mitchel marsh
-
ఇంగ్లండ్ టూర్.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా! కెప్టెన్ ఎవరంటే?
ఇంగ్లండ్, స్కాట్లాండ్లతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ప్రకటించింది. ఓవరాల్‌గా యూనైటడ్ కింగడమ్ టూర్‌కు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరమయ్యాడు. అతడికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. కంగారులు యూకే పర్యటనలో భాగంగా తొలుత స్కాట్లాండ్తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 2న ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆసీస్ ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ పర్యటన సెప్టెంబర్ 11న ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లతో టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్‌కు ఆసీస్ సెలక్టర్లు రెస్ట్ ఆస. అయితే వీరు ముగ్గురూ వన్డే జట్టులో భాగమయ్యారు.ఈ టూర్లో ఆసీస్ వన్డే, టీ20 జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ మిచిల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. కాగా యువ ఆటగాడు కూపర్ కొన్నోలీకి తొలిసారి ఆసీస్ జట్టులో దక్కింది. అదేవిధంగా యువ సంచలనం ఫ్రెజర్ మెక్‌గర్క్‌కు వన్డే, టీ20 జట్టులో చోటు దక్కింది.స్కాట్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20లకు ఆసీస్ జట్టుమిచిల్ మార్ష్ (కెప్టెన్),. జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ. టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్. కామెరాన్ గ్రీన్. ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.ఇంగ్లండ్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచ్ మార్ష్ (కెప్టెన్). సీన్ అబాట్. అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్. ఆరోన్ హార్డీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్. ట్రావిస్ హెడ్. జోష్ ఇంగ్లిస్. మార్నస్ లాబుస్చాగ్నే. గ్లెన్ మాక్స్వెల్. మాథ్యూ షార్ట్. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. -
T20 WC 2024 IND vs AUS: ఆసీస్‌పై ఘన విజయం.. ప్రతీకారం తీర్చుకున్న భారత్
India vs Australia match live updates and highlights:ఆసీస్‌పై ఘన విజయం..టీ20 వరల్డ్‌కప్-2024 సెమీఫైనల్లో భారత జట్టు అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. గ్రూపు-1 నుంచి తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇక ఈ విజయంతో 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది.వారెవ్వా బుమ్రా..భారత బౌలర్లు అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. 76 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న హెడ్.. బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 17 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 153/5ఆసీస్ నాలుగో వికెట్ డౌన్..135 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన స్టోయినిష్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 148/4. క్రీజులో ట్రావిస్ హెడ్(75), డేవిడ్(2) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ డౌన్.. మార్ష్ ఔట్128 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన మాక్స్వెల్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.13 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 128/213 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(63), మాక్స్వెల్(20) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ డౌన్.. మార్ష్ ఔట్87 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి మాక్స్వెల్ వచ్చాడు. 10 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 99/2. క్రీజులో ట్రావిస్ హెడ్(54), మాక్స్వెల్(0) పరుగులతో ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఆసీస్6 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(26), మిచెల్ మార్ష్(31) ఉన్నారు.తొలి వికెట్ డౌన్..206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. 3 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(15), హెడ్(0) ఉన్నారు.రోహిత్ శర్మ ఊచకోత.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(92) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(31), శివమ్ దూబే(28) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, స్టోయినిష్ తలా రెండు వికెట్లు సాధించగా.. హాజిల్ వుడ్ తలా వికెట్ పడగొట్టారు.18 ఓవర్లకు భారత్ స్కోర్: 181/418 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా(12), శివమ్ దూబే(28) పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్.. సూర్య ఔట్టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే(19), హార్దిక్ పాండ్యా(2) పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ డౌన్.. రోహిత్ శర్మ ఔట్127 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 92 పరుగులు చేసిన రోహిత శర్మ.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రోహిత్ ఇన్నింగ్‌లో 8 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి. క్రీజులోకి శివమ్ దూబే వచ్చాడు.దూకుడుగా ఆడుతున్న భారత్.. 11 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(92), సూర్య(17) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ డౌన్.. పంత్ ఔట్93 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రిషబ్ పంత్.. స్టోయినిష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(76), సూర్య ఉన్నారు.రోహిత్ శర్మ ఫిప్టీ.. 6 ఓవర్లు భారత్ స్కోర్: 60/16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 6 సిక్స్‌లు ఉన్నాయి. క్రీజులో రోహిత్ శర్మ(51), రిషబ్ పంత్(7) పరుగులతో ఉన్నాడు.రోహిత్ జోరుకు వరుణుడు బ్రేక్..సెయింట్ లూసియా వేదికగా జరుగుతున్న ఆసీస్-భారత్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. 4.1 ఓవర్ల వద్ద భారత్ ఇన్నింగ్స్ వర్షం కారణంగా అగిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ మంచి జోష్‌లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కేవలం 14 బంతుల్లోనే 5 సిక్స్‌లు, 2 ఫోర్లతో 41 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఓవరాల్‌గా 4.1 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది.రోహిత్ ఆన్ ఫైర్.. 3 ఓవర్లకు బారత్ స్కోర్: 35/1విరాట్ కోహ్లి ఔటైనప్పటకి రోహిత్ శర్మ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మూడో ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రోహిత్ 4 సిక్స్‌లు, ఒక బౌండరీతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. 3 ఓవర్లకు భారత్ స్కోర్: 35/1టీమిండియాకు బిగ్ షాక్..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. విరాట్ కోహ్లి డకౌటయ్యాడు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ ఔటయ్యాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు.టీ20 వరల్డ్‌కప్-2024లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఆసీస్ మాత్రం ఒక మార్పు చేసింది. ఆస్టన్ ఆగర్ స్ధానంలో పేసర్ మిచెల్ స్టార్క్ వచ్చాడు.తుది జట్లుభారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్(కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ -
ఢిల్లీ జట్టులోకి సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు..ఎవరంటే?
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మిచిల్ మార్ష్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. తొడకండరాల గాయం కారణంగా మార్ష్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ సైతం ధ్రువీకరించాడు. ఈ క్రమంలో మార్ష్ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో ఢిల్లీ క్యాపిటల్స్ మెనెజ్‌మెంట్ పడింది. మార్ష్ ప్లేస్‌లో దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ రస్సీ వాండర్ డస్సెన్ పేరును ఢిల్లీ క్యాపిటల్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా ఐపీఎల్-2024 మినీ ఆక్షన్‌లో రూ.2 కోట్ల కనీస ధరతో వేలంకు వచ్చిన వాండర్ డస్సెన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఈ ప్రోటీస్ స్టార్ దమ్ములేపాడు. ఈ లీగ్‌లో కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన డస్సెన్.. 364 పరుగులతో సెకెండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా టీ20లో కూడా డస్సెన్ అదరగొట్టాడు. ఈ క్రమంలోనే డస్సెన్‌ను ఢిల్లీ సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వాన్ డెర్ డస్సెన్ గతంలో ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ క్రికెటర్?
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్, ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మధ్య నుంచి వైదొలిగాడు. మార్ష్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకోవడం కోసం మార్ష్ తన స్వదేశానికి వెళ్లినట్లు ప్రముఖ క్రీడా వెబ్సైట్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తెలిపింది. ఢిల్లీ టీమ్ మేనేజ్మెంట్తో సంప్రదింపుల తర్వాతే అతడు ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు ఈఎస్పీఎన్ పేర్కొంది. కాగా ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా మార్ష్ తన గాయానికి సర్జరీ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ గాయం కారణంగానే ఢిల్లీ ఆడిన ఆఖరి రెండు మ్యాచ్‌లకు మార్ష్ దూరమయ్యాడు. అయితే మార్ష్ ఈ ఏడాది సీజన్లో తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. రాజస్తాన్ రాయల్స్‌పై చేసిన 23 పరుగులకే అతడి టాప్ స్కోర్‌గా ఉంది. బౌలింగ్‌లో కూడా కేవలం ఒకే వికెట్ సాధించాడు. -
NZ vs Aus: ఆసీస్ కెప్టెన్ కమిన్స్ షాకింగ్ కామెంట్స్
"I’d doubt that I’ll be captaining..’’...: న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. కివీస్‌తో సిరీస్‌లో స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా కొనసాగుతాడని స్పష్టం చేసింది. ఉస్మాన్ ఖవాజాతో కలిసి అతడు ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని తెలిపింది. ఆల్‌రౌండర్లు కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్ ఇద్దరిని తుదిజట్టులో ఆడిస్తున్నట్లు వెల్లడించింది. ఇక తుదిజట్టును ప్రకటిస్తున్న సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను కెప్టెన్‌గా ఎన్నాళ్లు కొనసాగుతానో తెలియదన్నాడు. వాళ్ల కెప్టెన్సీలో ఆడటం ఆస్వాదిస్తున్నా ముప్పై ఏళ్ల వయసు దాటిన తర్వాత ఫామ్, ఆటకు శరీరం సహకరించే తీరుపైనే తన భవిష్యత్తు ఆధారపడి ఉందని కమిన్స్ పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్లో మాథ్యూ వేడ్, మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని.. వాళ్లిద్దరి కారణంగా తనకు కాస్త విశ్రాంతి లభించిందని హర్షం వ్యక్తం చేశాడు. మొదటి రెండు టెస్టుల మధ్య ఆరేళ్ల గ్యాప్ కాగా ఫాస్ట్ బౌలర్ అయిన ప్యాట్ కమిన్స్ 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసినా.. ఆ తర్వాత 2017 వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వరుసగా గాయాల బారిన పడిన కారణంగా మొదటి రెండు టెస్టుల మధ్య దాదాపు ఆరేళ్ల గ్యాప్ వచ్చింది. అయితే, ఆ తర్వాత కమిన్స్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌గా వరుస విజయాలు అందిస్తూ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్ సాధించాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో కంగారూలను చాంపియన్లుగా నిలిపి సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం టెస్టుల్లో ప్యాట్ కమిన్స్ నంబర్‌వన్ బౌలర్ కావడం విశేషం. న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా ఎలెవన్: స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్. చదవండి: NZ Vs Aus: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ బ్యాటర్ దూరం -
ఆసీస్ స్టార్ ప్లేయర్ మార్ష్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు, బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ ఓపెనర్ షాన్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్‌లో (బిగ్‌బాష్ లీగ్) ఉండగానే ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మార్ష్ తాజాగా అన్ని రకాల క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. బీబీఎల్‌లో జనవరి 16న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచ్ తనకు చివరిదని స్పష్టం చేశాడు. మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు తన చివరి మ్యాచ్‌లో (బిగ్‌బాష్ లీగ్) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన షాన్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాకయ్యారు. మార్ష్.. తన చివరి మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌పై 49 బంతుల్లో 10 బౌండరీల సాయంతో 64 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. మార్ష్ తన రెనెగేడ్స్ సహచరుడు, ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే తాను కూడా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2008-19 మధ్యలో షాన్ మార్ష్ ఆస్ట్రేలియా తరఫున 38 టెస్ట్‌లు, 73 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. ఇందులో అతను 13 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 5000 పైచిలుకు పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ అదరగొట్టిన మార్ష్ 2008-17 మధ్యలో వివిధ ఫ్రాంచైజీల తరఫున 71 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, 20 హాఫ్ సెంచరీల సాయంతో 132 స్ట్రయిక్‌రేట్‌తో 2477 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన మార్ష్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్).. ఆ సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా (616 పరుగులు) నిలిచాడు. ఆసీస్ దిగ్గజ ఆటగాడు జెఫ్ మార్ష్ పెద్ద కొడుకైన 40 ఏళ్ల షాన్ మార్ష్.. ప్రస్తుత ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు స్వయానా అన్న అవుతాడు. -
మిచెల్ మార్ష్ విధ్వంసకర శతకం.. బంగ్లాపై ఆసీస్ ఘన విజయం
వన్డే ప్రపంచకప్-2023లో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ను అద్బుతమైన విజయంతో ఆస్ట్రేలియా ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా పుణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 307 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 44.4 ఓవర్లలలోనే ఊదిపడేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 132 బంతులు ఎదుర్కొన్న మార్ష్ 17 ఫోర్లు, 9 సిక్స్‌లతో 177 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మార్ష్.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.క్రీజులో అడుగుపెట్టనప్పటినుంచే బౌండరీలు వర్షం కురిపించాడు. అతడితో పాటు డేవిడ్ వార్నర్(53), స్టీవ్ స్మిత్(63 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో టాస్కిన్ అహ్మద్, ముస్తిఫిజర్ రెహ్మాన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో హృదయ్(74) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాంటో(45), లిటన్ దాస్(36) పరుగులతో రాణించారు. చదవండి: WC 2023: వరల్డ్‌కప్‌లో దారుణ ప్రదర్శన.. పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్‌బై..! -
WC 2023: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం అదే.. అతడి వల్లే.: బాబర్ ఆజం
ICC ODI WC 2023- Aus Vs Pak- Babar Azam Comments On Loss: ‘‘మా స్థాయికి తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాం. ఇక వార్నర్ లాంటి బ్యాటర్ ఇచ్చిన క్యాచ్ జారవిడిస్తే.. అతడు వదిలిపెడతాడా? కచ్చితంగా మనం మూల్యం చెల్లించుకునేలా చేస్తాడు. నిజానికి ఈ గ్రౌండ్లో భారీ స్కోర్లు సాధారణమే. మా లక్ష్యం కూడా మరీ ఛేదించలేనిదైతే కాదు. ఏదేమైనా మా ఫాస్ట్‌బౌలర్లు, స్పిన్నర్లు ఆఖరి ఓవర్లలో మెరుగైన ప్రదర్శనతో తిరిగి పుంజుకునేలా చేశారు. మేము టార్గెట్ ఛేజ్ చేయగలమనే సందేశాన్ని ఇచ్చారు. View this post on Instagram A post shared by ICC (@icc) గతంలో ఇలాంటివి మాకు అనుభవమే. కానీ ఈరోజు అలా జరుగలేదు. మిడిల్ ఓవర్లలో భారీ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం’’ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం విచారం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఆసీస్ వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కంగారూ జట్టు.. పాక్‌ను 62 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. వార్నర్, మార్ష్ విధ్వంసకర ఇన్నింగ్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న బాబర్ ఆజం బృందం.. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(163), మిచెల్ మార్ష్(121)లను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయింది. వారిద్దరిని అవుట్ చేసినప్పటికీ అప్పటికే స్కోరు బోర్డుపై భారీ స్కోరుకు పునాది పడింది. ఆరంభంలో వార్నర్ ఇచ్చిన క్యాచ్‌లను రెండుసార్లు మిస్ చేయడంతో పాక్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఈ క్రమంలో తిరిగి పుంజుకున్న పాక్ బౌలర్లు ఆసీస్ మిడిలార్డర్, లోయర్ ఆర్డర్‌ను దాదాపు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేసినా.. పెద్దగా ఫలితం లేకుండా పోయింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఓపెనింగ్ జోడీ శుభారంభం.. కానీ నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిదికి అత్యధికంగా 5 వికెట్లు దక్కాయి. ఈ క్రమంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్(64), ఇమామ్ ఉల్ హక్(70) శుభారంభాలు అందించినా.. కెప్టెన్ బాబర్ ఆజం 18 పరుగులకే పెవిలియన్ చేరడం ప్రభావం చూపింది. మిగతా వాళ్లలో మహ్మద్ రిజ్వాన్ 46, సౌద్ షకీల్ 30, ఇఫ్తికర్ అహ్మద్ 26 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఆసీస్ బౌలర్ల ధాటికి లోయర్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ముఖ్యంగా స్పిన్నర్ ఆడం జంపా ఆది నుంచే ఒత్తిడి పెంచుతూ కీలక వికెట్లు తీశాడు. ఫలితంగా 45.3 ఓవర్లలో 305 పరుగులకే పాక్ ఆలౌట్ అయింది. ఓటమికి ప్రధాన కారణం అదే ఈ నేపథ్యంలో పరాజయంపై స్పందించిన పాకిస్తాన్ సారథి బాబర్ ఆజం.. ‘‘ఆసీస్ ఇన్నింగ్స్‌లో తొలి 10 ఓవర్లలో మా బౌలర్లు మరింత మెరుగ్గా రాణించాల్సింది. అదే విధంగా.. మిడిల్ ఓవర్లలో మా బ్యాటర్లు ఇంకాస్త బెటర్‌గా ఆడితే బాగుండేది’’ అంటూ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. కాగా ఈ మ్యాచ్‌లో అద్భుత శతకంతో మెరిసిన డేవిడ్ వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: టీమిండియాకు షాక్! బీసీసీఐ కీలక ప్రకటన.. పాండ్యా అవుట్.. ఇక View this post on Instagram A post shared by ICC (@icc) -
డేవిడ్ వార్నర్, మార్ష్ విధ్వంసం.. పాకిస్తాన్ టార్గెట్ 368 పరుగులు
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగుల స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ విధ్వంసకర శతకాలతో చెలరేగారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 259 పరుగుల భారీ బాగస్వామ్యం నెలకొల్పారు. వార్నర్ 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్‌లతో 163 పరుగులు చేయగా. మార్ష్ 108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్స్‌లతో 121 పరుగులు సాధించాడు. అయితే ఓ దశలో 400 మార్క్ సులభంగా దాటేలా కన్పించిన ఆసీస్.. మిడిలార్డర్ విఫలమకావడంతో 365 పరుగులకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది ఐదు వికెట్లు పడగొట్టగా.. హ్యారీస్ రవూఫ్ మూడు, ఉస్మా మీర్ ఒక్క వికెట్ సాధించారు. చదవండి: WC 2023 PAK vs AUS: పాకిస్తాన్‌పై సూపర్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన డేవిడ్ వార్నర్ -
మిచెల్ మార్ష్ అరుదైన రికార్డు.. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే!
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పాకిస్తాన్లో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మార్ష్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. పాకిస్తాన్ బౌలర్లను మార్ష్ ఊచకోత కోశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 108 బంతులు ఎదుర్కొన్న మార్ష్ 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 121 పరుగులు చేశాడు. కాగా మార్ష్ తన పుట్టిన రోజునే సెంచరీని సాధించడం విశేషం. ఆక్టోబర్ 20న మార్ష్ 32 వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇక బర్త్‌డే రోజున సెంచరీతో చెలరేగిన మార్ష్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో బర్త్‌డే రోజున సెంచరీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా మార్ష్ రికార్డులకెక్కాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో తొలి స్ధానంలో కివీస్ దిగ్గజం రాస్ టేలర్ ఉన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై టేలర్ తన జన్మదినం నాడు సెంచరీ చేశాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఫీట్ సాధించిన లిస్ట్‌లో మార్ష్ ఆరో స్ధానంలో నిలిచాడు. చదవండి: WC 2023 PAK vs AUS: పాకిస్తాన్‌పై సూపర్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన డేవిడ్ వార్నర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: పాక్ బౌలింగ్‌ను ‘శతక్కొట్టిన’ ఆసీస్ ఓపెనర్లు.. వరల్డ్‌కప్‌లో సరికొత్త రికార్డు
ICC ODI WC 2023- Warner- Marsh 100s Against Pakistan: వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఇద్దరూ శతక్కొట్టారు. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫోర్లు, సిక్సర్ల వర్షం ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కంగారూ జట్టు ఓపెనర్లు మార్ష్, వార్నర్ మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడారు. చక్కటి సమన్వయంతో సింగిల్స్ తీస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. పాకిస్తాన్ ఫీల్డర్ల తప్పిదాలను క్యాష్ చేసుకుంటూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో 21వ ఓవర్ రెండో బంతికే 150 పరుగులు భాగస్వామ్యం నమోదు చేసిన మార్ష్, వార్నర్.. 31వ ఓవర్లో ఇద్దరూ శతకాలు సాధించారు. పాక్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో నాలుగో బంతికి వార్నర్ 100 పరుగుల మార్కు అందుకోగా.. ఆ మరుసటి బంతికే మార్ష్ ఫోర్ బాది శతకం పూర్తి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) పాకిస్తాన్‌పై వరుసగా నాలుగోది.. బర్త్‌డే బాయ్‌కు మొదటి వరల్డ్‌కప్ సెంచరీ ఇక వెటరన్ ఓపెనర్ వార్నర్‌కు ఇది పాకిస్తాన్‌పై వరుసగా నాలుగో సెంచరీ కాగా.. మిచెల్ మార్ష్ పుట్టినరోజును ఇలా హండ్రెడ్‌తో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరు వన్డే వరల్డ్‌కప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఆస్ట్రేలియా తరఫున ప్రపంచకప్ ఈవెంట్లో తొలిసారి సెంచరీలు నమోదు చేసిన ఓపెనింగ్ జోడీగా మార్ష్, వార్నర్ నిలిచారు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన నాలుగో జంటగా రికార్డులకెక్కారు. అంతకు ముందు ఈ ఫీట్ నమోదు చేసిన ఓపెనింగ్ జోడీలు.. ►2011- ఉపుల్ తరంగ- తిలకరత్నె దిల్షాన్(శ్రీలంక)- జింబాబ్వే మీద- పల్లెకెలో ►2011 క్వార్టర్ ఫైనల్- ఉపుల్ తరంగ- తిలకరత్నె దిల్షాన్(శ్రీలంక)- ఇంగ్లండ్ మీద- కొలంబోలో ►2019- రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్(ఇండియా)- శ్రీలంక మీద- లీడ్స్‌లో ►తాజాగా.. 2023- డేవిడ్ వార్నర్- మిచెల్ మార్ష్- పాకిస్తాన్ మీద- బెంగళూరులో. View this post on Instagram A post shared by ICC (@icc) ►కాగా పాకిస్తాన్ మీద వరల్డ్‌కప్‌లో ఇలా ఓ జట్టు ఓపెనర్లు ఇద్దరూ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. దీంతో మార్ష్, వార్నర్ కారణంగా పాక్ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. చదవండి: WC 2023: టీమిండియాకు షాక్! బీసీసీఐ కీలక ప్రకటన.. వైస్ కెప్టెన్ అవుట్.. ఇక -
మిచెల్ మార్ష్ విధ్వంసం.. కేవలం 28 బంతుల్లోనే! ఆసీస్ ఘన విజయం
దక్షిణాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. డర్భన్ వేదికగా ప్రోటీస్‌తో జరిగిన రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో కెప్టెన్ మార్క్రమ్(49) పరుగులతో రాణించగా.. బావుమా(35) పర్వాలేదనపించాడు. ఆసీస్ బౌలర్లలో అబాట్, ఈల్లీస్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. బెహ్రెండోర్ఫ్ రెండు వికెట్లు సాధించారు. మార్ష్, షార్ట్ విధ్వంసం.. ఇక 165 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఆసీస్ ఛేదించింది. మరోసారి ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 39 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 79 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా మార్ష్ తన హాఫ్‌సెంచరీ మార్క్‌ను కేవలం 28 బంతుల్లోనే అందకున్నాడు. అతడికి ఇది వరుసగా రెండో అర్ధ శతకం కావడం విశేషం. అతడితో పాటు ఓపెనర్ మాథ్యూ షార్ట్ కూడా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 30 బంతులు ఎదుర్కొన్న షార్ట్ 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66 పరుగులు చేశాడు. కాగా షార్ట్‌కు ఇది రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం. ఇక ప్రోటీస్ బౌలర్లలో విలియమ్స్, షమ్సీ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 ఆదివారం జరగనుంది. చదవండి: విరాట్ కోహ్లి అంటే నాకు గౌరవం.. అది అనవసరం! విజయం మాదే: బాబర్ -
మిచెల్ మార్ష్ ఊచకోత.. డేవిడ్ విధ్వంసం! దక్షిణాఫ్రికా చిత్తు
దక్షిణాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 111 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ప్రోటీస్ బౌలర్లపై మార్ష్ విరుచుకుపడ్డాడు. కింగ్స్‌మేడ్ మైదానంలో మార్ష్ బౌండరీలు వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న మిచెల్.. 13 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక మార్ష్‌తో పాటు టిమ్ డేవిడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. ప్రోటీస్ బౌలర్లలో విలియమ్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. జానెసన్, గెరాల్డ్, షమ్సీ తలా వికెట్ సాధించారు. కుప్పకూలిన ప్రోటీస్.. అనంతరం 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కేవలం 115 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లలో తన్వీర్ సంఘా 4 వికెట్లు, మార్కస్ స్టోయినిస్ 3 వికెట్లతో ప్రోటీస్‌ను దెబ్బతీశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెండ్రిక్స్(56) మినహా అందరూ విఫలమయ్యారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికలో శుక్రవారం జరగనుంది. చదవండి: Asia Cup 2023: శ్రీలంక గడ్డపై భారత జట్టు -
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. సౌతాఫ్రికా సిరీస్ నుంచి కెప్టెన్ ఔట్..!
సౌతాఫ్రికాతో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని తెలుస్తోంది. గాయం నుంచి కోలుకుంటాడని సౌతాఫ్రికా పర్యటనలోని వన్డే సిరీస్‌కు కమిన్స్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు.. అతని తాజా పరిస్థితిని సమీక్షించి వన్డే జట్టు నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కమిన్స్ స్థానంలో టీ20 జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్‌కు వన్డే జట్టు పగ్గాలు కూడా అప్పజెప్పాలని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు భావిస్తున్నాయట. వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని కమిన్స్‌కు వీలైనంత విశ్రాంతి కల్పించాలన్నది క్రికెట్ ఆస్ట్రేలియా యోచనగా తెలుస్తుంది. వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌తో వన్డే సిరీస్ సమయానికంతా సిద్ధంగా ఉండాలని సీఏ కమిన్స్ సూచించిందని సమాచారం. కాగా, ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే 3 టీ20లు, 5 వన్డేల సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికాతో పర్యటించనున్న విషయం తెలిసిందే. అనంతరం సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది. యాషెస్ సిరీస్-2023 ఆఖరి టెస్ట్ సందర్భంగా గాయపడిన కమిన్స్ (ఎడమ చేతి మణికట్టు విరిగింది) వరల్డ్‌కప్‌కు ముందు జరిగే ఈ సిరీస్ సమయానికంతా అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. -
ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్‌గా మిచెల్ మార్ష్.. ముగ్గురు మొనగాళ్లు ఎంట్రీ
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు 14 మంంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ను కెప్టెన్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. టీ20ల్లో ఆస్ట్రేలియా సారధి ఎంపికైన 12వ ఆటగాడిగా మార్ష్ నిలిచాడు. కాగా టెస్టులు, వన్డేల్లో ఆసీస్ జట్టుకు ప్యాట్ కమ్మిన్స్ సారథ్యం వహిస్తుండగా.. టీ20ల్లో మాత్రం శాశ్వత కెప్టెన్ లేడు. ఈ ఏడాది ఆరంభంలో ఆరోన్ ఫించ్ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక క్రికెట్ ఆస్ట్రేలియా అతడి స్ధానాన్ని ఇంకా భర్తీ చేయలేదు. అయితే టీ20 ప్రపంచకప్-2024కు ముందు మార్ష్‌ను టీ20ల్లో తమ ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా నియమించే ఛాన్స్ ఉంది. కాగా మార్ష్ మూడు ఫార్మాట్లలో కూడా కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇటీవలే జరిగిన యాషెస్ సిరీస్‌లో కూడా అతడు అద్బుతమైన ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో 50 సగటుతో 250 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. ముగ్గురు మొనగాళ్లు ఎంట్రీ! ఇక ప్రోటీస్ సిరీస్‌తో ముగ్గురు యువ ఆటగాళ్లు ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యారు. లెఫ్టార్మ్ స్పీడ్‌స్టర్ స్పెన్సర్ జాన్సన్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీ , మాథ్యూ షార్ట్‌లకు తొలిసారి ఆసీస్ జట్టులో చోటు దక్కింది. ఆరోన్ హార్డీ వన్డే ప్రపంచకప్-2023కు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన ప్రాథమిక జట్టులో కూడా ఛాన్స్ లభించింది. ప్రోటీస్‌తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా చదవండి: అస్సలు ఊహించలేదు.. అతడే మా కొంపముంచాడు! కొంచెం బాధ్యతగా ఆడాలి: హార్దిక్ -
టీమిండియాతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా విధ్వంసకర ఆటగాడు!
టీమిండియాతో వన్డే సిరీస్‌కు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కానునున్నట్లు సమాచారం. మణికట్టు గాయంతో బాధపడుతున్న కమ్మిన్స్.. దక్షిణాఫ్రికా, భారత పర్యటనలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు ఆఖరి వారంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ప్రోటీస్‌తో మూడు టీ20లు, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆసీస్ తలపడనుంది. కంగారు జట్టు ప్రోటీస్ టూర్ ఆగస్టు 31న ప్రారంభమై సెప్టెంబర్ 17న ముగియనుంది. అనంతరం ఆస్ట్రేలియా నేరుగా దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు చేరుకోనుంది. అతిథ్య భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ తలపడనుంది. సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక రెండు పర్యటనలకు దూరంగా ఉండనున్న కమ్మిన్స్.. తిరిగి మళ్లీ వరల్డ్‌కప్‌కు అందుబాటులో రానున్నట్లు సమాచారం. కెప్టెన్‌గా మిచెల్ మార్ష్.. ఇక దక్షిణాఫ్రికా, భారత పర్యటనలలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కమ్మిన్స్ గైర్హజరీ నేపథ్యంలో అతడికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఆస్ట్రేలియా క్రికెట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మార్ష్ గత కొంత కాలంగా జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడికి అద్భుతమైన ఆటతో పాటు కెప్టెన్సీ చేసే సత్తా కూడా ఉంది. బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్స్కార్చర్స్ కెప్టెన్‌గా మార్ష్ వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా టెస్టులు, వన్డేల్లో ఆసీస్ జట్టుకు ప్యాట్ కమ్మిన్స్ సారథ్యం వహిస్తుండగా.. టీ20ల్లో మాత్రం కంగారు జట్టుకు శాశ్వత కెప్టెన్ లేడు. ఈ ఏడాది ఆరంభంలో ఆరోన్ ఫించ్ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక క్రికెట్ ఆస్ట్రేలియా అతడి స్ధానాన్ని ఇంకా భర్తీ చేయలేదు. ఈ క్రమంలో మిచిల్ మార్ష్ ఆసీస్ టీ20 కెప్టెన్ రేసులో అందరి కంటే ముందున్నాడు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. చదవండి: Asia cup 2023: ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ కీలక నిర్ణయం.. మాజీ కెప్టెన్‌కు! -
ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్.. స్వదేశానికి మిచెల్ మార్ష్
-
ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. స్వదేశానికి వెళ్లనున్న ఆల్‌రౌండర్.. కారణమిదే
IPL 2023- Mitchell Marsh: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్వదేశానికి పయనం కానున్నాడు. ఐపీఎల్-2023 సీజన్లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ వెల్లడించాడు. మార్ష్ త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నాడని.. అందుకే అతడు ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడని పేర్కొన్నాడు. పూర్తిగా నిరాశపరిచాడు ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో మార్ష్ భాగమయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఈ పేస్ ఆల్‌రౌండర్ డకౌట్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే, ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం దక్కించుకున్న మార్ష్.. విజయ్ శంకర్‌ను అవుట్ చేసి తన ఖాతాలో ఓ వికెట్ జమచేసుకున్నాడు. గర్ల్‌ఫ్రెండ్‌తో రెండేళ్ల క్రితం ఎంగేజ్మెంట్! ఇదిలా ఉంటే.. గర్ల్‌ఫ్రెండ్ గ్రెటా మ్యాక్‌తో మార్ష్ రెండేళ్ల క్రితం నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లికి ఈనెలలోనే ముహుర్తం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు పయనం కానున్న మార్ష్ కొన్ని వారాలు జట్టుకు దూరం కానున్నాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌ను రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది. గువాహటి వేదికగా ఇరు జట్లు ఏప్రిల్ 8న మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన హోప్స్.. మార్ష్ పెళ్లి విషయాన్ని వెల్లడిస్తూ.. కొన్ని మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నట్లు తెలిపాడు. చదవండి: IPL 2023: 'టైమూ పాడూ లేదు.. చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది' View this post on Instagram A post shared by Mitch Marsh (@mitchmarsh235) -
హర్దిక్ సూపర్ డెలివరీ.. పాపం మార్ష్! మిడిల్ స్టంప్ ఎగిరిపోయిందిగా..
చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిప్పులు చెరుగుతున్నాడు. స్టార్ పేసర్లు షమీ, సిరాజ్ చేతులెత్తేసిన చోట.. హార్దిక్ ప్రత్యర్ధి జట్టుకు చుక్కలు చూపిస్తున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు హెడ్, మిచెల్ మార్ష్ అద్భుతమైన శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్ని విధాల ప్రయత్నించాడు. పవర్‌ప్లేలో ముగ్గురు బౌలర్లనుమార్చినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇటువంటి సమయంలో బంతిని రోహిత్ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేతికి ఇచ్చాడు. అయితే రోహిత్ నమ్మకాన్ని హార్దిక్ వమ్ము చేయలేదు. వేసిన తొలి ఓవర్లోనే దూకుడుగా ఆడుతున్న హెడ్‌ను పాండ్యా పెవిలియన్‌కు పంపాడు. అనంతరం ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను కూడా ఓ అద్భుతమైన బంతితో పాండ్యా ఔట్ చేశాడు. హార్దిక్ సూపర్ డెలివరి.. మిచెల్ మార్ష్ క్లీన్ బౌల్డ్ ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియాకు మరో బిగ్ వికెట్‌ను హార్దిక్ అందించాడు. 47 పరుగులతో భారీ ఇన్నింగ్స్ దిశగా దూసుకుపోతున్న మిచెల్ మార్ష్‌ను ఓ అద్భుతమైన బంతితో హార్దిక్ క్లీన్ బౌల్డ్ చేశాడు. హార్దిక్ ఔట్ సైడ్ ఆఫ్ వేసిన బంతిని మార్ష్ కవర్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి థిక్ ఎడ్జ్ తీసుకుని స్టంప్స్‌ను గిరాటేసింది. కాగా ఆ ముందు బంతినే మార్ష్ బౌండరీకి తరలించాడు. తర్వాతి బంతిని కూడా ఫోర్ బాదాలని ప్రయత్నించిన మార్ష్ తన వికెట్‌ను కోల్పోయాడు. ఇక మ్యాచ్‌లో ఇప్పటివరకు 4 ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. #INDvsAUS3rdODI pic.twitter.com/UyUDAkZFa1 — Sanju Here 🤞👻 (@me_sanjureddy) March 22, 2023 .@hardikpandya7 picks up two quick wickets as Travis Head and Steve Smith depart. Watch the two dismissals here 👇👇#INDvAUS @mastercardindia pic.twitter.com/65yyVrPR2f — BCCI (@BCCI) March 22, 2023 చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. కోహ్లి లుంగీ డ్యాన్స్ అదిరిపోయిందిగా! వీడియో వైరల్ -
Ind Vs Aus: భారత్‌తో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ల రీఎంట్రీ
India Vs Australia ODI Series 2023 Squads: టీమిండియాతో వన్డే సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయాల నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్లు గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ మార్ష్ సహా పేసర్ జై రిచర్డ్సన్ పునరాగమనం చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ప్రకటన విడుదల చేసింది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి అనుభవజ్ఞులతో సహా మార్నస్ లబుషేన్, సీన్ అబాట్ తదితరులకు జట్టులో చోటిచ్చింది. కాగా మార్చి 17 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్ ముంబై మ్యాచ్‌తో సిరీస్‌కు తెరలేవనుండగా.. వైజాగ్(మార్చి 19), చెన్నై(మార్చి 22)లో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక ఇప్పటికే బీసీసీఐ ఆసీస్‌తో సిరీస్‌కు వన్డే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల మొదటి మ్యాచ్‌కు దూరం కానుండగా.. హార్దిక్ పాండ్యా సారథిగా వ్యవహరించనున్నాడు. టెస్టుల్లో వరుస ఓటములు ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా మార్చి 1-5, మార్చి 9-13 తేదీల్లో ఇండోర్, అహ్మదాబాద్‌లలో ఆఖరి రెండు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులో గెలిచిన టీమిండియా ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు.. రెండో టెస్టు తర్వాత అత్యవసరంగా స్వదేశానికి పయనమైన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తిరిగి వస్తాడా లేదా అన్న సందేహాలు నెలకొనగా.. తాజా ప్రకటన అతడి రాకపై క్లారిటీ ఇచ్చింది. టీమిండియాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (సి), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, జై రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్. చదవండి: T20 WC 2023: ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారా? టీమిండియా పటిష్ట జట్టు: ఆసీస్ కెప్టెన్ Virat Kohli: కోహ్లిపై ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్.. పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే.. ఫ్యాన్స్ ఫైర్ -
ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్సీ రేసులో నేను లేను: మార్ష్
ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ వన్డేలకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇంకా ఇప్పటి వరకు ఫించ్ స్థానంలో ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా ఎవరిని నియమించలేదు. ఈ క్రమంలో ఫించ్ వారుసుడిగా ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ మిచిల్ మార్ష్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడని వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై మార్ష్ తాజాగా స్పందించాడు. కెప్టెన్సీపై తనకు ఆసక్తి లేదని, తన వ్యక్తిగత ఆటను మెరుగుపరచుకోవడంపై దృష్టి సారిస్తానని మార్ష్ స్పష్టం చేశాడు. ఈఎస్పీన్ క్రిక్ఇన్ఫోతో మార్ష్ మాట్లాడుతూ.. "నిజంగా వన్డే కెప్టెన్సీ రేసులో నేను లేను. ప్రస్తుతం నా దృష్టి అంతా టీ20 ప్రపంచకప్‌పైనే. మరో సారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడానికి మాకు ఇది మంచి అవకాశం. ఇటువంటి సమయంలో కెప్టెన్సీ గురించి అస్సలు నేను ఆలోచించను. ఈ మెగా ఈవెంట్లో నా ఆటతీరును మరింత మెరుగుపరుచుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత వన్డే కెప్టెన్సీ గరుంచి క్రికెట్ ఆస్ట్రేలియా ఓ నిర్ణయం తీసుకుంటుంది" అని పేర్కొన్నాడు. కాగా మార్ష్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో ఆసీస్ జట్టులో భాగంగా ఉన్నాడు. చదవండి: IND vs SA: ఢిల్లీలో భారీ వర్షాలు.. మూడో వన్డే జరిగేనా? -
టీమిండియాతో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!
స్వదేశంలో జింబాబ్వేతో రెండో వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా రెండో వన్డేకు దూరమయ్యాడు. మరోవైపు వచ్చే నెలలో భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కూడా మార్ష్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. మార్ష్ ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఇక అతడి స్థానంలో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ జట్టులోకి వచ్చాడు. కాగా ఇరు జట్లు మధ్య రెండో వన్డే టౌన్స్ విల్లే వేదికగా ఆగస్టు 31 (బుధవారం)న జరగనుంది. కాగా తొలి వన్డేలో మార్ష్ పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో ఆరు ఓవర్లు వేసిన మార్ష్ 22 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. కాగా తొలి వన్డేలో జింబాబ్వేపై ఆసీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చదవండి: IND vs PAK: రోజుకు 150 సిక్స్‌లు కొడుతున్నా అన్నావు.. ఇప్పుడు ఏమైంది భయ్యా నీకు? -
శ్రీలంకతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్..!
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచిల్ మార్ష్ గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొలంబోలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 సమయంలో మార్ష్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. దీంతో పల్లెకెలె వేదికగా జరిగిన మూడో టీ20కి మార్ష్ దూరమయ్యాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు వారాలు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే పల్లెకెలె వేదికగా జాన్ 14న జరగనుంది. మరోవైపు శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా వన్డే జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్ , డేవిడ్ వార్నర్ చదవండి: SL vs AUS: టీ20ల్లో చరిత్ర సృష్టించిన శ్రీలంక.. తొలి జట్టుగా..! -
మార్ష్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్న ఆటగాళ్లు వీరే!
ఐపీఎల్-2022 సీజన్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా మార్ష్‌ను ఢిల్లీ క్యాపిటిల్స్ 6.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఒక వేళ ఐపీఎల్‌కు మార్ష్ దూరమైతే ఢిల్లీకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మార్ష్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్న ఆటగాళ్లను ఓ సారి పరిశీలిద్దాం. బెన్ మెక్‌డెర్మోట్ ఆస్ట్రేలియా ఆటగాడు మెక్‌డెర్మోట్ అద్భుతమైన టీ20 ఆటగాడు. గత రెండు బిగ్‌బాష్ సీజన్‌ల్లో మెక్‌డెర్మోట్ అద్భుతంగా రాణించాడు. 2020 సీజన్లో 402 పరుగులు, 2021 సీజన్లో 577 పరుగులు సాధించాడు. అదేవిధంగా ఈ ఏడాది స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోను మెక్‌డెర్మోట్ రాణించాడు. 5 మ్యాచ్‌లు ఆడిన అతడు 93 పరుగులు సాధించాడు. కాగా రూ.50 లక్షల కనీస ధరతో ఐపీఎల్-2022 వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. కాగా టీ20ల్లో అతడికి ఉన్న రికార్డుల దృష్ట్యా ఢిల్లీ మెక్డెర్మోట్ని భర్తీ చేసే అవకాశం ఉంది. దాసున్ షనక శ్రీలంక పరిమిత ఓవర్ల కెప్టెన్ దసున్ షనక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మార్ష్ స్థానంలో సరైన ఎంపిక అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో షనక అద్భుతంగా రాణించాడు. 3 మ్యాచ్‌ల్లో 124 పరుగులు సాధించాడు. మోయిసెస్ హెన్రిక్స్ ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ బిగ్ బాష్ లీగ్‌లో అద్భుతంగా రాణించాడు. గత ఏడాది సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన హెన్రిక్స్ 440 పరుగులు సాధించాడు. హెన్రిక్స్ బ్యాట్‌తో పాటు బాల్‌తో కూడా రాణించగలడు. ఐపీఎల్లో హెన్రిక్స్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2017 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున 277 పరుగులు సాధించాడు. మార్ష్‌కు ప్రత్యమ్నాయంగా హెన్రిక్స్‌ను తీసుకునే అవకాశం ఉంది. చదవండి: IPL 2022: ఎవరీ ఆయుష్ బదోని.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు -
దుమ్మురేపిన మిచెల్ మార్ష్; థ్రిల్లింగ్ మ్యాచ్‌లో సూపర్ విక్టరీ
సెంట్ లూసియా: ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో(75 పరుగులు, 3 వికెట్లు) ఆస్రేలియా విండీస్ పర్యటనలో ఎట్టకేలకు విజయాన్ని దక్కించుకుంది. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని దక్కించుకుంది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (75, 44 బంతులు; 4 ఫోర్లు, 6 సిక్సర్లతో) దుమ్మురేపగా.. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 53 పరుగులతో అతనికి సహకరించాడు. ఇక చివర్లో క్రిస్టియన్ 22 పరుగులతో మెరిశాడు. విండీస్ బౌలర్లలో హెడెన్ వాల్ష్ 3 వికెట్లతో మెరవగా.. థామస్, రసెల్, అలెన్‌లు ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లు సిమన్స్, ఎవిన్ లూయిస్ తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే 31 పరుగులు చేసిన లూయిస్ జంపా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇక గత మ్యాచ్ హీరో క్రిస్ గేల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి మిచెల్ మార్ష్ వెనక్కి పంపాడు. మరోఎండ్‌లో సిమన్స్ మాత్రం దాటిగా ఆడుతూ రన్‌రేట్ ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఫ్లెచర్, నికోలస్ పూరన్‌లు స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. ఆ తర్వాత 72 పరుగులు చేసిన సిమన్స్ కూడా వెనుదిరిగాడు. చివర్లో రసెల్, పాబియెన్ అలెన్‌లు కొన్ని భారీ షాట్లతో మెప్పించారు. ఆఖరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో అలెన్ ఔట్ కావడంతో విండీస్ విజయానికి గండి పడింది. రసెల్ 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఆసీస్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ 3, ఆడమ్ జంపా 2, రిలే మెరిడిత్ ఒక వికెట్ తీశారు. ఇప్పటికే సిరీస్‌ను దక్కించుకున్న విండీస్ 3-1తో ఆధిక్యంలో ఉంది. ఇక చివరి టీ20 శుక్రవారం( జూలై 16న) జరగనుంది.