Ellyse Perry
-
ఆర్సీబీకి గుడ్ న్యూస్
మహిళల ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభవార్త. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతుంది. బీబీఎల్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతనిథ్యం వహించే పెర్రీ.. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో, బంతితో ఇరగదీసింది.డబ్యూబీబీఎల్ 2024 సీజన్లో పెర్రీ ఇప్పటివరకు చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో 39 బంతుల్లో 81 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన పెర్రీ.. రెండో మ్యాచ్‌లో 28 బంతుల్లో 54 పరుగులు చేసి రెండు వికెట్లు తీసింది. మూడో మ్యాచ్‌లో 25 బంతుల్లో అజేయమైన 31 పరుగులు చేసిన పెర్రీ.. ఓ వికెట్ పడగొట్టింది. నాలుగో మ్యాచ్‌లో 62 బంతుల్లో 86 పరుగులు చేసిన పెర్రీ.. తాజాగా జరిగిన ఐదో మ్యాచ్‌లో 44 బంతుల్లో అజేయమైన 48 పరుగులు చేసి ఓ వికెట్ తీసింది.ఓవరాల్‌గా పెర్రీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 100 సగటున, 152.28 స్ట్రయిక్‌రేట్‌తో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 300 పరుగులు చేసింది. అలాగే ఆరు వికెట్లు తీసింది. మహిళల ఐపీఎల్ ప్రారంభానికి ముందు పెర్రీ సూపర్ ఫామ్ ఆర్సీబీకి శుభ శకునమని చెప్పాలి. పెర్రీ గత ఐపీఎల్ సీజన్లోనూ బ్యాట్‌తో పాటు బంతితోనూ ఇరగదీసింది. పెర్రీ 2024 సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా (9 మ్యాచ్‌ల్లో 347 పరుగులు) నిలిచి బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీసింది. కాగా, మహిళల ఐపీఎల్ 2025 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో జరుగనుంది. ఈ సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. లీగ్‌లోని ఐదు ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాలను వెల్లడించాయి. అలాగే తాము రిలీజ్ చేసిన పేర్లను కూడా ప్రకటించాయి.డబ్ల్యూపీఎల్ 2025 సీజన్ కోసం ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ప్లేయర్లు వీళ్లే..స్మృతి మంధన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, కనిక అహుజా, డానీ వాట్ (యూపీ నుంచి ట్రేడింగ్)ఆర్సీబీ వదిలేసిన ప్లేయర్లు..దిషా కసత్, ఇంద్రాణి రాయ్, నదినే డి క్లెర్క్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్ -
ఎల్లిస్ పెర్రీ ఊచకోత.. సిడ్నీ సిక్సర్స్ బోణీ విజయం
మహిళల బిగ్‌బాష్ లీగ్ 2024లో భాగంగా మెల్బోర్న్ రెనిగేడ్స్‌తో ఇవాళ (అక్టోబర్ 27) జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెనిగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. జార్జియా వేర్హమ్ (61) అర్ద సెంచరీతో రాణించగా.. కోట్నీ వెబ్ (43) పర్వాలేదనిపించింది. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో ఎమ్మా డి బ్రోగ్ (19), డియాండ్రా డొట్టిన్ (15), సోఫి మోలినెక్స్ (17), నయోమి స్టేలెన్బర్గ్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. సిడ్నీ బౌలర్లలో సోఫి ఎక్లెస్టోన్, ఎల్లిస్ పెర్రీ, కోట్నీ సిప్పెల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కయోమీ బ్రే ఓ వికెట్ దక్కించుకుంది.Carnage from Perry 👏pic.twitter.com/pCpCm1Ayjq— CricTracker (@Cricketracker) October 27, 2024అనంతరం 179 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిడ్నీ.. కెప్టెన్ ఎల్లిస్ పెర్రీ (38 బంతుల్లో 81; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) ఊచకోత కోయడంతో 19 ఓవర్లలోనే (7 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. సిడ్నీ ఇన్నింగ్స్‌లో హోలీ ఆర్మిటేజ్ (30), సారా బ్రైస్ (36 నాటౌట్) ఓ మోసర్తు స్కోర్లు చేశారు. రెనెగేడ్స్ బౌలర్లలో జార్జియా వేర్హమ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అలైస్ క్యాప్సీ రెండు.. లిన్సే స్మిత్, సోఫీ మోలినెక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుత బిగ్‌బాష్ లీగ్ ఎడిషన్‌లో సిడ్నీకు ఇది తొలి విజయం. ఇవాళ ఉదయం జరిగిన లీగ్ ఓపెనర్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్పై బ్రిస్బేన్ హీట్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. లీగ్‌లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ కూడా జరుగనుంది. పెర్త్ స్కార్చర్స్, మెల్బోర్న్ స్టార్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
అక్కడా.. ఇక్కడా ఆర్సీబీ ఆటగాళ్లదే డామినేషన్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ జట్టునే అధికంగా ఇష్టపడతారు. ఆర్సీబీ ప్రాతినిథ్యం వహించిన, వహిస్తున్న క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి ఆటగాళ్ల రేంజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఆర్సీబీ క్రేజ్ కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ జట్టు ఆటగాళ్ల క్రేజ్ మహిళల ఐపీఎల్‌లోనూ (డబ్ల్యూపీఎల్) ఇదే రేంజ్లో ఉంది. డబ్ల్యూపీఎల్‌లోనూ ఆర్సీబీ టైటిల్ సాధించకపోయినా విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తాజా డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరి తమ తొలి టైటిల్‌పై అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తుంది. నేడు జరుగబోయే ఫైనల్లో స్మృతి మంధన నేతృత్వంలోని ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఆర్సీబీ కేవలం క్రేజ్ విషయంలోనే తోపు కాదని గణంకాలు సూచిస్తున్నాయి. ఐపీఎల్, డబ్ల్యూపీల్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు ఆర్సీబీ ఆటగాళ్ల పేరిటే ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు (175) క్రిస్ గేల్ పేరిట ఉండగా.. మహిళల ఐపీఎల్లో ఈ రికార్డు ఆర్సీబీకే చెందిన సోఫీ డివైన్ (99) పేరిట ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/12) ఆర్సీబీ బౌలర్ అల్జరీ జోసఫ్ పేరిట ఉండగా.. డబ్ల్యూపీఎల్‌లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/15) ఎల్లిస్ పెర్రీ పేరిట ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ డామినేషన్ ఏ రేంజ్లో సాగుతుందో ఇట్టే అర్దమవుతుంది. -
WPL 2024:చరిత్ర సృష్టించిన ఎలీస్ పెర్రీ.. తొలి క్రికెటర్‌గా రికార్డు
డబ్ల్యూపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఆల్‌రౌండర్, ఆసీస్ స్టార్ ఎలీస్ పెర్రీ నిప్పులు చేరిగింది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా పెర్రీ 6 వికెట్లతో చెలరేగింది. ప్రత్యర్ధి బ్యాట్లను తన బౌలింగ్‌తో ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ ముప్పుతిప్పలు పెట్టింది. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టింది. పెర్రీ సాధించిన 6 వికెట్లు కూడా బౌల్డ్‌లు, ఎల్బీ రూపంలో వచ్చినివే కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన కనబరిచిన పెర్రీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆల్‌రౌండర్ మరిజన్నె కాప్(5-15) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కాప్ రికార్డును పెర్రీ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పెర్రీ చెలరేగడంతో ముంబై కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ముంబై బ్యాటర్లలో సజన(30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. పెర్రీతో పాటు శ్రేయంకా పాటిల్, శోభన, డివైన్ తలా వికెట్ సాధించారు. చదవండి: IPL 2024: బాల్ బాయ్‌కు సారీ చెప్పిన రింకూ సింగ్.. అసలేం జరిగిందంటే..? -
భారీ సిక్సర్ కొట్టిన ఆర్సీబీ బ్యాటర్.. దెబ్బకు కారు అద్దం పగిలిపోయింది!
మహిళల ప్రీమియర్ లీగ్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో అద్భుత విజయం సాధించింది. బెంగళూరు వేదికగా యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. ముఖ్యంగా ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన(50 బంతుల్లో 80, 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎల్లీస్ పెర్రీ(37 బంతుల్లో 58) యూపీ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్‌ల ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. డబ్ల్యూపీఎల్ హిస్టరీలోనే ఆర్సీబీకి ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. కారు అద్దం పగలగొట్టిన పెర్రీ.. కాగా ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా ఓ అనుహ్య సంఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ స్టార్ ఎల్లీస్ పెర్రీ కొట్టిన ఓ సిక్సర్ దెబ్బకు కారు అద్దం పగిలిపోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 19వ ఓవర్ చివరి బంతిని పెర్రీ లాంగ్-ఆన్ మీదుగా సిక్సర్‌గా మలిచింది. ఈ క్రమంలో బంతి నేరుగా వెళ్లి డిస్ప్లే బాక్స్‌లో ఉన్న కారు అద్దానికి తగిలింది. దీంతో అద్దం పూర్తిగా పగిలిపోయింది. ఇది చూసిన అందరూ ఒక్క షాక్‌కు గురయ్యారు. పెర్రీ సైతం తలపై చేతులు వేసుకుని అయ్యో అన్నట్లు రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా డబ్ల్యూపీఎల్ ప్రస్తుత సీజన్ పూర్తయిన తరువాత ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుగా ఈ కారును అందిస్తారు. చదవండి: PSL 2024: ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి విధ్వంసం.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో! వీడియో వైరల్ 𝘽𝙧𝙚𝙖𝙠𝙞𝙣𝙜 𝙍𝙚𝙘𝙤𝙧𝙙𝙨 + 𝙂𝙡𝙖𝙨𝙨𝙚𝙨 😉 Ellyse Perry's powerful shot shattered the window of display car 😅#TATAWPL #UPWvRCB #TATAWPLonJioCinema #TATAWPLonSports18 #HarZubaanParNaamTera#JioCinemaSports #CheerTheW pic.twitter.com/RrQChEzQCo — JioCinema (@JioCinema) March 4, 2024 -
WPL 2024: సూపర్ స్మృతి...
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోరీ్నలో తొలి అంచెపోటీలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయంతో ముగించింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), టాపార్డర్ బ్యాటర్ ఎలీస్ పెరీ (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో బెంగళూరు 23 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలుపొందింది. ఈ లీగ్‌లో ఆర్సీబీకిది మూడో విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన (21 బంతుల్లో 28; 5 ఫోర్లు)తో ఒపెనింగ్ వికెట్‌కు చకచకా 51 పరుగులు జతచేసిన స్మృతి ఆ తర్వాత పెరీ అండతో దూకుడు పెంచింది. ఇద్దరు ధనాధన్ ఆటతీరు కనబరచడంతో యూపీ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. రెండో వికెట్‌కు 10.4 ఓవర్లలో 95 పరుగులు జతచేశారు. మంధాన 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 146 పరుగుల వద్ద స్మృతి ని్రష్కమించగా, 33 బంతుల్లో అర్ధశతకం సాధించిన పెరీ ఆఖరి ఓవర్లో అవుటైంది. రిచా ఘోష్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించింది. ఆంధ్ర అమ్మాయి అంజలి శర్వాణి, దీప్తి శర్మ, సోఫీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేయగలిగింది. కెపె్టన్, ఓపెనర్ అలీసా హీలీ (38 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) పవర్‌ప్లేలో దంచేసింది. మరో ఓపెనర్ కిరణ్ నవ్‌గిరే (18) సహా చమరి ఆటపట్టు (8), గ్రేస్ హారిస్ (5), శ్వేత సెహ్రావత్ (1) స్వల్ప వ్యవధిలో ని్రష్కమించడంతో యూపీ లక్ష్యానికి దూరమైంది. దీప్తి శర్మ (22 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), పూనమ్ (24 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు పోరాడారు. నేటి నుంచి ఢిల్లీ వేదికపై రెండో అంచె పోటీలు జరుగుతాయి. మంగళవారం జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. -
చరిత్ర సృష్టించిన ఆసీస్ ప్లేయర్.. తనతో పాటు తల్లి, తండ్రి, సోదరుడు ఆడిన దేశంపైనే..!
మహిళల క్రికెట్లో 27 ఏళ్ల ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కిమ్ గార్త్ చరిత్ర సృష్టించింది. తనతో పాటు తల్లి, తండ్రి, సోదరుడు ప్రాతినిధ్యం వహించిన దేశంపైనే వన్డే మ్యాచ్ ఆడి రికార్డుల్లోకెక్కింది. 2010 నుంచి 2019 వరకు ఐర్లాండ్‌కు ఆడిన కిమ్.. నిన్న (జులై 25) అదే ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించి, చరిత్ర పుటల్లోకెక్కింది. ఓ క్రికెటర్ రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించడం సాధారణమే అయినప్పటికీ.. తనతో పాటు కుటుంబంలోని నలుగురు క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించిన దేశానికి వ్యతిరేకంగా ఆడటం మాత్రం చరిత్రలో ఇదే మొదటిసారి. కిమ్ తండ్రి జోనాథన్ గార్త్, తల్లి అన్నే మేరీ మెక్‌డొనాల్డ్, తమ్ముడు జోనాథన్ గార్త్ ఐర్లాండ్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కిమ్ వివిధ కారణాల చేత 2022 నుంచి ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడుతుంది. ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌తో నిన్న జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 153 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఎల్లీస్ పెర్రీ (91), గార్డ్నర్ (65), మూనీ (49) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 321 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఆతర్వాత బరిలోకి దిగిన ఐర్లాండ్ 38.2 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో యామీ హంటర్ (50) టాప్ స్కోరర్‌గా నిలువగా.. గాబీ లివిస్ (37), కెప్టెన్ లారా డెలానీ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన కిమ్ గార్తీ (6-2-9-1) ఓ వికెట్ పడగొట్టగా.. జార్జీయా వేర్హమ్ చెరో 3 వికెట్లు, మెక్‌గ్రాత్, జొనాస్సెన్ చెరో 2, గార్డనర్ ఓ వికెట్ దక్కించుకున్నారు. -
Ashes Series 2023: ఇంగ్లండ్ ఓపెనర్ డబుల్ సెంచరీ.. ఆసీస్‌కు ధీటుగా..!
మహిళల యాషెస్ సిరీస్ 2023 ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ ట్యామీ బీమౌంట్ డబుల్ సెంచరీ సాధించింది. మహిళల క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటర్‌గా, తొలి ఇంగ్లీష్ మహిళగా ట్యామీ రికార్డుల్లోకెక్కింది. 317 బంతుల్లో 26 బౌండరీ సాయంతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న ట్యామీ.. కెరీర్లో తాను సాధించిన తొలి టెస్ట్ శతకాన్నే ద్విశతకంగా మార్చుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు ట్యామీ తన 7 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో కేవలం 2 అర్ధసెంచరీలు మాత్రమే సాధించింది. అయితే ఆమెకు వన్డేల్లో, టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. 103 వన్డేల్లో 9 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీల సాయంతో 3505 పరుగులు (40.8 యావరేజ్‌తో), 99 టీ20ల్లో సెంచరీ, 10 హాఫ్ సెంచరీల సాయంతో 1721 పరుగులు (108.4 స్ట్రయిక్‌రేట్‌తో) సాధించింది. WOW 🤯 Our first female double centurion in Test match cricket.#EnglandCricket #Ashes pic.twitter.com/Eju1kwmlug — England Cricket (@englandcricket) June 24, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 473 పరుగులకు ఆలౌటైంది. ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన అనాబెల్ సదర్లాండ్ (137) అజేయమైన సెంచరీతో చెలరేగగా.. ఎల్లైస్ పెర్రీ (99) ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకుంది. తహిల మెక్‌గ్రాత్ (61) అర్ధసెంచరీతో రాణించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎక్లెస్టోన్ 5 వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్, లారెన్ ఫైలర్ తలో 2 వికెట్లు, కేట్ క్రాస్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆసీస్‌కు ధీటుగా జవాబిస్తుంది. ఆ జట్టు మూడో రోజు మూడో సెషన్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 25 పరుగులు వెనుకబడి ఉంది. ట్యామీ బీమౌంట్ (205), కేట్ క్రాస్ (0) క్రీజ్‌లో ఉన్నారు. హీథర్‌నైట్ (57), నాట్‌సీవర్ బ్రంట్ (78) అర్ధశతకాలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 3, తహిల మెక్‌గ్రాత్, డార్సీ బ్రౌన్, నదర్లాండ్, పెర్రీ తలో వికెట్ పడగొట్టారు. -
ఆసీస్ సుందరికి ఎంత కష్టమొచ్చే!
ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ ప్రస్తుతం వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023) తొలి ఎడిషన్‌లో సందడి చేస్తుంది. ఆర్సీబీ వుమెన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె బ్యాటింగ్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. అయితే ఆమె మినహా మిగతావారు విఫలం కావడంతో ఆర్సీబీ వుమెన్ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసింది. అయితే బుధవారం యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో మాత్రం ఆర్సీబీ మంచి ప్రదర్శన కనబరిచి లీగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈసారి ఎల్లిస్ పెర్రీ బ్యాట్‌తో విఫలమైనప్పటికి బంతితో రాణించింది. కీలకమైన మూడు వికెట్లు తీసి యూపీ వారియర్జ్‌ను తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా చేసింది. ముఖ్యంగా తన దూకుడైన ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ గుండెల్లో దడ పుట్టించిన గ్రేస్ హారిస్ వికెట్ తీసి జట్టుకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత లక్ష్య చేధనలో కనికా అహుజా, రిచా ఘోష్‌లు రాణించడంతో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ గెలిచిన తర్వాత ఎల్లిస్ పెర్రీ గ్రౌండ్లోకి దూసుకొచ్చి దీప్తిశర్మను కౌగిలించుకొని విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది.ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఎల్లిస్ పెర్రీ మాట్లాడింది. తన జట్టుకు అంటుకున్న రంగు ఇంకా పోలేదని.. దానివల్ల నాకు చిరాకు కలుగుతుందని ఎవరైనా సలహా ఇవ్వగలరా అని అడిగింది. ''ఇంట్లో ఎవరైనా ఉంటే నా జట్టుకు అంటుకున్న పింక్ కలర్‌ను పోగొట్టే చిట్కా చెప్పండి. మీరు చేసే పెద్ద సహాయం అదే. జుట్టుకున్న రంగును చూసినప్పుడల్లా నాకు ఏదో తెలియని చిరాకు కలుగుతుంది. హోలీ ఆడినప్పుడు బాగానే అనిపించింది కానీ జట్టుకు మాత్రం పింక్ కలర్ అలాగే ఉండిపోయింది. దయచేసి సాయం చేయండి.. అది పోగొట్టే మార్గం చెప్పండి'' అంటూ నవ్వుతూ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎల్లిస్ పెర్రీ సాయం కోరడంపై స్పందించిన క్రికెట్ ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''నీలాంటి అందమైన క్రికెటర్ సలహా అడిగితే ఇవ్వకుండా ఉంటామా.. కచ్చితంగా ఇస్తాం''.. ''అందం, అభినయంతో పాటు ఆటతో మా మనుసుల గెలిచావ్.. నీకు ఆ మాత్రం సాయం చేయలేమా'' అంటూ పేర్కొన్నారు. (2/n) pic.twitter.com/sX7tkzRBfZ — Krish (@archer_KC14) March 15, 2023 చదవండి: ఆడడంలో విఫలం.. తప్పు మీద తప్పు చేస్తూ -
వరుస ఓటములు బాధిస్తున్నా.. ఆకట్టుకున్న ఆసీస్ క్రికెటర్
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023) తొలి ఎడిషన్ నాకౌట్ స్టేజీకి దగ్గరైంది. ఇప్పటికే లీగ్‌లో సగానికి పైగా మ్యాచ్‌లు ముగియడంతో ఎవరు ప్లేఆఫ్‌కు వెళ్తున్నారు.. ఎవరు వెళ్లడం లేదనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ వుమెన్ ఐదు వరుస విజయాలతో ప్లేఆఫ్ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్నట్లే. అదే సమయంలో స్మృతి మంధాన సారధ్యంలోని ఆర్సీబీ వుమెన్ మాత్రం ఐదు వరుస ఓటములతో చివరి స్థానంలో కొనసాగుతూ దాదాపు లీగ్ నుంచి నిష్క్రమించే స్థితికి చేరుకుంది. దాదాపుగా ప్లేఆఫ్ అవకాశాలు కోల్పోయిన ఆర్సీబీ తన చివరి మూడు మ్యాచ్‌ల్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలనుకుంటుంది. ఇక ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. జట్టులో ఆస్ట్రేలియా క్రికెటర్ ఎలిస్ పెర్రీ మాత్రమే నిలకడగా రాణిస్తూ వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోవడంతో కాస్త ఎమోషన్‌కు గురైన ఎలిస్ పెర్రీ కంటతడి పెట్టడం కదిలించింది. తాజాగా మరోసారి తన చర్యతో అందరిని ఆకట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ముగియగానే ఆర్సీబీ డగౌట్లో పడేసిన వాటర్‌బాటిల్స్, చెత్తను ఏరి డస్ట్‌బిన్‌లో పడేసింది. డబ్ల్యూపీఎల్‌లో తాను ఆడిన ప్రతి మ్యాచ్ తర్వాత ఎలిస్ పెర్రీ ఇదే కంటిన్యూ చేస్తూ వచ్చింది. పర్యావరణానికి ముప్పుగా ఉన్న ప్లాస్టిక్‌ను ఏరేస్తూ ఆమె చేస్తున్న మంచి పనికి అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఆర్సీబీ వుమెన్ ఇవాళ(బుధవారం) యూపీ వారియర్జ్‌తో తలపడనుంది. Ellyse Perry cleans her dugout, places then picks up all bottles and garbage after each match. Great gesture from Perry. #royalchallengersbangalore #ViratKohli𓃵 pic.twitter.com/UIwejvwUp3 — 𝗞𝗜𝗡𝗚 𝗞𝗢𝗛𝗟𝗜 (@68036hu) March 15, 2023 Ellyse Perry has habit that after the match, she cleans her dugout and picks up bottles and garbage puts them in the dustbin. Ellyse Perry said - "I think wherever you play, you should respect". Ellyse Perry - The GOAT, The Role model, The inspiration! pic.twitter.com/DxPLmTB8TH — CricketMAN2 (@ImTanujSingh) March 15, 2023 చదవండి: Ind Vs Aus: భారత్- ఆసీస్ వన్డే సిరీస్.. షెడ్యూల్, జట్లు.. పూర్తి వివరాలు R Ashwin: ట్విటర్ అకౌంట్‌పై ఆందోళన.. ఎలాన్ మస్క్‌కు లేఖ -
RCB: సప్తవర్ణశోభితం.. హోలీ వేడుకల్లో స్మృతి సేన! శాశ్వతంగా ఉండిపోదు కదా!
WPL 2023 RCB- Holi 2023: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా క్రికెటర్లు రంగుల్లో మునిగితేలారు. ఒకరిపై ఒకరు రంగు చల్లుకుంటూ హోలీ పండుగను సంబరంగా జరుపుకొన్నారు. కెప్టెన్ స్మృతి మంధాన సహా విదేశీ ప్లేయర్లు ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, హీథర్ నైట్ ఈ వేడుకల్లో భాగమయ్యారు. శాశ్వతంగా ఉండిపోతుందా? తమ ప్లేయర్లంతా సప్తవర్ణశోభితమై ఉన్న ఫొటోలను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆసీస్ క్రికెటర్ ఎలిస్ పెర్రీ.. ‘‘ఇప్పటికే రెండుసార్లు హెయిర్ వాష్ చేశా! ఒకవేళ ఈ రంగు శాశ్వతంగా ఉండిపోదు కదా!’’ అంటూ గులాల్‌తో నిండిపోయిన జుట్టుతో ఉన్న ఫొటోను షేర్ చేసి సరదాగా కామెంట్ చేసింది. రెండింటిలోనూ ఓటమి బీసీసీఐ తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆర్సీబీ ఫ్రాంఛైజీ జట్టును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు లీగ్‌లోనే అత్యధికంగా 3.4 కోట్ల రూపాయల భారీ ధర చెల్లించి ఆమెను కొనుగోలు చేసింది. ఇక స్మృతిని కెప్టెన్‌గా నియమించిన ఆర్సీబీ.. టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాను తమ మెంటార్‌గా నియమించి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఆర్సీబీ ఓడిపోవడం గమనార్హం. ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 60 పరుగులు, రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో బుధవారం (మార్చి 8) గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో గెలిచి విజయ ప్రస్థానాన్ని ఆరంభించాలని పట్టుదలగా ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు స్మృతి మంధాన (కెప్టెన్), రేణుకా సింగ్, ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దీక్షా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఆశా షిబానా, హీథర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖెనార్, మేగన్ షట్, సహానా పవార్. చదవండి: Saeed Anwar-PM Modi: ప్రధాని మోదీపై పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. Ind Vs Aus: నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న టీమిండియా.. యువ బ్యాటర్‌పై ద్రవిడ్ ప్రత్యేక శ్రద్ధ -
చరిత్ర సృష్టించిన ఎల్లీస్ పెర్రీ.. రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు బద్దలు
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా పెర్రీ రికార్డులకెక్కింది. మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భాగంగా శనివారం దక్షిణాఫ్రికాతో తలపడేందుకు మైదానంలో అడుగుపెట్టిన పెర్రీ.. ఈ ఘనతను తన పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ పెర్రీ 40 మ్యాచ్‌లు ఆడింది. కాగా అంతకుముందు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(39) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో పెర్రీ రికార్డును బ్రేక్ చేసింది. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌లో 1500 పరుగులతో పాటు 100 వికెట్లు సాధించిన మొదటి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా పెర్రీ నిలిచింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ గ్రూప-ఎ నుంచి తమ సెమీఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా ఈ మెగా టోర్నీలో ఆసీస్‌కు ఇది వరసుగా నాలుగో విజయం కావడం గమనార్హం. చదవండి: IND vs AUS: అప్పుడు రాహుల్.. ఇప్పుడు శ్రేయాస్? అయ్యో ఖవాజా ! వీడియో వైరల్ -
అందాలన్నీ ఆర్సీబీలోనే.. స్మృతి, సానియా, ఎల్లిస్..!
మహిళల ఐపీఎల్ (WPL)లో అందమైన జట్టు ఏది అంటే..? ఏమాత్రం తడుంకోకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు చెప్పాలి. విధ్వంసకర ఆటతో పాటు మతి పోగొట్టే అందాలన్నీ ఆర్సీబీ సొంతమయ్యాయనడం అతిశయోక్తి కాదు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధన, ఆసీస్ ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ, ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్, ఆసీస్ పేసర్ మెగాన్ షట్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్, టీమిండియా పేసర్ రేణుకా సింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే జట్టు నిండా అందాలే ఉన్నాయి. ఇన్ని అందాలు చాలవన్నట్లు.. ఆర్సీబీ తమ కుటుంబంలోకి క్రికెటేతర అందాన్ని కూడా ఆహ్వానించింది. బెంగళూరు ప్రాంచైజీ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను మెంటార్‌గా నియమించుకుంది. జట్టు అందాల పూతోటగా మారడం పట్ల ఆర్సీబీ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని అందాలన్నీ ఒకే చోట చేరినట్లుందని సంబురపడిపోతున్నారు. అందంతో పాటు తమ ప్లేయర్స్ ఆటలోనూ మహరాణులంటూ మురిసిపోతున్నారు. ఆటతో పాటు అందాలను ఆస్వాదించే వారికి ఆర్సీబీ వంద శాతం కనువిందు కలిగిస్తుందని గర్వంగా చెప్పుకుంటున్నారు. కాగా, ఫిబ్రవరి 13న జరిగిన WPL మెగా వేలంలో ఆర్సీబీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అందాలన్నిటినీ ఏకం చేసింది. వేలంలో స్మృతి మంధనను 3.4 కోట్ల రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకున్న ఆర్సీబీ యాజమాన్యం.. రిచా ఘోష్‌ను 1.9 కోట్లకు, ఎల్లిస్ పెర్రీని 1.7 కోట్లకు, రేణుకా సింగ్‌ను 1.5 కోట్లకు, సోఫీ డివైన్‌ను 50 లక్షలకు, హీథర్ నైట్‌ను 40 లక్షలకు, మెగాన్ షట్‌ను 40 లక్షలకు, కనిక అహుజను 35 లక్షలకు, డేన్ వాన్ నికెర్క్ను 30 లక్షలకు, ఎరిన్ బర్న్స్‌ను 30 లక్షలకు, ప్రీతి బోస్‌ను 30 లక్షలకు, కోమల్ జంజద్ను 25 లక్షలకు, ఆశా శోభనను 10 లక్షలకు, దిశా కాసత్ను 10 లక్షలకు, ఇంద్రాణి రాయ్‌ను 10 లక్షలకు, పూనమ్ ఖేమ్నర్ను 10 లక్షలకు, సహన పవార్‌ను 10 లక్షలకు, శ్రేయాంక పాటిల్‌ను 10 లక్షలకు సొంతం చేసుకుంది. The pioneer in Indian sports for women, a youth icon, someone who has played Bold and broken barriers throughout her career, and a champion on and off the field. We are proud to welcome Sania Mirza as the mentor of the RCB women’s cricket team. 🤩#PlayBold @MirzaSania pic.twitter.com/eMOMU84lsC — Royal Challengers Bangalore (@RCBTweets) February 15, 2023 వేలంలో మొత్తంగా 18 ప్లేయర్లను (12 మంది స్వదేశీ, ఆరుగురు విదేశీ ప్లేయర్లు) కొనుగోలు చేసిన ఆర్సీబీ.. తాజాగా తమ హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్‌కు చెందిన బెన్ సాయర్‌ను నియమించుకుంది. ఆర్సీబీ పర్స్‌లో ఇంకా 10 లక్షలు మిగిలాయి. -
అందంతో మతిపోగొడుతున్న మహిళా క్రికెటర్
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ తన అందచందాలతో కుర్రకారు గుండెళ్లో రైళ్లు పరిగెత్తించింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్స్ లో పెర్రీ తళుక్కున మెరిసింది. ఈ కార్యక్రమానికి ఆసీస్ మెన్స్ క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు హాజరయ్యారు. అయితే అందరి దృష్టి ఎల్లీస్ పెర్రీపైనే నెలకొంది. అందుకు కారణం ఆమె వేసుకొచ్చిన దుస్తులు. రెడ్ కలర్ డ్రెస్‌లో బ్లూ కార్పెట్‌పై క్లీవేజ్ షో చేస్తూ దగదగ మెరిసిపోయిన ఎల్లీస్ పెర్రీ అవార్డు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రౌండ్లో తన ఆటతో అభిమానులను మంత్రముగ్దులను చేసిన ఎలీస్ పెర్రీ.. తాజాగా అవార్డు కార్యక్రమంలో తన అందచందాలతో అలరించింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 32 ఏండ్ల ఈ ఆసీస్ ఆల్ రౌండర్.. 2007 నుంచి కంగారు జట్టులో కీలక సభ్యురాలిగా వ్యవహరిస్తోంది. ఆస్ట్రేలియా తరఫున 10 టెస్టులు, 128 వన్డేలు, 131 టీ20 మ్యాచ్ లు ఆడింది. టెస్టులలో 752 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉండటం విశేషం. బౌలర్ గా 37 వికెట్లు పడగొట్టింది. వన్డేలలో పెర్రీ.. 3,369 పరుగులు చేసి 161 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక టీ20లలో 1,418 రన్స్ చేసి 117 వికెట్లు సాధించింది. ఇక అవార్డుల విషయానికి వస్తే.. ►స్టీవ్ స్మిత్ ఉత్తమ ఆస్ట్రేలియా క్రికెటర్(అలెన్ బోర్డర్ మెడల్) అవార్డు సొంతం చేసుకోగా.. ఉత్తమ ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌గా బెత్‌మూనీ(బెలిండా క్లార్క్) అవార్డు గెలుచుకుంది. ►మెన్స్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- ఉస్మాన్ ఖవాజా ►ఉమెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- బెత్ మూనీ ►మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- డేవిడ్ వార్నర్ ►వుమెన్స్ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- తాహిలా మెక్‌గ్రాత్ ►మెన్స్ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- మార్కస్ స్టోయినిస్ ►వుమెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-అన్నాబెల్ సదర్లాంఢ్ ►మెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- మైకెల్ నాసర్ ►బ్రాడ్‌మన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- లాన్స్ మోరిస్ ►కమ్యూనిటి ఇంపాక్ట్ అవార్డు- ఉస్మాన్ ఖవాజా -
క్రీడల చరిత్రలో క్రికెట్, ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లు ఆడిన ఆసీస్ ప్లేయర్ ఎవరో తెలుసా..?
ప్రపంచ క్రీడల చరిత్రలో అత్యంత అరుదైన ఘటన ఒకటి ఉంది. ఓ అంతర్జాతీయ ప్లేయర్.. క్రికెట్ వరల్డ్‌కప్‌తో పాటు ఫిఫా ప్రపంచకప్‌లో కూడా పాల్గొని, విశ్వంలో ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర పుటల్లో నిలిచింది. ప్రపంచ క్రీడల చరిత్రలో టార్చ్‌లైట్ వేసి వెతికినా ఇలాంటి ఓ ఘటన నమోదైన దాఖలాలు లేవు. ఆస్ట్రేలియాకు చెందిన 32 ఏళ్ల మహిళా క్రికెటర్ ఎల్లైస్ పెర్రీ 16 ఏళ్ల వయసులోనే (2007) అంతర్జాతీయ క్రికెట్ టీమ్‌తో పాటు ఫుట్‌బాల్ జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చి.. అటు ఐసీసీ మహిళల వరల్డ్‌కప్ (2009)తో పాటు 2011 ఫిఫా మహిళల ప్రపంచకప్‌లో కూడా పాల్గొంది. పెర్రీ.. ఓ పక్క క్రికెట్లో సంచనాలు నమోదు చేస్తూనే, ఫుట్‌బాల్‌లోనూ సత్తా చాటింది. ఆల్‌రౌండర్‌గా వరల్డ్‌కప్‌లో నేటికీ బద్ధలు కాని ఎన్నో రికార్డులు నమోదు చేసిన పెర్రీ.. ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండర్‌గా ఉంటూనే గోల్స్ సాధించింది. 2011 ఫిఫా ప్రపంచకప్‌లో స్వీడన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పెర్రీ.. మెరుపు వేగంతో సాధించిన గోల్‌ను ఆసీస్ ఫుట్‌బాల్ ప్రేమికులు ఎన్నటికీ మర్చిపోలేరు. అయితే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని క్లబ్‌లు క్రికెట్ కావాలో, ఫుట్‌బాల్ కావాలో తేల్చుకోమని చెప్పడంతో 2014లో ఫుట్‌బాల్‌కు స్వస్తి పలికి నేటికీ ఆసీస్ జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతుంది. క్లబ్ లెవెల్ ఫుట్‌బాల్‌లో ఎన్నో అద్భుతాలు చేసిన పెర్రీ.. అంతర్జాతీయ క్రికెట్లో అంతకుమించిన ఎన్నో చెరగని రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. అటు క్రికెట్లోనూ.. ఇటు ఫుట్‌బాల్‌లోనూ సత్తా చాటిన పెర్రీ ఎందరో మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమెను దేశంలోని అన్ని అత్యుత్తమ పురస్కారాలతో సత్కరించింది. క్రికెట్లో ఆసీస్ తరఫున టెస్ట్‌ల్లో 10 మ్యాచ్‌లు ఆడిన పెర్రీ.. 75.20 సగటుతో 752 పరుగులు చేసింది. ఇందులో 2 శతకాలు 3 అర్ధశతకాలు ఉన్నాయి. ఆమె అత్యుత్తమ స్కోర్ 213 నాటౌట్‌గా ఉంది. సుదీర్ఘ ఫార్మాట్లో ఆమె 37 వికెట్లు కూడా సాధించింది. 128 వన్డేలు ఆడిన పెర్రీ.. 50.28 సగటున 2 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీల సాయంతో 3369 పరుగులు చేసి 161 వికెట్లు పడగొట్టింది. ఇక, 126 టీ20లు ఆడిన పెర్రీ.. 4 హాఫ్ సెంచరీల సాయంతో 1253 చేసి 115 వికెట్లు పడగొట్టింది. ఇక ఫుట్‌బాల్ విషయానికొస్తే.. ఆసీస్ తరఫున 18 మ్యాచ్‌లు ఆడిన పెర్రీ.. 3 గోల్స్ సాధించింది. అలాగే క్లబ్ స్థాయిలో 50కి పైగా మ్యాచ్‌ల్లో పాల్గొంది. విండీస్ దిగ్గజం కూడా ఫిఫా వరల్డ్‌కప్, క్రికెట్ ప్రపంచకప్ ఆడాడు.. అయితే..! పురుషుల క్రికెట్లో విండీస్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేట్ సర్ వివియన్ రిచర్డ్స్ కూడా ఫిఫా వరల్డ్‌కప్, క్రికెట్ ప్రపంచకప్‌లలో ఆడాడు. 70, 80 దశకాలలో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన రిచర్డ్స్.. 1975, (తొలి వన్డే ప్రపంచకప్), 1979, 1983 వన్డే ప్రపంచకప్‌లలో పాటు 1974 ఫిఫా వరల్డ్‌కప్‌లో కూడా పాల్గొన్నాడు. కరీబియన్ దీవుల్లోని అంటిగ్వా తరఫున ఫిఫా వరల్డ్‌కప్ బరిలోకి దిగిన సర్ రిచర్డ్స్.. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. నాటి పోటీల్లో ఆంటిగ్వా ఆశించిన స్థాయిలో రాణించలేక, వరల్డ్‌కప్ మెయిన్ డ్రాకు అర్హత సాధించలేకపోయింది. -
వెస్టిండీస్‌తో సెమీఫైనల్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరగున్న తొలి సెమీఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ గాయం కారణంగా వెస్టిండీస్‌తో సెమీఫైనల్‌కు దూరమైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గాయపడిన పెర్రీ ఇంకా కోలులేనట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో వెన్ను నొప్పి కారణంగా మూడు ఓవర్లు వేసిన తర్వాత ఆమె మైదానాన్ని విడిచిపెట్టి వెళ్లింది. ఈ క్రమంలో కీలకమైన సెమీఫైనల్‌కు పెర్రీ దూరం కానున్నట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ వెల్లడించింది. "దురదృష్టవశాత్తూ పెర్రీ సేవలను సెమీఫైనల్లో కోల్పోతున్నాము. మాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ.ఆమె ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. ప్రస్తుతం పెర్రీ వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. పెర్రీ స్థానంలో డెత్ బౌలర్‌ను జట్టులోకి తీసుకువస్తాం" అని లానింగ్ పేర్కింది. ఇక వెస్టిండీస్- ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మార్చి 29 న జరగనుంది. ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా): అలిస్సా హీలీ (వికెట్ కీపర్), రాచెల్ హేన్స్, మెగ్ లానింగ్ (కెప్టెన్) బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, జెస్ జోనాస్సెన్ అలనా కింగ్, మేగాన్ స్కాట్, డార్సీ బ్రౌన్ చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది! -
ఆస్ట్రేలియా విజయాల పరంపర.. న్యూజిలాండ్‌పై భారీ విజయం
మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజయాల పరంపర కొనసాగిస్తోంది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 144 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 128 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్ డార్సీ బ్రౌన్ మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను దెబ్బతీసింది. అదే విధంగా వెల్లింగ్టన్, గార్డెనర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీ సాటర్త్‌వైట్(44) తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. కాగా అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో వికెట్ల నష్టానికి 269 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో పెర్రీ(68),తహ్లియా మెక్‌గ్రాత్(57),గార్డెనర్(48) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో తాహుహు మూడు వికెట్లు పడగొట్టగా..అమేలియా కెర్,హన్నా రోవ్, మాకే చెరో వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ ప్రదర్శన చేసిన ఎల్లీస్ పెర్రీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా మూడు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా తొలి స్ధానంలో ఉంది. చదవండి: Women’s World Cup 2022: క్రీడా స్ఫూర్తి చాటుకున్న మంధాన.. తనకు దక్కిన అవార్డును! -
విజయ్‌తో డిన్నర్‌కు ఓకే చెప్పిన ఎలిస్
న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీతో డిన్నర్ చేయాలని ఉందని టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇటీవల విజయ్ను సీఎస్కే జట్టు ఇంటర్య్వూ చేయగా అక్కడ ఏ ఇద్దరు క్రికెటర్లతో డిన్నర్‌కు వెళ్తారు అనే ప్రశ్న ఎదురైంది. దీనికి మురళీ విజయ్ బదులిస్తూ.. ఎలిస్ పెర్రీతో డిన్నర్ చేయాలని ఉందన్నాడు. ఆమె చాలా అందంగా ఉంటుందని కూడా వ్యాఖ్యానించాడు. అదే సమయంలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కూడా డిన్నర్ చేయాలని ఉందన్నాడు. ఇక్కడ శిఖర్ ధావన్ సంగతి ఎలా ఉన్నా ఎలిస్ పెర్రీ మాత్రం విజయ్‌తో డిన్నర్‌కు ఓకే చెప్పారు. (చివరి వరకు కేకేఆర్‌తోనే: రసెల్) సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెర్రీకి మురళీ విజయ్‌తో డిన్నర్ ప్రశ్న ఎదురు కాగా అందుకు ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. తనకు విజయ్‌తో డిన్నర్‌కు ఎటువంటి అభ్యంతరం లేదని, కాకపోతే డిన్నర్‌కు అయ్యే బిల్ మాత్రం విజయ్ చెల్లిస్తాడని ఆశిస్తున్నా అని సరదాగా వ్యాఖ్యానించారు. ఇక వచ్చే వరల్డ్‌కప్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా.. లేక యాషెస్ సిరీస్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారా’ అనే ప్రశ్నకు కాసేపు ఆలోచించి యాషెస్ అని చెప్పారు. కోచ్‌గా చేయడం ఇష్టమా.. కామెంటేటర్‌గా వ్యవహరించడం ఇష్టమా అంటే కోచ్‌గా చేయడానికే ఆమె ఓటేశారు. అదే సమయంలో భారత మహిళా క్రికెట్ జట్టు యువ సంచలనం షెఫాలీ వర్మపై పెర్రీ ప్రశంసలు కురిపించారు. షెఫాలీలో టాలెంట్ అసాధారణమని కొనియాడారు. ఆ తరహా క్రీడాకారిణిని తమ గేమ్‌లో ఉండాలని కోరుకుంటామన్నారు. (ప్రమాదకరమైన పిచ్‌పై ‘టెస్టు’ ఆడుతున్నాం) ఇదిలా ఉంచితే, 2018 డిసెంబర్లో పెర్త్‌లో ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ తరఫున చివరిసారి కనిపించిన విజయ్.. ఇప్పటికీ రెగ్యులర్ ఆటగాడిగా చోటు సంపాదించుకోలేపోయాడు. టెస్టు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లకు తోడు ఇప్పుడు రోహిత్ శర్మ కూడా అందుబాటులో ఉండటంతో మురళీ విజయ్ను టీమిండియా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. కాగా, ఈ ఏడాది ఆగస్టులో తాను దేశం కోసం ఆడాలని ఏనాడు కోరుకోనని, ఫ్యాషన్ కోసం మాత్రమే క్రికెట్ ఆడతానంటూ మనసులో మాట బయటపెట్టాడు. కాగా, గత రెండేళ్లుగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మురళీ విజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. -
విజ్డన్ అత్యుత్తమ క్రికెటర్‌గా స్టోక్స్
లండన్: గత ఏడాది అత్యద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఇంగ్లండ్ టాప్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యాడు. 2019 సంవత్సరానికిగాను ‘లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్’గా స్టోక్స్‌ను ఎంపిక చేసినట్లు విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్ ప్రకటించింది. 2005లో ఆండ్రూ ఫ్లింటాఫ్ తర్వాత ఒక ఇంగ్లండ్ ఆటగాడు దీనికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. వరుసగా గత మూడు సంవత్సరాలు లీడింగ్ క్రికెటర్‌గా కోహ్లి ఎంపిక కాగా... ఇప్పుడు స్టోక్స్ ఆ స్థానంలోకి వచ్చాడు. ఇంగ్లండ్ తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన స్టోక్స్... ఫైనల్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే స్టోక్స్ టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడాడు. హెడింగ్లీలో జరిగిన యాషెస్ సిరీస్ మూడో టెస్టులో 135 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు సంచలన విజయం అందించాడు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ ఉత్తమ ప్లేయర్‌గా ఎంపికైంది. 2016లోనూ ఇదే అవార్డుకు ఎంపికైన పెర్రీ...రెండుసార్లు ఈ పురస్కారానికి ఎంపికైన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. యాషెస్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ, అర్ధసెంచరీ చేయడంతో పాటు వన్డేల్లో 73 సగటుతో, టి20ల్లో 150 సగటుతో పరుగులు సాధించింది. మరో 27 వికెట్లు కూడా పడగొట్టింది. టి20ల్లో వరల్డ్ లీడింగ్ క్రికెటర్ గా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రసెల్ ఎంపికయ్యాడు. -
బ్యాట్ పట్టి.. ఫోర్ కొట్టి
మెల్బోర్న్ : క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ దాదాపు ఐదున్నరేళ్ల తర్వాత బ్యాట్ పట్టి మైదానంలోకి మరోసారి దిగాడు. ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్ కొట్టి తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఈ అపూర్వ ఘట్టం ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఓ చారిటబుల్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలో కార్చిచ్చు కారణంగా నష్టపోయిన వారిని అదుకునేందుకుగాను బుష్ ఫైర్ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భాగంగా పాంటింగ్ ఎలెవన్, గిల్‌క్రిస్ట్ ఎలెవన్ రెండు జట్లుగా విడిపోయి ఆడనున్నాయి. ఇక పాంటింగ్ జట్టుకు సచిన్ కోచ్‌గా వ్యవహరించాడు. భుజం గాయం కారణంగా సచిన్ ఆటకు దూరంగా ఉండాలని డాక్టర్ల సూచనను పక్కకు పెట్టి మరీ బ్యాటింగ్ చేశాడు. ఇన్నింగ్స్ బ్రేక్ సందర్బంగా ఆస్ట్రేలియా మహిళల జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఎలైస్ పెర్రీ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని సచిన్ తనదైన రీతిలో బౌండరీ తరలించాడు. చూడముచ్చటైన ఈ షాట్‌కు పెర్రీతో సహా సహచర ఆటగాళ్లు, అభిమానులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సచిన్‌తో పెర్రీ కాసేపు సంభాషించి పలు సూచనలు తీసుకున్నారు. కాగా చాలా కాలం తర్వాత జెర్సీ నంబర్ 10 మైదానంలో కనిపించడంతో అటు క్రికెట్ ఫ్యాన్స్ అటు సచిన్ వీరాభిమానులు పండగ చేసుకున్నారు. Sachin is off the mark with a boundary!https://t.co/HgP8Vhnk9s #BigAppeal pic.twitter.com/4ZJNQoQ1iQ — cricket.com.au (@cricketcomau) February 9, 2020 చదవండి: దగ్గరి దారులు వెతక్కండి! క్రికెటర్‌కు 17నెలల జైలుశిక్ష -
టీ20ల్లో సరికొత్త రికార్డు
హోవ్: అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ నయా రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్లను సాధించడంతో పాటు వెయ్యికిపైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా కొత్త అధ్యాయాన్ని లిఖించారు. అటు పురుషుల క్రికెట్లో, ఇటు మహిళల క్రికెట్లోనూ ఈ మార్కును చేరిన క్రికెటర్లు లేరు. గతంలో పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 1498 పరుగులు సాధించగా, 98 వికెట్లు సాధించాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో పెర్రీ ఈ ఘనతను సాధించారు. (ఇక్కడ చదవండి:మరోసారి ‘రికార్డు’ సెంచరీ) వరల్డ్ టీ20లో భాగంగా గత నవంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ నటెల్లీ స్కీవర్ వికెట్ సాధించడం ద్వారా వంద వికెట్ల క్లబ్లో చేరారు. తాజాగా అదే ఇంగ్లండ్‌తో జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండర్ పెర్రీ 47 పరుగులు సాధించి అజేయంగా నిలిచారు. దాంతో అంతర్జాతీయ టీ20లో వెయి పరుగుల మార్కును అందుకున్నారు.ఇంగ్లండ్ నిర్దేశించిన 122 పరుగుల ఛేదనలో ఆసీస్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. టెస్టుల్లు, వన్డేలు,టీ20ల ఆధారంగా జరుగుతున్న మహిళల యాషెస్ సిరీస్‌ను ఇప్పటికే ఆసీస్ కైవసం చేసుకుంది. దీనిలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో పెర్రీ ఏడు వికెట్లు సాధించారు. ఫలితంగా వన్డే ఫార్మాట్లో ఒక మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు సాధించిన తొలి ఆసీస్ మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం మూడు టీ20ల సిరీస్ జరుగుతుంది. ఇందులో తొలి రెండు టీ2లను ఆసీస్ చేజిక్కించుకుంది. బుధవారం చివరిదైన మూడో టీ20 జరుగనుంది.