Holi 2023
-
హోలీ రోజు వేధింపులు.. దేశం విడిచి వెళ్లిన జపాన్ యువతి
హోలీ వేడుకల సందర్భంగా బుధవారం ఢిల్లీలో జపాన్‌కు చెందిన ఓ యువతిపై కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. అదే ప్రాంతానికి చెందిన యువకులు యువతిని చుట్టుముట్టి ఆమెను వేధింపులకు గురిచేశారు. తనను గట్టిగా పట్టుకుని బలవంతంగా రంగులు పూశారు. తలపై గుడ్డు కొట్టారు. వారిని వదిలించుకొని వెళ్తున్న యువతికి మరో యువకుడు అడ్డు వచ్చాడు. దీంతో ఆమె అతని చెంపచెళ్లుమనిపించింది. అనంతరం అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోయింది. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. యువకుల చర్యపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు..ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మైనర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జపాన్ యువతి ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. స్థానిక యువకులు హోలీ పేరుతో యువతిని వేధించిననట్లు తెలిపారు. బలవంతంగా యువతిపై రంగులు చల్లి, తలపై గుడ్టు పగులకొట్టిన్నట్లు చెప్పారు. అయితే ఇప్పటి వరకు యువతి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అంతేగాక యువతి దేశం విడిచి శుక్రవారమే బంగ్లాదేశ్ వెళ్లిన్నట్లు పేర్కొన్నారు. For those who were against the #BHARATMATRIMONY Holi campaign. A Japanese tourist in India. Imagine your sister, mother or wife being treated like this in another county? Maybe you will understand then. pic.twitter.com/VribIpXBab — Ram Subramanian (@iramsubramanian) March 10, 2023 తాను బంగ్లాదేశ్ చేరుకున్నట్లు, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు యువతే స్వయంగా ట్వీట్ చేసిందని చెప్పారు. అంతేగాక యువతికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం జపాన్ రాయబార కార్యలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ దారుణ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తీవ్రంగా స్పందించారు. వీడియోను పరిశీలించి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. Very distrubing videos getting viral on social media showing sexual harassment with foreign nationals on Holi! I am issuing notice to Delhi Police to examine these videos and arrest the perpetrators! Completely shameful behaviour! — Swati Maliwal (@SwatiJaiHind) March 10, 2023 -
విషాదం నింపిన హోలీ.. బాత్రూమ్లోకి వెళ్లి భార్యభర్తలు మృతి!
ఉత్తర ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్లోని బాత్రూమ్లో ఓ జంట అనుమానాస్పదంగా మృత్యువాతపడింది. హోలీ అనంతరం స్నానం కోసం వెళ్లిన దంపతులు బాత్రూమ్లో శవమై కనిపించారు. ఈ దురదృష్ట ఘటన ఘజియాబాద్ జిల్లా మురాద్‌నగర్ పట్టణంలోని అగ్రసేన్ మార్కెట్ సమీపంలో వెలుగు చూసింది. మృతిచెందిన దంపతులను దీప్కా గోయల్ (40), అతని భార్య శిల్పి (36)గా గుర్తించారు. వివరాలు.. తమ కుటుంబ సభ్యులతో గోయల్, శిల్పి గురువారం ఎంతో ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రంగులు కడుక్కొని, స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లిన జంట తిరిగి బయటకు రాలేదు. అనుమానించిన కుటుంబ సభ్యులు బలవంతంగా బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా.. ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే దంపతులను ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం దంపతుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అయితే బాత్రూమ్లో సరైన వెంటిలేషన్ లేకపోవడం, గీజర్ నుంచి వెలువడే విష వాయువుల వల్లే ఊపిరాడక చనిపోయి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇళ్లంతా తనిఖీ చేసినప్పటికీ ఎలాంటి అనుమానాస్పదంగా అనిపించలేదని తెలిపారు. కాగా, పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతనే వారి మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మరో ఘటనలో మోదీనగర్‌లో హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ 30 ఏళ్ల వినీత్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పద గుండెపోటుతో మరణించాడు. లక్ష్మీ నగర్ నివాసికి చెందిన వినీత్ హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేస్తున్న సమయంలో కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుండెపోటుతో మృతిచెందినట్లు పేర్కొన్నారు. -
భర్తల భరతం పట్టిన భార్యామణులు!
కారేపల్లి: భార్యామణులు భర్తల భరతంపట్టారు. ఇంకొందరు పచ్చ బరిగెలతో వరసైన వారి వీపులను విమానం మోత మోగించారు. చేసేదేం లేక పురుషపుంగవులు పరుగు లంకించుకున్నారు. హోలీ సందర్భంగా గిరిజన తండాల్లో ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ. గత ఏడాది హోలీ నుంచి ఈ ఏడాది హోలీ మధ్యకాలంలో భూక్యా, లాకావత్, తేజావత్, వడిత్యా వంశస్తుల కుటుంబాల్లో ఎవరికైతే తొలి సంతానంగా మగబిడ్డ జన్మిస్తాడో ఆ ఇంట్లో డూండ్ వేడుక వైభవంగా నిర్వహిస్తారు. కారేపల్లి మండలం సామ్యతండాలో భూక్యా నగేష్, సుజాత దంపతులకు తొలి సంతానం మగబిడ్డ దర్శక్ జన్మించడంతో ఈ వేడుక నిర్వహించారు. డూండ్ అంటే గిరిజన భాషలో వెతకడం అని అర్థం కాగా, బాలుడిని ఒక ఇంట్లో దాచిపెట్టి గ్రామస్తులంతా వెతకడమే ఈ వేడుక! ఇదంతా హోలీ రోజు ముగియగా.. గురువారం గ్రామంలో ఓ గుంజ పాతి, తినుబండారాలు ఉన్న రెండు గంగాళాలను తాళ్లతో కట్టారు. గంగాళాలకు మహిళలు పచ్చి బరిగెలతో కాపలాగా ఉండగా, పురుషులు వాటిని ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. మహిళలు, పురుషులు సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాత్రలు ఎత్తుకెళ్లేందుకు వచ్చే పురుషులను మహిళలు సరదాగా కొడుతుండటం చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ వేడుకలో బావ, బావమరిది వంటి వరసైనవారు మహిళల దెబ్బల రుచి చూడాల్సిందే. చివరకు పురుషులు గంగాళాలను ఎత్తుకెళ్లి ఆరగించడంతో వేడుక ముగిసింది. -
జీవితాంతం ఒంటరిగానే ఉంటా కానీ! హోలీ యాడ్‌పై దుమారం: అసలేమైంది?
సాక్షి,ముంబై: మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ భారత్ మ్యాట్రిమోనీ వివాదంలో ఇరుక్కొంది. హోలీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కంపెనీ విడుదల చేసిన యాడ్‌పై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. పవిత్ర హోలీని అవమానకరంగా చిత్రీకరించి హిందూ మనోభావాలను దెబ్బతీశారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయ్‌కాట్ భారత్ మోట్రిమోనీ అన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ యాడ్‌పై చర్చ కారణంగా ఇది ఇప్పటికే 1.5 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. రంగుల పండుగ సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై భారత్ మ్యాట్రిమోనీ ఒక వీడియోను పోస్ట్ చేసింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం,హోలీ సందర్బంగా మహిళలకు సురక్షిత వాతావరణాన్ని సృష్టించాలంటూ తన యాడ్‌లో కోరింది. కొన్ని కలర్స్( మరకలు) అంత తొందరగా మాసిపోవు. వేధింపుల వల్ల ప్రతీ ముగ్గురిలో ఒకమహిళ హోలీకి దూరంగా ఉంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే సవాళ్లను గుర్తించడం వారి శ్రేయస్సును గౌరవించే సమాజాన్ని సృష్టించడం ముఖ్యం అని పేర్కొంది. అంతే ఒక్కసారిగా అగ్గి రాజుకుంది. ‘‘మీకు హిందూ వినియోగదారులంటే లెక్కలేదా..సిగ్గుపడండి..బ్యాన్ భారత్ మోట్రిమోనీ’’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ట్విటర్లో #BoycottBharatMatrimony ట్రెండింగ్‌లో నిలిచింది. హోలీని తిట్టడమే లక్ష్యం. హిందూ పండుగలను హిందూ వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకోకండి అని ఒకరు ట్వీట్ చేయగా, భారత్ మ్యాట్రిమోనీ యాడ్ హిందూ సంప్రదాయాలను అగౌరవపరిచేదిగాను, హిందూ మత మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ మరికొందరు ఆగ్రహించారు. హిందువుల పండుగలప్పుడు మాత్రమే మహిళల రక్షణ, కాలుష్యం, జంతువుల హక్కులు గుర్తొస్తాయా అంటూ ఇంకొకరు మండిపడ్డారు. ఈ యాడ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేయడంతోపాటు భారత్ మ్యాట్రిమోనీని నిషేధించాల్సిందేనని కమెంట్ చేస్తున్నారు. ఈ యాడ్‌లో తప్పేమీ లేదంటూ సంస్థ భావ ప్రకటనా స్వేచ్ఛను సమర్థించిన వారు లేకపోలేదు. అలాగే సంస్కృతి పేరుతో ప్రతిదీ మంచిది కాదు. సతి, వరకట్నం కూడా భారతీయ సంస్కృతిలో భాగమే. చెడును వ్యతిరేకించాలి. హోలీ రోజున మహిళలపై వేధింపులు నిజమే. దీని వల్ల మొత్తం పండుగకే చెడ్డ పేరు వస్తుందని మరికొంతమంది యూజర్లు వ్యాఖ్యానించారు. అయితే ఈ విమర్శల నేపథ్యంలో క్యాప్షన్‌ను సవరించి, సోషల్ మీడియా పేజీలలో తాజా పోస్ట్‌లను అప్లోడ్ చేసింది. అయినా విమర్శల సెగ చల్లార లేదు. కాగా ప్రకటనలపై విమర్శలు, వివాదం చెలరేగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఫ్యాబ్ఇండియా, తనిష్క్, సియట్ టైర్లు, అమోజాన్ లాంటి పలు సంస్థలు దాదాపు ఇలాంటి వివాదాల్లో పడ్డాయి. ఇటీవల ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ హోలీ ప్రకటనలపై విమర్శలు వెల్లువెత్తాయి. హోలీ సందర్భంగా ప్రజలు ఒకరిపై ఒకరు గుడ్లు విసురుకోవద్దంటూ ఢిల్లీలోని స్విగ్గీ బిల్బోర్డ్ వివాదానికి దారితీయడంతో తరువాత, దాన్ని స్విగ్గీ తొలగించింది. I will be single in my entire life but i will never register in this #BHARATMATRIMONY@bharatmatrimony is fully hypocrisy all this gyans are vanished in Christian and Muslim festivals Total Boycott 🚫 #BoycottBharatMatrimony — ÂkaSH আকাশ (@itzmeakashmazz) March 8, 2023 pic.twitter.com/pMTJCNRBwV — Ankit Bhuptani 🏳️🌈 (@CitizenAnkit) March 8, 2023 -
Holi 2023: బంపరాఫర్.. స్కూల్ పిల్లలకు గురువారం కూడా సెలవు..!
లక్నో: పాఠశాల విద్యార్థలకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. హోలి పూర్ణిమ సందర్బంగా గురువారం(మార్చి9) సెలవు అని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను బుధవారం ఉదయం విడుదల చేసింది. హోలీ పండుగ సందర్భంగా ఇప్పటికే మార్చి 7, 8న రెండు రోజులపాటు సెలవులు ఇచ్చింది యూపీ ప్రభుత్వం. అయితే పండుగ బాగా జరుపుకొనేందుకు మరో రోజు కూడా కావాలనే డిమాండ్ రావడంతో అందుకు తగ్గట్టే మూడో రోజు కూడా హాలిడే ఇస్తున్నట్లు ప్రకటించింది. యూపీ బేసిక్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. उत्तर प्रदेश बेसिक शिक्षा परिषद के विद्यालयों में 9 मार्च 2023 को होली के उपलक्ष्य में अवकाश रहेगा। pic.twitter.com/9FfiYp8Wye — Department Of Basic Education Uttar Pradesh (@basicshiksha_up) March 7, 2023 కాగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో 10, 12వ తరగతి పరీక్షలు మార్చి 3,4 తేదీల్లో ముగిశాయి. మే నెలలో ఫలితాలు ప్రకటిస్తారు. అయితే తేదీపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు ఈ ఏడాది హోలీని మహారాష్ట్రలో 6,7 తేదీల్లో జరుపుకోగా.. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో మాత్రం 7,8 తేదీల్లో జరుపుకొన్నారు. ఒక్క యూపీ ప్రభుత్వమే హోలీ సందర్బంగా స్కూళ్లకు మూడు రోజులపాటు సెలవులు ఇచ్చింది. దీంతో విద్యార్థులు సంతోషంలో మునిగిపోయారు. మరో రోజు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. చదవండి: ఆ బీజేపీ ఎమ్మెల్యేకు ఈ రేంజ్లో వెల్కం.. ఏందిరా నాయనా..? -
తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు!
హోలీ పండుగ సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. కొత్తగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావించే వారికి భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. పండుగ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటి వాటిని అందిస్తోంది. ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: గూగుల్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఆ భాగ్యం కొందరికే! పాత ద్విచక్రవాహనాల ఎక్స్చేంజ్పై భారీగా.. ప్రస్తుతం ఓలా ఎస్1 వేరియంట్‌పై రూ.2వేలు, ఎస్1 ప్రో వేరియంట్‌పై రూ.4 వరకు తగ్గింపు ఇస్తున్నారు. ఇక పాత పెట్రోల్ బైక్ లేదా స్కూటర్ ఎక్స్చేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 45 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా రూ.6,999 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఓలా కమ్యూనిటీ సభ్యులకు ఓలా కేర్ ప్లస్ సబ్స్క్రిప్షన్, ఎక్సెంటెడ్ వారంటీస్పై 50 శాతం తగ్గింపు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్లన్నీ మార్చి 8 నుంచి 12 వరకే. ఓలా హోలీ ఆఫర్ల ద్వారా కస్టమర్ల పండుగ ఆనందం మరింత పెరుగుతుందని ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్సూల్ ఖండేల్‌వాలా పేర్కొన్నారు. ఓలా సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ఓలా కేర్ సర్వీసుల్లో ఓలా కేర్, ఓలా కేర్ ప్లస్ అని రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఓలా కేర్ ప్లాన్ ద్వారా ఫ్రీ లేబర్ సర్వీర్, థెఫ్ట్ అసిస్టెన్స్, రోడ్ సైడ్ అసిస్ట్, పంచర్ అసిస్ట్ వంటి సేవలు లభిస్తాయి. ఇక ఓలా కేర్ ప్లస్ విషయానికి వస్తే.. యాన్వల్ కాంప్రెహెన్సిల్ డయాగ్నస్టిక్, ఫ్రీ అంబులెన్స్, ఫ్రీ హోమ్ సర్వీస్, పికప్ అండ్ డ్రాప్ వంటి ప్రయోజనాలు పొందవచ్చు. కాగా డీ2సీ(డైరెక్ట్ టు కస్టమర్) సేవలను విస్తరించే పనిలో ఉన్న ఓలా మార్చి 2023 నాటికి అన్ని ప్రధాన నగరాల్లో 500 కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లను తెరుస్తోంది. -
RCB: సప్తవర్ణశోభితం.. హోలీ వేడుకల్లో స్మృతి సేన! శాశ్వతంగా ఉండిపోదు కదా!
WPL 2023 RCB- Holi 2023: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా క్రికెటర్లు రంగుల్లో మునిగితేలారు. ఒకరిపై ఒకరు రంగు చల్లుకుంటూ హోలీ పండుగను సంబరంగా జరుపుకొన్నారు. కెప్టెన్ స్మృతి మంధాన సహా విదేశీ ప్లేయర్లు ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, హీథర్ నైట్ ఈ వేడుకల్లో భాగమయ్యారు. శాశ్వతంగా ఉండిపోతుందా? తమ ప్లేయర్లంతా సప్తవర్ణశోభితమై ఉన్న ఫొటోలను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆసీస్ క్రికెటర్ ఎలిస్ పెర్రీ.. ‘‘ఇప్పటికే రెండుసార్లు హెయిర్ వాష్ చేశా! ఒకవేళ ఈ రంగు శాశ్వతంగా ఉండిపోదు కదా!’’ అంటూ గులాల్‌తో నిండిపోయిన జుట్టుతో ఉన్న ఫొటోను షేర్ చేసి సరదాగా కామెంట్ చేసింది. రెండింటిలోనూ ఓటమి బీసీసీఐ తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆర్సీబీ ఫ్రాంఛైజీ జట్టును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు లీగ్‌లోనే అత్యధికంగా 3.4 కోట్ల రూపాయల భారీ ధర చెల్లించి ఆమెను కొనుగోలు చేసింది. ఇక స్మృతిని కెప్టెన్‌గా నియమించిన ఆర్సీబీ.. టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాను తమ మెంటార్‌గా నియమించి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఆర్సీబీ ఓడిపోవడం గమనార్హం. ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 60 పరుగులు, రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో బుధవారం (మార్చి 8) గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో గెలిచి విజయ ప్రస్థానాన్ని ఆరంభించాలని పట్టుదలగా ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు స్మృతి మంధాన (కెప్టెన్), రేణుకా సింగ్, ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దీక్షా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఆశా షిబానా, హీథర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖెనార్, మేగన్ షట్, సహానా పవార్. చదవండి: Saeed Anwar-PM Modi: ప్రధాని మోదీపై పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. Ind Vs Aus: నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న టీమిండియా.. యువ బ్యాటర్‌పై ద్రవిడ్ ప్రత్యేక శ్రద్ధ -
మరోసారి వైరల్ అవుతున్న రఘువీరారెడ్డి
సాక్షి, బెంగళూరు: నీలకంఠపురం రఘువీరారెడ్డి.. పీసీసీ మాజీ చీఫ్, మడకశిర మాజీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈయన.. వయసు మీదపడుతున్న ఛాయలతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తుంటారు. తాజాగా.. బెంగళూరులో కుటుంబ సభ్యులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. సరదాగా చిందులు వేస్తూ అల్లరి చేసిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. -
Happy Holi 2023: రంగుల్లో మునిగి తేలుతున్న సినీ తారలు
హోలీ పండగ సందర్భంగా రంగులతో ఆడారు సినీ తారలు. ఆ ఆనందోత్సాహాలను సోషల్ మీడియా వేదికగా ఫొటోల రూపంలో అభిమానుల కోసం షేర్ చేశారు. నేపాల్‌లో హోలీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు తమన్నా. పెళ్లైన తర్వాత తొలి హోలీ ఫెస్టివల్‌ను భర్త సోహైల్ కతూరియాతో జరుపుకున్నారు హన్సిక. కరీనా కపూర్, కరిష్మా కపూర్, అనన్యా పాండే , రకుల్ ప్రీత్ సింగ్ కూడా హోలీ సంబరాల్లో మునిగారు. View this post on Instagram A post shared by Rakul singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) गुंजिया खाई क्या??? 😀💖 मुंबई वालो रंग के साथ प्यार भी बरसाने के लिये दिल से शुक्रिया!!! You guys have my heart 🫶🏻💗 Happy Holi 💜💙🧡#holi #holihai pic.twitter.com/xuCf15rImz — Soundarya Sharma (@soundarya_20) March 7, 2023 View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Nani (@nameisnani) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
హోలీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగను ఆనందోత్సహాలతో జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. కాగా, దేశవ్యాప్తంగా రంగుల కేళి హోలీ సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైన భారత్‌లో ప్రతి ఏటా అనేక పండుగలను జరుపుకొంటారు. అయితే రంగుల పండుగ హోలీకి వీటిలో ప్రత్యేక స్థానం ఉంది. అందర్నీ కలిపే పండుగగా చెప్పుకునే హోలీని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకొంటారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు. చదవండి: మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే.. -
‘రొమాంటిక్’హోలీ.. రంగు పడింది.. ప్రేమ పుట్టింది
హోలీ వచ్చిందంటే ఆ సందడే వేరు. బంధువులు సన్నిహితులంతా ఒక్కచోట చేరి రంగుల్లో మునిగితేలుతూ సంబరాలు చేసుకుంటారు. ఆకాశంలోని ఇంద్ర దనుస్సు నేలకు దిగి వచ్చిందా అనేంతగా ప్రజలంతా రంగుల్లో మునిగిపోతారు. ఇక ఈ పండుగ ప్రత్యేకతను చాటుతూ వెండితెరపై ఎన్నో చిత్రాలు ఆవిష్కృతమయ్యాయి. ముఖ్యంగా ప్రేమికులను కలిపేందుకు ఈ హోలీ పండుగను వేదికగా మలిచిన ప్రేమ కథ చిత్రాలేన్నో. కొట్టు కొట్టు కొట్టు…రంగు తీసి కొట్టు రంగులోన లైఫ్ ఉంది రా… అంటూ కింగ్ నాగార్జున అందాల భామలను పడేశాడు. రంగు రబ్బ..రబ్బ అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇలియానాతో కలసి రంగుల్లో మునిగి తేలాడు. రంగేలీ హోలీ…హంగామా కేళీ అంటూ డార్లింగ్ ప్రభాస్ అందాల భామలతో సందడి చేశాడు. ఇలా ప్రేమకథా చిత్రాల్లో హీరోహీరోయిన్ల మధ్య సయ్యాటలు, పాటలకు ఈ రంగుల పండుగను చేర్చి మరితం ఆకర్షనీయంగా మలిచిన ఆ చిత్రాలేంటో ఓ సారి చూద్దాం! ‘మజిలి’లో చై-సామ్ హోలీ! ఈ సినిమా సమంత, హీరో నాగ చైతన్య చాటుమాటుగా ప్రేమిస్తుంది. క్రికెట్ ఆడుతూ తన స్నేహితులతో జాలిగా తిరుగుతున్న హీరోని ఫాలో అవుతూ ఉంటుంది. అతడి అల్లరి చూస్తూ మురిపోతుంటుంది. తన ప్రేమను చెప్పకుండా వన్ సైడ్ లవ్‌లో పడుతుంది. నేరుగా అతడికి ఎదురుపడేందుకు భయపడే సామ్ హోలీ పండగలో మాత్రం ఏకంగా హీరోకి చాటుగా కలర్ పూసి ఆనందపడిపోతుంది. అలా ఎన్నో ప్రేమ కథ చిత్రాల్లో హీరోహీరోయిన్ల ప్రేమకు ఈ హోలీ పండుగ వేదికగా నిలిచింది. నాని-లావణ్యల ‘భలే భలే’ హోలీ భలే భలే మగాడివో చిత్రంలో నాని-లావణ్య త్రిపాఠిల ప్రేమలో కూడా హోలీ పండుగను చేర్చారు. రోడ్డుపై హీరోయిన్ చూసిన నాని అప్పుడే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ వెంటనే మొట్ట మొదటి సారి అంటూ పాట వేసుకుంటాడు నాని. ఇక ఇందులో హీరోయిన్‌తో కలిసి హోలీ ఆడుతూ ఆమెతో ప్రేమ ఆటలు ఆడుతాడు. ఇక ఆ తర్వాత తన మతిమరుపు జబ్బు దాచి హీరోయిన్ ఎలాగోలా ప్రేమలో పడేస్తాడు. ఛార్మితో నాగ్ ‘మాస్’ హోలీ కింగ్ నాగార్జున కెరీర్లో హిట్ సినిమాల్లో ‘మాస్’ సినిమా ఒకటి. అన్నమయ్య, రామదాసు వంటి చిత్రాలతో తర్వాత నాగార్జున యూత్ మంచి క్రేజ్ తీసుకువచ్చిన సినిమా కూడా ఇదే. డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమయ్యాడు. 2004లో వచ్చిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఇందులో జ్యోతిక, ఛార్మిలు హారోయిన్లుగా నటించారు. తన పగ కోసం చార్మి ఉంటున్న అపార్ట్మెంట్లో ఉండేందకు వచ్చిన నాగ్ తన ఉనికిని ఎవరికి తెలియకుండ జాగ్రత్త పడతాడు. ఈ క్రమంలో నాగ్ అపార్ట్మెంట్ వాసులకు దగ్గరయ్యేందుకు లారెన్స్ హోలీ పండగను వేదికగా తీసుకున్నాడు. ఈ క్రమంలో కొట్టు కొట్టు కొట్టు.. రంగు తీసి కొట్టు అంటూ నాగ్ ‘మాస్’లో ఛార్మితో ఆడిపాడాడు. ఈ పాట తర్వాతే ఛార్మీ నాగ్ ప్రేమలో పడుతుంది. రంగుల్లో భూమిక ప్రేమలో పడ్డ ‘వాసు’ తన ఫ్రెండ్‌ను కొట్టిన విలన్ గ్యాంగ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు వెళతాడు వెంకటేశ్. అయితే అప్పుడే హీరోయిన్‌తో వెంకి ప్రేమలో పడతాడు. ఈ సీన్ ఆకర్షనీయంగా తీర్చిదిద్దేందుకు రంగుల పండుగను తీసుకున్నాడు డైరెక్టర్. విలన్లను కొట్టేందుకు వచ్చిన వెంకీ రంగుల మబ్బుల్లో చందమామల హీరోయిన్ వైట్ డ్రెస్‌తో ఎంట్రీ ఇస్తుంది. తనపై రంగుల పడకుండా నవ్వుతూ పరుగెడుతుంటే వెంకీ ఆమెను అలా కళ్లార్పకుండా చూస్తునే ఉండిపోతాడు. అలా వైట్ డ్రెస్‌తో చందమామల మెరిసిపోయిన్ హీరోయిన్ భూమికతో లవ్‌లో పడతాడు. అమెరికాలో ‘దేవదాసు’ హోలీ సెలబ్రెషన్స్ రామ్-ఇలియాన వెండితెర ఎంట్రీ ఇచ్చిన చిత్రం దేవదాసు. ఇండియాలో ఉండే రామ్ అమెరికా సెనెటర్ కూతురైన ఇలియానతో ప్రేమలో పడతాడు. ఇండియాకు వచ్చిన మధుతో లవ్‌లో పడ్డ హీరో తన ప్రేమను గెలిపించుకునేందుకు అమెరికాకు వెళతాడు. అక్కడ ఆమెను కలుసుకునేందుకు హోలీని ప్లాన్ చేస్తాడు. హీరోయిన్ను ఎలా అయినా కలవాలి అన్న సాకుతో హోలీ రోజున హీరోయిన్ను తన తండ్రి చేతనే బయటకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేసి కలుస్తాడు. చివరకు హీరోయిన్ తండ్రితో చివరి వరకూ యుద్దం చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు. షామిలిని పడేసేందుకు హోలీని అడ్డుపెట్టుకున్న సిద్దూ ఈ సినిమాలో రిచ్ పర్సన్యాలిటీ అయినటువంటి హీరో, తనకు నచ్చిన షామిలీని ప్రేమించేందుకు అనేక పాట్లు పడుతూ ఉంటాడు. అందులో భాగంగానే షామిలీ కుటుంబంలో ఉన్న పిల్లలను తనకు సపోర్ట్‌గా చేసుకునేందుకు హోలీ పండుగను ఎంపిక చేసుకుని రంగుల్లో మునిగి తేలతాడు. ఇక ఆ పద్దతి నచ్చని షామిలీ తన ఇంట్లో పిల్లల్ని తీసుకెళ్ళి పోయి, హీరోకి పెద్ద షాక్ ఇస్తుంది. అలా ఎన్నో ట్రైల్స్ వేసి హీరో చివరకు ప్రేమ కథను ముగిస్తాడు. -
రొమాంటిక్ హోలీ.. సిద్ధార్థ్ బుగ్గలపై రంగులు అద్దిన కియారా!
కులమతాలకతీతంగా ప్రజలందరూ ఆనందంగా జరుపుకునే పండగల్లో హోలీ ఒకటి. నేడు, రేపు దేశవ్యాప్తంగా ఈ రంగుల పండగ జరగనుంది. ఇప్పటికే చాలా చోట్ల హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. కొత్త వసంతానికి స్వాగతం పలుకుతూ జనాలు సంతోషంగా హోలీ ఆడుతున్నారు. చిన్నా, పెద్దా.. పేద , ధనిక తారతమ్యం లేకుండా అంతా కలిసి వేడుకలు చేసుకుంటున్నారు. సినీ తారలు సైతం హోలీ పండగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ తన భర్త సిద్దార్థ్ మల్హొత్రతో కలిసి తొలిసారి హోలీ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేసుకుంది. పండగ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన దుస్తులను ధరించారు. భర్త సిద్ధార్థ్ ముఖానికి కియారా స్వయంగా రంగులు పూశారు. చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజిలిచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరితో పాటు అనన్య పాండే, మల్లికా షెరావత్, కరణ్ జోహార్ తదితర బాలీవుడ్ సినీ ప్రముఖులు ‘రొమాంటిక్’గా హోలీ పండను సెలబ్రేట్ చేసుకున్నారు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) बुरा न मानो होली है।❤️🔫 हैप्पी होली।❤️💛💚 . .#holihai #holifestival #holi #HappyHoli2023 pic.twitter.com/vKmyg0b0Na — Soundarya Sharma (@soundarya_20) March 7, 2023 Wishing everyone a very happy Holi ♥️🎨 #Holi pic.twitter.com/siGxrpdjIm — SONAL CHAUHAN (@sonalchauhan7) March 7, 2023 Holi is the day of colour.. It is the day good wins over evil. It is the day we let our inner child out… today let us tell our adult selves also to believe in the goodness of humanity. When we believe it will be so. 🙏 ❤️🧡💛💚💙💜🤍#HappyHoli #Holi #Colours pic.twitter.com/unhlSrOsXu — Kajol (@itsKajolD) March 7, 2023 View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Shahid Kapoor (@shahidkapoor) -
గోగుపూల హోలీ.. ప్రతీ పండుగ ప్రకృతితో మమేకమే!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రతీ పండుగ ప్రకృతితో మమేకమే. కాలక్రమేణా ప్రకృతిని వీడి ఆధునికత వైపు పరుగులు తీస్తూ.. పండుగల్లోని సహజ వేడుకలకు కృత్రిమ రంగులను అద్దుతున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేటికీ కొన్ని సంప్రదాయ అలవాట్లు అలాగే సజీవంగా కొనసాగుతున్నాయి. అలాంటి వాటిలో హోలీ పండుగ కూడా ఒకటి. ఈ పండుగకు కొంతమంది నేటికీ రంగుల కోసం మోదుగు పూలనే వాడుతున్నారు. ఈ పూలు హోలీ పండుగకు ముందే అడవుల్లో చెట్ల నిండా పూలతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ పూలు తెచ్చుకునే రంగులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గోగుపూల రంగులు ఎక్కువమందికి చేరేలా నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి ఓ యత్నం చేశారు. మోదుగు పూలను సేకరించి.. పదిహేను రోజుల క్రితం ఉపాధి కూలీలతో స్థానిక అడవిలో మోదుగు పూలను సేకరించారు. వాటి పూల కాడలను తీసి శుభ్రపరిచారు. తేమ పోయేలా ఎండలో ఆరబెట్టారు. ఆ తర్వాత గిర్నీలో మర పట్టించి, పొడిలా మార్చారు. ఆ పొడిలో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి, ప్యాకెట్లలో నింపారు. ఇప్పటికి పదిహేను కిలోల మోతాదులో సేకరించారు. ఆ పొడిని కొద్దిగా నీటిలో వేసుకుని మరిగిస్తే ఆరెంజ్ కలర్ రంగు వస్తుంది. ఈ రంగును నీటిలో కావాల్సినంత మేర కలుపుకొని హోలీ వేడుకల్లో చల్లుకునేందుకు వాడుకోవచ్చు. జిల్లాలోని ప్రభుత్వశాఖల అధికారులకు ఉచితంగా అందజేశారు. రసాయనాలు లేని ఈ సహజ రంగులతో ఎలాంటి చర్మ, అనారోగ్య సమస్యలు తలెత్తవు. చిన్నా, పెద్దా అందరూ ఈ సహజ రంగులను వాడుకోవచ్చని చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్కెట్లోకి.. గతంలో చాలామంది ఈ మోదుగు పూలను హోలీ రంగుల్లో వాడేవారు. ప్రస్తుతం తగ్గిపోయింది. మళ్లీ అందరికీ సహజ సిద్ధ రంగును వాడేలా చేసేందుకు ఈ పొడిని తయారు చేశాం. వచ్చే ఏడాదికి మార్కెట్లో అందుబాటులో ఉండేలా చేస్తాం. దీని ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం కల్పించవచ్చు. – విజయలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారిణి. -
Holy 2023: రంగులు త్వరగా పోవాలంటే..
హోలీ ఆడడం ఒక ఎత్తు అయితే.. ఆ మరకలను వదిలించుకునేందుకు పడే శ్రమ మరో ఎత్తు. పైగా హోలీ ఆడేప్పుడు రంగులే కాదు.. అడ్డమైనవన్నీ పూసేసుకుంటారు కొందరు. మరకలు త్వరగా పోవాలంటే వెంటనే వాటిని కడిగేయాలి. ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే శరీరానికి అంతలా అంటుకుపోతాయి. అయితే.. హోలీ ఆడిన తర్వాత త్వరగా రంగుల్ని పోగొట్టుకునేందుకు పాటించాల్సిన కొన్ని చిట్కాలు.. ► హోలీ రంగులు చల్లుకోవడానికి ముందుగా ఒంటికి కాస్త కొబ్బరి నూనె కాని గ్లిజరిన్ ఆయిల్ కాని రాసుకుంటే మంచిది. ► ఫ్లూయల్ ఆయిల్స్ లేదా కిరోసిన్ రాసి రంగులు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు కొందరు. కానీ, అది శరీరానికి అంత మంచిది కాదని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. ► శరీరానికి అంటిన మరకలను గోరువెచ్చని నీటితో కడగడం వల్ల రంగులు త్వరగా పోతాయి. (మరీ వేడి నీళ్లు అస్సలు మంచిది కాదు) ► శెనగపిండిలో కొంచెం పాలు, పెరుగు, రోజ్ వాటర్‌కి బాదం నూనె కలిపి పేస్ట్‌లాగ కలిపి ఒళ్లంతా పట్టించాలి. అరగంట తరువాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే రంగులు వదిలిపోతాయి. ► ఒక పాత్రలో గ్లిజరిన్, సీ సాల్ట్ కలపాలి. అందులో అరోమా ఆయిల్ కొన్ని చుక్కలు వేయాలి. ఆ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని రుద్దితే రంగులు పోతాయి. ► రంగుల వల్ల దురద అనిపిస్తే గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమాన్ని శరీరానికి రాసుకోవాలి. కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ► ముఖానికి ముల్తాన్ మట్టి ప్యాక్ వేసుకుంటే దురద నుండి కొంచెం ఉపశమనం కలుగుతుంది. ► రంగులు వదిలించుకున్న వెంటనే శరీరానికి మాయిశ్చరైజ్ క్రీమ్స్ రాయడం మరిచిపోవద్దు. ► తలకు అంటిన రంగులు వదలాలంటే పెరుగులో గుడ్డు సొన కలిపి తలకు పట్టించి గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ► ఒకవేళ హెయిర్‌ని షాంపూతో క్లీన్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా ‘మైల్డ్ షాంపూ’నే ఉపయోగించాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్, తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి ప్యాక్‌లా వేసుకుంటే మంచిది. మరకలు పొగొట్టుకోండిలా.. హోలీలో చాలా మందికి ఎదురయ్యే సమస్య దుస్తులకు మరకలు అంటడం. ప్రీ ప్లాన్డ్గా పాత బట్టలేసుకుని ఆడేవాళ్లు కొందరైతే.. మరికొందరు స్పెషల్‌గా పండుగ కోసమే దుస్తులు కొనుక్కుంటారు. ఇంకొందరు మాత్రం రంగులంటిన దుస్తుల మరకలు వదిలించేందుకు కష్టపడుతుంటారు. ► డ్రెస్సులపై రంగు మరకలు పోవాలంటే నిమ్మరసం రుద్ది, వేడినీళ్ళలో నానబెట్టి ఉతకాలి. ► అరకప్పు వెనిగర్‌లో చెంచాడు లిక్విడ్ డిటర్జెంట్ వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని చల్లటి నీటి లో వేసి రంగు అంటిన బట్టలను నానబెట్టాలి. గంట తరువాత ఉతికితే రంగులు తేలికగా పోతాయి. ► తెలుపు రంగు దుస్తులకు రంగు మరకలు అంటితే క్లోరిన్‌లో వాటిని నానబెట్టాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో ఉతికితే మరకలు పోతాయి. ► నిమ్మకాయ, హైడ్రోజన్ పెరాక్సైడ్లు దుస్తులపై రంగు మరకలను తొలగించేందుకు బెస్ట్ చాయిస్. మూడు చెంచాల హైడ్రోజన్ పెరాక్సైడ్‌కి కొంచెం టూత్ పేస్ట్(జెల్ కాకుండా) కలిపి రంగు బట్టలను ఉతికితే ప్రయోజనం ఉంటుంది. ► వెనిగర్‌లో ముంచిన గుడ్డతో గోడకు అంటిన రంగు మరకల్ని తుడిస్తే పోతాయి. ఫ్లోర్ మరకల కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని ఉపయోగించాలి. చెప్పులు, షూస్, కార్పెట్ల విషయంలోనూ వీలైనంత త్వరగా రంగుల్ని కడిగేయాలి. ఫోన్ల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. వాటిని ఒక కవర్లో ప్యాక్ చేసి ఉంచడం ఆడుకోవడం ఉత్తమం. అలాగే పిల్లలు హోలీ ఆడుతున్నప్పుడు వాళ్లను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. -
Choti Holi 2023: రంగుల కేళీ హోలీ సంబురాలు (ఫోటోలు)
-
Happy Holi 2023: రంగుల పండుగ హోలీ విశిష్టత ఇదే.. ఎప్పుడు జరుపుకోవాలంటే..?
మంగళవారం(07-03-2023)రంగుల కేళి హోలీ సంబురాలు జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. నేటి ఉదయం నుంచే దేశవ్యాప్తంగా ప్రజలు హోలీని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైన భారత్‌లో ప్రతి ఏటా అనేక పండుగలను జరుపుకొంటారు. అయితే రంగుల పండుగ హోలీకి వీటిలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అందర్నీ కలిపే పండుగగా చెప్పుకునే హోలీని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకొంటారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ హోలీ పండుగ విశిష్టత ఏంటి? ఎన్నిరోజులు జరుపుకొంటారు? హోలికా దహనం ఎందుకు చేస్తారు? ఈ ఏడాది ఏ మూహుర్తంలో పూజలు చేసుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, రాధా కృష్ణల ప్రేమకు గుర్తుగా హోలీ జరుపుకొంటారు. ఈ పండుగను రెండు రోజులు చేసుకుంటారు. మొదటి రోజు చోటీ హోలి. అంటే హోలికా దహనం. రెండో రోజు రంగుల హోలి. అంటే ఒకరిపైఒకరు రంగులు జల్లుకొని పండుగ చేసుకోవడం. ఈ ఏడాది చోటి హోలి (హోలికా దహన్) మార్చి 7న, బడీ హోలి(రంగుల హోలి)మార్చి 8న జరపుకోవాలని ప్రముఖ పంచాంగం వెబ్సైట్ డ్రిక్ పంచాగ్ తెలిపింది. హోలికా దహనం ఏ సమయంలో.. హోలికా దహనాన్ని మార్చి 7న(మంగళవారం) సాయంత్రం 6:24 గంటల నుంచి రాత్రి 8:51 గంటల మధ్యే జరుపుకోవాలి. అయితే పౌర్ణమి తిథి మార్చి 6(సోమవారం) సాయంత్రం 4:17కు ప్రారంభమై, మార్చి 7( మంగళవారం) సాయంత్రం 6:09 గంటలకు ముగుస్తుంది. హోలికా దహనం సందర్భంగా భక్తులు పూజలు నిర్వహించి భోగి మంటలు వెలిగిస్తారు. తెలుగురాష్ట్రాల ప్రజలు ఈ పూజను సాయంత్రం 6:24 నుంచి రాత్రి 08:49 మధ్య జరుపుకోవాలని పండితులు చెప్పారు. ఎందుకీ పండుగ? హిందూ పురాణాల ప్రకారం హోలికా దహనం ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. రాక్షసుల రాజైన హిరణ్యకశ్యపుడు.. తన సొంత కుమారుడు ప్రహ్లాదుడుని చంపేందుకు శత విధాలా ప్రయత్నిస్తాడు. ఎందుకుంటే అతడు విష్ణువును ఆరాధించడం హిరణ్యకశ్యపుడికి అసలు నచ్చదు. దీంతో ఎన్నోసార్లు ప్రాహ్లాదుడ్ని చంపే ప్రయత్నం చేసి విఫలమవుతాడు. విష్ణువు అతడ్ని కాపాడుతుంటాడు. అయితే ప్రహ్లాదుడ్ని చంపేందుకు హిరణ్యకశ్యపుడి సోదరి హోలికా సాయం చేయాలనుకుంటుంది. ఇద్దరూ కలిసి పథకం పన్నుతారు. దీని ప్రకారం హోలికా మంటల్లో కూర్చుంటే.. ప్రహ్లాదుడ్ని ఆమె ఒడిలో కూర్చోమని హిరణ్యకశ్యపుడు ఆదేశిస్తాడు. తండ్రిమాట ప్రకారం ప్రహ్లాదుడు వెళ్లి మంటల్లోనే హోలికా ఒడిలో కూర్చుంటాడు. కాపాడమని విష్ణువును ప్రార్థిస్తాడు. దీంతో విష్ణువే ప్రహ్లాదుడ్ని మంటల్లో కాలిపోకుండా చేస్తాడు. హోలికా మాత్రం అదే మంటల్లో కాలిబూడిదవుతుంది. దీంతో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు హోలికా దహనం చేసి, ఆ మరునాడు హోలి పండుగను ఘనంగా జరుపుకొంటారు. అలాగే ఈ పండుగను శ్రీకృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మథుర, బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు. కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని నల్లని శరీర రంగు , రాధ శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధ ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుటుందని, అందుకే ఈ రోజును రంగుల పండుగగా జరుపుకుంటారని ప్రజలు విశ్వసిస్తారు. -
చైనా ఉత్పత్తులకు బ్రేక్! హోలీ వేళ భారతీయులంతా..
భారతీయ మార్కెట్లో చైనీస్ ఉత్పత్తులకు గిరాకీ మామూలుగా ఉండదు, అయితే ఈ సారి హోలీ సందర్భంగా కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆత్మనిర్భర్ భారత్ చొరవతో చాలామంది చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి సుముఖత చూపించడం లేదు. నివేదికల ప్రకారం, ఢిల్లీలో ఇప్పటికే చాలామంది వ్యాపారులు కేవలం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా సదర్ బజార్ విక్రేత జావేద్ మాట్లాడుతూ.. ఎక్కువ మంది కొనుగోలుదారులు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిపాడు. తమ పిల్లలకు రంగులను కొనుగోలు చేయడానికి చేయడానికి వచ్చిన కస్టమర్లతో ఒకరు మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతీయ ఉత్పత్తుల నాణ్యత బాగుండటంతో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్లో అమ్మకానికి ఉన్న చాలా ఉత్పత్తులు మన దేశంలో తయారు చేయబడినవి కావడం సంతోషించదగ్గ విషయం అన్నారు. కొనుగోలుదారుల నుంచి చైనా ఉత్పత్తుల మీద పెరుగుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని భారతీయ ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తున్నామని, లోపాలు ఉన్న వాటిని తిరిగి ఇవ్వకపోవడం కూడా చైనా ఉత్పత్తులు అమ్మకపోవడానికి కారణమని కొంతమంది వ్యాపారాలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ హోలీ పండుగ వేళ భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరగటం మంచి విషయమనే చెప్పాలి. -
Sweet Recipe: మూడు రోజుల వరకు తాజాగా ఉండేలా ఫిర్ని తయారీ ఇలా!
ఈ హోలీ రోజు ఇంట్లో వాళ్లకు ఇలా ఫిర్ని చేసిపెట్టండి! ఫిర్ని తయారీకి కావలసినవి: ►బియ్యం – పావు కప్పు ►వెన్న తీయని పాలు – లీటరు ►చక్కెర – అర కప్పు ►బాదం పప్పు – 10 ►పిస్తా – 10 ►యాలకుల పొడి – అర టీ స్పూన్ ►కుంకుమ పువ్వు – 15 రేకలు ►పన్నీరు – 2 టీ స్పూన్లు (ఇష్టమైతేనే) ►కిస్మిస్: 20 ►జీడిపప్పు: 10. తయారీ: ►బియ్యం కడిగి దళసరి బట్ట మీద వేసి నీడలో ఆరబెట్టి, తేమ పోయిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేయాలి (మరీ మెత్తగా అక్కరలేదు). ►ఈ లోపు ఒక చిన్న పాత్రలో నీటిని వేడి చేసి అందులో బాదం, పిస్తా వేసి మూత పెట్టాలి. ►అరగంట తర్వాత నీటిని వడపోసి పొట్టు వలిచి, సన్నగా తరగాలి. ►వెడల్పుగా, మందంగా ఉన్న పాత్రలో పాలు మరిగించాలి. ►ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక గరిటెడు పాలను చిన్న పాత్రలోకి తీసుకుని కుంకుమ పువ్వు రేకలు వేసి నానబెట్టాలి. ►పాత్రలో పాలను మరో రెండు నిమిషాల సేపు మరిగించిన తర్వాత మంట తగ్గించి బియ్యప్పిండి, చక్కెర వేసి అడుగు పట్టకుండా, ఉండకట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి. ►చిక్కబడుతున్నప్పుడు యాలకుల పొడి వేయాలి. ►మిశ్రమం చిక్కబడిన తర్వాత కుంకుమపువ్వు కలిపిన పాలు, బాదం, పిస్తా సగం వేసి కలపాలి. ►ఇవన్నీ వేసిన తర్వాత మరో రెండు లేదా మూడు నిమిషాల సేపు మరగనిచ్చి పన్నీరు వేసి కలిపి స్టవ్ ఆపేయాలి. ఫిర్నీ రెడీ. ఈ ఫిర్నీని కప్పులో పోసిన తర్వాత మిగిలిన బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్తో అలంకరించాలి. ఈ ఫిర్నీని గోరువెచ్చగా తినవచ్చు లేదా చల్లబరిచి తినవచ్చు. ఫ్రిజ్‌లో రెండు– మూడు రోజులు తాజాగా ఉంటుంది. ఇవి కూడా ట్రై చేయండి: రస్మలై ఇష్టమా! ఈ పదార్థాలు ఉంటే చాలు ఇంట్లోనే ఇలా ఈజీగా.. హోలీకి రైస్ ఖీర్ తయారు చేసుకోండిలా! -
Holi 2023: రంగు వెనక రహస్యం
హోలీ పండుగ పూట రంగుల్ని ఒకరిపై ఒకరు చల్లుకోవడం వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ రంగు వెనకాల ఒక్కో రహస్యం దాగి ఉంది. ఒక్కో రంగు ఒక్కో భావాన్ని ప్రేరేపిస్తుంది. హోలీలో వాడే ప్రధాన రంగుల గురించి పురాణాల్లో, తత్వ, మానసిక శాస్త్రాల్లో ఆ రంగుల గురించి ప్రస్తావన ఉంది. ఎరుపు: ప్రమాదానికి సంకేతంగా భావించే ఎరుపు రంగుకి ‘హోలీ’ ప్రత్యేక గుర్తింపును అందించింది. అనంతమైన ప్రేమకి ఇది చిహ్నం. సున్నితత్వం, కోరిక, సంతోషాలకు ప్రతీకగా చెప్తారు. పైగా ఎరుపు ఏకాగ్రతను ఆకర్షిస్తుంది. ఈ రంగు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. గులాబీ: ప్రేమను తెలియజేసే రంగు ఇది. లేత గులాబి రంగుతో ఆనందం వెల్లివిరిస్తుంది. మనిషికి మధురమైన భావనలను కలిగిస్తుంది. గులాబీ, నలుపు రంగును మేళవిస్తే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. హోలీలో గులాబీ రంగుకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తుంటారు. పసుపు: ఆధ్యాత్మిక ధోరణిలో పసుపు పవిత్రతకు సూచిక. శక్తికి, వెలుగుకు ప్రతీక. తెలివిని సూచించేదని పెద్దలు చెప్తుంటారు. సహజ సిద్ధంగా తయారు చేసే ఈ రంగు వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చేస్తుంది. అందుకే హోలీలో ఈ రంగును ఎక్కువగా ఉపయోగించాలని సూచిస్తుంటారు. కాషాయం: ఎరుపు, పసుపు ఛాయలు కలిగిన నారింజ రంగు స్థిరత్వాన్ని కలిగిస్తుంది. మనం ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉండేలా చేస్తుంది. అయితే సరదాని పంచే ఈ రంగుకి హోలీలో ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది. నీలం: దైవత్వంతో ముడిపడి ఉన్న రంగు. ప్రశాంతత, నెమ్మదితనాలను సూచిస్తుంది. మనలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ రంగు ఉపయోగపడుతుందని.. తద్వారా జీవితాన్ని ఉత్సాహంగా గడపవచ్చని పెద్దలు చెప్తారు. ఆకుపచ్చ: ప్రకృతితో సన్నిహితం కలిగిన రంగు. దుష్ట గ్రహాలకు, శక్తులకు వ్యతిరేకంగా పచ్చదనం పనిచేస్తుందని పెద్దలు చెప్తుంటారు. శాంతి, పవిత్రతలకు సూచిక. అలిసిపోయిన శరీరాలకు విశ్రాంతిని అందిస్తుంది. ఊదా: పసుపు, ఎరుపు రంగుల మిశ్రమం. నాణ్యత, సంపదలకు సంకేతం. రంగుల్లో రాజసమైనది. మనిషిలో ఉద్వేగాలను, ఉద్రేకాలను రేకెత్తించడంలో ఉపయోగపడుతుంది. నలుపు: రహస్యానికి గుర్తుగా నలుపు రంగును అభివర్ణిస్తుంటారు. అదేవిధంగా శక్తి, భయాలకు గుర్తుగా చెప్తుంటారు. అధికారాన్ని సూచించే రంగు నలుపే. ఈ రంగు మనిషి విలాసానికి ప్రతీకగా భావిస్తారు.