harrasements
-
జడ్జి వేధింపులు?.. ఎస్సై ఆత్మాహత్యాయత్నం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ పోలీస్ అధికారి ఆత్మహత్యాయత్నం చేశాడు. తనను కోర్టులో జడ్జి వేధించాడని, దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సోమవారం రాత్రి చనిపోయేందుకు ప్రయత్నించాడు. అదృష్టం బాగుండి అధికారులు కాపాడటంతో క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటన అలీఘర్‌లో వెలుగుచూసింది.బన్నాదేవి పోలీస్ స్టేసన్‌లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సచిన్ కుమార్ ఇటీవల బైక్ చోరికి పాల్పడిన అయిదుగురు నిందితులను పట్టుకున్నాడు. కేసు దర్యాప్తులో భాగంగా వారిని కోర్టులో హాజరుపరిచారు.అయితే నిందితులను కాకుండా తప్పుడు వ్యక్తులను పట్టుకున్నారని స్థానిక న్యాయమూర్తి త్రిపాఠి.. ఎస్సై సచిన్‌ను మందలించారు. కోర్టు విచారణ సమయంలో మేజిస్ట్రేట్ తన పట్ల అగౌరవంగా, అనుచితంగా ప్రవర్తించారని.. కోరిన రిమాండ్‌ను మంజూరు చేయకుండా సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు వేచి ఉండేలా చేశారని కుమార్ ఆరోపించారు.Sub Inspector Sachin Kumar sitting on the railway track to commit su!cide, over He said that "The police had caught 5 bike thieves. I presented them in the court. The judge said that you have caught wrong people. The judge misbehaved with me" pic.twitter.com/WWck5gBpnU— Ghar Ke Kalesh (@gharkekalesh) September 17, 2024దీంతో మనస్తాపం చెందిన సచిన్ కుమార్ రైల్వే ట్రక్‌పై కూర్చొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. అప్రమత్తమైన స్టేషన్ ఇంచార్జ్ పంకజ్ కుమార్ మిత్రా, ఇతర పోలీసులు వెంటనే స్పందిచి కుమార్‌ను రక్షించారు. అయితే ఈ ఆరోపణలపై న్యాయమూర్తి త్రిపాఠి ఇంకా స్పందించాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎస్సై ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణకు ఎస్పీ ఆదేశించారు. -
బాలికను వేధించాడని.. రైల్వే ఉద్యోగిపై ప్రయాణికుల దాష్టీకం
న్యూఢిల్లీ: రైలులో మైనర్ బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో బాధితురాలి కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు రైల్వే ఉద్యోగిని కొట్టి చంపారు. ఈ ఘటన హమ్సఫర్ఎక్స్ప్రెస్ రైలులో గురువారం వెలుగుచూసింది. వివరాలు.. బిహార్‌లోని సివాన్కుచెందిన కుటుంబం బుధవారం న్యూఢిల్లీకి వెళ్తున్న హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలులోని థర్డ్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు.అయితే రాత్రి 11.30 గంటలల సమయంలో సమయంలో అయితే అదే కోచ్‌లో ప్రయాణిస్తున్న గ్రూప్ డీ రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ .. కుటుంబంలోని 11 ఏళ్ల భాలికను తన సీటు వద్ద కూర్చొబెట్టుకున్నాడు. తర్వాత బాలిక తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లగా.. చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడుమహిళ వాష్‌రూమ్ నుంచి తిరిగి రాగానే, బాలిక తల్లి వద్దకు పరిగెత్తి, ఆమెను పట్టుకొని ఏడవడం ప్రారంభించింది. తల్లిని వాష్‌రూమ్‌కి తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ ప్రవర్తనపై ఆ మహిళ తన భర్త, మామతోపాటు కోచ్‌లోని ఇతర ప్రయాణికులకు చెప్పింది. రైలు లక్నోలోని ఐష్బాగ్ జంక్షన్‌కు చేరుకోవడంతోదీంతో అతడ్ని ఆ కోచ్ డోర్ వద్దకు తీసుకెళ్లారు. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు కదులుతున్న రైలులోనే గంటన్నరపాటు నిందితుడిని కొట్టారు.అనంతరం రైలు ఉదయం 4.35 నిమిషాలకు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సెంట్రల్ చేరుకోగా.. నిందితుడుని రైల్వే పోలీసు అధికారులు అప్పగించారు. బాలికను వేధించినట్లు అతడిపై ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిని ప్రశాంత్ కుమార్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిది బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని సమస్త్‌పూర్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.అయితే బాలిక కుటుంబం, ఇతర ప్రయాణికులు కుట్రతో ప్రశాంత్ కుమార్‌ను హత్య చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్‌ఫోర్స్‌లో లైంగిక వేధింపులు.. వింగ్ కమాండర్‌పై కేసు
శ్రీనగర్: భారత వైమానిక దళంలో సీనియర్ ర్యాంక్ అధికారిపై లైంగిక వేధింపుల కేసు కలకలం రేపుతోంది. గత రెండేళ్లుగా వింగ్ కమాండర్ అధికారి తనను మానసికంగా వేధిస్తున్నాడని, అత్యాచారాని పాల్పడ్డాడని ఆరోపిస్తూ మహిళా ఫ్లయింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుద్గామ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.కాగా ఇద్దరు అధికారులు శ్రీనగర్ బేస్‌లోనే పనిచేస్తున్నారు. మహిళ తన ఫిర్యాదులో.. 31 డిసెంబర్ 2023న ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో సీనియర్ అధికారి వింగ్ కమాండర్ పీకే సెహ్రావత్ బహుమతి పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. బహుమతి తీసుకోమని అతని గదిలోకి పిలిచి తనతో అసహ శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేసినట్లు తెలిపారు. చివరికి తనను తోసేసి అక్కడి నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చారు.ఈ ఘటన అనంతరం తనలో తానే మానసికంగా కుమిలిపోయానని.. ఎంతగానో భయపడ్డానని చెప్పారు. కానీ అతను మాత్రం ఏం జరగనట్లు సాధారణంగా వ్యహరించారని, కనీసం పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపారు. అనంతరం ఇద్దరు మహిళా అధికారులకు ఈ విషయం తెలియజేయగా వారి సాయంతో అంతర్గత కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కల్నల్ స్థాయి అధికారిని ఆదేశించారని, ఈ ఏడాది జనవరిలో రెండుసార్లు తనతోపాటు వింగ్ కమాండర్ వాంగ్మూలాలు నమోదు చేయించుకున్నారని చెప్పారు.అనంతరం వింగ్ కమాండర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే విచారణను ముగించారని ఆరోపించారు. రెండు నెలల తర్వాత మరోసారి ఫిర్యాదు చేయగా.. అధికారులు పక్షపతంతో నిందితుడికి సహకరించారని, ప్రత్యక్ష సాక్ష్యాలు లేవనే సాకుతో కేసును నీరుగార్చరని ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ న్యాయం జరగలేదని తెలిపింది.అప్పటి నుంచి అనేక సార్లు వింగ్ కమాండర్ చేతిలో వేధింపులకు గురవుతునే ఉన్నానని చెప్పుకొచ్చారు. వీటన్నింటితో మానసిక వేధనకు గురవుతున్నట్లు, ఒకానొక సమయంలో చనిపోదామని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నీసం సెలవులపై వెళ్లడానికి లేదా వేరే చోట పోస్టింగ్ కోసం అభ్యర్థించినా అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు తన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని నిరంతరం భయంతో జీవిస్తున్నానని తెలిపారు. తన జీవితం మొత్తం నాశనం అయ్యిందని, పూర్తిగా నిస్సహాయకురాలిగా మారినట్లు చెప్పారు.అయితే వింగ్ కమాండర్‌పై వేధింపుల ఆరోపణల వ్యహారంపై భారత వాయుసేన స్పందించింది. ఈ కేసు గురించి తమకు సమాచారం ఉందని వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా శ్రీనగర్‌లోని భారత వైమానిక దళాన్ని బుద్గామ్ పోలీసులు సంప్రదించారని.. వారి దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని వాయుసేనకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
పోలీసుల వేధింపులు?.. రెండు రోజుల వ్యవధిలో సోదరుల ఆత్మహత్య
లక్నో: పోలీసుల వేధింపులకు రెండు ప్రాణాలు బలయ్యాయి. హత్రాస్ పోలీసుల వేధింపులతో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు సోదరులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా తమ్ముడు సంజయ్ అనే ఆత్మహత్య చేసుకున్న రెండు రోజులకు ఆగ్రా సమమీపంలోని ఓ గ్రామంలో చెట్టుకు ఉరేసుకొని సోదరుడు ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.కాగా జూన్ 9న అతని బావమరిది లక్ష్మణ్ గ్రామంలోని ఒక మహిళతో పారిపోవడంతో పోలీసులు సంజయ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జూన్ 13న ప్రమోద్ను విచారించారు. అయితే కస్టడీలో ఉన్న సంజయ్‌ను కొందరు పోలీసు అధికారులు కొట్టారని, వారు అతని నుంచి రూ. 1 లక్ష డిమాండ్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ముందుగా పదివేలు కట్టి, మిగతా 90 వేలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సంజయ్‌ను విడుదల చేశారని తెలిపారు.అనంతరం జూన్ 22 న సంజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పోలీసు అధికారులు నిరంతరం వేధింపులకు గురిచేయడం, పోలీస్ స్టేషన్‌కు పిలపించి బెదిరింపులకు పాల్పడటంతో మనస్తాపం చెందిన సంజయ్ చనిపోయాడని కుటుంబీకులు ఆరోపించారు.సంజయ్ మరించిన తర్వాత ప్రమోద్ను పోలీసులు మళ్లీ విచారణకు పిలించారు. దీంతో అతడు కూడా సోమవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సోదరుడి ఆత్మహత్యపై ఫిర్యాదు చేయవద్దని ప్రమోద్ను పోలీసులు హెచ్చరించినట్లు కుటుంబ సభ్యుడు ఆరోపించారు. కాగా జంట ఆత్మహత్యలపై గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భద్రతను పెంచారు.సుసైడ్‌కు ముందు హత్రాస్‌లోని సాదాబాద్ పోలీస్ స్టేషన్లో కొంతమంది అధికారులను తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు ప్రమోద్ సింగ్ ఓ లేఖ రాశారు. దీని ఆధారంగా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఓ అధికారి అగ్నిహోత్రిని సస్పెండ్ చేయగా.. మరో అధికారి కుమార్‌ను బదిలీ చేశారు. -
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ సస్పెండెడ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించారు.. ఈ మేరకు అశ్లీల వీడియో కేసుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారణ అనంతరం ఆరురోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది.ఇక మైసూర్‌లోని కేఆర్ నగర్‌కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్డీ రేవణ్ణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్‌ను వ్యతిరేకిస్తూ సిట్ కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు రేవణ్ణ కస్టడీలోనే ఉండాలని, అందుకే బెయిల్‌ను రద్దు చేయాలని సిట్ హైకోర్టును కోరింది. దీనిపై విచారణను హైకోర్టు జూన్ 3కి వాయిదా వేసింది.కాగా జర్మనీ నుంచి బయల్దేరిన ప్రజ్వల్ రేవణ్ణ.. గురువారంయ అర్ధరాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిన వెంటనే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను భారీభద్రత మధ్య విచారణ నిమిత్తం సీఐడీ కార్యాయానికి తరలించారు. శుక్రవారం ఉదయం రేవణ్ణకు బెంగళూరులోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రజ్వల్‌ను సిటీ సివిల్ కోర్టుకు తరలించారు. అక్కడ అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి.. ప్రజ్వలను 14 రోజులపాటు తమ కస్టడికి అప్పగించాలని సిట్ కోర్టును కోరింది.మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు అయిన ప్రజ్వల్ రేవణ్ణ 2014-19లో హాసన నుంచి జీడీఎస్ తరపున ఎంపీగా గెలుపొందారు. ఈ లోక్‌సభల్లోనూ ఎన్డీయూ కూటమి తరపున. హాసన నుంచి మళ్లీ ఎంపీగా బరిలోకి దిగారు. అయితే పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయన గత ఏప్రిల్‌లో దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి. ఆయన ఆచూకి కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆయనపై నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బహిరంగానే కోరారు.ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని, మే 31న ‘సిట్’ ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారి వీడియో సందేశంలో రేవణ్ణ పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. -
Hyderabad: ‘డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్ చేస్తా’.. యువతి బెదిరింపులు.
సాక్షి, హైదరాబాద్: అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్ చేస్తానంటూ ఓ యువకుడిని ఒక యువతి వేధింపులకు గురి చేస్తున్న సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన కిరణ్‌కుమార్ కృష్ణానగర్‌లో ఉంటున్నాడు. ఏడాది క్రితం అతను రూం షేరింగ్ కోసం ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చాడు. ఓ యువతి స్పందించి తాను షేర్ చేసుకుంటానని చెబుతూ కూకట్‌పల్లిలో రూం తీసుకోవాలని కోరింది. దీంతో ఇద్దరూ కలిసి గదిలో ఉంటున్నారు. అయితే తాను వేశ్యనని ఆమె చెప్పడంతో, తన ప్రవర్తన నచ్చక కిరణ్ ఆమెను బయటికి వెళ్లాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో పాటు తాము సన్నిహితంగా ఉన్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానంటూ బెదిరించింది. అంతేగాక తనపై లైంగిక దాడిచేశాడని సైబరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. వారు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత అతడి నుంచి ఆమెకు రూ.4.70 లక్షలు పరిహారంగా చెల్లించాడు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ చేయడంతో కిరణ్‌కుమార్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు. ఈ నెల 13న రాత్రి ఆమె కిరణ్‌ను సారథి స్టూడియో వద్దకు రప్పించి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అతడిపై దాడి చేసింది. గురువారం అతను మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పార్టీ ఆఫీస్ ఎదుటే.. బీజేపీ మహిళా నాయకురాలి ఆత్మహత్యాయత్నం
సాక్షి, విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీరుకు నిరసనగా మహిళ నాయకురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన అంజనా చౌదరి.. పార్టీలో వేధింపులు తాళలేక బీజేపీ కార్యాలయం ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. మహిళా నాయకురాలిని వేధించిన పార్టీ నాయకుడికి అందలమెక్కించిన పురందేశ్వరి తీరుపై మనస్తాపంతోనే ఈ పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు అంజనా చౌదరి తన మనుసులోని ఆవేదనను బయటకు చెప్పుకుంది. ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని మరీ రాజకీయాలలోకి వచ్చినట్లు చెప్పింది. 26వ వార్డు మున్సిపల్ చైర్ పర్సన్ విషయంలో వివాదం జరిగిందని.. అప్పటి నుంచి ప్రశాంత్ అనే వ్యక్తి తనను టార్గెట్ చేసినట్లు పేర్కొంది. బీజేపీ వర్క్ షాప్ జరిగినపుడు వాష్ రూమ్‌కు వెళ్లి వచ్చేటప్పుడు వీడియోలు తీసి వైరల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అప్పటి అధ్యక్షుడు సోము వీర్రాజు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ప్రశాంత్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పురందేశ్వరి అధ్యక్షురాలు అయిన తర్వాత మళ్ళీ వాళ్లకు పదవులు ఇచ్చి, తనను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పార్టీలో అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వాపోయారు. తన చావుకు కారణం రాజంపేట బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులతో పాటు నాగోతు రమేష్ నాయుడు, ప్రశాంత్ అని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షురాలు మహిళ అయినా ఒక మహిళగా తనకు అన్యాయం జరిగిందంటూ కన్నీరు పెట్టుకున్నారు. చదవండి: బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం -
టీడీపీ నేత కీచక పర్వం.. విద్యార్ధినికి వేధింపులు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరం మండలం గొట్లూరులో టీడీపీ నేత భాస్కర్ కీచక పర్వానికి తెగబడ్డాడు. ఆటోలో వెళ్తున్న పదో తరగతి విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆటోలో నుంచి బయటకు లాక్కెళ్లి విద్యార్ధినిపై అత్యాచారయత్నం చేశాడు. ఈ క్రమంలో బాలికకు గాయాలవ్వగా.. ఆసుపత్రికి తరలించారు.బాధితురాలి తల్లిదండ్రులు పోలసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గూడూరులో నకిలీ రైల్వే డీఎస్పీ అరెస్ట్ -
మహిళలు, విద్యార్థినులపై వేధింపులు.. భద్రతకు కొత్త ఫోన్ నంబర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళా భద్రత విభాగం కొత్త ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు మహిళా భద్రత విభాగం ట్విట్టర్ (ఎక్స్)లో నూతన నంబర్లను వెల్లడించారు. ఏ రకమైన వేధింపులున్నా మహిళలు, విద్యార్థినులు 8712656858 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. 8712656856 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ రెండు నంబర్లు గుర్తు లేకపోతే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. చదవండి: షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: కిషన్ రెడ్డి #WomenSafetyWing is dedicated & committed to your well-being & safety. Don't hesitate to call us!#Dial: #918712656858 #Chat: #9187126 56856 For EMERGENCY DIAL 100.#SuicideAwarenes #AskForHelp #Telangana #Help #MentalHealthMatters #MentalHealthAwareness #Support pic.twitter.com/HELLdkKCLP — Women Safety Wing, Telangana Police (@ts_womensafety) September 8, 2023 -
కామపిశాచికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారు?: శేజల్ సంచలన ఆరోపణలు
సాక్షి, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్‌ను మరోసారి దుర్గం చిన్నయ్యకు కేటాయించడంపై శేజల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కామా పిశాచికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కామ పిశాచి, చీటర్‌కు లైసెన్స్ ఇచ్చి నీకు అడ్డులేదు రెచ్చిపో, ఇష్టమొచ్చిన అమ్మాయిని వేధించు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిందని మండిపడ్డారు. కాగా బీఆర్ఎస్ పార్టీ సోమవారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో దుర్గం చిన్నయ్య పేరు ఉండడంపై బాధితురాలు శేజల్ తీవ్రంగా స్పందించారు. .తాను ఏడు నెలలుగా పోరాటం చేస్తున్నా పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోవలేదని వాపోయారు. దుర్గం చిన్నయ్య భవిష్యత్తులో మహిళలను వేధించకుండా ఉంటారని గ్యారంటీ ఎంటని ప్రశ్నించారు. ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఎమ్మెల్యే అరాచకాలకు బలికావాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు దోచుకోవాలని, అమ్మాయిలను వేధించాలని దుర్గం చిన్నయ్యకు టికెట్ ఇచ్చారంటూ శేజల్ మండిపడ్డారు. దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా దుర్గం చిన్నయ్య చేసిన తప్పులపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే చేసిన లైంగిక వేధింపులు, అక్రమాలు, భూకబ్జాలపై బెల్లంపల్లిలో గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తానని.. దుర్గం చిన్నయ్య ఎలా గెలుస్తాడో చూస్తానని సవాల్ విసిరారు. చదవండి: సీఎం కేసీఆర్ మమ్మల్ని అవసరానికి వాడుకున్నారు: కూనంనేని -
అవమానించిన అత్తింటి బంధువులు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మామ, భర్త తరపు బంధువులు తరచూ తనను అవమానిస్తున్నారని గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... సరూర్‌నగర్ కృష్ణానగర్ కాలనీ నివాసి విష్ణువర్ధన్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం మియాపూర్, ఆల్వీన్ కాలనీకి చెందిన శశికళ(33)తో వివాహమైంది. వీరికి కుమార్తె శ్రేయారెడ్డి(6)ఉంది. శశికళను మామ దేవేందర్‌రెడ్డి, భర్త తరఫు బంధువులు ఉషారాణి, వందన, రాజశేఖర్ తరచూ అవమానిస్తున్నారని శశికళ తన తల్లి యానాం గౌరికుమారికి పలుమార్లు చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఉండగా, విష్ణువర్దన్‌రెడ్డి గురువారం ఉదయం శశికళ తల్లి గౌరీకుమారికి ఫోన్ చేసి తక్షణమే తమ ఇంటికి రమ్మన్నాడు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి కుమార్తె ఇంటి పక్కన ఉండేవారికి ఫోన్ చేయగా, శశికళ చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. వెంటనే బంధువులతో కలిసి ఆమె కృష్ణానగర్‌కు చేరుకొని కన్నీరు మున్నీరైంది. మామ, బంధువులు అవమానకరంగా ప్రవర్తించడంతోనే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గౌరీకుమారి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. చదవండి: Hyderabad: తాగుడుకు బానిసైన భర్త.. ఉద్యోగం మానేసి అబద్ధాలు చెప్తుండటంతో -
ఏయూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ సత్యనారాయణపై లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. యూనివర్సిటీ పాలక మండలిపై ప్రొఫెసర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎగ్జిక్యూటివ్ పీహెచ్‌డీల పేరుతో పెద్ద దందా నడుస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు 1400 అడ్మిషన్లు జరగ్గా.. వాటిలో చాలా మొత్తం డబ్బులు చేతులు మారాయని తెలిపారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉజ్వల్ ఘటక్ అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా ఈ వ్యవహారాలన్నీ యూనివర్సిటీ అధికారులు నడుపుతున్నారని ప్రొఫెసర్ ఆరోపించారు. డిఫెన్స్ లిక్కర్ వ్యాపారం చేస్తూ యూనివర్సిటీ అధికారులను ఉజ్వల్ చెప్పుచేతల్లో పెట్టుకున్నాడని ఆరోపించారు. తన భార్యకు అర్హత లేకపోయినా ఫ్రీ పీహెచ్డీ కోసం ఒత్తిడి తెచ్చారని, నిబంధనలకు విరుద్ధమని తిరస్కరించినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కరోజు కూడా డిపార్ట్ మెంట్‌కు రాని మహిళపై లైంగిక వేధింపులు ఎలా సాధ్యమని ప్రొఫెసర్ సత్యనారాయణ ప్రశ్నించారు. ఏయూతో సంబంధం లేని ఉజ్వల్ ఘటక్‌కు డీన్ పదవి ఏ విధంగా ఇచ్చారో వీసీ, రిజిస్ట్రార్ చెప్పాలని నిలదీశారు. చదవండి: Video: ఆగ్రాలో దారుణం.. టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి కాగా ఆంధ్రా యూనివర్సీలో హిందీ విభాగం హెడ్,ప్రొఫెసర్ సత్యనారాయణపై రీసెర్చ్ స్కాలర్ సోనాలి ఘటక్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జాతీయ మహిళా కమిషన్‌కు సోనాలి ఫిర్యాదు చేసింది. ప్రీ - టాక్ వైవా కోసం రెండు లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించింది. తన వద్ద నుంచి ఇప్పటికే రూ.75 వేలు తీసుకున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఎన్సీడబ్ల్యూకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మిగతా డబ్బు చెల్లించలేదని తన భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించింది. లైంగిక వేధింపులపై ఏయూ రిజిస్ట్రార్, వీసీకు కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. సోనాలీ ఆరోపణలపై తగిన విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఏయూ యూనివర్సిటీ వీసీని ఆదేశిస్తూ మెయిల్ చేసింది. అయితే సోనాలీ ఆరోపణలపై ఏయూ అధికారులు ఇంత వరకు స్పందించలేదు. -
సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, ధర్మసాగర్(హన్మకొండ): స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్యపై ధర్మసాగర్ మండలం జాన కీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు తేల్చినట్టు తెలిసింది. జూన్ 21న ఎమ్మెల్యే టి.రాజయ్య, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్, నవ్య భర్త ప్రవీణ్‌లపై వేధింపుల ఆరోపణలు చేసిన నవ్య ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిని సుమోటోగా తీసుకున్న జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సర్పంచ్ నవ్య కేసుపై సమాచారం సేకరించాలని పోలీసులను ఆదేశించాయి. ఈ క్రమంలో వేధింపులకు సంబంధించిన ఆధారాలు అందజేయాలని కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ధర్మసాగర్ సీఐ ఒంటేరు రమేశ్‌లు సర్పంచ్ నవ్యకు నోటీసులు జారీ చేశారు. ఆమె ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదని చెపుతున్నారు. సర్పంచ్ నవ్య నిర్ణీత సమయానికి ఆధారాలు సమర్పించలేదని, ఆమె ఆరోపణలు అవాస్తవమని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లకు బుధవారం పోలీసులు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే రెండు ఆడియోలు విడుదల చేసిన నవ్య.. కేసు నమోదు చేస్తేనే ఆధారాలు ఇస్తానని చెబుతోంది. చదవండి: ఇక నేను తప్పుకుంటా, సీఎంకు తెలియజేయండి.. జెన్కో సీఎండీ వ్యాఖ్యలు -
Hyderabad: ఎమ్మెల్యే చిన్నయ్య బాధితురాలు శేజల్ హెల్త్ అప్డేట్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నం చేశారు. మాదాపూర్‌లో శేజల్ నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. మాదాపూర్ పేస్ ఆసుపత్రిలో శేజల్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, ప్రాణాలకు ఏం ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆమెకు ఎమర్జెన్సీ బ్లాక్‌లో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే శేజల్ ఆయుర్వేదిక్‌కు సంబంధించిన నిద్రమాత్రలు వేసుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఆమెకు మద్దతుగా పలువురు నేతలు హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు. సూసైడ్ లెటర్ స్వాధీనం శేజల్ బ్యాగ్‌లో నిద్రమాత్రలు, సూసైడ్ లెటర్‌ను గుర్తించారు. ఇందులో బాధితురాలు పలు విషయాలను ప్రస్తావించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై గతంలో లైంగిక ఆరోపణలు చేసిన శేజల్.. తనకు న్యాయం జరగడం లేదంటూ సూసైడ్ లెటర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా ఎమ్మెల్యేపై న్యాయ పోరాటం చేస్తున్నానని, ప్రభుత్వ పెద్దలు న్యాయం చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదని అన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతోందని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నానని ఆమె వాపోయారు. మధ్యాహ్నం 1.30 గంటలకు శేజల్‌ను పెద్దమ్మ టెంపుల్ దగ్గర వదిలి వెళ్లగా.. టెంపుల్ నుంచి కనిపించకుండా పోయారు. ఆ తరువాత మాదాపూర్‌లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. కాగా, కొన్ని రోజు క్రితం కూడా శేజల్ ఢిల్లీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే చిన్నయ్యపై ఆమె జాతీయ మహిళా కమిషన్, సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినా తెలంగాణ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. ఈ క్రమంలో శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని డీజీపీ ఆదేశించారు. చదవండి: హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ కుంభకోణం -
Ranga Reddy: సాఫ్ట్వేర్ ఉద్యోగినికి న్యూడ్ కాల్స్ చేస్తూ వేధింపులు
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగిని వేధిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదిబట్ల ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. కడ్తాల్ గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్ ఆదిబట్ల సమీపంలోని సాయితేజ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా ఉద్యోగం చేస్తుండేవాడు. అపార్ట్మెంట్లో టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే వారికి పార్సిల్స్ తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఆ క్రమంలో కొంతమంది ఫోన్‌నంబర్లు మనోజ్‌కుమార్ వద్ద ఉన్నాయి. ఈ క్రమంలో టీసీఎస్‌లో పనిచేసే ఓ సాఫ్ట్వేర్ యువతిని న్యూడ్ ఫోన్‌కాల్స్ చేస్తూ కొద్దిరోజులుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు భరించలేని సదరు ఉద్యోగిని గురువారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మనోజ్‌కుమార్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. -
Mancherial: సాయం పేరుతో రాత్రివేళల్లో చాటింగ్, వీడియో కాల్స్
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల పట్టణ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బింగి ప్రవీణ్ సాయం చేస్తానంటూ మాటలు కలిపి మోసం చేసేందుకు ప్రయత్నించాడని ఓ మహిళ మంగళవారం మంచిర్యాల పోలీసులను ఆశ్రయించింది. ప్రవీణ్ నివాసం ఉంటున్న కాలనీలోనే తాను భర్తతో కలసి ఉంటున్నట్లు పేర్కొంది. తమ మధ్య ఉన్న గొడవను ప్రవీణ్ అనుకూలంగా మలుచుకునేందుకు ఓవైపు తన భర్తతో, మరోవైపు తనతో సన్నిహితంగా ఉంటూ పోలీసులు తెలుసంటూ మోసం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించింది. అధికార పార్టీ నేత కావడంతోనే పోలీసులు సైతం ప్రవీణ్ చెప్పినట్లు చేయడం, దీనిని ఆసరాగా చేసుకొని తనకు అర్ధరాత్రి వరకు వాట్సాప్‌లో చాటింగ్, వీడియో కాల్స్ చేస్తున్నాడని ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారని మహిళ వివరించింది. ఈ విషయమై బింగి ప్రవీణ్‌ను సంప్రదించగా తన ఇంటి సమీపంలోనే భార్యాభర్తలు ఉంటారని, సాయం చేయాలని కోరితేనే భార్యాభర్తలకు తన వంతు సాయం చేసేందుకు ప్రయత్నించానన్నారు. మహిళ లేనిపోని ఆరోపణలు చేస్తోందన్నారు. చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక ట్విస్ట్ -
Vizag Beach: వివాహిత శ్వేత మృతి కేసులో ఊహించని ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: వివాహిత శ్వేత అనుమానాస్పద మృతి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. భర్త మణికంఠ చెల్లెలి భర్తపైన లైంగిక వేధింపుల కేసు నమోదైంది. శ్వేత తల్లి రమాదేవి ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. విశాఖలోని జ్ఞానాపురం స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టుతోపాటు శ్వేత సెల్‌ఫోన్ కీలకంగా మారింది. మృతురాలి మొబైల్‌ను పరిశీలిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. కాగా అత్తింటి వేధింపులతో విశాఖ బీచ్‌లో ఐదు నెలల గర్భిణి శ్వేత ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చదవండి: విశాఖ బీచ్‌లో గర్భిణీ మృతదేహం.. పెళ్లైన నెల నుంచే వేధింపులు.. సూసైడ్ నోట్ స్వాధీనం అసలేం జరిగిందంటే.. పెదగంట్యాడ మండలం నడుపూరులో గురువెల్లి మణికంఠ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. దొండపర్తికి చెందిన శ్వేత(24)తో గత ఏడాది మణికంఠకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. మణికంఠ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల కిందట అతను హైదారాబాద్ వెళ్లాడు. శ్వేతను ఇక్కడే అతని తల్లిదండ్రుల వద్ద ఉంచాడు. మంగళవారం సాయంత్రం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తర్వాత ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె అత్తామామలు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో ఆమె మామ శాంతారావు అర్ధరాత్రి 12 గంటల సమయంలో న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆర్.కె.బీచ్‌లో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు 3వ పట్టణ పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని శ్వేత ఫొటోతో సరిపోల్చి.. న్యూపోర్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన భర్తతో ఉన్న కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చిట్టీ(మణికంఠ ముద్దు పేరు) నేను లేకపోయినా నువ్వు బిందాస్‌గా జీవిస్తావని నాకు తెలుసు. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్ అని రాసి ఉంది. చదవండి: సొంత కొడుక్కే షాకిచ్చిన తండ్రి.. ఇంటికొచ్చిన ప్రియురాలితో కలిసి.. -
బీచ్‌లో శ్వేత మృతదేహం.. పెళ్లైన నెల నుంచే వేధింపులు, సూసైడ్ నోట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ బీచ్‌లో శవమై తేలిన మహిళ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. వివాహిత శ్వేత మృతికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసులో శ్వేత కాల్ రికార్డింగ్స్, పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే శ్వేత తల్లి రమాదేవి స్టేట్మెంట్ను త్రీటౌన్ పోలీసులు నమోదు చేశారు. ఇంటి నుంచి బయలుదేరే గంట ముందు వరకు కూడా భర్త మణికంఠతో గొడవపడినట్లు విచారణలో తేలింది. అయితే అత్తమామలు వేధింపులపై పోలీసులు కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు విడాకులు ఇస్తానని భర్త బెదిరింపులు కాగా అత్తింటి వేధింపులు తట్టుకోలేకే తన కూతురు చనిపోయిందని శ్వేత తల్లి రమాదేవి ఆరోపించారు. పెళ్లైన నెల రోజుల నుంచే కూతుర్ని వేధించడం ప్రారంభించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అల్లుడి అసలు గుణం అప్పుడే బయటపడిందని.. నెల రోజులు క్రితం కూడా విడాకులు ఇస్తామని శ్వేతను భర్త మణికంఠ బెదిరించాడని పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి తల్లి మాట్లాడుతూ శ్వేత అత్తింటి వారిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తన కూతురు అయిదు నెలల గర్భిణీ అని.. కడుపుతో ఉన్నా కూడా కనికరించకుండా అత్తామామలు చిత్రహింసలు పెట్టేవారని తెలిపారు. ఇంట్లో పనులన్నీ తనతోనే చేయించేవారని, అత్త మామలు చెప్పిన పనులు చేయాలంటూ ఫోన్లో భర్త కూడా ఆదేశాలిచ్చేవాడని పేర్కొన్నారు. ఫోన్ చేసి రోజూ ఏడ్చేది.. ‘భర్తను పొగొట్టుకున్నాను. కూతుర్ని ఒక్కదాన్నే కష్టపడి పెంచి పెద్ద చేశాను. అత్తమామలు ఇబ్బందులు పెడుతున్నారని రోజూ ఫోన్ చేసి ఏడ్చేది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతానని చెప్పింది. పెళ్లైన తరవాత చదివించకుండా వంటింటికే పరిమితం చేశారు. శ్వేత అత్త నటిస్తోంది. అత్తింటి వేధింపులు, భర్త టార్చర్ వల్ల శ్వేత ప్రాణం తీసుకుంది. నా ఒక్కగానొక్క కూతురిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు’ అంటూ వాపోయారు. సూసైడ్ నోట్ ఇదిలా ఉండగా శ్వేత చనిపోయేముందు ఓ సూసైడ్ నోట్ రాసింది. ఇందులో ‘చిట్టీ...నాకు ఎప్పుడో తెలుసు నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని. నీకు అసలు ఏమాత్రం ఫరక్ పడదు. ఎనీ వే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.. అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడడానికి ఉన్నా కూడా నేను ఏం మాట్లాడటం లేదు. బికాజ్.. నువ్వు బయటకు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా యూ నో ఎవ్రీ థింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏ బిగ్ థాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్’ అని రాసి ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్వేత భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో నివసిస్తుండగా.. విశాఖపట్నంలో అత్తమామల వద్ద శ్వేత ఉంటోంది. మంగళవారం అత్తతో గొడవ జరగడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఫోన్లో భర్తతోనూ గొడవపడింది. తర్వాత విగత జీవిగా బీచ్‌లో కనిపించింది. చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 11 మంది జవాన్లు మృతి.. -
‘నా చావుకు ఇంటెలిజెన్స్ సీఐ కారణం.. కుటుంబానికి ప్రాణహాని’
సాక్షి, కరీంనగర్: ఇంటెలిజెన్స్ సీఐ వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. చొప్పదండి మండలంలోని భూపాలపట్నం గ్రామంలో బొడిగె శ్యామ్ అలియాస్ శంభయ్య అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తన చవుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సీఐ గోపాలకృష్ణ కారణమని, తన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆరోపించాడు. ఈ మేరకు సుసైడ్ నోట్ రాశాడు. ఓ భూమి విషయంలో సీఐ బెదిరించినట్లు లేఖలో పేర్కొన్నాడు. సీఐ గోపాలకృష్ణ 30 లక్షలతో భూమి కొనుగోలు చేసి.. 8 నెలల్లో రెట్టింపు కోసం టార్చర్ పెట్టినట్లు వెల్లడించాడు. అసభ్య పదజాలంతో తిట్టినట్లు వాపోయాడు. గోపాలకృష్ణ వేధింపులు భరించలేక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు. సీఐ నుంచి తన కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందని, ఈ లేఖను జిల్లా కలెక్టర్, ఎస్పీకి అందజేయాలని చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి సూసైడ్ నోటును స్వాదీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శంభయ్య మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శంభయ్య సుసైడ్ లేఖ ఆధారంగా పోలేసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శంభయ్య మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: విధి చిన్న చూపు: కూతురు అల్లరి చూసి ఆ తల్లి మురిసిపోయింది.. అంతలోనే -
హోలీ రోజు వేధింపులు.. దేశం విడిచి వెళ్లిన జపాన్ యువతి
హోలీ వేడుకల సందర్భంగా బుధవారం ఢిల్లీలో జపాన్‌కు చెందిన ఓ యువతిపై కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. అదే ప్రాంతానికి చెందిన యువకులు యువతిని చుట్టుముట్టి ఆమెను వేధింపులకు గురిచేశారు. తనను గట్టిగా పట్టుకుని బలవంతంగా రంగులు పూశారు. తలపై గుడ్డు కొట్టారు. వారిని వదిలించుకొని వెళ్తున్న యువతికి మరో యువకుడు అడ్డు వచ్చాడు. దీంతో ఆమె అతని చెంపచెళ్లుమనిపించింది. అనంతరం అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోయింది. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. యువకుల చర్యపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు..ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మైనర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జపాన్ యువతి ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. స్థానిక యువకులు హోలీ పేరుతో యువతిని వేధించిననట్లు తెలిపారు. బలవంతంగా యువతిపై రంగులు చల్లి, తలపై గుడ్టు పగులకొట్టిన్నట్లు చెప్పారు. అయితే ఇప్పటి వరకు యువతి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అంతేగాక యువతి దేశం విడిచి శుక్రవారమే బంగ్లాదేశ్ వెళ్లిన్నట్లు పేర్కొన్నారు. For those who were against the #BHARATMATRIMONY Holi campaign. A Japanese tourist in India. Imagine your sister, mother or wife being treated like this in another county? Maybe you will understand then. pic.twitter.com/VribIpXBab — Ram Subramanian (@iramsubramanian) March 10, 2023 తాను బంగ్లాదేశ్ చేరుకున్నట్లు, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు యువతే స్వయంగా ట్వీట్ చేసిందని చెప్పారు. అంతేగాక యువతికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం జపాన్ రాయబార కార్యలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ దారుణ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తీవ్రంగా స్పందించారు. వీడియోను పరిశీలించి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. Very distrubing videos getting viral on social media showing sexual harassment with foreign nationals on Holi! I am issuing notice to Delhi Police to examine these videos and arrest the perpetrators! Completely shameful behaviour! — Swati Maliwal (@SwatiJaiHind) March 10, 2023 -
మెడికో ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి అవమానించాడు: సీపీ రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ పీజీ మెడికల్ విద్యార్థిని ప్రీతిని సీనియర్ వేధించినట్లు పోలీసులు నిర్ధారించారు. సైఫ్ వేధించినట్లుగా ఆధారాలు లభించాయని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. ఈమేరకు వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనపై సీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రీతిని టార్గెట్ చేసి సైఫ్ వేధించాడని తెలిపారు. నాలుగు నెలలుగా వేధిస్తున్నట్లు వెల్లడైందన్నారు. ప్రీతి చాలా తెలివి, ధైర్యం ఉన్న అమ్మాయని.. అలాగే సున్నిత మసన్తత్వం కలిగినదని సీపీ చెప్పారు. వాట్సాప్ గ్రూపులో ప్రీతిని అవమానించేలా సీనియర్ విద్యార్థి సైఫ్ మెసెజ్‌లు పెట్టాడని పేర్కొన్నారు. సైఫ్ తన ఇతర మిత్రులతో చేసిన చాటింగ్‌లో ప్రీతిని టార్గెట్ చేసినట్లు తెలిసిందన్నారు. ఆమెకు సహకరించవద్దని సైఫ్ తన ఫ్రెండ్స్‌కు చెప్పాడని, బ్రెయిన్ లేదంటూ హేళన చేస్తున్నట్లు చాటింగ్ ద్వారా వెల్లడైందన్నారు. ‘దీనిపై ఈనెల 18న వాట్సాప్ గ్రూపులో అతడు పెట్టిన మెసేజ్‌పై ప్రీతి ప్రశ్నించింది. తనను ఉద్దేశించి గ్రూప్‌లో చాట్ చేయడం సరికాదని.. ఏదైనా ఉంటే హెచ్‌వోడీల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పింది. ప్రీతి ప్రశ్నించడాన్ని సైఫ్ తీసుకోలేకపోయాడు. వేధింపుల గురించి ప్రీతి వాళ్ల తల్లిదండ్రులకు తెలియజేసింది. మొదట్నుంచీ సైఫ్ వల్ల ప్రీతి ఇబ్బందిగా భావించింది. వాట్సాప్ గ్రూప్‌లో మెసెజ్‌ల ద్వారా అవమానించడం కూడా ర్యాగింగ్ కిందకే వస్తుంది. 21వ తేదీనే ప్రీతి, సైఫ్‌ను పిలిచి కాలేజీ యాజమాన్యం విచారించింది. పాయిజన్ ఇంజెక్షన్ ఏముంది అన్నదానిపై ప్రీతి గూగుల్‌లో సెర్చ్ చేసింది. విద్యార్థిని వేధించినందుకు ర్యాగింగ్ కేసుతోపాటు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశాం. సైఫ్‌ను కోర్టులో హాజరుపరచనున్నాం. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు, కేసును పక్కదారి పట్టిస్తున్నారని ప్రచారం చేయడం సరికాదు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల దీని వల్ల విచారణపై ప్రభావం పడుతుంది.’ అని సీపీ పేర్కొన్నారు. -
మెడికల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ నిర్లక్ష్యం వల్లే ప్రీతి ప్రాణాలు తీసుకోవలనుకున్నట్టు పాల్పడినట్లు తెలుస్తోంది. తనను వేధిస్తున్న సీనియర్ విద్యార్థి సైఫ్ అఘాయిత్యాల గురించి ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. గత కాలంగా సైఫ్ ఆమెను వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రీతి తన తండ్రికి చెప్పింది. తండ్రి స్వయంగా ఆర్ ఎస్సై కావడంతో పోలీస్ భద్రతా లభిస్తుందని విద్యార్థిని ఎదురుచూసింది. అయితే తన తండ్రి ఏసీపీ బోనాల కిషన్‌కు ఫోన్ చేసి వివరాలు చెప్పినా స్పందించలేదు. మరోసారి ఏసీపీకి మెసేజ్ చేసినా అటునుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఈ విషయాన్ని కూతురికి చెప్పాడు. దీంతో పోలీసుల సహకారం కూడా రాకపోవడం, ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు హోంమంత్రి మహమూద్ అలీ అండదండలు ఉన్నాయని కొంతకాలంగా సైఫ్ వేధిస్తున్నట్లు ప్రీతి తన తండ్రికి తెలిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సైఫ్ వేధింపుల గురించి తన తండ్రికి ప్రీతి పెట్టిన మెసేజ్‌లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా మెడికో విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగవుతుందని, నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని బులెటెన్‌లో పేర్కొన్నారు. మరోవైపు మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఫోన్ చాటింగ్‌తోపాటు పలు కీలక ఆధారాలు సేకరించారు. సైఫ్‌పై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ, ర్యాగింగ్ కేసులు నమోదు చేశారు. -
అత్యంత విషమంగా మెడికో ప్రీతి ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగవుతుందని, నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోన్నామని బులిటెన్‌లో పేర్కొన్నారు. మరోవైపు మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఫోన్ చాటింగ్‌తోపాటు పలు కీలక ఆధారాలు సేకరించారు. సైఫ్‌పై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ, ర్యాగింగ్ కేసులు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కేఎంసీలో పీజీ (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతోంది. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది. జనవరి 22న పాయిజన్ ఇంజిక్షన్ తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్తితిలోకి వెళ్లి యువతి ఒక్కసారిగా కుప్పకూలంతో సహచర విద్యార్థులు, డాక్టర్లు ఆమెను వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రీతి ప్రాణాల కోసం పోరాడుతోంది. ప్రీతిని కాపాడేందుకు నిమ్స్ వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కాలేజీలో సీనియర్ వేధింపులతోక ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సీనియర్ విద్యార్థి సైఫ్‌పై కాలేజీ యజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యువతి అంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ప్రాణాలతో పోరాడుతున్న ప్రీతి.. అత్యంత విషమంగా పీజీ వైద్య విద్యార్థిని పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: వరంగల్ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ ప్రీతి ప్రాణాలతో పోరాడుతోంది. ప్రస్తుతం నిమ్స్‌లోని ఏఆర్సీయూలో వెంటిలేటర్‌పైనే ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. అవయవాలు దెబ్బతినడంతో పాటు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు వైద్యులు చెబుతున్నారు. మత్తు ఇంజక్షన్ వల్లే ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని వెల్లడించారు. ఆమెను కాపాడేందుకు డాక్టర్ పద్మజా నేతృత్వంలోని అయిదుగురు వైద్యుల బృందం తీవ్రంగా శ్రమిస్తుంది. అనస్తేషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్లు ప్రీతికి వైద్య చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు ప్రీతి శరీరం సహకరించడం లేదని, బీపీ, పల్స్ రేట్ నమోదు కానీ పరిస్థితి వచ్చిందన్నారు. వరంగల్ నుంచి నిమ్స్‌కు తీసుకువచ్చే సమయంలో రెండుసార్లు గుండె ఆగిపోయిందని.. వైద్యులు సీపీఆర్ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారని తెలిపారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమి చెప్పలేమని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. కాగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌లో సీనియర్ వేధింపులతోక వైద్య విద్యార్థిని ప్రీతి బుధవారం మత్తు ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన సహా విద్యార్థులు, వైద్య సిబ్బంది వరంగల్‌లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎంకు మార్చారు. బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం నిమ్స్‌లో ప్రీతికి చికిత్స అందిస్తున్నారు. సైఫ్ వేధింపుల వల్లే.. కాలేజీలో సీనియర్ ర్యాగింగ్ వల్లే తన కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసిందని బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. నవంబర్‌లో ప్రీతి కేఎంసీలో చేరిందని, డిసెంబర్ నుంచి ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. దీనిపై కాలేజీ యజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యువతి అంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ‘జనవరి 20వ తేదీనకాలేజీ దగ్గరికి వెళ్లానని, ఉన్నతాధికారులకు వేధింపుల గురించి తెలియజేశాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. సీనియర్లు కదా మామూలుగా ర్యాగింగ్ ఉంటుంది అనుకున్నాం. వేధింపులకు పాల్పడుతున్న సైఫ్‌తో మాట్లాడుతానని ప్రీతికి చెప్పా. వద్దు, మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి. మార్కులు తక్కువ వేస్తారు అని భయపడింది. ఎంతో ధైర్యంగా ఉండేది. కరోనాలో కూడా విధులు నిర్వర్తించింది. అలాంటి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందంటే సైఫ్ ఎంతగా వేధించాడో. కాలేజీకి చెడ్డ పేరు ఎక్కడో వస్తుందోనని నిమ్స్‌కు తీసుకువచ్చారు. వరంగల్‌లో గొడవ అవుతుందని కావాలని హైదరాబాద్ తరలించారు. మాకు న్యాయం చేయాలి. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల వల్ల నా బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలి. మా బిడ్డ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వాడికి శిక్ష పడాలి. చాలా దారుణంగా వేధించాడు. మా బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. ప్రీతికి ఎటువంటి ఆనారోగ్యం లేదు. చదువుల్లో నంబర్ వన్. పోలీసు ఫిర్యాదు తర్వాత సైఫ్ వేధింపులు తీవ్రతరమయ్యాయి. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు సరికావు: జూనియర్ డాక్టర్లు ఆధారాలు లేకుండా సీనియర్ విద్యార్థిపై ఆరోపణలు చేయడం సరికాదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. ఘటనపై ప్రస్తుతం అధికారుల విచారణ జరుగుతోందని, విచారణపూర్తయ్యే వరకు తప్పుడు ఆరోపణలు చేయవద్దని పేర్కొన్నారు. అయితే ర్యాంగింగ్ లాంటిదేమి జరగలేదని కేఎంసీ ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రీతి ర్యాగింగ్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ప్రీతిని వేధించిన సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సైఫ్‌ను పోలీసులు విచారించనున్నారు. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. -
వరంగల్ ఎంజీఎంలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. నిమ్స్‌కు తరలింపు
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పిజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టిస్తుంది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో పరిస్థితి విషమంగా ఉంది. సీనియర్ పీజీ వైద్య విద్యార్థి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటికే వేధింపులకు గురిచేసిన వైద్య విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా హైదరాబాద్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న నరేందర్ కూతురు ప్రీతి కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతుంది. విధి నిర్వహణలో సీనియర్ వైద్య విద్యార్థి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కేఎంసీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనకు దారితీసేది కాదంటున్నారు కుటుంబ సభ్యులు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైద్య విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదనతో కోరుతున్నారు. నిమ్స్‌కు తరలింపు మరోవైపు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. సీనియర్ విద్యార్థి వేధింపుల వల్లే.. విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థిని మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోందని ఎంజీఎం సూపరింటెండెంట్ తెలిపారు. శ్వాస తీసకోవడంతో బాధితురాలు ఇబ్బంది పడుతోందని, విద్యార్థినిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ర్యాగింగ్ జరిగిందా లేదా అన్నది నిర్ధారణ కాలేదని పేర్కొన్నారు. వేధింపులపై విచారణకు కమిటీ వేస్తున్నామని.. మూడు కమిటీలతో విచారణ జరిపిస్తున్నామని వెల్లడించారు. సీనియర్ తప్పు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: Kushaiguda: గుడిలో చోరీకి యత్నించి ప్రాణాలు కోల్పోయిన దొంగ