BBL 2020-21 Final: Big Bash League10 Winner Sydney Sixers‌ - Sakshi
Sakshi News home page

సిడ్నీ సిక్సర్స్‌దే బిగ్‌బాష్‌ టైటిల్‌

Published Sun, Feb 7 2021 2:24 AM | Last Updated on Sun, Feb 7 2021 2:24 AM

Sydney Sixers Won BBL10 Title Against Perth Scorchers In Final Match - Sakshi

సిడ్నీ: వరుసగా రెండో ఏడాది సిడ్నీ సిక్సర్స్‌ జట్టు బిగ్‌బాష్‌ టి20 టోర్నమెంట్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్‌ జట్టు 27 పరుగుల ఆధిక్యంతో పెర్త్‌ స్కార్చర్స్‌ జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన డిఫెండింగ్‌ చాంపియన్‌ సిడ్నీ సిక్సర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. ఓపెనర్‌ జేమ్స్‌ విన్స్‌ (60 బంతుల్లో 95; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఐదు పరుగుల తేడాలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు.

189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్‌ స్కార్చర్స్‌ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్లు బాన్‌క్రాఫ్ట్‌ (30; 4 ఫోర్లు, సిక్స్‌), లివింగ్‌స్టోన్‌ (45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) శుభారంభం అందించినా... ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ తడబడటంతో పెర్త్‌ విజయానికి దూరమైంది. సిడ్నీ బౌలర్లలో బెన్‌ డ్వార్‌షుస్‌ మూడు వికెట్లు తీయగా... జాక్సన్‌ బర్డ్, సీన్‌ అబాట్, క్రిస్టియన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. 

చదవండి: 
దేవుడా.. పెద్ద గండం తప్పింది
సిరాజ్‌, కుల్దీప్‌ల గొడవ.. నిజమెంత!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement