ICC ODI WC 2023- Warner- Marsh 100s Against Pakistan: వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఇద్దరూ శతక్కొట్టారు. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఫోర్లు, సిక్సర్ల వర్షం
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కంగారూ జట్టు ఓపెనర్లు మార్ష్, వార్నర్ మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడారు. చక్కటి సమన్వయంతో సింగిల్స్ తీస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. పాకిస్తాన్ ఫీల్డర్ల తప్పిదాలను క్యాష్ చేసుకుంటూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
ఈ క్రమంలో 21వ ఓవర్ రెండో బంతికే 150 పరుగులు భాగస్వామ్యం నమోదు చేసిన మార్ష్, వార్నర్.. 31వ ఓవర్లో ఇద్దరూ శతకాలు సాధించారు. పాక్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో నాలుగో బంతికి వార్నర్ 100 పరుగుల మార్కు అందుకోగా.. ఆ మరుసటి బంతికే మార్ష్ ఫోర్ బాది శతకం పూర్తి చేసుకున్నాడు.
పాకిస్తాన్‌పై వరుసగా నాలుగోది.. బర్త్‌డే బాయ్‌కు మొదటి వరల్డ్‌కప్ సెంచరీ
ఇక వెటరన్ ఓపెనర్ వార్నర్‌కు ఇది పాకిస్తాన్‌పై వరుసగా నాలుగో సెంచరీ కాగా.. మిచెల్ మార్ష్ పుట్టినరోజును ఇలా హండ్రెడ్‌తో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరు వన్డే వరల్డ్‌కప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఆస్ట్రేలియా తరఫున ప్రపంచకప్ ఈవెంట్లో తొలిసారి సెంచరీలు నమోదు చేసిన ఓపెనింగ్ జోడీగా మార్ష్, వార్నర్ నిలిచారు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన నాలుగో జంటగా రికార్డులకెక్కారు. అంతకు ముందు ఈ ఫీట్ నమోదు చేసిన ఓపెనింగ్ జోడీలు..
►2011- ఉపుల్ తరంగ- తిలకరత్నె దిల్షాన్(శ్రీలంక)- జింబాబ్వే మీద- పల్లెకెలో
►2011 క్వార్టర్ ఫైనల్- ఉపుల్ తరంగ- తిలకరత్నె దిల్షాన్(శ్రీలంక)- ఇంగ్లండ్ మీద- కొలంబోలో
►2019- రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్(ఇండియా)- శ్రీలంక మీద- లీడ్స్‌లో
►తాజాగా.. 2023- డేవిడ్ వార్నర్- మిచెల్ మార్ష్- పాకిస్తాన్ మీద- బెంగళూరులో.
►కాగా పాకిస్తాన్ మీద వరల్డ్‌కప్‌లో ఇలా ఓ జట్టు ఓపెనర్లు ఇద్దరూ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. దీంతో మార్ష్, వార్నర్ కారణంగా పాక్ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది.
చదవండి: WC 2023: టీమిండియాకు షాక్! బీసీసీఐ కీలక ప్రకటన.. వైస్ కెప్టెన్ అవుట్.. ఇక
Comments
Please login to add a commentAdd a comment