Jhye Richardson
-
ముంబై ఇండియన్స్‌లోకి ఆస్ట్రేలియా స్టార్ బౌలర్.. ఎవరంటే?
ఐపీఎల్-2023కు ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జో రిచర్డ్సన్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న రిచర్డ్సన్ .. పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో ఈ మెగాటోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇక ఈ ఏడాది సీజన్‌కు దూరమైన రిచర్డ్సన్ స్థానంలో మరో ఆసీస్ పేసర్ రిలే మెరెడిత్‌ను ముంబై భర్తీ చేసింది. కనీస ధర రూ.1.5 కోట్లకు మెరెడిత్‌తో ముంబై ఇండియన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా తరపున కేవలం 5 టీ20 మ్యాచ్‌లు ఆడిన మెరెడిత్.. 8 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక మూడు వికెట్ల హాల్ కూడా ఉంది. ఇక అతడికి ఐపీఎల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. మెరిడిత్ 2021లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. గత రెండు సీజన్ల పాటు ముంబైకే ప్రాతినిథ్యం వహించిన అతడిని.. ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు ఆ ప్రాంఛైజీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇక ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు మెరెడిత్ 12 వికెట్లు పడగొట్టాడు. ఇక ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్8న సీఎస్కేతో తలపడనుంది. చదవండి: IPL 2023: సునీల్ నరైన్ మ్యాజిక్ .. దెబ్బకు కోహ్లి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్ -
IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!
IPL 2023- Mumbai Indians: ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జై రిచర్డ్సన్ గాయం కారణంగా ఈ సీజన్ ఐపీఎల్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతను శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇప్పటికే రిచర్డ్సన్ భారత్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. 2023 సీజన్లో అతను ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాల్సింది. కాగా ఇప్పటికే ముంబై ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండే అంశంపై సందేహం నెలకొనగా.. ఇపుడు రిచర్డ్సన్ రూపంలో మరో పేసర్ సేవలను కోల్పోయింది. దీంతో ఐపీఎల్-2023 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాగా గతేడాది ఐపీఎల్లో రిచర్డ్సన్ పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. రిచర్డ్సన్ 36 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే టీమిండియాతో వన్డే సిరీస్‌కు దూరమైన రిచర్డ్సన్.. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నాటికి కూడా అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దం నెలకొంది. చదవండి: దక్షిణాఫ్రికా ఘన విజయం -
ముంబై ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం! బుమ్రాతో పాటు
ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరం కాగా.. తాజాగా ఆస్ట్రేలియా పేసర్ జో రిచర్డసన్ అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొంది. జే రిచర్డ్సన్ గత కొన్ని రోజులుగా మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. అతడు ఇంకా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు భారత్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ప్రకటించింది. అతడి స్థానంలో నాథన్ ఎల్లీస్కి క్రికెట్ ఆస్ట్రేలియా అవకాశం కల్పించింది. ఒక వేళ ఈ ఏడాది సీజన్‌కు రిచర్డసన్ కూడా దూరమైతే ముంబై బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా తయారవుతోంది. ఇక ఏడాది సీజన్లో ముంబై.. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పైనే ఆశలు పెట్టుకుంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అనుమతులు ఇవ్వడంతో జోఫ్రా ఆర్చర్, ఐపీఎల్ 2023 సీజన్ ఆడబోతున్నాడు. చదవండి: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. వన్డే జట్టుకు ఎంపికైన స్టార్ బౌలర్ జై రిచర్డ్సన్.. హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ (పిక్కకు సంబంధించిన గాయం) కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. రిచర్డ్సన్ స్థానాన్ని నాథన్ ఇల్లీస్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ అస్ట్రేలియా ఇవాళ (మార్చి 6) అధికారికంగా ప్రకటించింది. బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా గాయపడిన రిచర్డ్సన్.. తాజాగా ఓ లోకల్ మ్యాచ్ అడుతుండగా మరోసారి గాయపడటంతో భారత్‌లో పర్యటించే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. ఒకవేళ రిచర్డ్సన్ గాయం తీవ్రత అధికంగా అతను ఐపీఎల్-2023 నుంచి కూడా నిష్క్రమించాల్సి వస్తుంది. ఈ సీజన్లో రిచర్డ్సన్ ముంబై ఇండియన్స్‌కు పాత్రినిధ్యం వహించాల్సి ఉంది. మార్చి 17, 19, 22 తేదీల్లో భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన 16 మంది సభ్యుల ఆసీస్ బృందంలో రిచర్డ్సస్ ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో నాలుగో టెస్ట్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసీస్-టీమిండియా వన్డే సిరీస్ ఆడనున్నాయి. మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం తొలి వన్డే ముంబైలో, రెండో వన్డే విశాఖలో, మూడో వన్డే చెన్నైలో జరుగుతుంది. కాగా, ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌లో టీమిండియా విజయం సాధిస్తే.. 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు కూడా అర్హత సాధిస్తుంది. -
మ్యాచ్ గెలిచిన ఆనందం.. ముక్కులో నుంచి రక్తం
బిగ్‌బాష్ లీగ్ 11వ సీజన్ విజేతగా పెర్త్ స్కార్చర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఫైనల్లో 79 పరుగుల తేడాతో విజయం అందుకున్న పెర్త్ స్కార్చర్స్ నాలుగోసారి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన జై రిచర్డ్సన్ ఒక వింత అనుభవం ఎదురైంది. విజయంలో భాగంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో రిచర్డ్సన్ను ఇంటర్య్వూ చేసిన బ్రాడ్ హగ్ ఏమైంది అని అడిగాడు. చదవండి: Daniil Medvedev: అంపైర్‌ను బూతులు తిట్టిన స్టార్ టెన్నిస్ ప్లేయర్ ''మ్యాచ్ విజయం తర్వాత సంబరాలు చేసుకుంటున్న సమయంలో స్క్వేర్‌లెగ్ దిశ నుంచి ఎవరో వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. అతని భుజం నా ముక్కుకు బలంగా తాకింది. దీంతో నా ముక్కు నుంచి రక్తం కారడం మొదలైంది. ఇది ఒకరకంగా నాకు ఒక మొమోరీగా ఉండిపోతుంది.'' అని రిచర్డ్సన్ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. When celebrations go wrong, featuring Jhye Richardson 😂 pic.twitter.com/xAkvP59fqy — 7Cricket (@7Cricket) January 28, 2022 -
Ashes 2nd Test: రిచర్డ్సన్ పాంచ్ పటాకా.. ఇంగ్లండ్ ఘోర పరాజయం
Jhye Richardson Maiden Five Wicket Haul: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిధ్య ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆసీస్ పేసర్ జై రిచర్డ్సన్(5/42) కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన రిచర్డ్సన్ రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయి బర్న్స్(34), హమీద్(0), బట్లర్(26), క్రిస్ వోక్స్(44), ఆండర్సన్(2) వికెట్లు సాధించాడు. ఫలితంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే కుప్పకూలింది. 82/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. రిచర్డ్సన్, మిచెల్ స్కార్క్(2/43), నాథన్ లయన్(2/55), మైఖేల్ నెసర్(1/28) ధాటికి 192 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ(103), రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ(51) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మార్నస్ లబుషేన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 473/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా, ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 230/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసి 468 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. ఛేదనలో ఇంగ్లండ్192 పరుగులకే కుప్పకూలి చిత్తుగా ఓడింది. చదవండి: పిచ్‌ను చూసి షాక్‌కు గురైన శ్రేయాస్.. ప్రాక్టీస్‌లో నిమగ్నం కావాలన్న ద్రవిడ్ -
IPL 2021: పంజాబ్ కింగ్స్‌లోకి ఆసీస్ యువ పేసర్
ముంబై: ఐపీఎల్ 14 సెకండ్ హాఫ్ కోసం అన్ని జట్లు సన్నద్దం అవుతున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న మిగతా మ్యాచ్‌లకు చెన్నై సూపర్ కింగ్స్ ఇదివరకే యూఏఈకి చేరుకోగా, శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ అక్కడ అడుగు పెట్టనుంది. అయితే యూఏఈ వేదికగా జరుగునున్న ఐపీఎల్ రెండో దశ కు దాదాపు అన్ని జట్టలకు కీలకమైన వీదేశీ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా క్రికెటర్లు జై రిచర్డ్సన్, రిలే మెరిడిత్ ఐపీఎల్ 14 మిగతా సీజన్ కు అందుబాటులో ఉండటం లేదని తమ నిర్ణయాన్ని ప్రకటించారు. చదవండి:Mohammed Siraj: సిరాజ్ సెలబ్రేషన్స్ వైరల్; హైదరాబాద్‌లో భారీ కటౌట్ దీంతో ఆసీస్ యువ పేసర్ నాథన్ ఎలిస్‌తో పంజాబ్ కింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాది కాలంగా నాథన్ ఎలిస్ ఆధ్బతంగా రాణిస్తున్నాడు. ఎలిస్ బంగ్లాదేశ్‌తో తన ఆరంగేట్ర మ్యాచ్‌లోనే హ్యట్రిక్ సాధించాడు. ఇక టీ20 ప్రపంచ కప్‌కు ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టులో ముగ్గురు రిజర్వ్ ఆటగాళ్లలో ఎలిస్ కూడా ఉన్నాడు. కాగా, ఐపీఎల్ 2021లో 8 మ్యాచ్‌లాడిన పంజాబ్ కింగ్స్ కేవలం 3 విజయాలు సాధించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సైతం క్లిష్టంగా ఉంటాయి. మిగతా 6 మ్యాచ్‌లలో 5 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. చదవండి: Megan Schutt: తండ్రైన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగన్ స్కాట్ Nathan ᴇʟʟ-ɪs a 👑 He’s the newest addition to #SaddaSquad for the second phase of #IPL2021! 😍#SaddaPunjab #PunjabKings pic.twitter.com/0hMuOJ19NU — Punjab Kings (@PunjabKingsIPL) August 20, 2021 -
రూ.14 కోట్లకు కొన్నారు.. భయం వేసింది: క్రికెటర్
ముంబై: బిగ్‌బాష్ లీగ్- 2020- 21లో రాణించిన ఆస్ట్రేలియా బౌలర్ జై రిచర్డ్సన్ ఐపీఎల్-14వ ఎడిషన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. బీబీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడి, 27 వికెట్లు తీసిన ఈ ఆటగాడిని మినీ వేలంలో భాగంగా పంజాబ్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరవై నాలుగేళ్ల ఈ యువ పేసర్‌ను దక్కించుకునేందుకు కళ్లు చెదిరే రీతిలో 14 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇక సోమవారం నాటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్- రాజస్తాన్ రాయల్స్ తొలి పోరులో ఆడే అవకాశం దక్కించుకున్న రిచర్డ్సన్ మ్యాచ్‌కు ముందు స్పోర్ట్స్ టుడేతో మాట్లాడుతూ.. వేలం నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. ‘‘తొలుత కాస్త భయం వేసింది. మరీ ఇంత ధర అంటే అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి కదా. నిజానికి వేలం జరుగుతున్న సమయంలో నేను న్యూజిలాండ్‌లో ఉన్నాను. అప్పటికే రాత్రి అయిపోయింది. వేలం నా జీవితాన్ని మార్చబోతోందని తెలుసు. కచ్చితంగా నా జీవితంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయని అనిపించింది. రూ. 14 కోట్లకు కొనుగోలు చేశారు అనగానే నాలో ఉత్సాహం రెట్టింపు అయింది. అదొక ఉద్విగ్న క్షణం. భవిష్యత్తుకు మంచి ఆధారం. ఒక క్రికెటర్‌గా నాకు ఆర్థిక భద్రత లభించినట్లు అనిపించింది. సాధారణంగా, మాలాంటి ఆటగాళ్ల కెరీర్ 5 నుంచి పదేళ్ల వరకు కొనసాగుతుంది. ఈలోపే ఆర్థికంగా స్థిరపడాలి. ఈ వేలం నాకు గొప్ప ఊతమిచ్చింది. ఇక ఇంత ధర పెట్టారు అంటే వారి అంచనాలు కూడా ఏ స్థాయిలో ఉంటాయో నేను అర్థం చేసుకోగలను. ఒక క్రికెటర్‌గా ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధమే. ప్రైస్ టాగ్ గురించి నేను బాధపడాల్సిన పనిలేదు. అయితే, నా నైపుణ్యాలు జట్టుకు ఎంత మేరకు ఉపయోగపడతాయి, ఇండియాలో నా సామర్థ్యం నిరూపించుకోగలనా లేదా అన్నదే ప్రస్తుతం నా ముందున్న సవాలు’’ అని రిచర్డ్సన్ చెప్పుకొచ్చాడు. చదవండి: మూడేళ్ల క్రితం క్యాచ్ డ్రాప్ అయ్యింది.. కానీ ఇప్పుడు వైరల్: షూ తీసి, చెవి దగ్గర పెట్టుకుని.. బౌలర్ సెలబ్రేషన్ -
ఐపీఎల్ వేలంలో క్రిస్ మోరిస్ కొత్త రికార్డు
ఐపీఎల్–2021 వేలంలో విదేశీ ఆటగాళ్ల పంట పండింది. ఇప్పటికే నాలుగు వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడిన క్రిస్ మోరిస్ రూ. 16.25 కోట్లకు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో వేలంలో ఒక ఆటగాడికి పలికిన అత్యధిక ధర ఇదే కావడం విశేషం. బెంగళూరు జట్టు ఇద్దరు ఆటగాళ్ల కోసం ఏకంగా రూ. 29.25 కోట్లు వెచ్చించడం మరో చెప్పుకోదగ్గ అంశం. ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రూ. 14.25 కోట్ల విలువ పలుకగా, న్యూజిలాండ్‌కు చెందిన పేస్ బౌలర్ కైల్ జేమీసన్ ఏకంగా రూ. 15 కోట్లు అందుకోనున్నాడు. ఆసీస్ పేసర్ జాయ్ రిచర్డ్సన్ను సొంతం చేసుకునేందుకు పంజాబ్ టీమ్ రూ.14 కోట్లు ఖర్చు చేసింది. వేలంలో ఈ నలుగురు క్రికెటర్లే రూ. 10 కోట్లకంటే ఎక్కువ ధర పలికారు. చెన్నై: ఎప్పటిలాగే ఐపీఎల్ వేలం అంచనాలకు భిన్నంగా అనూహ్యంగా సాగింది. కచ్చితంగా భారీ ధర పలకగలరని భావించిన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పట్టించుకోకపోగా, అనామకులుగా కనిపించిన మరికొందరు మంచి విలువతో లీగ్‌లోకి దూసుకొచ్చారు. మరికొందరు ఆటగాళ్ల స్థాయి, సామర్థ్యం, గత రికార్డులను పరిగణనలోకి తీసుకుంటే ఆశించిదానికంటే చాలా ఎక్కువ మొత్తం లభించింది. దాదాపు అన్ని జట్లు వారి వ్యూహాలకు తగినట్లుగా ఆటగాళ్లను కొనసాగించడంతో మిగిలిన ఖాళీల కోసం, ఒక్క ఐపీఎల్ – 2021 కోసం మాత్రమే వేలం జరిగింది. 2015లో యువరాజ్ సింగ్ నెలకొల్పిన రికార్డు ధర (రూ. 16 కోట్లు– ఢిల్లీ)ని ఇప్పుడు మోరిస్ బద్దలు చేయడం విశేషం. ఐపీఎల్–2021 వేలం విశేషాలు చూస్తే... ► గత ఏడాది క్రిస్ మోరిస్‌కు బెంగళూరు రూ. 10 కోట్లు చెల్లించింది. వేలానికి ముందు అతడిని విడుదల చేసిన జట్టు ఆశ్చర్యకరంగా తాజా వేలంలో ఒక దశలో మోరిస్‌కు రూ. 9.75 కోట్ల వరకు చెల్లించేందుకు సిద్ధం కావడం విశేషం. రూ. 10 కోట్లు దాటిన తర్వాత కూడా ముంబై, పంజాబ్ మోరిస్ కోసం ప్రయత్నించగా, చివరకు రాజస్తాన్ అతడిని తీసుకుంది. 2020 ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున 5 ఇన్నింగ్స్‌లలో కలిపి 34 పరుగులు చేసిన మోరిస్... 6.63 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. ► 6.8 అడుగుల పొడగరి అయిన కివీస్ పేసర్ కైల్ జేమీసన్ అనూహ్యంగా భారీ ధర పలికాడు. గత ఏడాది భారత్‌పై కివీస్ టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అతని కోసం ఆర్సీబీ మొదటినుంచీ పోటీ పడింది. చివరి క్షణంలో పంజాబ్ తప్పుకోవడంతో జేమీసన్ బెంగళూరు సొంతమయ్యాడు. ► మ్యాక్స్‌వెల్ కోసం చివరి వరకు చెన్నై, బెంగళూరు తీవ్రంగా పోటీ పడ్డాయి. రూ.4.40 కోట్లనుంచి ఈ రెండు జట్లూ అతడిని సొంతం చేసుకునేందుకు విలువ పెంచుకుంటూ పోయాయి. చివరకు ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. గత ఏడాది పంజాబ్ అతనికి రూ. 10.75 కోట్లు చెల్లించగా... ఘోరంగా విఫలమైన తర్వాత కూడా మ్యాక్సీ విలువ పెరగడం విశేషం. గత ఐపీఎల్లో మ్యాక్స్‌వెల్ 11 ఇన్నింగ్స్‌లలో కలిపి 108 పరుగులే చేయగలిగాడు. అతని స్ట్రైక్‌రేట్ కూడా అతి పేలవంగా 101.88గా మాత్రమే ఉంది. ► బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాయ్ రిచర్డ్సన్ కోసం సాగిన వేలం అందరినీ ఆశ్చర్యపరచింది. 9 అంతర్జాతీయ టి20లే ఆడిన అతని రికార్డు గొప్పగా లేకపోయినా భారీ విలువ పలికాడు. రూ.13.25 కోట్ల వరకు పోటీ పడిన ఆర్సీబీ చివరకు తప్పుకుంది. ► ఆస్ట్రేలియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని పేస్ బౌలర్ రిలీ మెరిడిత్ కోసం పంజాబ్ ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ► వేలంకు ముందు ఒకే ఒక విదేశీ ఆటగాడి స్థానం ఖాళీగా ఉన్న చెన్నై, మొయిన్ అలీని ఎలాగైనా తీసుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్‌తో పోటీ పడి ఆ జట్టు ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌ను భారీ మొత్తానికి ఎంచుకుంది. ► వరల్డ్ నంబర్‌వన్ టి20 బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్‌ను పంజాబ్ కేవలం రూ.1.50 కోట్లకే దక్కించుకుంది. ► రూ. 12.50 కోట్ల విలువతో గత ఐపీఎల్ వరకు రాజస్తాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌ను ఢిల్లీ కేవలం రూ. 2.20 కోట్లకే సొంతం చేసుకుంది. ► ఆస్ట్రేలియా వన్డే, టి20 కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను రూ. 1 కోటి కనీస ధరకు కూడా ఎవరూ పట్టించుకోలేదు. ► గత ఐపీఎల్లో రూ. 8.5 కోట్లు పలికిన విండీస్ పేసర్ షెల్డన్ కాట్రెల్‌ను ఎవరూ ఎంచుకోలేదు. ► వేలంలో అందరికంటే చివరగా వచ్చిన పేరు అర్జున్ టెండూల్కర్. కనీస ధర రూ. 20 లక్షలు ముంబై బిడ్డింగ్ చేయగా మరే జట్టూ స్పందించలేదు. దాంతో అతను తన తండ్రి మెంటార్‌గా ఉన్న జట్టులోకి వచ్చేశాడు. విహారికి నిరాశ... ఆసీస్ పర్యటనలో ఆకట్టుకున్న ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారికి ఈ సారి కూడా ఐపీఎల్ అవకాశం దక్కలేదు. రూ. 1 కోటి కనీస విలువతో అతను వేలంలోకి రాగా, ఏ జట్టూ తీసుకోలేదు. భారత సీనియర్ టీమ్ సభ్యులలో లీగ్ అవకాశం దక్కనిది ఒక్క విహారికే! రెండో సారి అతని పేరు వచ్చినప్పుడు కూడా ఫ్రాంచైజీలు స్పందించలేదు. మళ్లీ ఐపీఎల్లో పుజారా భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాకు ఎట్టకేలకు ఐపీఎల్ అవకాశం దక్కింది. అతని కనీస ధర రూ.50 లక్షలకు చెన్నై సొంతం చేసుకుంది. 2014 తర్వాత పుజారా ఐపీఎల్‌లోకి రావడం ఇదే తొలిసారి. పుజారాను చెన్నై ఎంపిక చేసుకున్న సమయంలో వేలంలో పాల్గొంటున్న అన్ని ఫ్రాంచైజీల సభ్యులందరూ చప్పట్లతో తమ సంతోషాన్ని ప్రకటించడం విశేషం! ఉమేశ్‌కు రూ. 1 కోటి మాత్రమే... భారత సీనియర్ పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌పై ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అతని బేస్ ప్రైస్‌కే చివరకు ఢిల్లీ తీసుకుంది. గౌతమ్‌కు రికార్డు మొత్తం భారత్‌కు ప్రాతినిధ్యం వహించని అన్క్యాప్డ్ ఆటగాళ్లలో కృష్ణప్ప గౌతమ్‌కు బంగారు అవకాశం లభించింది. భారత ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ అవసరం ఉన్న చెన్నై ఎలాగైనా సొంతం చేసుకునేందుకు ప్రయత్నించడంతో పోటీ పెరిగింది. హైదరాబాద్ రూ. 9 కోట్ల వరకు తీసుకు రాగా, చివరకు అతను చెన్నై చేరడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా గౌతమ్ నిలిచాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో 37 బంతుల్లో సెంచరీ చేసిన మొహమ్మద్ అజహరుద్దీన్‌ను రూ. 20 లక్షలకే బెంగళూరు ఎంచుకుంది. షారుఖ్ ఖాన్‌ను కొన్న ప్రీతి జింటా! తమిళనాడు జట్టు ముస్తాక్ అలీ ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్టర్ షారుఖ్ ఖాన్‌పై అందరి ఆసక్తి కనిపించింది. రూ. 20 లక్షల కనీస ధరనుంచి ఢిల్లీ బిడ్డింగ్ మొదలు పెట్టగా, ఆర్సీబీ దానిని రూ. 5 కోట్ల వరకు తీసుకెళ్లింది. చివరకు అతను రూ.5.25 కోట్లకు పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది. ముగ్గురిని మాత్రమే... గురువారం జరిగిన వేలంలో సన్‌రైజర్స్ టీమ్ కేదార్ జాదవ్ (రూ. 2 కోట్లు), ముజీబ్ ఉర్ రహమాన్ (రూ.1.50 కోట్లు), జె.సుచిత్ (రూ. 30 లక్షలు)లను మాత్రమే తీసుకుంది. టీమ్‌లో ఈ సారి హైదరాబాద్‌కు చెందిన ఒక్క ఆటగాడు కూడా లేడు. వేలంలో ఆంధ్ర జట్టుకు చెందిన కేఎల్ భరత్ (రూ.20 లక్షలు – బెంగళూరు), హరిశంకర్ రెడ్డి (రూ. 20 లక్షలు – చెన్నై), హైదరాబాద్ జట్టునుంచి కె. భగత్ వర్మ (రూ. 20 లక్షలు – చెన్నై) ఎంపికయ్యారు. ► కైల్ జేమీసన్ (రూ. 15 కోట్లు – బెంగళూరు) ► మ్యాక్స్‌వెల్ (రూ. 14.25 కోట్లు – బెంగళూరు) ► జాయ్ రిచర్డ్సన్ (రూ. 14 కోట్లు – పంజాబ్) ► కృష్ణప్ప గౌతమ్ (రూ. 9.25 కోట్లు – చెన్నై) ► రిలీ మెరిడిత్ (రూ. 8 కోట్లు – పంజాబ్) ► మొయిన్ అలీ (రూ. 7 కోట్లు – చెన్నై) -
ఆసీస్ ఫాస్ట్ బౌలర్‌కు కోట్లాభిషేకం
చెన్నై: ఈ ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్సన్ పంట పండింది. జై రిచర్డ్సన్ను పంజాబ్ కింగ్స్ రూ. 14 కోట్లకు దక్కించుకుంది. రిచర్డ్సన్ కోసం ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌లు పోటీ పడగా పంజాబ్ కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది. రిచర్డ్సన్ కనీస ధర 1 కోటి 50 లక్షల రూపాయలు ఉండగా తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఆర్సీబీ పలుసార్లు అతని కోసం బిడ్‌కు వెళ్లగా ఆపై వెనక్కి తగ్గింది. చివరకు పంజాబ్ కింగ్స్ అతన్ని 14 కోట్లకు కొనుగోలు చేసింది. రిచర్డ్సన్కు ఇదే తొలి ఐపీఎల్. ఇదిలా ఉంచితే, ఈ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను 14 కోట్ల 25 లక్షల రూపాయలకు ఆర్సీబీ కొనుగోలు చేయగా, మోరిస్‌ను రూ. 16 కోట్ల 25 లక్షల రికార్డు ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఇప్పటివరకూ ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాళ్లు.