డేవిడ్‌ వార్నర్‌, మార్ష్‌ విధ్వంసం.. పాకిస్తాన్‌ టార్గెట్‌ 368 పరుగులు | Afridi Five For Helps PAK Limit AUS To 367 After 259 Run Opening Stand | Sakshi
Sakshi News home page

CWC PAK vs AUS: డేవిడ్‌ వార్నర్‌, మార్ష్‌ విధ్వంసం.. పాకిస్తాన్‌ టార్గెట్‌ 368 పరుగులు

Published Fri, Oct 20 2023 6:04 PM | Last Updated on Fri, Oct 20 2023 6:50 PM

Afridi Five For Helps PAK Limit AUS To 367 After 259 Run Opening Stand - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా బెంగళూరు వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా  అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగుల స్కోర్‌ సాధించింది. ఆసీస్‌ బ్యాటర్లలో ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ విధ్వంసకర శతకాలతో చెలరేగారు. 

వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 259 పరుగుల భారీ బాగస్వామ్యం నెలకొల్పారు. వార్నర్‌ 124 బంతుల్లో  14 ఫోర్లు, 9 సిక్స్‌లతో 163 పరుగులు చేయగా. మార్ష్‌ 108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్స్‌లతో 121 పరుగులు సాధించాడు. అయితే ఓ దశలో 400 మార్క్‌ సులభంగా దాటేలా కన్పించిన ఆసీస్‌.. మిడిలార్డర్‌ విఫలమకావడంతో 365 పరుగులకే పరిమితమైంది.  పాక్‌ బౌలర్లలో షాహీన్‌ షా అఫ్రిది ఐదు వికెట్లు పడగొట్టగా.. హ్యారీస్‌ రవూఫ్‌ మూడు, ఉస్మా మీర్‌ ఒక్క వికెట్‌ సాధించారు.
చదవండి: WC 2023 PAK vs AUS: పాకిస్తాన్‌పై సూపర్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన డేవిడ్‌ వార్నర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement