లక్నో: పాఠశాల విద్యార్థలకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. హోలి పూర్ణిమ సందర్బంగా గురువారం(మార్చి9) సెలవు అని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను బుధవారం ఉదయం విడుదల చేసింది.
హోలీ పండుగ సందర్భంగా ఇప్పటికే మార్చి 7, 8న రెండు రోజులపాటు సెలవులు ఇచ్చింది యూపీ ప్రభుత్వం. అయితే పండుగ బాగా జరుపుకొనేందుకు మరో రోజు కూడా కావాలనే డిమాండ్ రావడంతో అందుకు తగ్గట్టే మూడో రోజు కూడా హాలిడే ఇస్తున్నట్లు ప్రకటించింది. యూపీ బేసిక్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.
उत्तर प्रदेश बेसिक शिक्षा परिषद के विद्यालयों में 9 मार्च 2023 को होली के उपलक्ष्य में अवकाश रहेगा। pic.twitter.com/9FfiYp8Wye
— Department Of Basic Education Uttar Pradesh (@basicshiksha_up) March 7, 2023
కాగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో 10, 12వ తరగతి పరీక్షలు మార్చి 3,4 తేదీల్లో ముగిశాయి. మే నెలలో ఫలితాలు ప్రకటిస్తారు. అయితే తేదీపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
మరోవైపు ఈ ఏడాది హోలీని మహారాష్ట్రలో 6,7 తేదీల్లో జరుపుకోగా.. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో మాత్రం 7,8 తేదీల్లో జరుపుకొన్నారు. ఒక్క యూపీ ప్రభుత్వమే హోలీ సందర్బంగా స్కూళ్లకు మూడు రోజులపాటు సెలవులు ఇచ్చింది. దీంతో విద్యార్థులు సంతోషంలో మునిగిపోయారు. మరో రోజు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
చదవండి: ఆ బీజేపీ ఎమ్మెల్యేకు ఈ రేంజ్‌లో వెల్‌కం.. ఏందిరా నాయనా..?
Comments
Please login to add a commentAdd a comment