మహిళల యాషెస్ సిరీస్ 2023 ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ ట్యామీ బీమౌంట్ డబుల్ సెంచరీ సాధించింది. మహిళల క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటర్‌గా, తొలి ఇంగ్లీష్ మహిళగా ట్యామీ రికార్డుల్లోకెక్కింది. 317 బంతుల్లో 26 బౌండరీ సాయంతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న ట్యామీ.. కెరీర్‌లో తాను సాధించిన తొలి టెస్ట్ శతకాన్నే ద్విశతకంగా మార్చుకుంది.
ఈ మ్యాచ్‌కు ముందు ట్యామీ తన 7 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్‌లో కేవలం 2 అర్ధసెంచరీలు మాత్రమే సాధించింది. అయితే ఆమెకు వన్డేల్లో, టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. 103 వన్డేల్లో 9 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీల సాయంతో 3505 పరుగులు (40.8 యావరేజ్‌తో), 99 టీ20ల్లో సెంచరీ, 10 హాఫ్ సెంచరీల సాయంతో 1721 పరుగులు (108.4 స్ట్రయిక్‌రేట్‌తో) సాధించింది.
WOW 🤯
— England Cricket (@englandcricket) June 24, 2023
Our first female double centurion in Test match cricket.#EnglandCricket #Ashes pic.twitter.com/Eju1kwmlug
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 473 పరుగులకు ఆలౌటైంది. ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన అనాబెల్ సదర్‌లాండ్ (137) అజేయమైన సెంచరీతో చెలరేగగా.. ఎల్లైస్ పెర్రీ (99) ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకుంది. తహిల మెక్‌గ్రాత్ (61) అర్ధసెంచరీతో రాణించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎక్లెస్టోన్ 5 వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్, లారెన్ ఫైలర్ తలో 2 వికెట్లు, కేట్ క్రాస్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆసీస్‌కు ధీటుగా జవాబిస్తుంది. ఆ జట్టు మూడో రోజు మూడో సెషన్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 25 పరుగులు వెనుకబడి ఉంది. ట్యామీ బీమౌంట్ (205), కేట్ క్రాస్ (0) క్రీజ్‌లో ఉన్నారు. హీథర్‌నైట్ (57), నాట్‌సీవర్ బ్రంట్ (78) అర్ధశతకాలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్ 3, తహిల మెక్‌గ్రాత్, డార్సీ బ్రౌన్, నదర్‌లాండ్, పెర్రీ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment