వన్డే ప్రపంచకప్-2023లో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ను అద్బుతమైన విజయంతో ఆస్ట్రేలియా ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా పుణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 307 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 44.4 ఓవర్లలలోనే ఊదిపడేసింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 132 బంతులు ఎదుర్కొన్న మార్ష్ 17 ఫోర్లు, 9 సిక్స్‌లతో 177 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మార్ష్.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.క్రీజులో అడుగుపెట్టనప్పటినుంచే బౌండరీలు వర్షం కురిపించాడు.
అతడితో పాటు డేవిడ్ వార్నర్(53), స్టీవ్ స్మిత్(63 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో టాస్కిన్ అహ్మద్, ముస్తిఫిజర్ రెహ్మాన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో హృదయ్(74) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాంటో(45), లిటన్ దాస్(36) పరుగులతో రాణించారు.
చదవండి: WC 2023: వరల్డ్‌కప్‌లో దారుణ ప్రదర్శన.. పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్‌బై..!
Comments
Please login to add a commentAdd a comment