
IPL 2023- Mumbai Indians: ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జై రిచర్డ్‌సన్ గాయం కారణంగా ఈ సీజన్ ఐపీఎల్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతను శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇప్పటికే రిచర్డ్‌సన్ భారత్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.
2023 సీజన్‌లో అతను ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాల్సింది. కాగా ఇప్పటికే ముంబై ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండే అంశంపై సందేహం నెలకొనగా.. ఇపుడు రిచర్డ్‌సన్ రూపంలో మరో పేసర్ సేవలను కోల్పోయింది.
దీంతో ఐపీఎల్-2023 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాగా గతేడాది ఐపీఎల్‌లో రిచర్డ్‌సన్ పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. రిచర్డ్సన్ 36 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే టీమిండియాతో వన్డే సిరీస్‌కు దూరమైన రిచర్డ్‌సన్.. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నాటికి కూడా అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దం నెలకొంది.
చదవండి: దక్షిణాఫ్రికా ఘన విజయం