Big Bash League 2021-22 Final: Perth Scorchers Defeated Sydney Sixers by 79 Runs - Sakshi
Sakshi News home page

BBL 2021-22: సిడ్నీ సిక్సర్స్‌కు ఘోర పరాభవం.. బిగ్‌బాష్‌ లీగ్‌ విజేత పెర్త్‌ స్కార్చర్స్‌

Published Fri, Jan 28 2022 5:50 PM | Last Updated on Fri, Jan 28 2022 7:20 PM

Perth Scorchers Beat Sydney Sixers 79 Runs Clinch 4th BBL Title - Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌ 11) సీజన్‌ విజేతగా పెర్త్‌ స్కార్చర్స్‌ నిలిచింది. సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఫైనల్లో పెర్త్‌ స్కార్చర్స్‌ 79 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పెర్త్‌ స్కార్చర్స్‌ బీబీఎల్‌ టైటిల్‌ గెలవడం  నాలుగోసారి కాగా.. సిడ్నీ సిక్సర్స్‌ను ఫైనల్లో ఓడించడం ఇది మూడోసారి.76 పరుగులు నాటౌట్‌తో సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడిన  పెర్త్‌ స్కార్చర్స్‌ బ్యాట్స్‌మన్‌ లారీ ఇవాన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: Beth Mooney: దవడ విరిగింది.. ముఖానికి సర్జరీ.. పడిలేచిన కెరటం

మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన పెర్త్‌ స్కార్చర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లారీ ఇవాన్స్(41 బంతుల్లో 76, 4 ఫోర్లు; 4 సిక్సర్లు), ఆస్టన్‌ టర్నర్‌(35 బంతుల్లో 54, 4 ఫోర్లు, ఒక సిక్స్‌) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌ 16.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. డేనియల్‌ హ్యూజెస్‌ 42 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పెర్త్‌ స్కార్చర్స్‌ బౌలర్లలో ఆండ్రూ టై 3, జై రిచర్డ్‌సన్‌ 2, జాసన్‌ బెండార్ఫ్‌, ఆస్టన్‌ టర్నర్‌, పీటర్‌ హట్‌జోగ్లో, ఆస్టన్‌ అగర్‌ తలా ఒక వికట్‌ తీశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement