పెర్త్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్-10)లో భాగంగా బుధవారం పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పెర్త్ స్కార్చర్స్ కెప్టెన్ ఆస్టన్ టర్నర్ కొట్టిన ఒక షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెర్త్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను జేక్ బాల్ వేశాడు. క్రీజులో మిచెల్ మార్ష్, ఆస్టన్ టర్నర్‌లు ఉన్నారు. బాల్ వేసిన మొదటి బంతిని ఆస్టన్ టర్నర్ ఫైన్‌లెగ్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కింద పడ్డాడు.. కానీ అప్పటికే బంతి బ్యాట్‌కు సరైన దిశలో తగలడంతో వేగంగా బౌండరీ లైన్‌ను దాటేసింది. (చదవండి: సిక్స్ కొడితే బీర్ మగ్‌లో పడింది..!)
ఇలాంటి షాట్లను దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఎక్కువగా ఆడుతుంటాడు. ఆస్టన్ టర్నర్ ధరించిన జెర్సీ నెంబర్ 17.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్ జెర్సీ నెంబర్ కూడా 17 కావడం ఇక్కడ యాదృశ్చికం. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్‌లో షేర్ చేసింది. ఆస్టన్ ఆడిన షాట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. 'పడితే పడ్డాడు కాని షాట్ మాత్రం సూపర్‌గా ఆడాడు.. ఏబీ డివిలియర్స్ జెర్సీని ధరించాడే కాబట్టే అలాంటి షాట్లు ఆడాడు.. టర్నర్‌కు డివిలియర్స్ గుర్తుచ్చాడేమో.. ఒక్కసారి టర్నర్ ధరించిన జెర్సీ నెంబర్ చూడండంటూ ' వినూత్న రీతిలో కామెంట్లు పెట్టారు.(చదవండి: 'ఛీ.. స్కూల్ లెవల్ కన్నా దారుణం')
కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కొలిన్ మున్రో 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ 16.4 ఓవర్లలోనే 97 పరుగులకే ఆలౌటైంది. జాక్ ఎడ్‌వర్డ్స్ 44 పరుగులు మినహా ఏ ఒక్కరు ఆకట్టుకోలేకపోయారు. పెర్త్ స్కార్చర్స్ బౌలర్లలో అండ్రూ టై 4 వికెట్లు తీయగా.. జై రిచర్డ్సన్ 3 వికెట్లు తీశాడు.
How on earth did Ashton Turner do that!? #BBL10 pic.twitter.com/juU0uXH5MW
— cricket.com.au (@cricketcomau) January 6, 2021
Comments
Please login to add a commentAdd a comment