Japanese woman harassed on Holi has left India, 3 including juvenile held - Sakshi
Sakshi News home page

హోలీ రోజు వేధింపులు.. దేశం విడిచి వెళ్లిన జపాన్‌ యువతి.. ముగ్గురి అరెస్ట్‌!

Published Sat, Mar 11 2023 12:34 PM | Last Updated on Sat, Mar 11 2023 12:55 PM

Japanese Woman Harassed On Holi In Delhi Has Left India 3 Held - Sakshi

హోలీ వేడుకల సందర్భంగా బుధవారం ఢిల్లీలో జపాన్‌కు చెందిన ఓ యువతిపై కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. అదే ప్రాంతానికి చెందిన యువకులు యువతిని చుట్టుముట్టి ఆమెను వేధింపులకు గురిచేశారు. తనను గట్టిగా పట్టుకుని బలవంతంగా రంగులు పూశారు. తలపై గుడ్డు కొట్టారు. 

వారిని వదిలించుకొని వెళ్తున్న యువతికి మరో యువకుడు అడ్డు వచ్చాడు. దీంతో ఆమె అతని చెంపచెళ్లుమనిపించింది. అనంతరం అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోయింది. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో.. యువకుల చర్యపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు..ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురిని  అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మైనర్‌ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

జపాన్‌ యువతి ఢిల్లీలోని పహర్‌గంజ్‌ ప్రాంతంలో నివసిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. స్థానిక యువకులు హోలీ పేరుతో యువతిని వేధించిననట్లు తెలిపారు. బలవంతంగా యువతిపై రంగులు చల్లి, తలపై గుడ్టు పగులకొట్టిన్నట్లు చెప్పారు. అయితే ఇప్పటి వరకు యువతి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అంతేగాక యువతి దేశం విడిచి శుక్రవారమే బంగ్లాదేశ్‌ వెళ్లిన్నట్లు పేర్కొన్నారు.

తాను బంగ్లాదేశ్‌ చేరుకున్నట్లు, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు యువతే స్వయంగా ‍ట్వీట్‌ చేసిందని చెప్పారు. అంతేగాక​ యువతికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం జపాన్‌ రాయబార కార్యలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ దారుణ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ తీవ్రంగా స్పందించారు. వీడియోను పరిశీలించి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement