IPL 2023: Delhi Capitals star Mitchell Marsh to fly back to Australia for marriage, to miss few games - Sakshi
Sakshi News home page

IPL 2023- Mitchell Marsh: క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ! స్వదేశానికి వెళ్లనున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌! కారణమిదే

Published Fri, Apr 7 2023 6:07 PM | Last Updated on Fri, Apr 7 2023 6:34 PM

IPL 2023: Delhi Capitals Star Mitchell Marsh To Fly Back Home For Marriage - Sakshi

IPL 2023- Mitchell Marsh: ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ స్వదేశానికి పయనం కానున్నాడు. ఐపీఎల్‌-2023 సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ కోచ్‌ జేమ్స్‌ హోప్స్‌ వెల్లడించాడు. మార్ష్‌ త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నాడని.. అందుకే అతడు ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడని పేర్కొన్నాడు.

పూర్తిగా నిరాశపరిచాడు
ఐపీఎల్‌-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో మార్ష్‌ భాగమయ్యాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ డకౌట్‌ అయ్యాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. 4 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. అయితే, ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసే అవకాశం దక్కించుకున్న మార్ష్‌.. విజయ్‌ శంకర్‌ను అవుట్‌ చేసి తన ఖాతాలో ఓ వికెట్‌ జమచేసుకున్నాడు.

గర్ల్‌ఫ్రెండ్‌తో రెండేళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్‌!
ఇదిలా ఉంటే.. గర్ల్‌ఫ్రెండ్‌ గ్రెటా మ్యాక్‌తో మార్ష్‌ రెండేళ్ల క్రితం నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లికి ఈనెలలోనే ముహుర్తం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు పయనం కానున్న మార్ష్‌ కొన్ని వారాలు జట్టుకు దూరం కానున్నాడు.

కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ తదుపరి మ్యాచ్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది. గువాహటి వేదికగా ఇరు జట్లు ఏప్రిల్‌ 8న మ్యాచ్‌ ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన హోప్స్‌.. మార్ష్‌ పెళ్లి విషయాన్ని వెల్లడిస్తూ.. కొన్ని మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నట్లు తెలిపాడు.  

చదవండి: IPL 2023: 'టైమూ పాడూ లేదు.. చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement