మహిళల బిగ్‌బాష్ లీగ్ 2024లో భాగంగా మెల్‌బోర్న్ రెనిగేడ్స్‌తో ఇవాళ (అక్టోబర్ 27) జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెనిగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. జార్జియా వేర్హమ్ (61) అర్ద సెంచరీతో రాణించగా.. కోట్నీ వెబ్ (43) పర్వాలేదనిపించింది.
రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో ఎమ్మా డి బ్రోగ్ (19), డియాండ్రా డొట్టిన్ (15), సోఫి మోలినెక్స్ (17), నయోమి స్టేలెన్‌బర్గ్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. సిడ్నీ బౌలర్లలో సోఫి ఎక్లెస్టోన్, ఎల్లిస్ పెర్రీ, కోట్నీ సిప్పెల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కయోమీ బ్రే ఓ వికెట్ దక్కించుకుంది.
Carnage from Perry 👏pic.twitter.com/pCpCm1Ayjq
— CricTracker (@Cricketracker) October 27, 2024
అనంతరం 179 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిడ్నీ.. కెప్టెన్ ఎల్లిస్ పెర్రీ (38 బంతుల్లో 81; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) ఊచకోత కోయడంతో 19 ఓవర్లలోనే (7 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. సిడ్నీ ఇన్నింగ్స్‌లో హోలీ ఆర్మిటేజ్ (30), సారా బ్రైస్ (36 నాటౌట్) ఓ మోసర్తు స్కోర్లు చేశారు.
రెనెగేడ్స్ బౌలర్లలో జార్జియా వేర్హమ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అలైస్ క్యాప్సీ రెండు.. లిన్సే స్మిత్, సోఫీ మోలినెక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుత బిగ్‌బాష్ లీగ్ ఎడిషన్‌లో సిడ్నీకు ఇది తొలి విజయం. ఇవాళ ఉదయం జరిగిన లీగ్ ఓపెనర్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్‌పై బ్రిస్బేన్ హీట్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. లీగ్‌లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ కూడా జరుగనుంది. పెర్త్ స్కార్చర్స్, మెల్‌బోర్న్ స్టార్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment