హోబార్ట్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. టీ 20 క్రికెట్‌లో 400 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కి సరికొత్త ప్రపంచ రికార్డు లిఖించాడు. ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో మెల్‌బోర్న్ రెనిగేడ్స్‌కు ఆడుతున్న బ్రావో.. హోబార్ట్ హరికేన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు సాధించాడు. ఫలితంగా టీ 20 క్రికెట్‌లో 400 వికెట్ల మైలురాయిని చేరుకున్న మొదటి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
365 టీ 20 మ్యాచ్‌ల్లో( అంతర్జాతీయ మ్యాచ్‌లు కలుపుకుని) బ్రేవో ఈ ఫీట్ సాధించాడు. బ్రేవో విజృంభణతో హరికేన్స్ 164 పరుగులకే పరిమితమైంది. ఆపై లక్ష్య ఛేదనలోరెనిగేడ్స్ 18.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment