బీబీఎల్లో మరో భారత క్రీడాకారిణి | Smriti Mandhana agrees to play Brisbane Heat for Women's BBL | Sakshi
Sakshi News home page

బీబీఎల్లో మరో భారత క్రీడాకారిణి

Published Tue, Sep 27 2016 3:05 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

బీబీఎల్లో మరో భారత క్రీడాకారిణి

బీబీఎల్లో మరో భారత క్రీడాకారిణి

ముంబై:ఆస్ట్టేలియాలో జరిగే బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో ఆడటానికి  భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్  స్మృతీ మందనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు తమతో స్మృతీ ఒప్పందం చేసుకున్నట్లు ఫ్రాంచైజీ బ్రిస్బేన్ హీట్ మంగళవారం వెల్లడించింది. తాజా ఒప్పందంతో బిగ్ బాష్ లీగ్లో ఆడే రెండో భారత క్రీడాకారిణిగా స్మృతీ నిలిచింది. అంతకముందు  భారత వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్  సిడ్నీ థండర్తో  ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఇది ఈ సీజన్ లో బ్రిస్బేన్ హీట్ చేసుకున్న రెండో విదేశీ ఒప్పందం. వెస్టిండీస్ మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ దేవేంద్ర డాటిన్ ఈ ఫ్రాంచైజీతో ఆడటానికి తొలుత ఒప్పందం చేసుకుంది.


తన తాజా బీబీఎల్ ఒప్పందంపై స్మృతీ ఆనందం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా అమ్మాయిలతో కలిసి ఆడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. తమ ప్రిపరేషన్కు, అక్కడ ఆస్ట్రేలియా జట్టు ప్రిపరేషన్కు చాలా వ్యత్యాసం ఉందని స్మృతీ పేర్కొంది. దీనివల్ల మరింత నేర్చుకునే ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడింది.


ఇంగ్లండ్(మహిళల సూపర్ లీగ్), ఆస్ట్రేలియా(మహిళల బిగ్ బాష్ లీగ్)లలో నిర్వహించే లీగ్లో  భారత స్టార్ మహిళా క్రికెటర్లు ఆడేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) గత జూన్ లో అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు భారతీయ మహిళా క్రికెటర్లకు ఆర్థికంగా మరింత లాభం చేకూరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement