BBL
-
ఎల్లిస్ పెర్రీ ఊచకోత.. సిడ్నీ సిక్సర్స్ బోణీ విజయం
మహిళల బిగ్‌బాష్ లీగ్ 2024లో భాగంగా మెల్బోర్న్ రెనిగేడ్స్‌తో ఇవాళ (అక్టోబర్ 27) జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెనిగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. జార్జియా వేర్హమ్ (61) అర్ద సెంచరీతో రాణించగా.. కోట్నీ వెబ్ (43) పర్వాలేదనిపించింది. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో ఎమ్మా డి బ్రోగ్ (19), డియాండ్రా డొట్టిన్ (15), సోఫి మోలినెక్స్ (17), నయోమి స్టేలెన్బర్గ్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. సిడ్నీ బౌలర్లలో సోఫి ఎక్లెస్టోన్, ఎల్లిస్ పెర్రీ, కోట్నీ సిప్పెల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కయోమీ బ్రే ఓ వికెట్ దక్కించుకుంది.Carnage from Perry 👏pic.twitter.com/pCpCm1Ayjq— CricTracker (@Cricketracker) October 27, 2024అనంతరం 179 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిడ్నీ.. కెప్టెన్ ఎల్లిస్ పెర్రీ (38 బంతుల్లో 81; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) ఊచకోత కోయడంతో 19 ఓవర్లలోనే (7 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. సిడ్నీ ఇన్నింగ్స్‌లో హోలీ ఆర్మిటేజ్ (30), సారా బ్రైస్ (36 నాటౌట్) ఓ మోసర్తు స్కోర్లు చేశారు. రెనెగేడ్స్ బౌలర్లలో జార్జియా వేర్హమ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అలైస్ క్యాప్సీ రెండు.. లిన్సే స్మిత్, సోఫీ మోలినెక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుత బిగ్‌బాష్ లీగ్ ఎడిషన్‌లో సిడ్నీకు ఇది తొలి విజయం. ఇవాళ ఉదయం జరిగిన లీగ్ ఓపెనర్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్పై బ్రిస్బేన్ హీట్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. లీగ్‌లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ కూడా జరుగనుంది. పెర్త్ స్కార్చర్స్, మెల్బోర్న్ స్టార్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
BBL: ధరలో స్మృతిని మించిపోయిన జెమీమా, దీప్తి, శిఖా (ఫొటోలు)
-
బిగ్‌బాష్ లీగ్‌లో టీమిండియా స్టార్లు..!
సిడ్నీ: ఈ ఏడాది మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) టి20 టోర్నీలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఆడటం దాదాపు ఖరారైంది. డబ్ల్యూబీబీఎల్ డ్రాఫ్టింగ్ జాబితాలో ఈ ముగ్గురి పేర్లు ఉండటమే దీనికి కారణం. మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హర్మన్‌ప్రీత్‌ను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోనుంది. ఈ మేరకు ఫ్రాంచైజీలు సోమవారం అట్టిపెట్టుకోవాలనుకుంటున్న ప్లేయర్ల జాబితా విడుదల చేశాయి.అడిలైడ్ స్ట్రయికర్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మను ఆ జట్టు రిటైన్ చేసుకోనుంది. సూజీ బేట్స్ (సిడ్నీ సిక్సర్స్), అలీస్ కాప్సీ (మెల్బోర్న్ స్టార్స్), సోఫియా ఎకెల్‌స్టోన్ (సిడ్నీ సిక్సర్స్), షబ్నిమ్ ఇస్మాయిల్ (హోబర్ట్ హరికేన్స్), హీతర్ నైట్ (సిడ్నీ థండర్), డానీ వ్యాట్ (పెర్త్ స్కార్చెర్స్) రిటెన్షన్ జాబితాలో ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు డబ్ల్యూబీబీఎల్ సీజన్ జరగనుంది. -
ప్రపంచానికి తెలియని ఆసీస్ క్రికెటర్ల ప్రేమకథ
ఆస్ట్రేలియా క్రికెటర్లు మార్కస్ స్టోయినిస్, స్పిన్నర్ ఆడమ్ జంపాల పేరు చెప్పగానే ఒక విషయం గుర్తుకురాక మానదు. ఈ ఇద్దరు క్రికెటర్ల మధ్య 2019 బీబీఎల్(బిగ్‌బాష్ లీగ్)లో జరిగిన బ్రొమాన్స్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత వీరిద్దరు గే(హోమోసెక్సువల్స్) రిలేషిన్‌షిప్‌లో ఉన్నట్లు కథనాలు కూడా వచ్చాయి. ఈ కథనాలపై అటు స్టోయినిస్ కానీ.. ఇటు జంపా కానీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీనిని బట్లే స్టోయినిస్, జంపాలు హోమోసెక్సువల్ రిలేషన్షిప్లో ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. వీరిద్దరు లివింగ్ఇన్ రిలేషిన్‌షిప్‌లో ఉన్నారంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే అటు ఆస్ట్రేలియా క్రికెట్లో.. ఇటు బిగ్‌బాష్ లీగ్‌లో చాలా సందర్భాల్లో డ్రెస్సింగ్ రూమ్‌లో వీరిద్దరు బ్రొమాన్స్ చేసుకోవడం కెమెరాల కంట పడింది. తాజాగా ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు దినోత్సవం పురస్కరించుకొని బీబీఎల్ ఫ్రాంచైజీ మెల్బోర్న్ స్టార్స్ ఒక ఫోటో షేర్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఆ ఫోటోలో స్టోయినిస్ చెంపపై ఆడమ్ జంపా ముద్దుపెట్టడం కనిపిస్తుంది. ఈ ఫోటోను ట్వీట్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ ''హ్యాపీ వాలెంటైన్స్ డే'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఏది ఏమైనా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచానికి తెలియని ఆసీస్ క్రికెటర్ల ప్రేమకథను పరిచయం చేసినందుకు బీబీఎల్‌కు కృతజ్ఞతలు అంటూ కొందరు అభిమానుల ట్వీట్ చేశారు. ఇక బీబీఎల్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ఆడమ్ జంపా.. ఈ సీజన్లో జట్టును విజేతగా నిలపడంలో విఫలమైనప్పటికి.. ఆటగాడిగా మాత్రం అదరగొట్టాడు. టోర్నీలో 14 మ్యాచ్‌లాడిన జంపా 16 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. మొదటిస్థానంలో లూక్‌వుడ్(14 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు) ఉన్నాడు. ఇక స్టోయినిస్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. 9 మ్యాచ్‌ల్లో రెండు అర్థసెంచరీలో సాయంతో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మెల్బోర్న్ స్టార్స్ బీబీఎల్ 2022-23లో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఆస్ట్రేలియా తరపున మార్కస్ స్టోయినిస్ 57 వన్డేల్లో 1296 పరుగులు, 51 టి20ల్లో 803 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చే స్టోయినిస్ మెరుపు ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. ఎన్నోసార్లు తన ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లతో చాలాసార్లు విజయాలందించాడు. ఇక స్పిన్నర్ ఆడమ్ జంపా 76 వన్డేల్లో 127 వికెట్లు, 72 టి20ల్లో 82 వికెట్లు పడగొట్టాడు. happy valentine's day 🥰 pic.twitter.com/tv5dkKlxi3 — KFC Big Bash League (@BBL) February 13, 2023 Ohk, happy Valentines Day 🌝👍🏻 pic.twitter.com/XgGrTDNYvS — 𝐀𝐬𝐡𝐦𝐢𝐭𝐚 (@samaira__kohli) February 14, 2023 చదవండి: క్రికెటర్ మనసు దోచుకున్న మల్లికా సాగర్ -
టీమిండియా క్రికెటర్ల వరుస రిటైర్మెంట్లకు కారణం అదేనా..?
ఇటీవలి కాలంలో టీమిండియా క్రికెటర్లు వరుస పెట్టి రిటైర్మెంట్లు ప్రకటిస్తున్న అంశంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. కొద్ది రోజుల వ్యవధిలోనే భారత ఆటగాళ్లు రాహుల్ శర్మ, సురేశ్ రైనా, ఈశ్వర్ పాండే, తాజాగా రాబిన్ ఉతప్ప భారత క్రికెట్‌తో బంధం తెంచుకున్న విషయం విధితమే. గతంలో ఓ వెలుగు వెలిగిన ఈ క్రికెటర్లు, వయసు ఏమంత పైబడనప్పటికీ వరుసగా క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి గల కారణాలు విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది వీరందరి అభిమతంగా తెలుస్తోంది. క్రికెట్ ఆడేందుకు శరీరం సహకరిస్తున్నప్పుడే నాలుగు రూపాయలు వెనకేసుకోవాలని వీరు భావిస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత క్రికెట్‌తో అనుబంధమున్న ఏ ఆటగాడూ ఇతర దేశాల క్రికెట్ లీగ్స్‌లో కానీ మరే ఇతర క్రికెట్ బోర్డుల ఆధ్వర్యంలో జరిగే టోర్నీల్లో కానీ పాల్గొనే వీలు లేదు. ఈ నిబంధనే వయసు, టాలెంట్ ఉన్న చాలా మంది భారత క్రికెటర్లకు ప్రాణసంకటంలా మారింది. యువ క్రికెటర్లైతే ఏదో ఒక రోజు టీమిండియాకు ఆడే అవకాశం రాకపోదా అన్న ఆశతో భారత క్రికెట్‌తో బంధాన్ని తెంచుకునే సాహసం చేయలేకపోతుంటే.. వయసు పైబడిన ఆటగాళ్లు మాత్రం బీసీసీఐని నమ్ముకుంటే అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్న చందంగా తమ బతుకులు మారతాయని ఇష్టం లేకపోయినా భారత క్రికెట్‌తో అనుబంధాన్ని తెంచుకుంటున్నారు. ఇలా బీసీసీఐతో బంధం తెంచుకున్న వారికి దేశవాళీ క్రికెట్లో కానీ, జాతీయ జట్టుకు కానీ, బీసీసీఐ ఆధ్వర్యంలో నడిచే ఐపీఎల్లో కానీ ఆడే అవకాశాలు రాకపోయినా భారీ ధన ప్రవాహం నడిచే ఇతర దేశాల క్రికెట్ లీగ్స్‌లో ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇటీవల భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వారంతా ఈ కారణంగానే బీసీసీఐతో బంధం తెంచుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సక్సెస్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్రాంచైజీ లీగ్స్ పుట్టుకొచ్చాయి. వీటికి ప్రస్తుతం భారీ గిరాకీ ఉంది. ఐపీఎల్ అంత కాకపోయినా ఆ రేంజ్లో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు కొన్ని ఫ్రాంచైజీలు పర్సులు రెడీ చేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్, ఈసీబీ ఆధ్వర్యంలో నడిచే హండ్రెడ్ లీగ్, వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), బంగ్లాదేశ్ లీగ్, శ్రీలంక క్రికెట్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్ ఇలా ప్రతి ఐసీసీ అనుబంధ దేశంలో ఓ లీగ్ జరుగుతుండగా.. వచ్చే ఏడాది నుంచి కొత్తగా మరో రెండు లీగ్‌లు (యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్) ప్రారంభంకానున్నాయి. ఆటగాళ్లు ఈ లీగ్స్‌లో ఏదో ఒక లీగ్‌లో సక్సెస్ అయితే డబ్బుతో పాటు ఏడాదంతా ఖాళీ లేకుండా క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రారంభంకాబోయే యూఏఈ, సౌతాఫ్రికా లీగ్ల్లోని ఫ్రాంచైజీలను దాదాపుగా ఐపీఎల్ యాజమాన్యాలే కొనుగోలు చేయడంతో భారత వెటరన్ క్రికెటర్ల ఫోకస్ అంతా వీటిపైనే ఉంది. -
క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఇకపై విదేశీ లీగ్‌లలో భారత క్రికెటర్లు..?
భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనకూడదనే నిబంధన విషయంలో బీసీసీఐ పట్టువీడనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్ల్లోని మెజార్టీ ఫ్రాంచైజీలు బీసీసీఐని నడిపిస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల చేతుల్లోనే ఉండటంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. త్వరలో దక్షిణాఫ్రికాలో ప్రారంభంకానున్న టీ20 లీగ్‌లో ఆరింటికి ఆరు జట్లను ఐపీఎల్ ఓనర్లే చేజిక్కించుకోవడంతో ఈ విషయమై బీసీసీఐపై ఒత్తిడి అధికమైందని భారత క్రికెట్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ అంగీకరించిందని తెలుస్తోంది. ఈ విషయమై ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే వార్షిక సాధారణ సమావేశంలో (ఏజీఎం) స్పష్టత రానుందని బీసీసీఐకి చెందిన కీలక ప్రతినిధి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. కాగా, ప్రస్తుత నిబంధనల ప్రకారం బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఏ పురుష క్రికెటర్‌కు విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అనుమతి లేదు. రిటైరైన వాళ్లు, ఇకపై టీమిండియాకు ఆడబోమని భావించినవాళ్లతో పాటు మహిళా క్రికెటర్లకు మాత్రమే ఫారెన్ లీగ్‌లలో ఆడే అవకాశముంది. చదవండి: భారత్‌కు ఆసియా కప్, ప్రపంచకప్ అందించడమే నా ప్రధాన లక్ష్యం: కోహ్లి -
సిడ్నీ సిక్సర్స్‌కు ఘోర పరాభవం.. బీబీఎల్ విజేత పెర్త్ స్కార్చర్స్
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 11) సీజన్ విజేతగా పెర్త్ స్కార్చర్స్ నిలిచింది. సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఫైనల్లో పెర్త్ స్కార్చర్స్ 79 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పెర్త్ స్కార్చర్స్ బీబీఎల్ టైటిల్ గెలవడం నాలుగోసారి కాగా.. సిడ్నీ సిక్సర్స్‌ను ఫైనల్లో ఓడించడం ఇది మూడోసారి.76 పరుగులు నాటౌట్‌తో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన పెర్త్ స్కార్చర్స్ బ్యాట్స్‌మన్ లారీ ఇవాన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: Beth Mooney: దవడ విరిగింది.. ముఖానికి సర్జరీ.. పడిలేచిన కెరటం మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లారీ ఇవాన్స్(41 బంతుల్లో 76, 4 ఫోర్లు; 4 సిక్సర్లు), ఆస్టన్ టర్నర్(35 బంతుల్లో 54, 4 ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 16.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. డేనియల్ హ్యూజెస్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పెర్త్ స్కార్చర్స్ బౌలర్లలో ఆండ్రూ టై 3, జై రిచర్డ్సన్ 2, జాసన్ బెండార్ఫ్, ఆస్టన్ టర్నర్, పీటర్ హట్జోగ్లో, ఆస్టన్ అగర్ తలా ఒక వికట్ తీశారు. That winning feeling 🤩🏆 #BBL11 pic.twitter.com/FCu3wVSvrJ — KFC Big Bash League (@BBL) January 28, 2022 It’s raining orange under the roof! 🏆 #BBL11 pic.twitter.com/KZgodUli2C — KFC Big Bash League (@BBL) January 28, 2022 -
క్యాచ్ పట్టలేదని తిట్టిపోశారు.. కట్‌చేస్తే
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా సిడ్నీ థండర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మ్యాచ్‌లో డేనియల్ సామ్స్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. అయితే అంతకముందు ఓవర్లో సింపుల్ క్యాచ్ జారవిడిచాడని డేనియల్ సామ్స్‌ను బౌలర్ తిట్టినంత పని చేశాడు. ఇది మనుసులో పెట్టుకున్నాడో లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ.. మరుసటి ఓవర్లోనే దిమ్మతిరిగే క్యాచ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో తన్వీర్ సంగా వేసిన మూడో బంతిని అలెక్స్ క్యారీ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అక్కడే కాచుకొని ఉన్న డేనియల్ సామ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ రెండు చేతులతో సూపర్ క్యాచ్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: "పుష్ప" పాటకు చిందేసిన టీమిండియా మాజీ క్రికెటర్.. తగ్గేదేలే అంటూ..! ఇక మ్యాచ్ విషయానికి వస్తే అడిలైడ్ స్ట్రైకర్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇయాన్ కాక్బెన్ 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి విజయానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది. Don't let his subdued reaction fool you. Daniel Sams makes up for his earlier drop with a hanger in the deep! A BKT Golden Moment | #BBL11 pic.twitter.com/7hCV5VxxK0 — cricket.com.au (@cricketcomau) January 23, 2022 -
స్టన్నింగ్ క్యాచ్.. చరిత్రలో నిలిచిపోయే అవకాశం మిస్సయింది
బిగ్‌బాష్ లీగ్‌లో(బీబీఎల్ 2021-22) అద్భుత సన్నివేశం కొద్దిలో మిస్ అయింది. హరికేన్ హోబర్ట్స్ ఆటగాడు విల్ పార్కర్ బౌండరీ లైన్‌పై స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నప్పటికి.. బౌండరీ లైన్ తాకడంతో అంపైర్లు సిక్స్‌గా ప్రకటించారు. అయితే పార్కర్ బౌండరీ లైన్ తాకకుండా క్యాచ్ తీసుకొని ఉంటే చరిత్రలో నిలిచిపోయేవాడు. హోబర్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ మూడో బంతిని మాట్ షార్ట్ లాంగాన్ దిశగా భారీ షాట్ కొట్టాడు. అక్కడే ఉన్న పార్కర్ పరిగెత్తుకొచ్చి విల్లులా వొంగి.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. అప్పటికే బౌండరీ లైన్ టచ్ చేయడంతో పార్కర్ ఏం చేయలేక బంతిని విసిరాడు. రూల్ ప్రకారం అంపైర్లు సిక్సర్ ఇవ్వడంతో పార్కర్ విన్యాసం వృథాగా మిగిలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ 22 పరుగులతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 19.4 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. WILL PARKER! Six in the scorebook, but oh my... 🤯 #BBL11 pic.twitter.com/vIUFy64Kc5 — KFC Big Bash League (@BBL) January 21, 2022 -
'గట్టిగానే తగిలినట్టుంది.. ఏం కాలేదని కవర్ చేశాడు'
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో భాగంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ బెన్ కటింగ్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే..అడిలైడ్ ఓవల్ వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగింది. అడిలైడ్ స్ట్రైకర్స్ పేస్ బౌలర్ డానియెల్ వొర్రాల్ షార్ట్‌పిచ్ బంతి విసిరాడు. క్రీజులో ఉన్న బెన్ కటింగ్ దానిని కింద కొట్టాలని చూశాడు. కానీ బంతి మిస్ అయి హెల్మెట్‌కు బలంగా తగిలింది. డేనియల్ ఏమైనా అయిందా అన్నట్లు అడగ్గా.. దానికి కటింగ్ ఏం కాలేదంటూ చేతితో 'థంప్స్ అప్(ఓకే)' సింబల్ చూపించాడు. చదవండి: Brett Lee: కొడుకనే కనికరం లేకుండా క్లీన్‌బౌల్డ్ అయితే కొద్ది సెకన్ల వ్యవధిలోనే బెన్ కటింగ్ తన హెల్మెట్ తీసి గాయమైందా అన్నట్లు పరిశీలించుకోవడం కెమెరాలకు చిక్కింది. కానీ పెద్దగా తగలకపోవడంతో కటింగ్ బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అయితే బెన్ కటింగ్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు వినూత్నరీతిలో స్పందించారు.'' దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది.. కానీ భలే కవర్ చేశాడు..'' అంటూ కామెంట్స్ పెట్టారు. కాగా బెన్ కటింగ్ 32 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 22 పరుగుల తేడాతో విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. జేసన్ సంగా 55 బంతుల్లోనే 91 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. చదవండి: Team India New Year Celebrations: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌తో అదరగొట్టిన టీమిండియా Yikes! A quick thumbs up from Cutting after that nasty blow to the helmet #BBL11 pic.twitter.com/d7viKgsf74 — cricket.com.au (@cricketcomau) December 31, 2021 -
రెండు సెంచరీలు ఒకే తరహాలో.. అరుదైన ఫీట్
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో సంచలన ఇన్నింగ్స్‌లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్ మెక్ డెర్మోట్ వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా మెల్బోర్న్ రెనెగేడ్స్‌పై సెంచరీ బాదిన అతను బీబీఎల్ చరిత్రలో కొత్త రికార్డు సాధించాడు. అయితే మెక్ డెర్మోట్ రెండు సెంచరీలను ఒకే తరహాలో అందుకోవడం విశేషం. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో 95 పరుగులకు చేరుకున్న మెక్ డెర్మోట్.. కేన్ రిచర్డ్సన్ వేసిన బంతిని స్టాండ్స్‌లో కి బాది సెంచరీ పూర్తి చేశాడు. ఓవరాల్‌గా 65 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెక్ డెర్మోట్కు మూడో సెంచరీ కాగా.. ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ. చదవండి: BBL 2021: కళ్లు చెదిరే క్యాచ్.. ఔటయానన్న సంగతి మరిచిపోయి కాగా ఇంతకముందు అడిలైడ్ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లోనూ సిక్స్‌తోనే సెంచరీ సాధించాడు. తద్వారా బీబీఎల్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలను సిక్సర్లతో పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా మెక్ డెర్మోట్ చరిత్ర సృష్టించాడు. ఇక హోబర్ట్ హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. HISTORY MADE 🏆 Ben McDermott just made back-to-back 💯 for the first time in #BBL history! 📺 Watch #BBL11 on @Foxtel CH 503 or stream on @kayosports: https://t.co/gt5iNQ2w7F 📝 Blog: https://t.co/2QI8PpTMaE 🔢 Match Centre: https://t.co/QMgYF6q7lt pic.twitter.com/MFuEmYMWAw — Fox Cricket (@FoxCricket) December 29, 2021 That magic moment 💯 Ben McDermott brings up his second Big Bash century in STYLE 😎 #BBL11 pic.twitter.com/XsZP6cwY8y — KFC Big Bash League (@BBL) December 27, 2021 -
కళ్లు చెదిరే క్యాచ్.. ఔటయానన్న సంగతి మరిచిపోయి
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సిడ్నీ సిక్సర్స్ ఆటగాడు సీన్ అబాట్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో జాసన్ బెండార్సీస్ వేసిన బంతిని ఓపెనర్ క్రిస్ లిన్ ఆఫ్‌సైడ్ దిశగా కవర్‌డ్రైవ్ ఆడాడు. అయితే ఎవరు ఊహించని విధంగా సీన్ అబాట్ గాల్లోకి ఎగిరి కుడివైపుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో క్రిస్ లిన్.. సీన్ అబాట్ స్టన్నింగ్ ఫీట్‌కు షాక్ తిన్నాడు. అసలు ఔటయ్యానా అనే సందేహం కలిగిందంటే.. సీన్ అబాట్ ఎంత వేగంతో బంతిని అందుకున్నాడో అర్థమవుతుంది. ఇక చేసేదేం లేక 2 పరుగులు చేసిన లిన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోనూ బిగ్‌బాష్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 19.1 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. డకెట్ 21, విల్డర్మత్ 27, మాక్స్ బ్రియాంట్ 22 పరుగులు చేశారు. సీన్ అబాట్ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన సిడ్నీ సిక్సర్స్ దారుణ ఆటతీరు కనబరిచింది. ఒక దశలో 100 లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన సిడ్నీ సిక్సర్స్ ప్రస్తుతం సీన్ అబాట్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తుండడంతో 18 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 8 పరుగుల దూరంలో ఉంది. Catch of the summer? 🤯 Chris Lynn could NOT believe it... #BBL11 This 'Oh What a Feeling' Moment brought to you by @Toyota_Aus pic.twitter.com/6fGBa3l5D0 — Fox Cricket (@FoxCricket) December 29, 2021 -
ఆండ్రూ టైకి ఊహించని షాక్ ఇచ్చిన అంపైర్లు
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో పెర్త్ స్కార్చర్స్ బౌలర్ ఆండ్రూ టైకి ఊహించని షాక్ తగిలింది. సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆండ్రూ టై బౌలింగ్ చేసే సమయంలో రెండు బంతులను బ్యాట్స్‌మన్ నడుముపైకి విసిరాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం బంతులు బ్యాట్స్‌మన్ పైకి విసిరితే బీమర్ అని పిలుస్తారు. అయితే బీమర్ అనేది క్రికెట్లో ప్రమాదకరంగా ఉండడంతో దానిని నిషేధించారు. దీంతో ఒక బౌలర్ ఒక ఓవర్లో రెండు కంటే ఎక్కువ బీమర్లు వేస్తే అతన్ని బౌలింగ్ చేయకుండా నిషేధించొచ్చు. ఆండ్రూ టై అదే తప్పు చేశాడు. దీంతో కీలక మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం కోల్పోయాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఓవర్ నాలుగో బంతిని బ్యాట్స్‌మన్ అలెక్స్ రాస్ నడుముపైకి బీమర్ వేశాడు. మరుసటి బంతిని వైడ్ వేయగా.. ఆ తర్వాత బంతిని మరోసారి బీమర్ వేయడంతో అంపైర్లు టైను అడ్డుకొని బౌలింగ్ వేయకుండా నివారించారు. ప్రస్తుతం ఆండ్రూ టై బౌలింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ జట్టు 20 ఓవర్లలో 200 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్ బిల్లింగ్స్ 35 బంతుల్లో 67 పరుగులు, జాసన్ సాంగా 46 బంతుల్లో 56 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి 34 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కొలిన్ మున్రో 64 పరుగులు నాటౌట్‌తో రాణించినప్పటికి మిగిలినవారు విఫలమయ్యారు. Two dangerous no-balls, and he's out. Here's why AJ Tye finished the innings with 1.3 completed overs to his name...@KFCAustralia | #BBL11 pic.twitter.com/nuTs6XF3LI — KFC Big Bash League (@BBL) December 28, 2021 -
బ్యాట్స్‌మన్ భారీ సిక్స్.. అభిమాని తల పగిలి రక్తం
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్) 2021లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్యాట్స్‌మన్ కొట్టిన భారీ సిక్స్‌ను క్యాచ్‌గా తీసుకుందామని భావించిన అభిమాని తల పగిలి రక్తం కారడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళవారం పెర్త్ స్కార్చర్స్, హోబర్ట్ హరికేన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఆండ్రూ టై బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్ బెన్ మెక్‌డెర్మోట్ భారీ సిక్స్ బాదాడు. స్టాండ్స్‌లోకి వస్తున్న బంతిని ఒక అభిమాని ఉత్సాహంతో క్యాచ్ అందుకోవాలని ప్రయత్నించాడు. చదవండి: BBL 2021: 60 బంతుల్లో శతకం.. మిచెల్ మార్ష్ విధ్వంసం అయితే బంతి దురదృష్టవశాత్తూ అతని తల బాగంలో కుడివైపు బలంగా తగిలింది. దీంతో కుప్పకూలిన సదరు అభిమాని నుదుట నుంచి రక్తం కారడం మొదలైంది. ఇది చూసిన తోటి ప్రేక్షకులు కాస్త ఆందోళనకు గురయ్యారు. వెంటనే అతన్ని సర్జన్ రూమ్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉన్నట్లు స్టేడియం నిర్వాహకులు ప్రకటించారు. చదవండి: ఆస్ట్రేలియా అండర్-19లో భారత సంతతి కుర్రాడు.. వింత బౌలర్ల జాబితాలో చోటు మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ మిచెల్ మార్ష్(60 బంతుల్లో 100,6 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులకు, లారీ ఇవాన్స్( 40; 24 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 19 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటై 53 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. బెన్ మెక్‌డెర్మోట్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పెర్త్ స్కార్చర్స్ బౌలర్లలో టైమల్ మిల్స్ 3, ఆస్టన్ అగర్, ఆండ్రూ టై చెరో రెండు వికెట్లు తీశారు. చదవండి: Ruturaj Gaikwad: సెలక్టర్లకు తలనొప్పిగా మారుతున్న రుతురాజ్.. తాజా ఫీట్‌తో కోహ్లి సరసన Lucky the fan on the hill is OK... Because his missed catch has drawn blood 😳#BBL11 pic.twitter.com/X0MTmDp7a2 — 7Cricket (@7Cricket) December 14, 2021 -
60 బంతుల్లో శతకం.. మిచెల్ మార్ష్ విధ్వంసం
బిగ్‌బాష్ లీగ్ 2021లో మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. బీబీఎల్‌లో పెర్త్ స్కార్చర్స్ తరపున ఆడుతున్న మార్ష్ 60 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు బాదాడు. హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్ష్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. బీబీఎల్ మార్ష్‌కు ఇది డెబ్యూ సెంచరీ కాగా.. ఈ సీజన్లో రెండోది. ఓవరాల్‌గా బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో 28వ శతకం. ఇంతకముందు పెర్త్ స్కార్చర్స్కే చెందిన ఓపెనర్ కొలిన్ మున్రో ఈ సీజన్లో తొలి శతకంతో మెరిశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ మిచెల్ మార్ష్(60 బంతుల్లో 100,6 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులకు, లారీ ఇవాన్స్( 40; 24 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 19 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటై 53 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. బెన్ మెక్‌డెర్మోట్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పెర్త్ స్కార్చర్స్ బౌలర్లలో టైమల్ మిల్స్ 3, ఆస్టన్ అగర్, ఆండ్రూ టై చెరో రెండు వికెట్లు తీశారు. Click Here For Video: Mitchel Marsh Century MITCH. MARSH. CENTURY.#BBL11 pic.twitter.com/I4zyNQyv9i — 7Cricket (@7Cricket) December 14, 2021 -
గిల్‌క్రిస్ట్‌తో మహిళా కామెంటేటర్ మజాక్.. వీడియో వైరల్
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్స్ మధ్య జరిగే సంభాషణలు ఒక్కోసారి ఆసక్తి కలిగిస్తాయి. మ్యాచ్ గురించి ప్రస్తావన తెస్తూనే తమదైన శైలిలో జోక్‌లు.. పంచ్‌లు పేల్చుకుంటూ సరదాగా ఉంటారు. తాజాగా బిగ్‌బాష్ లీగ్ 2021లో భాగంగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. డిసెంబర్ 12న మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య సీరియస్‌గా మ్యాచ్ జరుగుతుంది. చదవండి: BBL 2021: కొలిన్ మున్రో విధ్వంసం..బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో 27వ సెంచరీ ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పాటు మరో ఇద్దరు కామెంటేటర్స్‌గా వ్యవహరించారు. వీరిలో ఇసా గుహా అనే మహిళ కూడా ఉంది. మ్యాచ్ సందర్భంగా కామెంటరీ ప్యానెల్ మధ్య స్పిన్ బౌలింగ్‌లో ఉండే టెక్నిక్స్ అంశం చర్చకు వచ్చింది. క్యారమ్ బాల్ ప్రస్తావన రాగానే తోటి కామెంటేటర్.. '' క్యారమ్ బాల్ వేయాలంటే .. ఒక బౌలర్ మధ్య వేలును ఎక్కువగా ఉపయోగించడం చూస్తుంటాం'' అని చెప్పాడు. ఇది విన్న వెంటనే ఇసా గుహా.. ''మరి మీది ఎంత పెద్దదిగా ఉంది'' అని డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేలా మాట్లాడడంతో గిల్‌క్రిస్ట్ ఒక్కసారిగా నవ్వేశాడు. ఇది చూసిన మిగతా టెక్నిషియన్స్ కూడా మొదట ఆశ్చర్యపోయినా నవ్వడం షురూ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. '' ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తోనే మజాకా''.. ''డబుల్ మీనింగ్ మరీ ఎక్కువైంది'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Ashes 2021: క్రేజీ బౌన్సర్.. తృటిలో తప్పించుకున్న రూట్ ఇక మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 17.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. A reasonable question from @isaguha 👀😂😂😂😂😂😂 pic.twitter.com/Tzu5F2emUg — Alexandra Hartley (@AlexHartley93) December 12, 2021 -
సిడ్నీ సిక్సర్స్దే బిగ్‌బాష్ టైటిల్
సిడ్నీ: వరుసగా రెండో ఏడాది సిడ్నీ సిక్సర్స్ జట్టు బిగ్‌బాష్ టి20 టోర్నమెంట్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్ జట్టు 27 పరుగుల ఆధిక్యంతో పెర్త్ స్కార్చర్స్ జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డిఫెండింగ్ చాంపియన్ సిడ్నీ సిక్సర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. ఓపెనర్ జేమ్స్ విన్స్ (60 బంతుల్లో 95; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఐదు పరుగుల తేడాలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్లు బాన్‌క్రాఫ్ట్ (30; 4 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) శుభారంభం అందించినా... ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ తడబడటంతో పెర్త్ విజయానికి దూరమైంది. సిడ్నీ బౌలర్లలో బెన్ డ్వార్షుస్ మూడు వికెట్లు తీయగా... జాక్సన్ బర్డ్, సీన్ అబాట్, క్రిస్టియన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. చదవండి: దేవుడా.. పెద్ద గండం తప్పింది సిరాజ్, కుల్దీప్ల గొడవ.. నిజమెంత! What a moment for @SixersBBL 🏆👏🏼#BBL10 pic.twitter.com/EHDTzJSxHC — Fox Cricket (@FoxCricket) February 6, 2021 -
టైం లేదని గ్రౌండ్‌లోనే పని కానిచ్చాడు
కాన్బెర్రా: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 10)లో భాగంగా ఆదివారం సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సిడ్నీ థండర్స్ బ్యాటింగ్ సమయంలో ఆ జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖాజా చేసిన ఒక పని సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. అసలు విషయంలోకి వెళితే.. సిడ్నీ ఇన్నింగ్స్ సమయంలో 9వ ఓవర్ తర్వాత కొన్ని నిమిషాల పాటు బ్రేక్ లభించింది. ఇదే సమయంలో ఖాజా తన అండర్గార్మెంట్లో గార్డ్ సమస్యగా మారడంతో డ్రెస్సింగ్ రూమ్‌కు కాల్ ఇచ్చాడు. అయితే వారు వచ్చేలోపే ఖాజా తన ప్యాంటును విప్పి తన అండర్గార్డ్ను తొలగించి దానిని సరిచేసే పనిలో పడ్డాడు. అంతలో సిబ్బంది అతని వద్దకు వచ్చి కొత్త గార్డ్ అందించడంతో దాన్ని వేసుకొని మళ్లీ యధావిథిగా ఆటను ప్రారంభించాడు. అయితే ఖాజా చర్యతో మైదానంలోని ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు అంపైర్లు, ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఖాజాకు సంబంధించిన వీడియోనూ సెవెన్ క్రికెట్ డాట్‌కామ్ తన ట్విటర్లో షేర్ చేసింది. క్రికెట్లో ఇలాంటి సీన్ మీరు ఎప్పుడు చూసి ఉండరు.. అందరూ చూస్తుండగానే ఖాజా గ్రౌండ్‌లోనే పని కానిచ్చేశాడు అంటూ లాఫింగ్ ఎమోజీతో క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారి నవ్వులు పూయిస్తుంది. చదవండి: థ్యాంక్స్ మోదీ జీ.. టీమిండియా ఎమోషనల్ ట్వీట్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బ్రిస్బేన్ హీట్.. సిడ్నీ థండర్స్‌పై 7 వికెట్లతో విజయాన్ని అందుకొని ఫైనల్ బెర్తుకు మరింత దగ్గరైంది. మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. కటింగ్ 34, బిల్లింగ్స్ 34 పరుగులతో రాణించారు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బేన్ హీట్ 3 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. సామ్ హీజ్లెట్ 74 నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. జిమ్మీ పియర్సన్ 43 పరుగులతో రాణించాడు.చదవండి: కళ్లు చెదిరే సిక్స్.. కొడితే అవతల పడింది Have ... have you ever seen this before 😂 Usman Khawaja had to change everything - on the field! 🙈#BBL10 pic.twitter.com/XOKsXkhLVS — 7Cricket (@7Cricket) January 31, 2021 -
కళ్లు చెదిరే సిక్స్.. కొడితే అవతల పడింది
కాన్బెర్రా: ఆసీస్ ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ మీకందరికి గుర్తుండే ఉంటాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కప్పు కొట్టడంలో బెన్ కటింగ్ పాత్ర మరువలేనిది. ఆర్సీబీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌లో 15 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 39 పరుగులు సాధించాడు. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ కీలకమైన రెండు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచి సన్‌రైజర్స్‌కు కప్పు అందించాడు. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా ఆదివారం సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. గెలిస్తే ఫైనల్ అవకాశాలు మరింత మెరుగయ్యే మ్యాచ్‌లో బెన్ కంటింగ్ జూలు విదిల్చాడు. 18 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే బెన్ కటింగ్ కొట్టిన నాలుగు సిక్సర్లలో .. ఒక సిక్సర్ స్టేడియం అవతల పడింది. మోర్నీ మోర్కెల్ వేసిన 18 ఓవర్ మూడో బంతిని కటింగ్ ప్రంట్ ఫుట్ వచ్చి డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టగా.. బంతి నేరుగా వెళ్లి స్టేడియం రూఫ్‌ను తాకుతూ బయటపడింది. మీటర్ రేంజ్లో కటింగ్ కొట్టిన సిక్స్ 101 మీటర్లుగా నమోదైంది. బెన్ కటింగ్ సిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ఆండ్రూ టై కావాలనే అలా చేశాడా! ఈ సీజన్ బిగ్‌బాష్ లీగ్‌లో కటింగ్ కొట్టిన సిక్స్ అత్యంత ఎత్తులో వెళ్లిన సిక్స్‌గా రికార్డుకెక్కింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కటింగ్ 34, సామ్ బిల్లింగ్స్ 34 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ ఆడుతున్న బ్రిస్బేన్ హీట్స్ ఇప్పటివరకు 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. హీట్స్ గెలవాలంటే 48 బంతుల్లో 89 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: దుమ్మురేపిన పుజారా.. కోహ్లి మాత్రం అక్కడే That is OUTTTAAAAA HERE!! Wow! #BBL10 #BBLFinals pic.twitter.com/lOTzhwDtyb — KFC Big Bash League (@BBL) January 31, 2021 -
ఆండ్రూ టై కావాలనే అలా చేశాడా!
కాన్బెర్రా: బిగ్‌బాష్ లీగ్‌లో శనివారం పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ ఘనవిజయం సాధించి ఫైనల్‌కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మన్ జేమ్స్ విన్స్ 98* పరుగులతో వీరవిహారం చేసి ఒంటిచేత్తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే విన్స్ సెంచరీ మిస్ కావడానికి పెర్త్ స్కార్చర్స్ బౌలర్ ఆండ్రూ టై పరోక్ష కారణమయ్యాడు. వాస్తవానికి సిడ్నీ జట్టుకు చివరి బంతికి ఒక పరుగు చేయాల్సిన దశలో విన్స్ 98 పరుగులతో ఉన్నాడు. విజయానికి ఒక పరుగు దూరం.. అతని సెంచరీకి రెండు పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆండ్రూ టై కావాలని చేశాడో.. యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కాని అతను వేసిన బంతి వైడ్ వెళ్లింది. దీంతో సిడ్నీ సిక్సర్స్ పరుగు అవసరం లేకుండా ఎక్స్ట్రా రూపంలో విజయం సాధించినా... విన్స్‌కు మాత్రం నిరాశ మిగిలింది. ఆండ్రూ టై చేసిన పనిపై సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. 'ఎలాగో మ్యాచ్ ఓడిపోతారని తెలుసు.. విన్స్‌ను సెంచరీ చేయిస్తే బాగుండేది.. ఆండ్రూ టై కావాలనే ఇదంతా చేశాడు' అంటూ కామెంట్స్ రాసుకొచ్చారు. ఆండ్రూ టై చేసిన పనిపై విన్స్ స్పందించాడు. ఆండ్రూ టై కావాలనే ఆ పని చేశాడా అనేది అతనికి తెలియాలి. నేను సెంచరీ మిస్ అయినందుకు బాదేం లేదు.. ఎందుకంటే జట్టును ఫైనల్ చేర్చాననే సంతోషం ఆ బాధను మరిచిపోయేలా చేసింది. అప్పటికి అతను వేసిన బంతిని టచ్ చేసేందుకు ప్రయత్నించాను. కానీ బ్యాట్‌కు దూరంగా బంతి వైడ్ రూపంలో వెళ్లింది. ఒక బౌలర్‌గా ఆలోచించిన టై.. అతని బౌలింగ్‌లో సెంచరీ చేసే అవకాశం ఇవ్వకూడదనే అలా చేశాడు. ఈ విషయంలో ఆండ్రూ టైది కూడా తప్పు అనలేం. అంటూ చెప్పుకొచ్చాడు.చదవండి: వైరల్: బాబు ఈ కొత్త షాట్ పేరేంటో కాగా ఆండ్రూ టై చర్యపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విన్స్ సెంచరీ కాకుండా వైడ్ వేయాలని ఆండ్రూ టై దగ్గరకు ఎవరు వచ్చి చెప్పలేదు.. కావాలనే అతను బంతిని వైడ్ వేశాడు. నిజంగా టై నుంచి ఇలాంటిది ఆశించలేదు. అంటూ విరుచుకుపడ్డాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇంగ్లిస్ 69 పరుగులు(5 ఫోర్లు, 2 సిక్సర్ల)తో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ టర్నర్ 33 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సిడ్నీ బ్యాటింగ్‌లో జేమ్స్ విన్స్ 53 బంతుల్లోనే 98 పరుగులు( 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో) వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్ జోష్ ఫిలిపి 45 పరుగులతో రాణించాడు. చదవండి: అంపైర్‌ను తిట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు -
వైరల్: బాబు ఈ కొత్త షాట్ పేరేంటో
బిగ్‌బాష్(బీబీఎల్ 10) లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ ఆటగాడుజోష్ ఇంగ్లిస్ క్రికెట్ ప్రపంచానికి కొత్త షాట్‌ను పరిచయం చేశాడు. సిడ్నీ సిక్సర్స్ బౌలర్ బెన్డార్సిస్ వేసిన వైడ్ డెలివరిని ఇంగ్లిస్ చివరి నిమిషంలో ఫ్లిక్ చేశాడు. కాగా ఎవరు ఊహించిన విధంగా బంతి బ్యాట్ వెనకవైపు తాకుతూ కీపర్‌ను దాటుకుంటూ వేగంగా బౌండరీలైన్ దాటింది. ఇంగ్లిస్ ఆడిన ఈ తరహా షాట్ ఇప్పటివరకు ఎవరు చూడలేదు. ఈ కొత్త షాట్‌కు క్రికెట్ పుస్తకాల్లో కూడా పేరు లేదు. శనివారం సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఈ షాట్ నమోదైంది.ఇంగ్లిస్ ఆడిన షాట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో షేర్ చేసింది. జోష్ ఇంగ్లిస్ కొత్త షాట్ ఏమైనా కనిపెట్టాడా చెప్పండి అంటూ కామెంట్ చేసింది. అయితే అతని షాట్ చూసిన కామెంటేటర్లు.. ఓ.. నో.. బిగ్‌బాష్ లీగ్‌లో అతి దారుణమైన షాట్ ఇదే అంటూ కామెంట్ చేశారు. అయితే ఇంగ్లిస్ ఆడిన షాట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఇంగ్లిస్ నువ్వు ఆడిన ఈ కొత్త షాట్‌కు పేరేంటి బాబు.. కవర్ డ్రైవ్.. స్ట్రెయిట్ డ్రైవ్ లాగా బ్యాక్వర్డ్ డ్రైవ్ అయి ఉండొచ్చు.' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఆసీస్ జట్టులో విభేదాలు.. కారణం అతనే! కాగా సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇంగ్లిస్ 69 పరుగులు(5 ఫోర్లు, 2 సిక్సర్ల)తో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ టర్నర్ 33 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సిడ్నీ బ్యాటింగ్‌లో జేమ్స్ విన్స్ 53 బంతుల్లోనే 98 పరుగులు( 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో) వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్ జోష్ ఫిలిపి 45 పరుగులతో రాణించాడు. చదవండి: అది జాతీయ జంతువు.. అందుకే కట్ చేయలేదు Did Josh Inglis just invent a new shot?!? #BBL10 pic.twitter.com/slVuZ70lGl — cricket.com.au (@cricketcomau) January 30, 2021 -
కిందా మీదా పడ్డాడు.. చివరకు రనౌట్ చేశాడు
పెర్త్: ఆసీస్ వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 10) విజయవంతగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో ఇప్పటికే ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్‌గా మారి అభిమానుల మనుసులు గెలుచుకుంటున్నాయి. తాజాగా శనివారం పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ కీపర్ జోష్ ఇంగ్లిస్ సిడ్నీ బ్యాట్సమన్‌ను రనౌట్ చేసిన తీరు నవ్వు తెప్పిస్తుంది. విషయంలోకి వెళితే.. జాసన్ బెండార్ఫ్ వేసిన బంతిని సామ్ బిల్లింగ్స్ ఆఫ్‌సైడ్ పుష్ చేసి నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న అలెక్స్ రాస్‌ను పరుగుకు పిలిచాడు. అయితే బెండార్ప్ వేగంగా వెళ్లి బంతిని అందుకని ఇంగ్లిస్‌కు త్రో విసిరాడు. అయితే ఇంగ్లిస్ మాత్రం బంతిని అందుకునే క్రమంలో తడబడ్డాడు. దీంతో బంతి చేతిలో నుంచి జారి గాల్లోకి లేవడంతో తన చేతిని ఉపయోగించి బంతిని వికెట్ల వైపు విసిరాడు. అదృష్టం బాగుండి వికెట్లను గిరాటేయడంతో అలెక్స్ రాస్ రనౌట్ అయ్యాడు. అయితే ఇంగ్లిస్ చర్య ఇంగ్లండ్ ఆటగాడు జేసన్ రాయ్‌కు నవ్వు తెప్పించింది. ఇంగ్లిస్.. ఎలాగైతేనేమి కిందా మీద పడి రనౌట్ అయితే చేశావంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.(చదవండి: 'నన్ను తిడతావేంటి... ఆ నిర్ణయం థర్డ్ అంపైర్‌ది') ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 50, ఆస్టన్ టర్నర్ 31, జై రిచర్డసన్ 20* రాణించారు. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్ 20 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌట్ అయి 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్‌లో సామ్ బిల్లింగ్స్ 83 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.(చదవండి: సిడ్నీ టెస్ట్: బుమ్రా, సిరాజ్‌లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు) You are KIDDING me!!! Jason Roy's reaction to this run out is golden! 😂😂@BKTtires | #BBL10 pic.twitter.com/JDhIJ8CjLW — cricket.com.au (@cricketcomau) January 9, 2021 -
ఏబీ జెర్సీ ధరించాడు.. అందుకే అలా పడ్డాడు
పెర్త్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్-10)లో భాగంగా బుధవారం పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పెర్త్ స్కార్చర్స్ కెప్టెన్ ఆస్టన్ టర్నర్ కొట్టిన ఒక షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెర్త్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను జేక్ బాల్ వేశాడు. క్రీజులో మిచెల్ మార్ష్, ఆస్టన్ టర్నర్లు ఉన్నారు. బాల్ వేసిన మొదటి బంతిని ఆస్టన్ టర్నర్ ఫైన్‌లెగ్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కింద పడ్డాడు.. కానీ అప్పటికే బంతి బ్యాట్‌కు సరైన దిశలో తగలడంతో వేగంగా బౌండరీ లైన్‌ను దాటేసింది. (చదవండి: సిక్స్ కొడితే బీర్ మగ్‌లో పడింది..!) ఇలాంటి షాట్లను దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఎక్కువగా ఆడుతుంటాడు. ఆస్టన్ టర్నర్ ధరించిన జెర్సీ నెంబర్ 17.. అంతర్జాతీయ క్రికెట్లో ఏబీ డివిలియర్స్ జెర్సీ నెంబర్ కూడా 17 కావడం ఇక్కడ యాదృశ్చికం. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. ఆస్టన్ ఆడిన షాట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. 'పడితే పడ్డాడు కాని షాట్ మాత్రం సూపర్‌గా ఆడాడు.. ఏబీ డివిలియర్స్ జెర్సీని ధరించాడే కాబట్టే అలాంటి షాట్లు ఆడాడు.. టర్నర్‌కు డివిలియర్స్ గుర్తుచ్చాడేమో.. ఒక్కసారి టర్నర్ ధరించిన జెర్సీ నెంబర్ చూడండంటూ ' వినూత్న రీతిలో కామెంట్లు పెట్టారు.(చదవండి: 'ఛీ.. స్కూల్ లెవల్ కన్నా దారుణం') కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కొలిన్ మున్రో 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ 16.4 ఓవర్లలోనే 97 పరుగులకే ఆలౌటైంది. జాక్ ఎడ్వర్డ్స్ 44 పరుగులు మినహా ఏ ఒక్కరు ఆకట్టుకోలేకపోయారు. పెర్త్ స్కార్చర్స్ బౌలర్లలో అండ్రూ టై 4 వికెట్లు తీయగా.. జై రిచర్డ్సన్ 3 వికెట్లు తీశాడు. How on earth did Ashton Turner do that!? #BBL10 pic.twitter.com/juU0uXH5MW — cricket.com.au (@cricketcomau) January 6, 2021 -
సిక్స్ కొడితే బీర్ మగ్‌లో పడింది..!
హోబార్డ్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)-10 వ సీజన్ ఇప్పటికే అభిమానులకు కావాల్సిన మజాను అందించగా, ఇటీవల జరిగిన ఓ మ్యాచ్‌లో సరదా సన్నివేశం ఒకటి చోటుచేసుకుంది. ఒక బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి సరిగ్గా వెళ్లి ఒక అభిమాని తాగుతున్న బీర్ కప్‌లో పడింది. శనివారం(జనవరి 2వ తేదీన) హోబర్ట్ హరికేన్స్-మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు వేదికైంది. విషయంలోకి వెళితే.. హోబర్ట్ హరికేన్స్ బ్యాటర్ డేవిడ్ మలాన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 పరుగులు సాధించాడు. కాగా, అందులో ఒక సిక్స్ ఫ్యాన్ బీర్ మగ్‌లో పడింది. మెల్బోర్న్ స్టార్స్ బౌలర్ లాన్స్ మోరిస్ వేసిన 16వ ఓవర్లో ఒక బంతిని మలాన్ భారీ షాట్ ఆడాడు. స్వేర్ లెగ్ మీదుగా లాఫ్టెడ్ స్ట్రోక్ ఆడాడు. (ఓడిపోతామనే నాల్గోటెస్టు ఆడమంటున్నారా?) గ్యాలరీలోకి దూసుకొచ్చిన ఆ బంతిని పట్టుకోవడానికి ఫ్యాన్స్ పోటీ పడగా అది కాస్తా వెళ్లి ఒక అభిమాని బీర్ మగ్‌లో పడింది. అది కామెంటేటర్లతో పాటు కూర్చొన్న అభిమానుల్ని కూడా అలరించింది. కాగా, బీర్ మగ్‌లో పడ్డ ఆ బంతిని ఇవ్వడానికి సదరు అభిమానికి తొలుత నిరాకరించాడు. తాను బంతిని ఇవ్వనంటూ ఫీల్డర్‌ను ఆటపట్టించాడు. ఆ బంతి మగ్‌లో ఉండగానే ఒక చిప్లాగించిన తర్వాత దాన్ని తిరిగి వెనక్కి ఇచ్చాడు. ఇది బీబీఎల్ బెస్ట్ క్యాచ్‌ల్లో స్థానం సంపాదించకపోయినప్పటికీ ఆ అభిమానికి మాత్రం అదొక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ 21 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 143 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. What the... An all-time Bucket Moment! 😂🤷♂️#BBL10 | @KFCAustralia pic.twitter.com/V5b9Xm34B4 — KFC Big Bash League (@BBL) January 2, 2021 -
వైరల్ : టాస్ వేశారు.. కాని కాయిన్‌తో కాదు
పెర్త్ : క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేయడం ఆనవాయితీ. టాస్ వేయడానికి ఎక్కడైనా కాయిన్‌ను ఉపయోగిస్తారు.. కానీ బిగ్‌బాష్ లీగ్‌లో కాయిన్‌కు బదులు బ్యాట్‌ను ఫ్లిప్ చేసి టాస్ ఎంచుకోవడం వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆదివారం పెర్త్ స్కార్చర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ మధ్య జరుగుతున్న మ్యచ్‌లో చోటుచేసుకుంది. టాస్ సమయంలో కాయిన్‌కు బదులుగా బ్యాట్‌ను వాడారు. మెల్బోర్న్ రెనెగేడ్స్ కెప్టెన్ బ్యాట్ ఫ్లిప్‌తో టాస్ గెలిచిన మెల్బోర్న్ రెనెగేడ్స్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. (చదవండి: సెకన్ల వ్యవధిలో సూపర్ రనౌట్) In Perth, the @RenegadesBBL have won the bat flip and have elected to BOWL first against the @ScorchersBBL #BBL10 https://t.co/OvGFGccQuj — cricket.com.au (@cricketcomau) January 3, 2021 ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ 72 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కొలిన్ మున్రో 52 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ రెనెగేడ్స్ పరాజయం ముంగిట నిలిచింది. ఇప్పటికే 9 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 59 పరుగులతో ఓటమి అంచున నిలిచింది. -
పాపం ఫ్లెచర్.. సెకన్ కూడా గ్యాప్ ఇవ్వలేదు
హోబర్ట్ : బిగ్‌బాష్ లీగ్ 2020లో శనివారం హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో డీ ఆర్సీ షార్ట్ చేసిన రనౌట్ వైరల్‌గా మారింది. మెరుపు వేగంతో చేసిన ఆ రనౌట్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ క్రేజీ రనౌట్ హోబర్ట్ హరికేన్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో చోటుచేసుకుంది. స్కాట్ బోలాండ్ వేసిన బంతిని అండ్రీ ఫ్లెచర్ మిడాఫ్ దిశగా పుష్ చేశాడు. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కార్ట్‌రైట్ పరుగుకు పిలుపివ్వగా.. ప్లెచర్ క్రీజు నుంచి పరిగెత్తాడు. (చదవండి : స్టన్నింగ్ క్యాచ్.. షాక్‌లో బౌలర్, బ్యాట్స్‌మన్) అప్పటికే బంతిని మెరుపు వేగంతో అందుకున్న షార్ట్ నాన్‌స్ట్రైకింగ్ వైపు త్రో విసరగా.. అది నేరుగా వికెట్లను గిరాటేసింది. అప్పటికీ ప్లెచర్ క్రీజులోకి చేరుకోలేక రనౌట్‌గా వెనుదిరిగాడు. డీ ఆర్సీ షార్ట్ చేసిన రనౌట్ తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. షార్ట్ ఏంటి ఆ వేగం.. నీ రనౌట్‌తో ఫ్లెచర్ బిక్కమొహం వేశాడు. పాపం ఫ్లెచర్‌కు సెకన్ కూడా గ్యాప్ ఇవ్వలేదు.. అంటూ కామెంట్లు చేశారు. (చదవండి : ఆస్పత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ) The rocket arm from D'Arcy Short runs out Fletcher and the Stars lose their second wicket #BBL10 pic.twitter.com/4wGRhQuyKr — KFC Big Bash League (@BBL) January 2, 2021 ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మలన్ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్ మ్యాక్స్‌వెల్ 70 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడినా అతనికి మద్దతు ఇచ్చేవారు కరువయ్యారు. అటు హరికేన్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో మెల్బోర్న్ స్టార్స్ పరాజయం మూటగట్టుకుంది. (చదవండి : 8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు) -
క్యారీ స్టన్నింగ్ క్యాచ్.. వహ్వా అనాల్సిందే
అడిలైడ్ : బిగ్‌బాష్10 లీగ్‌లో గురువారం అడిలైడ్ స్ట్రైకర్స్, పెర్త్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించినా.. అడిలైడ్ స్ట్రైకర్స్ కెప్టెన్ అలెక్స్ క్యారీ మ్యాచ్ హీరోగా నిలిచాడు. మొదట బ్యాటింగ్‌లో మెరిసిన కేరీ ఆ తర్వాత కీపింగ్‌లోనూ అదరగొట్టాడు. పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్ సమయంలో 8వ ఓవర్ వెస్ అగర్ వేశాడు. అగర్ వేసిన బంతి బౌన్స్ అయి లియామ్ లివింగ్‌స్టోన్ బ్యాట్‌ను తాకుతూ క్యారీకి దూరంగా వెళ్లింది. సాధారణంగా చూస్తే క్యాచ్ అందుకోవడం కష్టమే.. కానీ క్యారీ మాత్రం ఒకవైపుకు పడిపోతూ.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : జహీర్ బౌలింగ్‌లో ఆసీస్ ఆటగాడు క్లీన్‌బౌల్డ్) కాగా అంతకముందు అడిలైడ్ స్ట్రైకర్స్ బ్యాటింగ్ సమయంలో క్యారీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లోనే 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 82 పరుగులు చేశాడు. కేరీ ఇన్నింగ్స్‌తో అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పెర్త్ స్కార్చర్స్ 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి విజయం సాధించింది. పెర్త్ ఇన్నింగ్స్‌లో జాసన్ రాయ్ 49 పరుగులు, జోష్ ఇన్‌గ్లిస్ 44* రాణించగా.. చివర్లో మిచెల్ మార్ష్ 38 పరుగులు చేసి జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. Alex Carey is having some night! What a catch...#BBL10 | @BKTtires pic.twitter.com/ADfNd6f8To — cricket.com.au (@cricketcomau) December 31, 2020 -
వైరల్ : రనౌట్ తప్పించుకునేందుకే..
కాన్బెర్రా : బిగ్‌బాష్ లీగ్ 2020లో శనివారం మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ స్టార్స్ ఇన్నింగ్ ఆఖరి ఓవర్లో డేనియల్ సామ్స్ వేసిన బంతిని బ్యాట్స్‌మెన్ లార్కిన్ ఫ్లిక్ చేశాడు. అయితే పొరపాటున బంతి లార్కిన్ జెర్సీలోకి దూరిపోయింది. అయితే లార్కిన్ కొట్టిన బంతి ఎక్కడా కనిపించకపోవడంతో సిడ్నీ థండర్స్ ఆటగాళ్లు కన్య్ఫూజ్ అయ్యారు. ఈ విషయం గమనించని లార్కిన్ నాన్ స్ట్రైకర్ ఎండ్ పిలుపుతో లార్కిన్ సింగిల్ పూర్తి చేశాడు. అతను సింగిల్ పూర్తి చేసే క్రమంలో జెర్సీ నుంచి బంతి కిందకు జారింది. (చదవండి : ఆసీస్‌కు మరో దెబ్బ.. కీలక బౌలర్ ఔట్!) దీంతో అవాక్కైన ఫీల్డర్లు ఇది ఛీటింగ్.. రనౌట్ తప్పించుకోవాలనే అలా చేశాడని.. అతని సింగిల్ చెల్లదని అంపైర్‌కు ఫిర్యాదు చేశారు. ఫీల్డ్ అంపైర్లు పరిశీలించి లార్కిన్ తీసిన సింగిల్‌ను రద్దు చేసి అతన్ని మళ్లీ స్ట్రైకింగ్‌కు పంపించారు. ఈ సంఘటనతో మైదానంలో కాసేపు డ్రామా నెలకొంది. ఈ వీడియోనూ బిగ్‌బాష్ లీగ్ నిర్వాహకులు ట్విటర్ షేర్ చేశారు. ' రనౌట్ తప్పించుకునేందుకు బంతిని జెర్సీలో దాచి పరుగులు పెట్టాడు... ఎంతైనా లార్కిన్ ఇంటలిజెంట్ బ్యాట్స్‌మెన్' అని సరదాగా కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఆ తర్వాత బంతికే లార్కిన్ రన్ఔట్ అయ్యాడు.. ఈసారి మాత్రం అతన్ని అదృష్టం వరించలేదు. (చదవండి : క్యాచ్ వదిలేశాడని బౌలర్ బూతు పురాణం) Hide the ball and run! Bit cheeky here from Nick Larkin... 😝 A @KFCAustralia Bucket Moment | #BBL10 pic.twitter.com/M4T4h2l3g6 — KFC Big Bash League (@BBL) December 12, 2020 ఈ మ్యాచ్‌లో మెల్బోర్స్ స్టార్స్ 22 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మెల్బోర్న్ స్టార్స్ జట్టులో స్టోయినిస్ 61, మ్యాక్స్‌వెల్ 39 పరుగులతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. పెర్గూసన్ 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అలెక్స్ హేల్స్ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. (చదవండి : నా తండ్రి వ్యాఖ్యలు నన్ను బాధించాయి) -
ఆ టోర్నీకి వార్నర్ దూరం..!
సిడ్నీ: ప్రస్తుతం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. స్వదేశంలో జరుగనున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో ఆడటానికి మొగ్గుచూపడం లేదు. వచ్చే ఫిబ్రవరి వరకూ ఆసీస్ దేశవాళీ సీజన్ బిజీగా ఉన్నందున బిగ్‌బాష్ లీగ్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడట. ఈ డిసెంబర్లో ఆరంభం కానున్న బీబీఎల్‌కు వార్నర్ అందుబాటులో ఉండకపోవచ్చని అతని మేనేజర్ జేమ్స్ ఎరిస్కిన్ స్పష్టం చేశాడు. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో ఎరిస్కిన్ మాట్లాడుతూ..‘ నాతో బీబీఎల్ గురించి వార్నర్ ఏమీ మాట్లాడలేదు. బీబీఎల్ ఆడటానికి వార్నర్ సుముఖంగా లేడు.(చదవండి: ఇదెక్కడి డీఆర్ఎస్ రూల్?) ఇక్కడ డబ్బు గురించి వార్నర్ ఆలోచించడం లేదు. ఫ్యామిలీతో గడపాలని చూస్తున్నాడు. బీబీఎల్ కంటే కుటుంబంతో ఉంటే ఉత్తమం అని వార్నర్ భావిస్తున్నాడు. రాబోవు ఆస్ట్రేలియా సీజన్ బిజీగా ఉంది. ఒకవేళ బీబీఎల్ ఆడితే విరామం లేకుండా పోతుంది. కాకపోతే చివరి వార్నర్ ఏమి చేయాలనుకుంటున్నాడో అతని నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది’ అని తెలిపాడు. సెప్టెంబర్ 19వ తేదీన ఆరంభమైన ఐపీఎల్.. వచ్చే నెల 10వ తేదీ వరకూ కొనసాగుతోంది. ఒకవేళ బీబీఎల్‌కు ఓకే చెబితే విశ్రాంతి తీసుకోవడానికి పెద్దగా సమయం ఉండదు. దాంతోనే బీబీఎల్‌కు బ్రేక్ ఇవ్వాలని వార్నర్ యోచనగా ఉన్నట్లు ఎరిస్కిన్ మాటల్లో తెలుస్తోంది. బీబీఎల్‌ను కూడా బయో బబుల్ వాతావరణంలో జరపాలని నిర్ణయించడంతో కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడమే వార్నర్ విముఖతకు ప్రధానం కారణం. డిసెంబర్లోనే ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లనుంది. కాగా, బీబీఎల్‌కు చివరి రెండు నుంచి మూడు వారాలకు టాప్ క్రికెటర్లంతా అందుబాటులో ఉండనుండగా, వార్నర్ మాత్రం అందుకు సిద్ధం లేనట్లు సమాచారం. -
యువరాజ్ ‘బిగ్‌బాష్’ ఆడతాడా?
మెల్బోర్న్: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ విదేశీ లీగ్‌లపై దృష్టి పెట్టాడు. గత ఏడాది అతను రిటైర్మెంట్ ప్రకటించడంతో బీసీసీఐ నిబంధనల ప్రకారం ఎక్కడైనా లీగ్‌లు ఆడేందుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మక ‘బిగ్ బాష్’ లీగ్‌లో ఆడేందుకు యువీ ప్రయత్నిస్తున్నాడని సమాచారం. యువరాజ్ మేనేజ్మెంట్ వ్యవహారాలు చూసే కంపెనీ ఈ విషయాన్ని చెప్పినట్లు స్థానిక పత్రిక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వెల్లడించింది. ‘యువరాజ్ ఏదైనా జట్టుతో జత కట్టేందుకు ఉన్న అవకాశాలను మేం క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చిస్తున్నాం’ అని అతని మేనేజర్ జేసన్ వార్న్ పేర్కొన్నారు. అయితే యువీ కోసం బీబీఎల్ జట్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంతర్గత సమాచారం. గతంలోనూ భారత క్రికెటర్లు కూడా బీబీఎల్‌లో ఆడితే బాగుంటుందని పలు సూచనలు వచ్చినా బీసీసీఐ వాటిని అంగీకరించలేదు. (నాదల్ వస్తున్నాడు ) -
ఒకప్పుడు స్టార్ క్రికెటర్.. ఇప్పుడు దొంగ!
సిడ్నీ: సాధారణంగా ఏ క్రికెటరైనా తమ కెరీర్లో ఒక్కసారైనా క్యాష్ రిచ్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆడాలని కోరుకుంటారు. ఒక్కసారి ఇక్కడ అడుగు పెడితే తమ దశే తిరిగి పోతుందని భావిస్తుంటారు. అలాంటిది.. ఒక్కసారి కాదు.. నాలుగు సంవత్సరాల పాటు ఐపీఎల్ ఆడి, బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో కూడా ప్రాతినిథ్యం వహించిన ఆ క్రికెటర్ సంపాదన ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఆసీస్ మాజీ క్రికెటర్ ల్యూక్ పోమర్స్ బాచ్ ఇందుకు భిన్నం. అతని ప్రవర్తనతోనే తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. ఒకప్పుడు టీ20 స్టార్ క్రికెటర్‌గా వెలిగి ఇప్పుడు ఏకంగా దొంగగా మారిపోయాడు. ల్యూక్ పోమర్స్ బాచ్.. ఒకప్పుడు తారాజువ్వలాగా ఎగిసి పడ్డాడు. 2007లో ఆస్ట్రేలియా తరపున పోమర్స్ బ్యాచ్ ఏకైక టీ20లో ప్రాతినిధ్యం వహించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 7 బంతుల్లోనే 15 పరుగులు చేశాడు. దీంతో తర్వాతి ఏడాది జరిగిన ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ జట్టులో చోటుదక్కించుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున కూడా ఆడాడు. ఇలా 2008 నుంచి 2013 వరకూ ఐపీఎల్ ఆడుతూనే ఉన్నాడు. 2013లో కింగ్స్ పంజాబ్ అతన్ని మూడు లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. తన ఐపీఎల్ చివరి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆడాడు. అతను మొత్తం 17 మ్యాచ్‌ల్లో 122 ప్లస్ స్ట్రైక్ రేట్లో 302 పరుగులు చేశాడు. 2012 ఐపీఎల్లో ఒక అమెరికన్ యువతిని వేదించడంతో అతను అరెస్ట్ అయ్యాడు. 2014లో క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఆ క్రమంలోనే చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఒక సారి బైకు దొంగతనం చేసి, మరోసారి లిక్కర్ షాప్ నుంచి మద్యం దొంగిలించి అరెస్టయ్యాడు. ఈక్రమంలో కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేని స్థితిలో ఒక కారులో తల దాచుకున్నాడు. తాజాగా దొంగతనంలో మరోసారి ల్యూక్ అరెస్టయ్యాడు. బిగ్‌బాష్‌లీగ్‌లో కూడా ప్రాతినిథ్యం వహించిన ల్యూక్ గురించిన తెలిసిన అభిమానులు మాత్రం విధి ఎంత చిత్రమైనది అని ముక్కున వేలేసుకుంటున్నారు. -
హిట్ వికెట్ సెలబ్రేషన్స్.. కానీ నాటౌట్
మెల్బోర్న్: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో హైడ్రామా చోటు చేసుకుంది. ఈరోజు మెల్బోర్న్ స్టార్స్-సిడ్నీ సిక్సర్స్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో హిట్ వికెట్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మన్ అయిన స్టీవ్ స్మిత్ ఆడిన బంతిని తప్పించుకునే క్రమంలో వికెట్లను చేతితో పడగొట్టాడు. మెల్బోర్న్ స్టార్స్ తరఫున ఆడుతున్న హరిస్ రాఫ్ వేసిన ఒక బంతి బౌన్స్ కాగా, దాన్ని స్మిత్ తప్పించుకునేందుకు యత్నించాడు. అయితే ఆ క్రమంలోనే స్మిత్ అదుపు తప్పి వికెట్లపైకి వెళ్లడంతో బెయిల్స్ కిందిపడిపోయాయి. దాంతో అప్పటికి ఇంకా పరుగులు ఖాతా ఆరంభించకపోవడంతో మెల్బోర్న్ స్టార్స్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. (ఇక్కడ చదవండి: ఫించ్ సెంచరీ చేస్తే.. స్మిత్ ఓడించాడు!) దీనిపై ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్‌ను సంప్రదించగా అది నాటౌట్‌గా తేల్చాడు. స్మిత్ వికెట్లను తాకడానికి కంటే ముందుగానే బెయిల్స్ పైకి లేచిపోవడంతో నాటౌట్ ఇచ్చాడు. ఆ సమయంలో గాలి కారణంగా బెయిల్స్ లేచాయని భావించిన థర్డ్ అంపైర్ అది హిట్ వికెట్‌గా ఇవ్వలేదు. దాంతో మెల్బోర్న్ స్టార్స్ ఆనందం ఆవిరైంది. కానీ స్మిత్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 24 పరుగులు చేసి ఆడమ్ జంపా వేసిన 13వ ఓవర్లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. ఆ తర్వాత మెల్బోర్న్ స్టార్స్ 99 పరుగులకే ఆలౌట్ కావడంతో పరాజయం పాలైంది. ఫలితంగా సిడ్నీ సిక్సర్స్ ఫైనల్‌కు చేరగా, మెల్బోర్న్ స్టార్స్ రెండో క్వాలిఫయర్(చాలెంజర్ మ్యాచ్) ఆడటానికి సిద్ధమైంది. Hit wicket? Don't think so! 🙊 The wind has just had a go at getting Steve Smith out! 💨 A @KFCAustralia Bucket Moment | #BBL09 pic.twitter.com/saGREjWJmO — KFC Big Bash League (@BBL) January 31, 2020 -
ఫించ్ సెంచరీ చేస్తే.. స్మిత్ ఓడించాడు!
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరఫున ఆడే క్రమంలో అరోన్ ఫించ్‌లు, స్టీవ్ స్మిత్‌లు జట్టుకు విజయాలు సాధించి పెట్టిన సందర్భాలు ఎన్నో. అయితే ఇద్దరూ ప్రత్యర్థులుగా మారితే.. ఒకర్ని ఒకరు ఓడించుకుంటే అది అత్యంత ఆసక్తిగా ఉంటుంది. బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా శనివారం సిడ్నీ సిక్సర్స్- మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రెనిగేడ్స్ కెప్టెన్ అరోన్ ఫించ్ ఉంటే, సిడ్నీ సిక్సర్స్ సభ్యుడిగా ఉన్న స్మిత్ ఉన్నాడు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన రెనిగేడ్స్ జట్టులో ఫించ్ శతకంతో చెలరేగిపోయాడు. 68 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 109 పరుగులు సాధించాడు. కాగా, మిగతా వారు పెద్దగా రాణించకపోవడంతో రెనిగేడ్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని సిడ్నీ సిక్సర్స్ సునాయాసంగా ఛేదించింది. 18.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి సిడ్నీ సిక్సర్స్ విజయం సాధించింది. ఈ విజయంలో స్టీవ్ స్మిత్ కీలక పాత్ర పోషించాడు. కడవరకూ అజేయంగా క్రీజ్‌లో ఉండి మ్యాచ్‌ను గెలిపించాడు. 40 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 66 పరుగులు సాధించాడు. సిడ్నీ సిక్సర్స్ ఓపెనర్ జోష్ ఫిలిఫ్ 61 పరుగులు సాధించగా, ఫస్ట్ డౌన్లో వచ్చిన స్మిత్ బ్యాట్ ఝుళిపించాడు. బౌండరీలతో అలరిస్తూ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. -
అరోన్ ఫించ్ మెరుపులు
సిడ్నీ: ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను కోల్పోయిన తర్వాత స్వదేశానికి చేరిన ఆసీస్ క్రికెట్ జట్టు సభ్యులు మళ్లీ బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)తో బిజీ అయిపోయారు. ఈ క్రమంలోనే మెల్బోర్న్ రెనిగేడ్స్‌కు కెప్టెన్‌గా వ్యవవహరిస్తున్న అరోన్ ఫించ్ బ్యాట్ ఝుళిపించాడు. శనివారం సిడ్నీ సిక్సర్స్‌తో మ్యాచ్‌లో ఫించ్ శతకంతో మెరుపులు మెరిపించాడు. తొలుత రెనిగేడ్స్ బ్యాటింగ్‌కు దిగగా ఫించ్ సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 68 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. రెనిగేడ్స్ ఇన్నింగ్స్‌లో ఫించ్ మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 175 పరుగులు చేసింది. అయితే ఆపై టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ ధాటిగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. 11 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. సిడ్నీసిక్సర్స్ జట్టులో స్టీవ్ స్మిత్ సభ్యుడు. -
బంతితో ఫుట్‌బాల్ ఆడేసి.. వికెట్ తీశాడు!
సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ ఫీల్డింగ్‌లో అదుర్స్ అనిపించాడు. శనివారం సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ తరఫున ఆడుతున్న మోరిస్ బంతిని ఫుట్‌బాల్ తరహాలో తన్ని వికెట్‌ను సాధించాడు. సిడ్నీ సిక్సర్స్ తొలి ఓవర్ ఆడటానికి సిద్ధం కాగా, థండర్స్ మోరిస్ చేతికి బంతినిచ్చింది. ఆ ఓవర్ ఐదో బంతికి డానియల్ హ్యూజ్స్ బంతిని డిఫెన్స్ ఆడి పరుగు తీయడానికి యత్నించాడు. అయితే బౌలింగ్ ఎండ్ నుంచి పరుగెత్తుకొంటూ వచ్చిన మోరిస్ బంతిని అమాంతంపై వికెట్లవైపు కాలితో తన్నేశాడు. ఫుట్‌బాల్ తరహాలో తన్నిన ఆ బంతి కాస్తా వికెట్లకు తగలడం, ఆ సమయానికి డానియల్ క్రీజ్‌లో చేరుకోలేకపోవడంతో రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించి వీడియోను బీబీఎల్ తన అధికారిక ట్వీటర్లో పోస్ట్ చేసింది. ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 15.5 ఓవర్లలో 76 పరుగులకు ఆలౌటైంది. అటు తర్వాత సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్ ఆరంభించిన కాసేపటికి వర్షం పడింది. సిడ్నీ థండర్స్ 5.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 28 పరుగుల వద్ద ఉండగా వర్షం పడింది. దాంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం థండర్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు. రాబోవు ఐపీఎల్ సీజన్లో మోరిస్ ఆర్సీబీ తరఫున బరిలో దిగుతున్నాడు. Goodness gracious 😱 Elite footwork from Chris Morris. Not ideal running from Dan Hughes and Josh Philippe... #BBL09 pic.twitter.com/k0cD7ARqh1 — KFC Big Bash League (@BBL) January 18, 2020 -
వన్డేలూ ఆడతా: డివిలియర్స్
మెల్బోర్న్: దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ ఇకపై అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా తరఫున ఈ ఏడాది టి20 ప్రపంచకప్ ఆడతానని ప్రకటించిన ఏబీ తాజాగా వన్డేలపై కూడా ఆసక్తి తెలిపాడు. బిగ్‌బాష్ టి20 లీగ్ సందర్భంగా టీవీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న గిల్‌క్రిస్ట్‌తో మాట్లాడుతూ వన్డేలకూ సిద్ధమేనని ‘మిస్టర్ 360’ డిగ్రీ బ్యాట్స్‌మన్ చెప్పాడు. 2018, మే నెలలో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్ గతేడాది ప్రపంచకప్‌కు ముందు తన నిర్ణయాన్ని సమీక్షించుకున్నాడు. మెగా ఈవెంట్ ఆడేందుకు సిద్ధమని చెప్పాడు. అయితే దక్షిణాఫ్రికా సెలక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోలేదు. ఇటీవల సఫారీ జట్టుకు తన సహచరుడు మార్క్ బౌచర్ కోచ్ కావడంతో పరిస్థితులు మారిపోయాయి. బౌచర్... ఏబీ తిరిగి రావాలని కోరడంతో పాటు ఇద్దరి మధ్య సంప్రదింపులు కూడా జరిగాయి. దీంతో పొట్టి ఫార్మాట్‌కు సై అన్న డివిలియర్స్ ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్లోనూ సఫారీ జెర్సీతో బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతున్నాడు. -
మ్యాక్స్‌వెల్ బాదేశాడు..
మెల్బోర్న్: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ నేతృత్వంలోని మెల్బోర్న్ స్టార్స్ మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌లకు గాను ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. శుక్రవారం మెల్బోర్న్ రెనిగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెనిగేడ్స్ నిర్దేశించిన 169 పరుగుల టార్గెట్‌ను మెల్బోర్న్ స్టార్స్ ఇంకా ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్ స్టోయినిస్ డకౌట్ నిష్ర్కమించగా, మరో ఓపెనర్ హిల్టన్ కార్ట్‌రైట్(35) ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత బెన్ డంక్(14) విఫలమయ్యాడు. ఆ తరుణంలో నిక్ లార్కిన్‌కు జత కలిసిన కెప్టెన్ మ్యాక్స్‌వెల్ పరుగుల మోత మోగించాడు. భారీ హిట్లు సాధిస్తూ రెనిగేడ్స్ బౌలర్లను చిత్తు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు బాదిన మ్యాక్స్‌వెల్.. ఒకే ఒక్క ఫోర్ కొట్టాడు.19 ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి మెల్బోర్న్ స్టార్స్‌కు మరో విజయాన్ని అందించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన రెనిగేడ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు షాన్ మార్ష్(63), మార్కస్ హారిస్(42)లు శుభారంభాన్ని అందించారు. ఆపై వెబ్‌స్టెర్(25) ఫర్వాలేదనిపించగా, మిగతా వారు విఫలమయ్యారు. దాంతో రెనిగేడ్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. -
అవుటా... నాటౌటా!
బ్రిస్బేన్: సిక్సర్‌గా మారబోతున్న బంతిని బౌండరీ ఇవతలినుంచే గాల్లోకి ఎగిరి ఆపడం, ఆపై అవసరమైతే బంతిని లోపలికి తోసిన తర్వాత లైన్ దాటి వెళ్లి వచ్చి కూడా క్యాచ్ అందుకోవడం లేదా మరో ఫీల్డర్‌కు అందించడం ఇటీవల తరచుగా చూస్తూనే ఉన్నాం. కానీ దీనికి కొనసాగింపుగానా అన్నట్లు జరిగిన ఘటన వివాదం రేపింది. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా వేడ్ కొట్టిన బంతిని ఫీల్డర్ రెన్షా క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. (ఇక్కడ చదవండి: క్రికెట్లో అదొక వేస్ట్ రూల్.. దాన్ని తీసేయండి!) ఈ క్రమంలో గీత దాటిన అతను అక్కడినుంచే బంతిని లోపల ఉన్న ఫీల్డర్ బాంటన్ వైపు తోశాడు! ముందుగా థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ తర్వాత అదే పనిగా ఎన్నో రీప్లేలు చూశాక అవుటిచ్చాడు. బంతిని నెట్టే సమయంలో అతని కాళ్లు గాల్లో ఉన్నాయి కాబట్టి నిబంధనల ప్రకారమే సరైనదేనంటూ లీగ్ నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఫీల్డర్ లైన్ దాటి ఇలా చేయడం పెద్ద తప్పంటూ మాజీలు, విశ్లేషకులు విరుచుకుపడ్డారు. -
స్టోయినిస్ అనుచిత ప్రవర్తన.. భారీ జరిమానా
మెల్బోర్న్: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో దూకుడుగా ప్రవర్తించిన ఆసీస్ క్రికెటర్ మార్కస్ స్టోయినిస్‌పై భారీ జరిమానా విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. శనివారం మెల్బోర్న్ స్టార్స్-మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టోయినిస్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ అయిన స్టోయినిస్.. మెల్బోర్న్ రెనిగేడ్స్ ఆటగాడే కేన్ రిచర్డ్సన్ను దూషించాడు. రిచర్డ్సన్పై వ్యక్తిగత దూషణలకు దిగాడు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్ కావడంతో తన తప్పును స్టోయినిస్ ఒప్పుకున్నాడు. ఆ క్రమంలోనే అతనికి 7,500 డాలర్ల జరిమానా విధిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. తన ప్రవర్తనపై ఎటువంటి చాలెంజ్‌కు వెళ్లకుండా ఒప్పుకోవడంతో స్టోయినిస్‌కు జరిమానాతో సరిపెట్టారు. దీనిలో భాగంగా రిచర్డ్సన్కు అంపైర్లకు స్టోయినిస్ క్షమాపణలు చెప్పాడు. ‘ ఆ క్షణంలో ఏమైందో నాకు తెలీదు. నేను దూషించిన మాట వాస్తవం. నేను తప్పు చేసాను అనే సంగతిని వెంటనే తెలుసుకున్నా. ఇది నిజంగా పెద్ద తప్పిదమే. కేన్‌కు, అంపైర్లకు క్షమాపణలు తెలియజేస్తున్నా’ అని స్టోయినిస్ పేర్కొన్నాడు.ఆ మ్యాచ్‌లో స్టోయినిస్ జట్టు మెల్బోర్న్ స్టార్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెనిగేడ్స్ 143 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, దాన్ని స్టార్స్ 18.5 ఓవర్లలో ఛేదించింది. స్టోయినిస్(68 నాటౌట్), గ్లెన్ మ్యాక్స్‌వెల్(40)లు విజయంలో కీలక పాత్ర పోషించారు. -
మళ్లీ లిన్ మోత మోగించాడు..
హోబార్ట్: ఈ ఏడాది జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు ఆడబోతున్న ఆసీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ లిన్.. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో మెరుపులు మెరిపిస్తున్నాడు. బీబీఎల్‌లో బ్రిస్బేన్ హీట్‌కు సారథిగా వ్యవహరిస్తున్న లిన్.. శుక్రవారం హోబార్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. 55 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 88 పరుగులు సాధించాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన లిన్ వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పని చెప్పాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగులు మోత మోగించాడు. ఈ క్రమంలోనే ఓపెనర్ మ్యాక్స్ బ్రయాంట్(65)తో కలిసి 95 పరుగుల్ని జోడించాడు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో బ్రిస్బేన్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఆపై మ్యాట్ రెన్షాతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన లిన్ జట్టు స్కోరును రెండొందల దాటించాడు. రెన్ షా 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేయడంతో బ్రిస్బేన్ మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఇక లిన్ నాటౌట్‌గా మిగిలాడు. ఆపై టార్గెట్‌ను ఛేదించే క్రమంలో హరికేన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులకే పరిమితమైంది. దాంతో బ్రిస్బేన్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో బ్రిస్బేన్‌కు ఇది రెండో విజయం. అంతకుముందు సిడ్నీ సిక్సర్స్‌పై బ్రిస్బేన్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కూడా లిన్ దూకుడుగా ఆడాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 11 సిక్సర్లతో 94 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిడ్నీ సిక్సర్స్‌పై బ్రిస్బేన్ హీట్ 48 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.(ఇక్కడ చదవండి:‘ప్రతీ సిక్స్‌ను డొనేట్ చేస్తా’) -
‘ప్రతీ సిక్స్‌ను డొనేట్ చేస్తా’
మెల్బోర్న్: ఆస్ట్రేలియా పించ్ హిట్టర్లలో క్రిస్ లిన్ ఒకడు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు ఈ హార్డ్ హిట్టర్. గతేడాది డిసెంబర్ నెలలో జరిగిన ఐపీఎల్ వేలంలో అతని కనీస ధర రూ. 2 కోట్లకే ముంబై దక్కించుకుంది. క్రిస్ లిన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ వదిలేసుకోవడంతో ఈసారి వేలంలోకి వచ్చాడు లిన్. అయితే ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో బ్రిస్బేన్ హీట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న లిన్.. ఈ లీగ్‌లో కొట్టే ప్రతీ సిక్స్‌ను ఆస్ట్రేలియాలో అడవులు అంటుకుని వాటి బారిన పడ్డ బాధితులకు డొనేట్ చేస్తానంటున్నాడు. ‘ హే గయ్స్.. ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లో నేను కొట్టే ప్రతీ సిక్స్‌కు 250 డాలర్లను వారికి సాయంగా అందిస్తా. ఒక్కో సిక్స్‌కు 250 డాలర్లను ఇవ్వాలనుకుంటున్నా’ అని లిన్ ట్వీట్ చేశాడు. ఇక ఆస్ట్రేలియాకు చెందిన వివాదాస్పద టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ కూడా తన వంతు సాయాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఏటీపీ కప్‌లో తాను కొట్టే ప్రతీ ఏస్‌కు 200 డాలర్లను ఇస్తానని తెలిపాడు. మరొక ఆసీస్ టెన్నిస్ ప్లేయర్ అలెక్స్ డి మినార్ కూడా ప్రతీ ఏస్‌కు 250 డాలర్లు ఇస్తానని ప్రకటించాడు. కాకపోతే తాను ఎక్కువ ఏస్‌లు కొట్టలేనేమోననే అనుమానం వ్యక్తం చేశాడు. ఇలా క్రికెట్ స్టార్లు, టెన్నిస్ స్టార్లు కలిసి తమ దేశంలోని అడవులు అంటుకుని వాటి బారిన పడ్డ వారికి సాయం చేయడానికి నడుం బిగించారు. గత కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియాలో అడవులను అంటుకున్న మంటలు క్రమంగా న్యూసౌత్ వేల్స్ , విక్టోరియాలోని ఈస్ట్ గిప్స్లాండ్ తదితర ప్రాంతాలకు వ్యాపించడంతో 17 మంది మ్యత్యువాడ పడగా వందల సంఖ్యలో గాయపడ్డారు.(ఇక్కడ చదవండి: క్రిస్ లిన్‌కు జాక్‌పాట్ లేదు..!) -
ఆ విషయాన్ని నా పార్టనర్ గుర్తించింది: మ్యాక్స్‌వెల్
సిడ్నీ: మానసిక సమస్యలు కారణంగా గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ఆసీస్ హార్డ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తిరిగి మ్యాచ్‌లు ఆడేందుకు సన్నద్ధమయ్యాడు. త్వరలో ఆరంభం కానున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో మెల్బోర్న్ స్టార్స్‌కు సారథ్యం వహించేందుకు మ్యాక్సీ సిద్ధమయ్యాడు. ఈ మేరకు తన మానసిక సమస్యను అర్థం చేసుకుని కోలుకోవడానికి నిరవధిక విరామాన్ని ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు మ్యాక్స్‌వెల్ ధన్యవాదాలు తెలియజేశాడు. తనకు మానసిక ఇబ్బందులున్నాయని, దాంతో కొంతకాలం విశ్రాంతి కావాలని అక్టోబర్‌లో సీఏను కోరాడు. మ్యాక్సీ విజ్ఞప్తిని మన్నించిన సీఏ.. అతనికి విరామాన్ని ఇచ్చింది. దాంతో దాదాపు రెండు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు మ్యాక్సీ. తాను తిరిగి కోలుకున్నానని, ఇక సుదీర్ఘ సమయం అవసరం లేదని మ్యాక్స్‌వెల్ స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. ఫలితంగా బీబీఎల్‌తో తన రీఎంట్రీ ఇవ్వబోయే విషయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించాడు. తన పునరాగమనంపై మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ.. ‘ నేను స్వింగ్‌లోకి వచ్చేశా. గత కొంత కాలంగా నేను మానసికంగా చాలా సతమతమయ్యా. దాంతో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. గత ఎనిమిది నెలలుగా విరామం లేకుండా తిరగడం వల్ల మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయా. భారీ భారం మోస్తున్నట్లు అనిపించేది. ఆ కారణంగా దేనిపైనా దృష్టి పెట్టలేకపోయా. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదు. ఈ విషయాన్ని నేను ఎవరితోనూ చెబుతుంటే నా పార్టనర్ విశ్రాంతి తీసుకోమని చెప్పింది. నా సమస్యను గుర్తించిన మొదటి వ్యక్తి నా పార్టనరే. ఇప్పుడు నా భుజాలపై నుంచి భారీ భారం దిగినట్లు ఉంది. నా సమస్యను అర్థం చేసుకుని నిరవధిక విరామాన్ని ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియాకు చాలా థాంక్స్’ అని మ్యాక్సీ పేర్కొన్నాడు. మరి మ్యాక్స్‌వెల్ పార్టనర్ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ భారతీయ కుటుంబానికి చెందిన విని రామన్ కావొచ్చు. ఈ పేరును మ్యాక్సీ వెల్లడించకపోయినా ఆమెతో గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్.. ఏడాది నిషేధం
సిడ్నీ: క్రికెట్ జట్టు సమాచారాన్ని గోప్యంగా ఉంచకుండా తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎమిలీ స్మిత్‌పై ఏడాది నిషేధం పడింది. మహిళల బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా ఈ నెల ఆరంభంలో సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హోబార్ట్ హరికేన్స్ క్రీడాకారిణి ఎమిలీ స్మిత్ జట్టు ఎలెవన్ పేర్లను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. మ్యాచ్ ఆరంభానికి గంట ముందు ఆమె జట్టులో ఎవరు ఆడుతున్నారో అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బట్టబయలు చేశారు. ఇది క్రికెట్ నిబంధనలకు విరుద్ధం. క్రికెట్ ఆస్ట్రేలియా ఆర్టికల్ 2.3.2 ప్రకారం స్మిత్‌పై 12 నెలల నిషేధం పడింది. ఈ పోస్ట్ బెట్టింగ్‌కు సంబంధించి ఉపయోగించబడే సమాచారానికి దారితీస్తుందని, జట్టు రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయడం నేరం అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఇది అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొన్న క్రికెట్ ఆస్ట్రేలియా.. ఎమిలీ స్మిత్‌పై 12 నెలల నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో బిగ్‌బాష్ లీగ్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఏడాది నిషేధంలో స్మిత్‌పై తొమ్మిది నెలలు పూర్తి సస్పెన్షన్ కొనసాగనుంది. ఇక చివరి మూడు నెలలు అందుబాటులోకి వచ్చినా జట్టులో ఎంపికకు అనర్హురాలిగానే ఉండాల్సి ఉంటుంది. -
ఏడీ డివిలియర్స్ ‘బిగ్’ అరంగేట్రం
కేప్‌టౌన్: ఇప్పటివరకూ పలు విదేశీ లీగ్‌లు ఆడిన దక్షిణాఫ్రికా గ్రేట్ ఏబీ డివిలియర్స్.. ఇంకా ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో మాత్రం ఆడలేదు. ఐపీఎల్, సీపీఎల్, పీఎస్ఎల్ వంటి లీగ్‌లు ఆడిన అనుభవం ఉన్న డివిలియర్స్ తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో ఆడటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 2019-20 సీజన్‌కు సంబంధించి బ్రిస్బేన్ హీట్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అయితే బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా సెకండ్ హాఫ్‌లో బ్రిస్బేన్ హీట్‌తో డివిలియర్స్ కలుస్తాడు. దీనిపై బ్రిస్బేన్ హీట్ కోచ్ డారెన్ లీమన్ మాట్లాడుతూ.. ‘ ఏడి డివిలియర్స్ మాతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. డివిలియర్స్‌తో కలిసి తొలిసారి పనిచేసే అవకాశం లభించింది. వరల్డ్‌క్లాస్ ప్లేయర్స్‌తో కలిసి పని చేసే అవకాశం అన్ని సందర్భాల్లోనూ రాదు. అతను 360 డిగ్రీల ఆటగాడు. అసాధారణమైన నైపుణ్యం డివీ సొంతం. ఏబీ గొప్ప నాయకుడు కూడా. బీబీఎల్ అనేది ప్రతీ ఒక్కరి టాలెంట్ వెలికి తీసే గొప్ప లీగ్’ అని లీమన్ పేర్కొన్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డివిలియర్స్ 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. దక్షిణాఫ్రికా తరఫున తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతల్ని డివీ సాధించాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున డివిలియర్స్ 442 పరుగులు చేశాడు. దాదాపు 45 సగటుతో ఈ పరుగులు నమోదు చేశాడు.ఇందులో 154 స్ట్రైక్ రేట్ ఉండటం విశేషం. -
ఇక టాప్-5 జట్లకు అవకాశం!
సిడ్నీ: వరల్డ్‌కప్ లీగ్దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్లకు ఏం ప్రయోజనం చేకూరుతుందనే వాదన వినిపించిన సంగతి తెలిసిందే. ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలో కూడా ఐపీఎల్ తరహా ప్లేఆఫ్స్‌ను అమలు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. దీని వల్ల తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు మేలు జరుగుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే తాజాగా బిగ్‌బాష్ లీగ్ తీసుకున్న సరికొత్త నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు మరింత ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో ప్లేఆఫ్స్‌ను తీర్చిదిద్దింది. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. ఈ పొట్టి లీగ్‌కు ఐపీఎల్ మాదిరిగానే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. డిసెంబర్ 17 నుంచి మొదలయ్యే బిగ్‌బాష్ తొమ్మిదో సీజన్లో కొత్త తరహా ఫైనల్స్‌ను నిర్వహించనున్నారు. పట్టికలో నిలిచిన తొలి ఐదు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన జట్లకు ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ‘ఎలిమినేటర్’లో గెలిచిన జట్టు మూడో స్థానంలో ఉన్న జట్టుతో ‘ది నాకౌట్’లో పోటీపడుతుంది. మరోవైపు తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ‘క్వాలిఫయిర్’లో తలపడతాయి. దీనిలో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు మాత్రం ‘నాకౌట్’లో విజయం సాధించిన టీమ్‌తో ‘ది చాలెంజర్’లో తలపడుతుంది. చాలెంజర్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. -
బీబీఎల్‌కు వాట్సన్ గుడ్‌బై
సిడ్నీ: తమ దేశంలో జరిగే ప్రతిష్టాత్మక బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)కు ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ గుడ్ బై చెప్పేశాడు. ఇక బీబీఎల్ ఆడబోనంటూ వాట్సన్ స్పష్టం చేశాడు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ఆడుతున్న వాట్సన్.. తమ దేశంలో జరిగే బీబీఎల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. కాగా, కొన్ని విదేశీ లీగ్‌ల్లో మాత్రం ఆడతానంటూ పేర్కొన్నాడు. గత మూడు సీజన్ల నుంచి బీబీఎల్‌లో సిడ్నీ థండర్‌కు సారథిగా వ్యవహరిస్తున్న వాట్సన్..తన జట్టు సహచరులకు కృతజ్ఞతలు తెలిపాడు. సిడ్నీ థండర్‌తో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని, అవి ఎప్పుడూ తన మదిలో పదిలంగానే ఉంటాయన్నాడు. ప్రధానంగా నిక్ కమిన్స్, పాడీ ఆప్టన్, లీ జర్మన్, షేన్ బాండ్లతో తన అనుభవం ఎప్పటికీ మరచిపోలేనిదిగా పేర్కొన్నాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు బీబీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వివరణ ఇచ్చాడు. -
రనౌటైన కోపాన్ని కుర్చీపై చూపించాడు!
-
అరోన్ ఫించ్ ఏందిది?
మెల్బోర్న్: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ తన కోపాన్ని కుర్చీపై చూపించాడు. రెండోరోజుల క్రితం బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా మెల్బోర్న్ రెనెగేడ్స్ కెప్టెన్‌గా ఉన్న ఫించ్ రనౌటైన క్రమంలో పెవిలియన్‌లోకి వెళుతూ అక్కడ ఉన్న కుర్చీపై విశ్వరూపం ప్రదర్శించాడు. రెండుసార్లు కుర్చీని బలంగా బాది దాన్ని విరగొట్టే యత్నం చేశాడు. ఆదివారం మెల్బోర్న్ రెనిగేడ్స్-మెల్బోర్న్ స్టార్స్ మధ్య బిగ్‌బాష్ ఫైనల్మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో భాగంగా మెల్బోర్న్ రెనిగేడ్స్ ఫించ్ బ్యాటింగ్ చేసే క్రమంలో అతని ఏమరుపాటు కారణంగా అనుకోకుండా రనౌట్ అయ్యాడు.ఫించ్‌కు మరో ఎండ్‌లో ఉన్న కామెరూన్ బంతిని ఆడాడు. దీన్ని బౌలర్ జాక్సన్ బంతిని పాదంతో ఆపే ప్రయత్నం చేశాడు. ఈలోపు అనవసర పరుగు కోసం ప్రయత్నించిన ఫించ్ రనౌట్ అయ్యాడు. దీంతో ఫించ్ కోపం కట్టలు తెంచుకుంది. ఏం చేసేది లేక పెవిలియన్ చేరేటప్పుడు దారిలో ఉన్న చైర్‌ను రెండుసార్లు బ్యాట్‌తో కొట్టాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. (ఇక్కడ చదవండి: 19 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు) ‘అసలు దీని ద్వారా ఏం సందేశం ఇద్దామని అనుకుంటాన్నావ్ ఫించ్’ అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా, ‘అతని దెబ్బకు కుర్చీ దాదాపు చెత్త అయిపోవడం ఖాయం’ మరొకరు సెటైర్ వేశాడు. ‘ఫించ్ కెమెరాకు చిక్కావ్.. నీకు జరిమానా తప్పదు’ మరొకరు ఎద్దేవా చేశాడు. అసహనంలో ఇలా ప్లాస్టిక్ చైర్‌పై దాడి చేయడం నీకు తగదు.. ఇదేమీ గొప్పగా అనిపించడం లేదు. ఇది పిల్లలకు ఒక చెడు సందేశం’ అని మరో అభిమాని విమర్శించాడు.ఇదిలా ఉంచితే, కుర్చీపై తన కోపాన్ని ప్రదర్శించిన ఫించ్‌కు బీబీఎల్ యాజమాన్యం మందలింపు సరిపెట్టింది. ఇలా మరొకసారి చేయవద్దని హెచ్చరించింది. కాగా, ఈ మ్యాచ్‌లో ఫించ్ నేతృత్వంలో మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్టు 13 పరుగుల తేడాతో గెలుపొందింది. -
19 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు
మెల్బోర్న్: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో మెల్బోర్న్ రెనిగేడ్స్ విజేతగా అవతరించింది. ఆదివారం మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో మెల్బోర్న్ రెనిగేడ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇది రెనిగేడ్స్‌కు తొలి బీబీఎల్ టైటిల్. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మెల్బోర్న్ స్టార్స్ తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అరోన్ ఫించ్ నేతృత్వలోని రెనిగేడ్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. రెనిగేడ్స్ టాపార్డర్ ఘోరంగా విఫలమైనా ఆరో స్థానంలో వచ్చిన టామ్ కూపర్(43 నాటౌట్), ఏడో స్థానంలో వచ్చిన డానియల్ క్రిస్టియన్(38 నాటౌట్)లు ఆదుకున్నారు. దాంతో గౌరవప్రదమైన స్కోరును రెనిగేడ్స్ బోర్డుపై ఉంచింది. కాగా,ఆపై సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ స్టార్స్‌కు శుభారంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు బెన్ డంక్(57), మార్కస్ స్టోనిస్(39)లు తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టును పటిష్ట స్థితిలో నిల్పారు. ఆ తర్వాత ఆడమ్ జంపా(17) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరును దాటలేకపోయారు. ప్రధానంగా 19 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 7 వికెట్లను చేజార్చుకుని పరాజయం కొనితెచ్చుకుంది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసిన మెల్బోర్న్ స్టార్స్ ఓటమి పాలైంది. రెనిగేడ్స్ బౌలర్లలో డానియల్ క్రిస్టియన్, కామెరూన్ బోయ్సే, క్రిస్ ట్రిమాన్లు తలో రెండు వికెట్లు సాధించారు. -
క్రికెట్లో కనీవినీ ఎరుగని రనౌట్
మెల్బోర్న్: క్రికెట్లో రనౌట్లు అనేవి సహజం. పరుగు తీసే క్రమంలో బ్యాట్స్‌మన్ క్రీజ్‌లోకి చేరుకోలేకపోతే రనౌట్‌గా నిష్క్రమిస్తూ ఉంటారు. చేజింగ్ సమయంలో అందులోనూ చివర ఓవర్లలో ప్రతీ పరుగు ముఖ్యమైనదే. ఈ సమయంలో రనౌట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. రనౌట్ అయిన విధానం పట్ల బ్యాట్స్‌మెన్‌పై ఒక్కోసారి జాలి చూపిస్తే.. మరికొన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తాం. ఆస్ట్రేలియాలో జరగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో జరిగిన సిల్లీ రనౌట్ అందిరిలోనూ నవ్వు తెప్పిస్తోంది. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా సిడ్నీ ధండర్స్- మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ వినూత్న రనౌట్ చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ రెనిగేడ్స్-సిడ్నీ థండర్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన మెల్బోర్న్, నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన సీడ్నీ లక్ష్య చేదనలో పూర్తిగా విఫలమైంది. దీంతో 19.1 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. అయితే సిడ్నీ ఇన్నింగ్స్ 18.3 ఓవర్లో జోనాథన్ కుక్, గురిందర్ సంధు ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. ఈక్రమంలో కుక్కు బౌలర్ వేసిన బంతిని ఆడి పరుగు తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న సంధును ఢీకొన్నాడు. దీంతో బౌలర్ హ్యారీ గుర్నే వారిద్దరి మధ్య నుంచి వెళ్లి రనౌట్ చేశాడు. దీంతో బ్యాట్స్‌మన్ కుక్ ఒక్క సారిగా షాక్‌కు గురై.. భారంతో మైదానాన్ని వీడాడు. -
క్రికెట్లో కనీవినీ ఎరుగని రనౌట్
-
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ కెప్టెన్
హోబార్ట్: దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జోహాన్ బోథా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఈ మేరకు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు సఫారీ జట్టు తాజా మాజీ స్పిన్నర్ ప్రకటించాడు. ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా హోబార్ట్ హరికేన్స్ కు ప్రాతినిథ్యం వహించిన బోథా.. బుధవారం సిడ్సీ సిక్సర్స్‌తో మ్యాచ్ తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో భోథాకు కనీసం వికెట్ కూడా లభించలేదు. దాంతో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని భావించిన 36 ఏళ్ల బోథా ఉన్నపళంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 2005 నుంచి 2012 వరకూ దక్షిణాఫ్రికా జట్టు ప్రాతినిథ్యం వహించగా, 2016లో ఆస్ట్రేలియా పౌరసత్వం పొందాడు. దక్షిణాఫ్రికా తరఫున 78 వన్డే మ్యాచ్‌లు, 40 టీ20 మ్యాచ్‌లు, 5 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలోనే 10 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2009లో బోథా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు నంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. ఆ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 4-1తో ఆసీస్‌పై గెలిచి టాప్ ర్యాంకును సొంతం చేసుకుంది. ఇదిలా ఉంచితే, పలు సందర్భాల్లో భోథా యాక్షన్‌పై అనుమానాలు తలెత్తడంతో అతని బౌలింగ్‌ను సరిచేసుకోవాల్సి వచ్చింది. -
ఓవర్లో ఏడో బంతికి బ్యాట్స్‌మన్ ఔట్!
పెర్త్: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో ఓ బ్యాట్స్‌మన్ ఔటైన తీరు వివాదాస్పదమైంది. సాధారణంగా ఓవర్‌కు ఆరు స్ట్రైయిట్ బంతులు మాత్రమే పడాల్సిన ఉన్నా అంపైర్ ఏడో బాల్ వేయించడంతో పాటు ఆ బంతికి బ్యాట్స్‌మన్ ఔట్ కావడం వివాదానికి దారి తీసింది. ఆస్ట్రేలియా వేదిక జరుగుతున్న బీబీఎల్‌లో భాగంగా ఆదివారం పెర్త్ స్కార్చర్స్-సిడ్నీ సిక్సర్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ జట్టు 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో ఓవర్లో ఓపెనర్ మైకేల్ క్లింగర్ ఏడో బంతికి ఔటయ్యాడు. ఓవర్‌కు వేసే బంతుల్ని లెక్కించే క్రమంలో అంపైర్ ఒక్క బంతి ఎక్కువగా వేయించాడు. ఆ బంతికి క్లింగర్ ఔట్ కావడం చర్చకు దారి తీసింది. డ్వార్షూయిస్ వేసిన సదరు ఓవర్ తొలి రెండు బంతుల్ని మరో ఓపెనర్ బెన్‌క్రాఫ్ట్ ఆడి ఒక లెగ్ బై ద్వారా పరుగు తీశాడు. ఆపై మూడో బంతిని క్లింగర్ ఆడి బై ద్వారా రెండు పరుగులు సాధించగా, నాల్గో బంతికి క్లింగర్ పరుగు తీశాడు. ఇక ఐదో బంతికి బెన్ క్రాఫ్ ఆడి రెండు పరుగులు తీయగా, ఆరు బంతికి పరుగు తీశాడు. దాంతో ఓవర్ పూర్తయ్యింది. అయితే మరొక బంతిని అంపైర్ వేయించడంతో క్లింగర్ ఔటయ్యాడు. ఫీల్డ్ అంపైర్ చేసిన తప్పిదాన్ని మ్యాచ్ అధికారులు సైతం గుర్తించకపోవడంతో క్లింగర్ 2 పరుగులకే పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కామెరూన్ బెన్‌క్రాఫ్ట్ 61 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో అజేయంగా 87 పరుగులు సాధించడంతో పెర్త్ స్కార్చర్స్ 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి గెలుపును అందుకుంది. బాల్ ట్యాంపరింగ్‌తో నిషేధానికి గురై ఇటీవల ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన బెన్‌క్రాఫ్ట్ బ్యాట్‌తో మెరవడం పెర్త్ స్కార్చర్స్ అభిమానుల్ని అలరించింది. -
నేటి నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ బరిలోకి బాన్‌క్రాఫ్ట్
బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి తొమ్మిది నెలల నిషేధానికి గురైన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ నేటి నుంచి మళ్లీ సీనియర్ ప్రొఫెషనల్ క్రికెట్ బరిలోకి దిగుతున్నాడు. శనివారంతో అతనిపై నిషేధం ముగిసింది. దాంతో బిగ్‌బాష్ టి20 లీగ్ జట్టు పెర్త్ స్కార్చర్స్ తమ 13 మంది సభ్యుల జట్టులోకి బాన్‌క్రాఫ్ట్‌ను ఎంపిక చేసింది. ఆదివారం హోబర్ట్ హరికేన్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం ఉంది. 26 ఏళ్ల బాన్‌క్రాఫ్ట్ ఆస్ట్రేలియా తరఫున 8 టెస్టులు, ఏకైక టి20 మ్యాచ్ ఆడాడు. స్మిత్, వార్నర్‌లపై మార్చి 29 వరకు నిషేధం కొనసాగనుంది. -
బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో తొలిసారి ఇలా..
-
బీబీఎల్ చరిత్రలో తొలిసారి..
బ్రిస్బేన్: ప్రపంచ క్రికెట్లో పలు రకాలైన అవుట్లతో బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాటపడుతూ ఉంటారు. అందులో అబ్స్ట్రక్టింగ్ అవుట్ ఒకటి. బ్యాట్స్‌మన్ ఉద్దేశపూర్వకంగా బంతికి అడ్డుతగిలితే దానిని అబ్స్ట్రక్టింగ్ అవుట్‌గా పరిగణిస్తారు. ఈ అవుట్ ద్వారా ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. తాజాగా బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో బ్రిస్బేన్ హీట్ తరపున ఆడుతున్న అలెక్స్ రాస్ ఇలానే పెవిలియన్‌కు చేరడం వివాదానికి దారి తీసింది. మరొకవైపు బీబీఎల్ చరిత్రలో ఒక బ్యాట్స్‌మన్ అబ్స్ట్రక్టింగ్ అవుట్ ద్వారా పెవిలియన్‌కు చేరడం కూడా ఇదే తొలిసారి. వివరాల్లోకి వెళితే.. బుధవారం బ్రిస్బేన్ హీట్-హోబార్ట్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. డీ ఆర్సీ షార్ట్(122;69 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. ఆపై లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన హరికేన్స్‌కు శుభారంభం లభించింది. అయితే సెకండ్ డౌన్లో వచ్చిన అలెక్స్ రాస్ కుదురుగా ఆడుతున్న సమయంలో అబ్స్ట్రక్టింగ్ అవుట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్‌లో భాగంగా తైమాల్ మిల్స్ వేసిన 17 ఓవర్ చివరి బంతిని అలెక్స్ కవ్ కార్నర్లో కొట్టి తొలి పరుగును విజయవంతంగా పూర్తిచేశాడు. అయితే రెండో పరుగును తీసే క్రమంలో వేగంగా క్రీజ్‌లోకి దూసుకొచ్చాడు. ఆ సమయంలో బంతిని గమనించని అలెక్స్ వికెట్లకు అడ్డంగా పరిగెట్టడంతో బంతి అతన్ని తాకుతూ వికెట్లను పడగొట్టింది. అప్పటికి అలెక్స్ క్రీజ్‌లో చేరుకున్నప్పటికీ, అబ్స్ట్రక్టింగ్ అవుట్ అంటూ థర్డ్ అంపైర్ ప్రకటించాడు. ఫలితంగా బీబీఎల్‌లో ఈ తరహాలో అవుటైన తొలి బ్యాట్స్‌మన్‌గా అలెక్స్ నిలిచాడు. కాగా, ఈ అవుట్‌పై ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ధ్వజమెత్తాడు. అలెక్స్ ఉద్దేశపూర్వకంగా బంతిని ఆపడం ద్వారా అవుట్‌గా ఎలా పరిగణిస్తారంటూ విమర్శించాడు. ఈ నాటకీయపరిణామం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. తన దృష్టిలో ఇది కచ్చితంగా అబ్స్ట్రక్టింగ్ అవుట్ కాదంటూ థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. -
పీటర్సన్ గుడ్ బై?
లండన్:2013-14 యాషెస్ సిరీస్ సందర్బంగా వివాదాస్పద రీతిలో వ్యవహరించి ఇంగ్లండ్ జట్టుకు దూరమైన మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్.. త్వరలోనే అన్ని స్థాయిల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. ఇందులో భాగంగా ఇదే తన చివరి బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్) అంటూ పీటర్సన్ వెల్లడించడం అందుకు బలాన్ని చేకూరుస్తుంది. 'నా బిగ్‌బాష్ లీగ్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నా. దీనికోసం రాబోవు 10 నెలలు పాటు వేచి చూసి నిర్ణయం తీసుకోవాలను కోవడం లేదు. ఇక కొన్ని రోజుల పాటు మాత్రమే క్రికెట్ ఆడతా. వాటిని ఎంజాయ్ చేస్తూ ఆడతా. వచ్చే డిసెంబర్లో ఆరంభమయ్యే బీబీఎల్‌లో కనిపించను' అని పీటర్సన్ పేర్కొనడం మొత్తంగా క్రికెట్‌కు గుడ్ బై చెప్పేందుకు తొలి అడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్ తరపున 2004లో వన్డేల్లో, 2005లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. సుమారు 10 సంవత్సరాల పాటు ఇంగ్లండ్‌కు ఆడిన పీటర్సన్ 104 టెస్టులు, 136 వన్డేలు ఆడాడు. 2014లో టెస్టు, 2013లో వన్డేలకు పీటర్సన్ వీడ్కోలు పలికాడు. ఆపై ప్రపంచ వ్యాప్తంగా పలు లీగ్‌లో ఆడుతున్న పీటర్సన్.. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనిగేడ్స్ తరపున ఆడుతున్నాడు. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రెనిగేడ్స్ విజయంలో పీటర్సన్ 40 పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్ తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పీటర్సన్.. వచ్చే బిగ్‌బాష్‌లో ఆడటం లేదని స్పష్టం చేశాడు. దాంతో మొత్తం క్రికెట్‌కు పీటర్సన్ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. -
మహిళల బిగ్‌బాష్‌లో హైడ్రామా
-
బెయిల్స్ పడగొట్టడం మరచిపోయారు!
గీలాంగ్: మహిళల బిగ్‌బాష్‌లో భాగంగా బుధవారం మెల్బోర్న్ రెనిగేడ్స్-సిడ్నీ సిక్సర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరి బంతికి రెనిగేడ్స్ వికెట్ కీపర్ ఎమ్మా ఇంగ్లిస్ బెయిల్స్ పడగొట్టడం మరచిపోయి గెలిచామన్న సంబరాల్లో మునిగిపోవడంతో హైడ్రామా నెలకొంది. వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన రెనిగేడ్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఆపై 121 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సిడ్నీ సిక్సర్స్ కడవరకూ పోరాడుతూ విజయం దిశగా దూసుకొచ్చింది. ఈ క్రమంలోనే చివరి బంతికి సిడ్నీ సిక్సర్ విజయానికి మూడు పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో క్రీజ్‌లో ఉన్న సిక్సర్స్ క్రీడాకారిణి షారా అలే ఫైన్ లెగ్ మీదుగా షాట్ కొట్టింది. ఆ తరుణంలోనే సిక్సర్స్ పరుగును పూర్తి చేసుకుని రెండో పరుగుకు సిద్దమైంది. కాగా, ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న క్రిస్ బ్రిట్ అందుకుని తమ కీపర్ ఎమ్మాకు వేగంగా విసిరడంతో రెనిగెడ్స్ విజయం దాదాపు ఖాయమైంది. అక్కడ వికెట్లను పడగొట్టడం మరిచిపోయిన ఎమ్మా .. గెలిచామన్న సంబరాల్లో మునిగిపోయింది. అయితే రెండో పరుగు కోసం అప్పటికే కాచుకుని కూచున్న సిడ్నీ సిక్సర్స్ క్రీడాకారిణులు దాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. దాంతో నివ్వెరపోవడం రెనిగెడ్స్ వంతైంది. ఆ బంతి డెడ్ అయ్యిందనే రెనిగెడ్స్ వాదనను అంపైర్ తిరస్కరించడంతో మ్యాచ్ టై అయ్యింది. అలా ఆ మ్యాచ్ 'సూపర్ ఓవర్'కు దారి తీసింది. దానిలో భాగంగా ఇరు జట్లు ఆడిన ఎలిమినేటర్ ఓవర్లో రెనిగెడ్స్ విజయం సాధించి ఊపిరిపీల్చుకుంది. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే మాత్రం కీపర్ చేసిన పొరపాటుకు రెనిగేడ్స్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది. -
డ్వేన్ బ్రేవో ప్రపంచ రికార్డు!
హోబార్ట్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. టీ 20 క్రికెట్లో 400 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కి సరికొత్త ప్రపంచ రికార్డు లిఖించాడు. ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో మెల్బోర్న్ రెనిగేడ్స్‌కు ఆడుతున్న బ్రావో.. హోబార్ట్ హరికేన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు సాధించాడు. ఫలితంగా టీ 20 క్రికెట్లో 400 వికెట్ల మైలురాయిని చేరుకున్న మొదటి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 365 టీ 20 మ్యాచ్‌ల్లో( అంతర్జాతీయ మ్యాచ్‌లు కలుపుకుని) బ్రేవో ఈ ఫీట్ సాధించాడు. బ్రేవో విజృంభణతో హరికేన్స్ 164 పరుగులకే పరిమితమైంది. ఆపై లక్ష్య ఛేదనలోరెనిగేడ్స్ 18.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. -
బీబీఎల్ లో మరో భారత క్రీడాకారిణి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో ఆడటానికి మరో భారత క్రీడాకారిణికి అవకాశం దక్కింది. ఇప్పటికే ఈ లీగ్ లో ఇద్దరు భారత క్రీడాకారుణులు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధన ఆడుతుండగా, తాజాగా ఇందులో ఆడేందుకు మరో భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తికి అవకాశం దక్కింది. బీబీఎల్ మహిళల మూడో ఎడిషన్ లో హోబార్ట్ హరికేన్స్ తరపున ఆడేందుకు వేదా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు వేద మాట్లాడుతూ.. బీబీఎల్ ఆడే అవకాశం వస్తుందని అనుకోలేదు. ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నెలరోజుల క్రితమే హరికేన్స్ యాజమాన్యంతో మాట్లాడా. ఆపై హర్మన్, మంధనాలతో చర్చించా. కాకపోతే అప్పటికి సఫారీల షెడ్యూల్ ఖరారు కాలేదు. దాంతో అప్పుడు వారితో ఏమీ చెప్పలేదు. మా దక్షిణాఫ్రికా పర్యటన ఫిబ్రవరిలో ఉండటంతో బీబీఎల్ ఆడేందుకు నాకు మార్గం సుగుమం అయ్యింది. దాంతో హరికేన్స్ నిర్వహకులతో మాట్లాడి ఒప్పందం చేసుకున్నా. ఆ జట్టుతో 10 మ్యాచ్ లతో మాత్రమే ఆడతా.ఈ విషయాన్ని వారితో చెప్పా. అందుకు హరికేన్స్ యాజమాన్యం ఒప్పుకుంది'అని వేద పేర్కొన్నారు. బీబీఎల్ లో సిడ్నీ థండర్స్ తరపున హర్మన్ ఆడుతుండగా, బ్రిస్బేన్ హీట్ కు మంధన ఆడుతున్న సంగతి తెలిసిందే. -
తొలి అఫ్గాన్ క్రికెటర్‌గా..
అడిలైడ్: అఫ్గానిస్తాన్ యువసంచలనం, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ కు మరో అరుదైన అవకాశం దక్కింది. ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు తరుపున ఈ యువ స్పిన్నర్ బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు తమతో రషీద్ ఖాన్ ఒప్పందం చేసుకున్న విషయాన్ని అడిలైడ్ స్ట్రైకర్స్ గురువారం వెల్లడించింది. తద్వారా బిగ్‌బాష్ లీగ్‌లో ఆడనున్న తొలి అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ గుర్తింపు పొందాడు. ఈ ఏడాది ఐపీఎల్-10లో సన్‌రైజర్స్ తరుపున అద్బుత ప్రదర్శన కనబర్చిన 18 ఏళ్ల రషీద్ ఖాన్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) లో సైతం రషీద్ ఖాన్ బరిలోకి దిగి అదరగొట్టాడు. అమెజాన్ వారియర్స్ తరుపున ఆడిన రషీద్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దాంతో బిగ్ బాష్ లీగ్ లో తీసుకునేందుకు అడిలైడ్ స్ట్రైకర్స్ ముందుకొచ్చింది. ఈ అవకాశం రావడంపై రషీద్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘బిగ్‌బాష్ లీగ్‌లో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో ఒప్పందం కుదుర్చోకోవడం, ఈ లీగ్‌లో తొలి అఫ్గాన్ గా బరిలోకి దిగడం నాలో అమితోత్సాహాన్ని ఇచ్చింది' అని రషీద్ తెలిపాడు. అడిలైడ్ స్ట్రైకర్స్ కోచ్ గా వ్యవహరిస్తున్న ఆసీస్ మాజీ క్రికెటర్ జాసన్ గిలెస్పీ ఈ యువకెరటాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అతని బౌలింగ్ లో ప్రత్యేకతే అతన్ని గొప్ప టీ20 క్రీడాకారుడిని చేసిందని కొడియాడారు. 29 అంతర్జాతీయ వన్డేలు ఆడిన రషీద్ 63 వికెట్లు తీశాడు. ఇటీవల కరేబియన్ టీ20లీగ్‌లో తొలి హ్యాట్రిక్ సాధించిన బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇక అంతర్జాతీయ వన్డేల్లో తనదైన ముద్ర వేసుకున్న రషీద్‌ఖాన్ వెస్టిండీస్ పర్యటనలో ప్రపంచ నాలుగో అత్యుత్తమ బౌలింగ్(7-18) గణంకాలు నమోదు చేశాడు. -
పీటర్సన్‌కు జరిమానా
మెల్బోర్న్:బిగ్‌బాష్ బాష్ లీగ్(బీబీఎల్)లో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఇంగ్లండ్ మాజీ ఆటగాడు, మెల్బోర్న్ స్టార్స్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ పై జరిమానా పడింది. గత వారం పెర్త్ స్కాచర్స్ -మెల్బోర్న్ స్టార్స్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. పెర్త్ స్కాచర్స్ ఆటగాడు సామ్ వైట్మన్ బ్యాటింగ్ చేసే సమయంలో బంతి బ్యాట్‌కు తాకి కీపర్ చేతుల్లోకి వెళ్లినట్లు కనబడింది. అయితే మెల్ బోర్న్ ఆటగాళ్ల అప్పీల్‌ను ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. కాగా, అదే సమయంలో మైక్రోఫోన్లో బీబీఎల్ వ్యాఖ్యాతలతో మాట్లాడుతున్న పీటర్సన్.. అంపైర్ నిర్ణయంపై ధ్వజమెత్తాడు. అది కచ్చింతగా తప్పుడు నిర్ణయమంటూ వేలెత్తి చూపాడు. ఆ బంతి గ్లౌవ్స్ కు తాకి ఉంటుందని అనుమానాన్ని వ్యక్తం చేశాడు. అంపైర్ నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో పీటర్సన్‌కు జరిమానా విధించారు. ఐసీసీ నిబంధనల్లోని లెవన్ -2ను పీటర్సన్ అతిక్రమించడంతో అతనిపై ఐదు వేల ఆస్ట్రేలియా డాలర్లను జరిమానా విధిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. -
నేనే తొలి వ్యక్తిని కావాలి: క్రిస్ గేల్
సెయింట్ ఆన్స్: క్రిస్ గేల్..విధ్వంసకర క్రికెటర్. ఫీల్డ్ లో దిగాడంటే అవతలి బౌలర్ ఎవరనేది చూడకుండా చెలరేగిపోవడమే ఇతనికి తెలిసిన విద్య. అయితే ప్రపంచ క్రికెట్ లో కొత్త చరిత్రను సృష్టించాలని అనుకుంటున్నట్లు ఈ విండీస్ డాషింగ్ క్రికెటర్ తాజాగా పేర్కొన్నాడు. తనకు 50 ఏళ్లు వచ్చే వరకూ క్రికెట్ ఆడటమే తన ప్రధాన లక్ష్యమన్నాడు. ఇలా యాభై ఏళ్లు వచ్చే వరకూ క్రికెట్ ఆడి తొలి వ్యక్తిని తానే కావాలంటూ గేల్ తన మనసులోని మాటను వెల్లడించాడు. ఒకవేళ ఈ లక్ష్యాన్ని చేరిన పక్షంలో క్రికెట్ ఫీల్డ్ లో తన యాక్షన్‌ను ఏదొక రోజు కూతురు చూసే అవకాశం ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. 2014 సెప్టెంబర్ నుంచి టెస్టు క్రికెట్ కు దూరమైన గేల్.. ట్వీ 20 ఫార్మాట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రపంచ ఓవరాల్ పొట్టి ఫార్మాట్లో గేల్ రికార్డు స్థాయిలో 9,777 పరుగులు చేసి తనదైన ముద్రను వేశాడు. ఇదిలా ఉంచితే, గతేడాది బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)కు సంబంధించి తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని మెల్బోర్న్ రెన్గేడ్స్ ప్రాంఛైజీ ఎగవేసిందంటూ గేల్ ధ్వజమెత్తాడు. తాను ఒక కరీబియన్ క్రికెటర్‌ను కావడం వల్లే తనకు రావాల్సిన సొమ్మును ఇవ్వలేదని విమర్శించాడు. మిగతా క్రికెటర్లకు మొత్తాన్ని చెల్లించిన ప్రాంఛైజీ.. తన విషయంలో ఎందుకు వివక్ష చూపిస్తుందంటూ ప్రశ్నించాడు. వ్యాఖ్యాతలకు సైతం డబ్బులు చెల్లించిన బీబీఎల్ యాజమాన్యం.. తనకు రావాల్సిన సొమ్ము విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తుందంటూ నిలదీశాడు. తనకు డబ్బు ఎగవేసిన అపవాదను వారు మూట గట్టుకోరనే ఇంకా ఆశిస్తున్నట్లు గేల్ ట్వీట్లలో పేర్కొన్నాడు. గతేడాది ఏడాది జనవరిలో జరిగిన బిగ్ బాష్ లీగ్ సందర్భంగా ఓ టీవీ జర్నలిస్టుతో గేల్ అసభ్యకరంగా ప్రవర్తించిన గేల్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు. బీబీఎల్ నుంచి గేల్ ను తప్పించడమే కాకుండా, అతనిపై భారీ జరిమానా కూడా విధించారు. -
ధోనిని అనుకరించాడు!
-
ధోనిని అనుకరించాడు!
న్యూఢిల్లీ:గతేడాది అక్టోబర్‌లో మహేంద్ర సింగ్ ధోని చేసిన రనౌట్ మ్యాజిక్ అందరికీ గుర్తుండే ఉంటుంది. న్యూజిలాండ్‌తో సిరీస్ లో రాంచీలో జరిగిన నాల్గో వన్డేలో ఆ దేశ స్టార్ ఆటగాడు రాస్ టేలర్‌ను ధోని చేసిన రనౌట్ మ్యాచ్‌కే హైలెట్ అయ్యింది. ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న ధోని.. వికెట్ల వైపు చూడకుండానే బంతిని విసిరి టేలర్‌ను అవుట్ చేశాడు. ఉమేశ్ వేసిన ఇన్నింగ్స్ 46వ ఓవర్లో ఫైన్‌లెగ్ దిశగా ఆడిన టేలర్ వేగంగా సింగిల్ పూర్తి చేసుకొని రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ఈ సమయంలో ధావల్ విసిరిన త్రో కోసం ధోని ముందుకు దూసుకొచ్చాడు. బౌన్స్ అయి వచ్చిన బంతిని అందుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండానే అదే వేగంతో రెప్పపాటులో వికెట్లపైకి విసిరేశాడు ధోనీ. ఆ బంతి వికెట్లకు తగలడం టేలర్ రనౌట్ కావడం చకచకా జరిగిపోయాయి. అయితే అదే తరహా అవుట్ కోసం ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ తాజాగా యత్నించినా సక్సెస్ అయితే కాలేదు. పురుషుల బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు ఆటగాడ్ని రనౌట్ చేయడానికి ధోని తరహాలోనే హాడిన్ ప్రయత్నించాడు. అయితే ఆ బంతి వికెట్లను తగిలే సరికి బ్యాట్స్ మన్ క్రీజ్‌లోకి వచ్చేశాడు. దీనిపై బీబీఎల్ ఒక వీడియోను పోస్ట్ చేసింది. వికెట్ల వెనుక నుంచి గతంలో ఎంఎస్ ధోని చేసిన మ్యాజిక్‌ను హాడిన్ టచ్ చేసే యత్నం చేశాడని బీబీఎల్ తన ట్వీట్లో పేర్కొంది. -
బ్లాక్ బ్యాట్‌పై నిషేధం!
సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో బ్లాక్ కలర్ బ్యాట్ పై నిషేధం విధించారు. ఆటగాళ్ల డ్రెస్ కోడ్ ను బట్టి బ్యాట్ కలర్ కూడా ఉండవచ్చని తొలుత పేర్కొన్న క్రికెట్ ఆస్ట్రేలియా.. దానిపై నిర్ణయాన్ని మార్చుకుంటూ నిషేధం విధించింది. పురుషుల బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ఆరంభపు మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ తరపున విండీస్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ బ్లాక్ బ్యాట్‌తో బరిలోకి దిగాడు. అయితే బ్లాక్ బ్యాట్ వాడకం వల్ల బంతి కలర్ దెబ్బతింటుందని మ్యాచ్ అధికారులు నివేదిక అందజేశారు. దాంతో బిగ్ బాష్ లీగ్‌లో బ్లాక్ బ్యాట్‌ను నిషేధం విధిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బిగ్ బాష్ లీగ్ లో బ్లాక్ బ్యాట్ వాడరాదంటూ నిబంధనలను విధించింది. 'మేము బ్లాక్ బ్యాట్ పై నిషేధం విధిస్తున్నాం. బ్లాక్ బ్యాట్ వాడటానికి ఎటువంటి ఇబ్బంది లేదని తొలుత చెప్పినా, బంతిపై నల్లని మరకలు పడుతూ ఉండటంతో ముందస్తు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం. అది బీబీఎల్ కావొచ్చు.. డబ్యూబీబీఎల్ కావొచ్చు.. ఆటగాడు రస్సెల్ కావొచ్చు.. మరెవరైనా కావొచ్చు..బ్లాక్ బ్యాట్ పై నిషేధం విధిస్తున్నాం'అని సీఏ పేర్కొంది. గత బీబీఎల్ సీజన్లో క్రిస్ గేల్ బంగారు పూత కల్గిన బ్యాట్‌ను వాడిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు గేల్ బ్యాట్ ను తయారు చేసిన స్పార్టాన్ కంపెనీ.. ఇప్పుడు రస్సెల్ కు బ్లాక్ బ్యాట్‌ను తయారు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా, గత ఈసీబీ నిర్వహించిన లీగ్ లో కూడా ఈ తరహా పరిణామమే చోటు చేసుకుంది. అసర్ జైదీ వాడిన స్ప్రే పెయింట్ బ్యాట్‌పై ఈసీబీ నిషేధం విధించింది. -
మరోసారి చెలరేగిన హర్మన్ ప్రీత్
ఆల్బరీ: ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్(డబ్యూబీబీఎల్)లో భారత క్రికెట్ క్రీడాకారిణి హర్మన్ ప్రీత్ కౌర్ తన దూకుడును కొనసాగిస్తోంది. బీబీఎల్ సిడ్నీ థండర్ తరపున బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్... వరుసగా రెండో మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకుంది. తాజాగా మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన టీ 20మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో 30 పరుగులతో అజేయంగా నిలిచి థండర్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. మెల్బోర్న్ స్టార్స్ నిర్దేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో థండర్స్ రెండు వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ థండర్ జట్టులో హర్మన్ ప్రీత్‌కు తోడు హైనెస్(35), స్టెఫానీ టేలర్(29), బ్లాక్ వెల్(21)లు రాణించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మెల్ బోర్న్ స్టార్స్‌ను హర్మన్ ప్రీత్ చావుదెబ్బ కొట్టింది. నాలుగు ఓవర్లలో 27 పరుగులిచ్చి నాలుగు వికెట్లతో మెల్ బోర్న్ స్టార్స్ మహిళల పతనాన్ని శాసించింది. హర్మన్ ప్రీత్ విజృంభణతో మెల్బోర్న్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 116 పరుగులకే పరిమితమైంది. ఇదిలా ఉండగా, ఇరు జట్లు మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.ఆ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ 47 పరుగులతో రాణించింది. -
ఆ సిక్స్ ఎప్పటికీ నిలిచే ఉంటుంది:గిల్ క్రిస్ట్
-
ఆ సిక్స్ ఎప్పటికీ నిలిచే ఉంటుంది:గిల్ క్రిస్ట్
సిడ్నీ: మనకు ఆడమ్ గిల్ క్రిస్ట్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సిక్సర్లను అతి సునాయసంగా కొట్టగలిగే క్రికెటర్లలో గిల్ క్రిస్ట్ ఒకడు. ఈ ఆసీస్ దిగ్గజాన్ని భారత ట్వంటీ 20 మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కొట్టిన సిక్స్ ఎంతగానో ఆకట్టుకుందట. శనివారం ఆరంభమైన మహిళల బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా సిడ్నీ థండర్స్ తరపున బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్(47 నాటౌట్;28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించింది. బీబీఎల్ లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే హర్మన్ అలరించింది. అయితే ఇక్కడ హర్మన్ కొట్టిన మూడు సిక్సర్లలో ఒక సిక్సర్‌ను మాత్రం గిల్ క్రిస్ట్ ప్రత్యేకంగా అభినందించాడు. ఆ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా ఉన్న గిల్లీ.. అది కచ్చితమైన క్రికెట్ షాట్ అంటూ కొనియాడాడు. ఆ షాట్ క్రికెట్లో ఎప్పటికీ నిలిచే ఉంటుందంటూ ప్రశంసించాడు. ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసి మెల్బోర్న్ స్టార్స్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 141 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిచింది మాత్రం హర్మన్ ప్రీత్ కౌరే కావడం విశేషం. హర్మన్ కొట్టిన సిక్సర్‌ను డబ్యూబీబీఎల్(మహిళల బిగ్ బాష్ లీగ్) యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
బీబీఎల్‌లో మరో భారత క్రీడాకారిణి
ముంబై:ఆస్ట్టేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో ఆడటానికి భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతీ మందనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు తమతో స్మృతీ ఒప్పందం చేసుకున్నట్లు ఫ్రాంచైజీ బ్రిస్బేన్ హీట్ మంగళవారం వెల్లడించింది. తాజా ఒప్పందంతో బిగ్ బాష్ లీగ్‌లో ఆడే రెండో భారత క్రీడాకారిణిగా స్మృతీ నిలిచింది. అంతకముందు భారత వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సిడ్నీ థండర్‌తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఇది ఈ సీజన్ లో బ్రిస్బేన్ హీట్ చేసుకున్న రెండో విదేశీ ఒప్పందం. వెస్టిండీస్ మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ దేవేంద్ర డాటిన్ ఈ ఫ్రాంచైజీతో ఆడటానికి తొలుత ఒప్పందం చేసుకుంది. తన తాజా బీబీఎల్ ఒప్పందంపై స్మృతీ ఆనందం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా అమ్మాయిలతో కలిసి ఆడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. తమ ప్రిపరేషన్‌కు, అక్కడ ఆస్ట్రేలియా జట్టు ప్రిపరేషన్‌కు చాలా వ్యత్యాసం ఉందని స్మృతీ పేర్కొంది. దీనివల్ల మరింత నేర్చుకునే ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడింది. ఇంగ్లండ్(మహిళల సూపర్ లీగ్), ఆస్ట్రేలియా(మహిళల బిగ్ బాష్ లీగ్)లలో నిర్వహించే లీగ్‌లో భారత స్టార్ మహిళా క్రికెటర్లు ఆడేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) గత జూన్ లో అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు భారతీయ మహిళా క్రికెటర్లకు ఆర్థికంగా మరింత లాభం చేకూరనుంది. -
బీబీఎల్ లో మిచెల్ అరంగేట్రం!
పెర్త్: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ తొలిసారి బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో అరంగేట్రానికి రంగం సిద్దం చేసుకున్నాడు. ఈ మేరకు 2016-17 సీజన్ లో భాగంగా పెర్త్ స్కార్చర్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పటివరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడిన జాన్సన్.. వచ్చే బిగ్ బాష్ లీగ్ లో తొలిసారి రంగ ప్రవేశం చేయబోతున్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న అనంతరం బిగ్ బాష్ లో ఆడే అవకాశాన్ని వదులుకున్నాడు. ఆ సమయంలో కుటుంబానికి చేరువుగా ఉండాలని భావించిన మిచెల్.. బిగ్ బాష్ లో ఆడేందుకు నిరాకరించాడు. తాను ఎప్పుడూ క్రికెట్ కు మరింత చేరువగా ఉండటానికే ఇష్టపడతానని తెలిపిన జాన్సన్.. ఈ లీగ్ ఆడటానికి ఆతృతగా ఉన్నట్లు పేర్కొన్నాడు. స్వదేశంలో జరిగే బిగ్ బాష్ లీగ్ కు విశేష ఆదరణ తో దూసుకుపోతుందన్నాడు. కొంతమంది ప్రేరణతోనే బీబీఎల్ ఆడటానికి సిద్దమైనట్లు మిచెల్ తెలిపాడు. తాను జట్టుతో పాటు ఉంటూ యువ క్రికెటర్లకు బౌలింగ్ విభాగంలో మెంటర్ గా సేవలందించడానికి సిద్ధమైనట్లు మిచెల్ తెలిపాడు. తాను బౌలింగ్ కోచింగ్ బాధ్యతలు కూడా తీసుకోవడంతో ఆటపై ఎక్కువ దృష్టి నిలిపాల్సిన అవసరం ఉందన్నాడు. -
పరుగెత్తకపోతే... ఆటెందుకు!
బీబీఎల్‌లో గేల్‌పై విమర్శల వర్షం సిడ్నీ: మహిళా కామెంటేటర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన విండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌పై మరో దుమారం చెలరేగింది. బిగ్ బాష్ లీగ్‌లో అతని ఆటతీరుపై మాజీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోమవారం రాత్రి సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సహచరుడు టామ్ కూపర్ ఓ సింగిల్ కోసం గేల్‌ను పిలిచాడు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా సులువుగా పూర్తి చేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ విండీస్ బ్యాట్స్‌మన్ పరుగు తీసేందుకు నిరాకరించాడు. అంతే కామెంట్రీలో ఉన్న మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్... గేల్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఏ జట్టైనా గెలవడాని, ఓడటానికి కావాల్సింది ఒక్క పరుగేనంటూ ధ్వజమెత్తారు. ‘గేల్ ప్రవర్తనను నమ్మలేకపోతున్నాం. అతని తీరు చాలా ఘోరంగా ఉంది. ఇలాంటి తీరును క్రికెట్లో ఎప్పుడూ చూడలేదు’ అంటూ రికీ విమర్శించాడు. ఇదంతా ఓవైపు జరుగుతుంటే మైదానంలో తర్వాతి బంతికే గేల్... ఫవాద్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అంతే పాంటింగ్ తన మాటలకు మరింత పదును పెంచాడు. మ్యాచ్ తర్వాత కూడా ఈ విషయంపై మాట్లాడేందుకు గేల్ నిరాకరించడంతో మాజీలు మాటల యుద్ధం మొదలుపెట్టారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో గేల్ జట్టు మెల్బోర్న్ రెనెగడెస్ ఐదు వికెట్ల తేడాతో గెలవడం విశేషం. -
క్రిస్ గేల్ కు జరిమానా
హొబర్ట్(ఆస్టేలియా): మహిళా టీవీ ప్రజెంటర్ మెల్ మెక్ లాలిన్ తో అసభ్యంగా మాట్లాడినందుకు వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ కు జరిమానా విధించారు. 10 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల(సుమారు 4 లక్షల 75 వేల రూపాయలు) జరిమానా వేశారు. ఈ మొత్తం రొమ్ము కేన్సర్ బాధితులకు సహాయం అందిస్తున్న మెక్ గ్రాత్ ఫౌండేషన్ కు వెళుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) వెబ్ సైట్ వెల్లడించింది. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) సందర్భంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(ఎస్ సీజీ)లో సోమవారం మహిళా ప్రజెంటర్ తో గేల్ అనుచితంగా ప్రవర్తించాడు. 'నేను ఇక్కడికి వచ్చింది నీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికే. నీ కళ్లు అందంగా ఉన్నాయి. సిగ్గుపడకు బేబీ. మ్యాచ్ గెలిచాం. ఇక మనం బయటకు పోదా'మని మెల్ మెక్ లాలిన్ తో గేల్ అసభ్యంగా మాట్లాడాడు. గేల్ వ్యాఖ్యలను బిగ్ బాష్ లీగ్ ఆర్గనైజేషన్ తీవ్రంగా పరిగణించింది. దీంతో అతడు క్షమాపణ చెప్పాడు.