స్మృతి మంధాన- ఎలిస్ పెర్రీ (PC: RCB)
WPL 2023 RCB- Holi 2023: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా క్రికెటర్లు రంగుల్లో మునిగితేలారు. ఒకరిపై ఒకరు రంగు చల్లుకుంటూ హోలీ పండుగను సంబరంగా జరుపుకొన్నారు. కెప్టెన్ స్మృతి మంధాన సహా విదేశీ ప్లేయర్లు ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, హీథర్ నైట్ ఈ వేడుకల్లో భాగమయ్యారు.
శాశ్వతంగా ఉండిపోతుందా?
తమ ప్లేయర్లంతా సప్తవర్ణశోభితమై ఉన్న ఫొటోలను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆసీస్ క్రికెటర్ ఎలిస్ పెర్రీ.. ‘‘ఇప్పటికే రెండుసార్లు హెయిర్ వాష్ చేశా! ఒకవేళ ఈ రంగు శాశ్వతంగా ఉండిపోదు కదా!’’ అంటూ గులాల్‌తో నిండిపోయిన జుట్టుతో ఉన్న ఫొటోను షేర్ చేసి సరదాగా కామెంట్ చేసింది.
రెండింటిలోనూ ఓటమి
బీసీసీఐ తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆర్సీబీ ఫ్రాంఛైజీ జట్టును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు లీగ్‌లోనే అత్యధికంగా 3.4 కోట్ల రూపాయల భారీ ధర చెల్లించి ఆమెను కొనుగోలు చేసింది. ఇక స్మృతిని కెప్టెన్‌గా నియమించిన ఆర్సీబీ.. టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాను తమ మెంటార్‌గా నియమించి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఆర్సీబీ ఓడిపోవడం గమనార్హం. ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 60 పరుగులు, రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో బుధవారం (మార్చి 8) గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో గెలిచి విజయ ప్రస్థానాన్ని ఆరంభించాలని పట్టుదలగా ఉంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు
స్మృతి మంధాన (కెప్టెన్), రేణుకా సింగ్, ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దీక్షా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఆశా షిబానా, హీథర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖెనార్, మేగన్ షట్, సహానా పవార్.
చదవండి: Saeed Anwar-PM Modi: ప్రధాని మోదీపై పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు..
Ind Vs Aus: నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న టీమిండియా.. యువ బ్యాటర్‌పై ద్రవిడ్ ప్రత్యేక శ్రద్ధ
Comments
Please login to add a commentAdd a comment