పాకిస్తాన్‌తో తొలి టీ20లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టాడు. పాక్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. కేవలం పందొమ్మిది బంతుల్లోనే 43 పరుగులు సాధించాడు. 226కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేసిన మాక్సీ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.
ఇక మాక్సీతో పాటు మరో ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం ఏడు బంతుల్లోనే రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత ఏడు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.
కాగా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచి పాకిస్తాన్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా టీ20 సిరీస్ మొదలైంది.
గాబా స్టేడియంలో గురువారం నాటి ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో టీ20ని ఏడు ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ ఆసీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఓపెనర్లు మాథ్యూ షార్ట్(7), జేక్ ఫ్రేజర్ మెగర్క్(9).. అదే విధంగా టిమ్ డేవిడ్(10) విఫలం కాగా.. మాక్సీ, స్టొయినిస్ దంచికొట్టారు.
చరిత్ర పుటల్లోకి!
ఇక పాక్‌తో తొలి టీ20 సందర్భంగా మాక్స్‌వెల్ పొట్టి ఫార్మాట్లో పది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా పురుషుల క్రికెట్‌లో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదహారో బ్యాటర్‌గా.. అదే విధంగా మూడో ఆసీస్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. మాక్సీ (10012) కంటే ముందు డేవిడ్ వార్నర్(12411), ఆరోన్ ఫించ్(11458) ఆస్ట్రేలియా తరఫున పదివేల పరుగుల క్లబ్‌లో చేరారు.
'This is why people pay a lot of money to watch this guy bat' #AUSvPAK pic.twitter.com/Zwab5Pnw3j
— cricket.com.au (@cricketcomau) November 14, 2024
Comments
Please login to add a commentAdd a comment