వెస్టిండీస్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు మరో స్వదేశీ పోరుకు సిద్దమైంది.ఐర్లాండ్ మహిళల జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడేందుకు భారత్ సిద్దమైంది. జనవరి 10న రాజ్‌కోట్ వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో ఐరీష్‌తో వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌కు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కెప్టెన్‌గా ఎంపికైంది. అదే విధంగా మరో సీనియర్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ కూడా ఈ వన్డే సిరీస్‌కు దూరమైంది.
కాగా మరోసారి స్టార్ ప్లేయర్ షెఫాలీ వర్మకు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. షెఫాలీ వర్మ ప్రస్తుతం దేశీవాళీ క్రికెట్‌లో దుమ్ము లేపుతున్నప్పటికి సెలక్టర్లు పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. కాగా విండీస్‌తో సిరీస్‌లో ఆడిన ప్రియా మిశ్రా, తనూజా కన్వర్, టైటాస్ సాధు , సైమా ఠాకోర్‌లు.. ఐరీష్ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో కూడా చోటు దక్కించుకున్నారు.
ఐర్లాండ్ సిరీస్‌కు భారత మహిళల జట్టు ఇదే: స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, రాఘవి బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజా కన్వర్, టైటాస్ సాధు , సైమా ఠాకోర్, సయాలీ సత్ఘరే
Comments
Please login to add a commentAdd a comment