
బిగ్‌బాష్ లీగ్ 11వ సీజన్ విజేతగా పెర్త్ స్కార్చర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఫైనల్లో 79 పరుగుల తేడాతో విజయం అందుకున్న పెర్త్ స్కార్చర్స్ నాలుగోసారి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన జై రిచర్డ్‌సన్ ఒక వింత అనుభవం ఎదురైంది. విజయంలో భాగంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో రిచర్డ్‌సన్‌ను ఇంటర్య్వూ చేసిన బ్రాడ్ హగ్ ఏమైంది అని అడిగాడు.
చదవండి: Daniil Medvedev: అంపైర్‌ను బూతులు తిట్టిన స్టార్ టెన్నిస్ ప్లేయర్
''మ్యాచ్ విజయం తర్వాత సంబరాలు చేసుకుంటున్న సమయంలో స్క్వేర్‌లెగ్ దిశ నుంచి ఎవరో వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. అతని భుజం నా ముక్కుకు బలంగా తాకింది. దీంతో నా ముక్కు నుంచి రక్తం కారడం మొదలైంది. ఇది ఒకరకంగా నాకు ఒక మొమోరీగా ఉండిపోతుంది.'' అని రిచర్డ్‌సన్ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
When celebrations go wrong, featuring Jhye Richardson 😂 pic.twitter.com/xAkvP59fqy
— 7Cricket (@7Cricket) January 28, 2022