Marcus Stoinis
-
వరల్డ్ నంబర్ వన్‌గా ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు
ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్‌స్టోన్ ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించాడు. ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటి.. ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి.. నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. తన కెరీర్లోనే అత్యుత్తమంగా 253 రేటింగ్ పాయింట్లతో లివింగ్‌స్టోన్ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా స్టార్ మార్కస్ స్టొయినిస్(211 రేటింగ్ పాయింట్లు)ను అగ్రస్థానం నుంచి వెనక్కి నెట్టి.. అతడికి అందనంత ఎత్తులో నిలిచాడు. కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో లివింగ్‌స్టోన్ అదరగొట్టాడు.ఆసీస్‌తో సిరీస్‌లో అదరగొట్టిసౌతాంప్టన్లో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటర్‌గా 37 పరుగులు చేయడంతో పాటు.. 22 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్లు తీసిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. రెండో టీ20లో విశ్వరూపం ప్రదర్శించాడు. కార్డిఫ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లోనే 87 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్.. కేవలం 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. నంబర్ వన్ బ్యాటర్ అతడేతద్వారా ఇంగ్లండ్‌ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ సిరీస్‌లో ఆసీస్- ఇంగ్లండ్ చెరో మ్యాచ్ గెలవగా.. మూడో టీ20 వర్షం కారణంగా రద్దైంది. కాగా 2017లో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 31 ఏళ్ల లివింగ్‌స్టోన్.. ఇప్పటి వరకు ఒక టెస్టు, 25 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 16, 558, 815 పరుగులు చేయడంతో పాటు.. వన్డేల్లో 17, టీ20లలో 29 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఐసీసీ టీ20 బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ట్రవిస్ హెడ్ తన టాప్ ర్యాంకును మరింత పదిలం చేసుకోగా.. లివింగ్‌స్టోన్ 17 స్థానాలు మెరుగుపరచుకుని 33వ ర్యాంకు సంపాదించాడు. బౌలర్ల టాప్-5 యథాతథంఇక బౌలర్ల విషయానికొస్తే.. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నంబర్ వన్‌గా కొనసాగుతుండగా.. వెస్టిండీస్ పేసర్ అకీల్ హొసేన్, అఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ బౌలర్ గుడకేశ్ మోటీ, శ్రీలంక వనిందు హసరంగ టాప్-5లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అయితే, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ అన్రిచ్ నోర్జేను వెనక్కినెట్టి ఆరోస్థానానికి చేరుకున్నాడు. కాగా టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా నుంచి హార్దిక్ పాండ్యా ఒక్కడే టాప్-10(ఏడో స్థానం)లో ఉన్నాడు.ఐసీసీ తాజా టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్- టాప్ 51. లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్)- 252 రేటింగ్ పాయింట్లు2. మార్కస్ స్టొయినిస్(ఆస్ట్రేలియా)- 211 రేటింగ్ పాయింట్లు3. సికందర్ రజా(జింబాబ్వే)- 208 రేటింగ్ పాయింట్లు4. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)- 206 రేటింగ్ పాయింట్లు5. వనిందు హసరంగ(శ్రీలంక)- 206 రేటింగ్ పాయింట్లు.చదవండి: నాకంటే నీకే బాగా తెలుసు కదా: కోహ్లికి షాకిచ్చిన గంభీర్! -
స్టోయినిస్ ఆల్‌రౌండ్ షో.. సునీల్ నరైన్ మాయాజాలం (3-0-3-3)
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ టోర్నీలో సర్రే జాగ్వర్స్కు ప్రాతనిథ్యం వహిస్తున్న స్టోయినిస్.. టోరంటో నేషనల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో ఆతర్వాత బంతితో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాగ్వర్స్.. స్టోయినిస్ హాఫ్ సెంచరీతో (37 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. జాగ్వర్స్ ఇన్నింగ్స్‌లో కైల్ మేయర్స్ (27), విరన్‌దీప్ సింగ్ (23 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సునీల్ నరైన్ (2), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (18), శ్రేయస్ మొవ్వ (4), మొహమ్మద్ నబీ (13) నిరాశపరిచారు. టోరంటో బౌలర్లలో రోహిద్ ఖాన్, జునైద్ సిద్దిఖీ తలో రెండు వికెట్లు, రొమారియో షెపర్డ్, జతిందర్‌పాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టోరంటో.. స్టోయినిస్ (4-1-19-3), సునీల్ నరైన్ (3-0-3-3), మొహమ్మద్ నబీ (2-0-6-2), బెన్ లిస్టర్ (3-0-14-1), హర్మీత్ సింగ్ (2.1-0-18-1) దెబ్బకు 17.1 ఓవర్లలో 81 పరుగులకు ఆలౌటైంది. టోరంటో ఇన్నింగ్స్‌లో ఉన్ముక్త్ చంద్ (21), డస్సెన్ (15), కిర్టన్ (11), రోహిత్ పౌడెల్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. భారీ హిట్టర్లు రోస్టన్ ఛేజ్ (8), కొలిన్ మున్రో (4), రొమారియో షెపర్డ్ దారుణంగా విఫలమయ్యారు.కాగా, గ్లోబల్ టీ20 కెనడా అనే టోర్నీ కెనడా వేదికగా జరిగే క్రికెట్ లీగ్. ఈ లీగ్‌లోనూ మిగతా లీగ్‌లలో లాగే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెటర్లు పాల్గొంటారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు (మాంట్రియాల్ టైగర్స్, టోరంటో నేషనల్స్, సర్రే జాగ్వర్స్, బ్రాంప్టన్ వోల్వ్స్, బంగ్లా టైగర్స్, వాంకోవర్ నైట్స్) పాల్గొంటాయి. లీగ్ మ్యాచ్‌ల అనంతరం తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి. ప్రస్తుత సీజన్ ఈనెల 25న మొదలైంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో మాంట్రియల్ టైగర్స్ టాప్‌లో ఉంది. ఈ లీగ్‌లో డేవిడ్ వార్నర్, మార్కస్ స్టోయినిస్, సునీల్ నరైన్, కార్లోస్ బ్రాత్‌వైట్, మొహమ్మద్ ఆమిర్, మొహమ్మద్ నబీ, కైల్ మేయర్స్, క్రిస్ లిన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, టిమ్ సీఫర్ట్, నవీన్ ఉల్ హక్, షకీబ్ అల్ హసన్, రహ్మానుల్లా గుర్బాజ్, డస్సెన్, కొలిన్ మున్రో, రొమారియో షెపర్డ్ లాంటి టీ20 స్టార్లు పాల్గొంటున్నారు. -
T20 World Cup 2024: ఆస్ట్రేలియా విజయం.. సూపర్-8లో ఇంగ్లండ్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా స్కాట్లాండ్తో ఇవాళ (జూన్ 16) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. ఛేదనలో ఆస్ట్రేలియా మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఓటమితో స్కాట్లాండ్ వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించింది.గ్రూప్-బిలో స్కాట్లాండ్తో సమానంగా ఐదు పాయింట్లు ఉన్న ఇంగ్లండ్ నెట్ రన్‌రేట్ ఆధారంగా సూపర్-8కు అర్హత సాధించింది. ఆసీస్-స్కాట్లాండ్ మ్యాచ్‌కు ముందు నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3.611 రన్‌రేట్‌తో ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. స్కాట్లాండ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రాతో 1.255 రన్‌రేట్ చొప్పున ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. గ్రూప్-బి నుంచి ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆస్ట్రేలియా ఎనిమిది పాయింట్లతో (2.791 రన్‌రేట్‌తో) అగ్రస్థానంలో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (60), బెర్రింగ్టన్ (42 నాటౌట్), మున్సే (35) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 2, ఆస్టన్ అగర్, నాథన్ ఇల్లిస్, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (68), మార్కస్ స్టోయినిస్ (59), టిమ్ డేవిడ్ (24 నాటౌట్) చెలరేగడంతో 19.4 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్, షరీఫ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాడ్ వీల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
T20 World Cup 2024: ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసిన స్టోయినిస్.. బోణీ కొట్టిన ఆసీస్
టీ20 వరల్డ్‌కప్ 2024 జర్నీని ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది. గ్రూప్-బిలో పసికూన ఒమన్‌తో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మార్కస్ స్టోయినిస్ ఆల్‌రౌండ్ షోతో (67 నాటౌట్, 3/19) ఇరగదీసి ఆసీస్‌ను గెలిపించాడు. స్టోయినిస్ దెబ్బకు అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న ఒమన్ విలవిలలాడిపోయింది.వివరాల్లోకి వెళితే.. బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఒమన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్) ఆదుకున్నారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హెడ్ (12), మిచెల్ మార్ష్ (14), మ్యాక్స్‌వెల్ (0) నిరాశపరిచారు. ఈ మ్యాచ్‌లో ఒమన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది. మెహ్రాన్ ఖాన్ 2, బిలాల్ ఖాన్, కలీముల్లా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. జంపా (4-0-24-2), ఇల్లిస్ (4-0-28-2), స్టార్క్ (3-0-20-2) కూడా సత్తా చాటారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన అయాన్ ఖాన్ టాప్ స్కోరర్‌గా నిలువగా..మరో ముగ్గురు రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
IPL: సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన స్టొయినిస్..
లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగిన 34 ఏళ్ల ఈ ఆసీస్ స్టార్.. పదేళ్లుగా వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై- లక్నో మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సేన విజయం సాధించింది. సొంతమైదానంలోనే చెన్నైని ఆరు వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. లక్నో గెలుపులో స్టొయినిస్దే కీలక పాత్ర.Have a look at those emotions 🥳The Lucknow Super Giants make it 2/2 this season against #CSK 👏👏Scorecard ▶️ https://t.co/MWcsF5FGoc#TATAIPL | #CSKvLSG | @LucknowIPL pic.twitter.com/khDHwXXJoF— IndianPremierLeague (@IPL) April 23, 2024సీఎస్కే విధించిన 211 లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆరంభంలోనే ఓపెనర్లు క్వింటన్ డికాక్(0), కేఎల్ రాహుల్(16) వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. తానున్నానంటూ స్టొయినిస్ బ్యాటెత్తాడు.మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు 26 బంతుల్లోనే అర్ధ శతకం, 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 63 బంతులు ఎదుర్కొని 124 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక స్టొయినిస్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉండటం విశేషం.Maiden #TATAIPL century ✅Highest T20 chase at Chepauk ✅Double over #CSK ✅Highest individual score in an IPL chase ✅#CSKvLSG #TATAIPL #IPLonJioCinema #MarcusStoinis pic.twitter.com/imjZQcLXa7— JioCinema (@JioCinema) April 23, 2024కాగా ఐపీఎల్ 17 ఏళ్ల చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌పై నమోదైన వ్యక్తిగత స్కోరు స్టొయినిస్దే. అంతకు ముందు 2014లో వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై మీద 122 పరుగులు సాధించాడు. నాడు పంజాబ్ కింగ్స్ తరఫున ముంబైలోని వాంఖడే వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సెహ్వాగ్ ఈ మేరకు పరుగులు రాబట్టాడు.అయితే, చెపాక్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో స్టొయినిస్.. సెహ్వాగ్ పేరిట ఉన్న ఈ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాదు.. నికోలస్ పూరన్(34), దీపక్ హుడా(6 బంతుల్లో 17 నాటౌట్)తో కలిసి లక్నోను విజయతీరాలకు చేర్చి మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ రన్ ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(124*) సాధించిన ఆటగాడిగా స్టొయినిస్ చరిత్రకెక్కాడు. చదవండి: CSK vs LSG: అతడు అద్భుతం.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం: గైక్వాడ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
CSK Vs LSG: అతడు అద్భుతం.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం!
‘‘ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. అయితే, మ్యాచ్ మాత్రం బాగా సాగింది. లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతంగా ఆడింది. 13- 14 ఓవర్ల వరకు మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది.అయితే, స్టొయినిస్ గొప్ప ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. పిచ్ మీద తేమ ఎక్కువగా ఉంది. అందుకే మా స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. లేదంటే ఫలితం వేరేలా ఉండేది.అయినా.. ఆటలో ఇవన్నీ సహజమే. కొన్ని విషయాలు మన ఆధీనంలో ఉండవు. పవర్ ప్లేలోనే రెండో వికెట్ కోల్పోయిన వేళ జడ్డూ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది.పవర్ ప్లే తర్వాత వికెట్ పడితే శివం దూబేను రంగంలోకి దించాలని ముందుగానే నిర్ణయించుకున్నాం. అందుకు అనుగుణంగానే మా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. మేము ఇంకొన్ని పరుగులు చేస్తే బాగుండేది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇంత తేమ కనిపించలేదు. ఏదేమైనా ఎల్ఎస్జీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే. వాళ్లు మెరుగ్గా ఆడినందువల్లే పైచేయి సాధించగలిగారు’’ అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.ఓటమికి కారణం అదేఇంకాస్త మెరుగైన స్కోరు సాధిస్తే బాగుండేదని.. మార్కస్ స్టొయినిస్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగానే మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్లో తొలుత లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిన సీఎస్కేకు.. సొంత మైదానం చెపాక్‌లోనూ చేదు అనుభవం ఎదురైంది.తమకు కంచుకోట అయిన చెపాక్‌లో చెన్నై భారీ స్కోరు సాధించినా దానిని నిలబెట్టుకోలేకపోయింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్(60 బంతుల్లో 108 నాటౌట్)తో దుమ్ములేపగా.. శివం దూబే(27 బంతుల్లో 66) మరోసారి ధనాధన్ దంచికొట్టాడు.What an incredible innings by Ruturaj Gaikwad !! Had people getting out right & left but made sure to be play well & be there right till the end ! A super century as he made 108* today 👏🏻 a true captain's innings!#LSGvsCSK • #RuturajGaikwad • #CSKvLSGpic.twitter.com/YdDSvde6w5— ishaan (@ixxcric) April 23, 2024వీరిద్దరి సూపర్ ఇన్నింగ్స్ కారణంగా.. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆదిలోనే ఓపెనర్లు క్వింటన్ డికాక్(0), కెప్టెన్ కేఎల్ రాహుల్(16) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.అయితే, వన్‌డౌన్ బ్యాటర్ మార్కస్ స్టొయినిస్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 63 బంతుల్లో 124 పరుగులతో అజేయంగా నిలిచి సీఎస్కే ఓటమిని శాసించాడు. మిగతా వాళ్లలో నికోలస్ పూరన్ 15 బంతుల్లో 34 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో 19.3 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసిన లక్నో.. చెన్నై కంచుకోటలో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఐదో విజయం అందుకుని టాప్-4లోకి చేరుకుంది.Have a look at those emotions 🥳The Lucknow Super Giants make it 2/2 this season against #CSK 👏👏Scorecard ▶️ https://t.co/MWcsF5FGoc#TATAIPL | #CSKvLSG | @LucknowIPL pic.twitter.com/khDHwXXJoF— IndianPremierLeague (@IPL) April 23, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిష్ విరోచిత శతకంతో చెలరేగాడు. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ వంటి వారు విఫలమైన చోట స్టోయినిష్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. 211 పరుగుల భారీ లక్ష్య చేధనలో సీఎస్కే బౌలర్లను స్టోయినిష్ ఓ ఆట ఆడుకున్నాడు. తన విధ్వంసకర సెంచరీతో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న స్టోయినిష్ 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 124 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో సీఎస్కేపై లక్నో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక సెంచరీతో మెరిసిన స్టోయినిష్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖిచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే విజయవంతమైన రన్ ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా స్టోయినిష్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు పాల్ వాల్తాటి పేరిట ఉండేది. 2011 ఐపీఎల్ సీజన్లో సీఎస్కేపై లక్ష్య చేధనలో వాల్తాటి 120 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో 124 పరుగులు చేసిన స్టోయినిష్.. వాల్తాటి ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. MARCUS STOINIS... THE HULK. 💪 - The winning celebrations from Stoinis and LSG says everything. 🔥pic.twitter.com/iGBHDNWDSU — Mufaddal Vohra (@mufaddal_vohra) April 23, 2024 -
స్టొయినిస్ విధ్వంసం
చెన్నై: నాలుగు రోజుల క్రితం లక్నో వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ఇప్పుడు చెన్నైలో రీప్లేగా జరిగిన పోరులో లక్నోనే మళ్లీ ‘సూపర్’గా ఆడి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో 6 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకాన్ని నమోదు చేశాడు. ‘హిట్టర్’ శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కస్ స్టొయినిస్ (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్స్‌లు) అసాధారణ ఇన్నింగ్స్‌తో అజేయ సెంచరీ సాధించి లక్నోను విజయతీరాలకు చేర్చాడు. పూరన్‌తో నాలుగో వికెట్‌కు 70 పరుగులు, దీపక్ హుడాతో అబేధ్యమైన ఐదో వికెట్‌కు 55 పరుగులు జోడించిన స్టొయినిస్ లక్నోకు చిరస్మరణీయ విజయం అందించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్... రహానే (1), వన్‌డౌన్‌లో మిచెల్ (11), జడేజా (16) చెన్నై టాప్–4 బ్యాటర్లలో ముగ్గురి స్కోరిది! పవర్ ప్లేలో చెన్నై చేసిన స్కోరు 49/2 తక్కువే! ఈ దశలో కెప్టెన్ రుతురాజ్ బౌండరీలతో పరుగుల వేగాన్ని అందుకున్నాడు. గైక్వాడ్ 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 11.3 ఓవర్లలో వందకు చేరింది. అదే ఓవర్లో జడేజా నిష్క్రమించడంతో వచ్చిన దూబే ఓ రకంగా శివతాండవమే చేశాడు. 15 ఓవర్లలో చెన్నై 135/3 స్కోరు చేసింది. కానీ ఆ తర్వాత దూబే పవర్‌ప్లే మొదలైంది. భారీ సిక్సర్లతో స్కోరు ఒక్కసారిగా దూసుకెళ్లింది. 16వ ఓవర్లో దూబే హ్యాట్రిక్ సిక్స్‌లతో 19 పరుగులు, 18వ ఓవర్లో గైక్వాడ్ 6, 4, 4లతో 16 పరుగులు, 19వ ఓవర్లో మళ్లీ దూబే దంచేయడంతో 17 పరుగులు, ఆఖరి ఓవర్లో 15 పరుగులతో స్కోరు 200 పైచిలుకు చేరింది. చివరి 5 ఓవర్లలో దూబే వికెట్ మాత్రమే కోల్పోయిన చెన్నై 75 పరుగులు సాధించింది. గైక్వాడ్ 56 బంతుల్లో శతకాన్ని, దూబే 22 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నారు. బ్యాటింగ్ గేర్ మార్చి... కొండంత లక్ష్యం ముందున్న లక్నోకు ఆరంభంలో అన్ని ఎదురుదెబ్బలే తగిలాయి. ఓపెనర్లు డికాక్ (0), కేఎల్ రాహుల్ (14 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్), దేవదత్ పడిక్కల్ (19 బంతుల్లో 13) నిరాశపరిచారు. టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన స్టొయినిస్ ఒక్కడే గెలిపించేదాకా మెరిపించాడు. ఈ క్రమంలో 26 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. తర్వాత నికోలస్ పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జోరు పెంచగానే... పతిరణ మరుసటి ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. స్టొయినిస్ 56 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీపక్ హుడా కూడా (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్‌కు పని చెప్పడంతో అనూహ్యంగా లక్నో లక్ష్యం వైపు పరుగు పెట్టింది. 18 బంతుల్లో 47 పరుగుల కష్టమైన సమీకరణం ఇద్దరి దూకుడుతో సులువైంది. 18, 19వ ఓవర్లలో 15 పరుగుల చొప్పున వచ్చాయి. 6 బంతుల్లో 17 పరుగుల్ని స్టొయినిస్ 6, 4, నోబాల్4, 4లతో ఇంకో మూడు బంతులు మిగిల్చి ముగించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) రాహుల్ (బి) హెన్రి 1; రుతురాజ్ (నాటౌట్) 108; మిచెల్ (సి) హుడా (బి) యశ్ 11; జడేజా (సి) రాహుల్ (బి) మోసిన్ 16; దూబే (రనౌట్) 66; ధోని (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–4, 2–49, 3–101, 4–205. బౌలింగ్: హెన్రీ 4–0–28–1, మోసిన్ ఖాన్ 4–0–50–1, రవి బిష్ణోయ్ 2–0–19–0, యశ్ ఠాకూర్ 4–0–47–1, స్టొయినిస్ 4–0–49–0, కృనాల్ పాండ్యా 2–0–15–0. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) దీపక్ 0; రాహుల్ (సి) రుతురాజ్ (బి) ముస్తఫిజుర్ 16; స్టొయినిస్ (నాటౌట్) 124; పడిక్కల్ (బి) పతిరణ 13; పూరన్ (సి) శార్దుల్ (బి) పతిరణ 34; హుడా (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–0, 2–33, 3–88, 4–158. బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–1, తుషార్ 3–0–34–0, ముస్తఫిజుర్ 3.3–0–51–1, శార్దుల్ 3–0–42–0, మొయిన్ అలీ 2–0–21–0, జడేజా 2–0–16–0, పతిరణ 4–0–35–2. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X గుజరాత్ వేదిక: న్యూఢిల్లీ రాత్రి7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
స్టోయినిస్‌కు మొండిచెయ్యి.. కొత్తగా నలుగురికి అవకాశం
2024-25 సంవత్సరానికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించిన 23 మంది ఆటగాళ్ల జాబితాను క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ (మార్చి 28) ప్రకటించింది. ఈ జాబితాలో లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్ మార్కస్ స్టోయినిస్, ఇటీవలే టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్‌కు చోటు దక్కలేదు. వీరితో పాటు ఆస్టన్ అగర్, మార్కస్ హ్యారిస్, మైకేల్ నెసర్, మ్యాట్ రెన్షాలకు కూడా క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్ లభించలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా కొత్తగా నలుగురు ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్ట్ కల్పించింది. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, మ్యాట్ షార్ట్, ఆరోన్ హార్డీ కొత్తగా కాంట్రాక్ట్ పొందిన వారిలో ఉన్నారు. ఈ నలుగురిలో బార్ట్లెట్ తొలిసారి కాంట్రాక్ట్ పొందగా.. మిగతా ముగ్గురు గతంలో వార్షిక కాంట్రాక్ట్ పొందారు. ఈ వార్షిక కాంట్రాక్ట్ టీ20 వరల్డ్‌కప్ అనంతరం అమల్లోకి వస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా 2024-25: సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లాబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, జే రిచర్డ్సన్, మ్యాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
స్టోయినిస్ ఊచకోత.. న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పిన మెల్బోర్న్
బిగ్‌బాష్ లీగ్ 2023లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ అద్భుత విజయం సాధించింది. ఆస్ట్రేలియా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ మెల్బోర్న్ స్టార్స్ సూపర్ విక్టరీ సాధించారు. స్టోయినిస్ ఊచకోతతో (19 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెల్బోర్న్ న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది. స్టోయినిస్ విధ్వంసం ధాటికి అడిలైడ్ నిర్ధేశించిన 206 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. క్రిస్ లిన్ విధ్వంసం.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్.. క్రిస్ లిన్ (42 బంతుల్లో 83 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మాథ్యూ షార్ట్ (32 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృస్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మెల్బోర్న్ కెప్టెన్ మ్యాక్స్‌వెల్ 2 వికెట్లతో రాణించాడు. Brilliant fireworks in Adelaide during BBL match on New Year's Eve.pic.twitter.com/2khkPbaSoO — Mufaddal Vohra (@mufaddal_vohra) December 31, 2023 పోటాపోటీగా విరుచుకుపడిన లారెన్స్, వెబ్‌స్టర్, స్టోయినిస్.. 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్.. డేనియల్ లారెన్స్ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), వెబ్‌స్టర్ (48 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (17 బంతుల్లో 28; 5 ఫోర్లు) పోటాపోటీగా రాణించడంతో 19 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అడిలైడ్ బౌలర్లలో కెమారూన్ బాయ్స్ (4-0-15-1) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ తీశాడు. -
CWC 2023: టీమిండియాతో మ్యాచ్‌కు ముందు గాయపడ్డ ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్
చెన్నై వేదికగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 8) జరుగనున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్విమ్మంగ్ పూల్‌లో గాయపడ్డాడు. కళ్లు మూసుకుని స్విమ్మింగ్ చేసిన జంపా పూల్‌లో ఉన్న మెట్లను గుద్దుకుని గాయాలపాలయ్యాడు. జంపా ముఖంపై, ఇతర చోట్ల గాయాలైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అయితే ఈ స్వల్ప గాయాల కారణంగా జంపా టీమిండియాతో మ్యాచ్‌కు దూరమయ్యే ప్రమాదమేమీ లేదని సీఏ క్లారిటీ ఇచ్చింది. జంపా 100 శాతం ఫిట్‌గా ఉన్నాడని తెలిపింది. కాగా, ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఉపఖండపు స్విమ్మింగ్ పూల్లలో గాయపడటం ఇది కొత్తేమీ కాదు. గతేడాది ఆ జట్టు వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీ కరాచీలోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కిందపడిపోయాడు. ఆ సమయంలో క్యారీ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఘటన తర్వాత క్యారీ బ్యాటింగ్‌లో రెచ్చిపోయాడు. కెరీర్లో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఆ తర్వాత ఆడిన 9 టెస్ట్‌ల్లో 71.83 సగటున పరుగులు చేశాడు. ఈ విషయం గురించి తెలిసిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. పూల్‌లో పడిపోవడం క్యారీకి, ఆసీస్‌కు కలిసొచ్చినట్లుందని అంటున్నారు. ఇదిలా ఉంటే, భారత్‌తో మ్యాచ్‌లో జంపా ఆడటంపై ఎలాంటి అనుమానాలు లేనప్పటికీ.. స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం మాత్రం ఆసీస్‌ను ప్రధానంగా వేధిస్తుంది. గాయాం నుంచి పూర్తిగా కోలుకోని స్టోయినిస్ భారత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం అనుమానమేనని తెలుస్తుంది. మరోవైపు గాయాల బెడద టీమిండియాకు కూడా ప్రధాన సమస్యగా మారింది. అసలే శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేక సతమతమవుతున్న భారత్‌కు హార్దిక్ పాండ్యా చేతి గాయం పెద్ద తలనొప్పిగా మారింది. గత వారం రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న గిల్ ఆసీస్‌తో ఇవాల్టి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం దాదాపుగా ఖరారు కాగా.. హార్దిక్ సైతం గిల్ బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తుంది. అయితే హార్దిక్ గాయంపై కంగారు పడాల్సిన అవసరం లేదని టీమిండియా మేనేజ్మెంట్ చెప్పుకొస్తుంది. ఏదిఏమైనప్నపటికీ.. గిల్, పాండ్యా ఇద్దరూ ఆసీస్‌తో మ్యాచ్‌కు దూరమైతే అది టీమిండియా విజయావకాశాలను భారీ దెబ్బతీస్తుంది. చెన్నైలోని చిదంబరంలో స్టేడియంలో మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది. -
మాథ్యూ వేడ్ వీరవిహారం.. రసెల్, నరైన్ మెరుపులు వృధా
మేజర్ లీగ్ క్రికెట్-2023 సీజన్లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్‌తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యునికార్న్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ (41 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ 2 సిక్సర్లు, బౌండరీతో 20 పరుగులు, స్టోయినిస్ 37 (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోరె ఆండర్సన్ 39 పరుగులు (20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. కెప్టెన్ ఫించ్ 12 పరుగులతో (10 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు పడగొట్టగా.. అలీ ఖాన్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఆరంభంలో జేసన్ రాయ్ (21 బంతుల్లో 45; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీశ్ కుమార్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్).. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (26 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సునీల్ నరైన్ (17 బంతుల్లో 28 నాటౌట్; 3 సిక్సర్లు) రాణించినప్పటికీ నైట్‌రైడర్స్ విజయతీరాలకు చేరలేకపోయింది. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌లో రిలీ రొస్సో (8) నిరాశపరిచాడు. యునికార్న్స్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, బిష్ణోయ్, ఆండర్సన్ తలో వికెట్ చేజిక్కించుకున్నారు. ఈ ఓటమితో నైట్‌రైడర్స్ లీగ్‌లో హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 2023లో ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. -
ఎక్కువగా వాళ్ల మీదే ఆధారపడ్డారు.. ఫలితం అనుభవించారు.. వచ్చే సీజన్లోనైనా..
IPL 2023- LSG: విదేశీ ఆటగాళ్ల మీద అతిగా ఆధారపడటం లక్నో సూపర్ జెయింట్స్ కొంపముంచిందని టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ అభిప్రాయడపడ్డాడు. అదే సమయంలో దీపక్ హుడా, కృనాల్ పాండ్యా వంటి దేశీ ప్లేయర్లు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోవడం ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్‌తో బుధవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో మరోసారి ఈ విషయం నిరూపితమైందన్నాడు. ఆ ముగ్గురే అద్భుతంగా ఐపీఎల్-2023లో లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌లలో 8 గెలిచిన లక్నో టాప్-3లో నిలిచి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా కృనాల్ పాండ్యా సారథ్య బాధ్యతలు చేపట్టి ముందుకు నడిపించాడు. అయితే, లక్నో గెలిచిన చాలా మ్యాచ్‌లలో విదేశీ ఆటగాళ్లు కైలీ మేయర్స్, నికోలసన్ పూరన్, మార్కస్ స్టొయినిస్లే కీలక పాత్ర పోషించారు. హుడా దారుణంగా మార్కస్ స్టొయినిస్ మొత్తంగా సీజన్లో 15 మ్యాచ్‌లలో 408 పరుగులతో లక్నో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 13 మ్యాచ్‌లు ఆడి 379 పరుగులు సాధించిన కైలీ మేయర్స్ అతడి తర్వాతి స్థానంలో ఉండగా.. పూరన్ 15 మ్యాచ్‌లలో 358 పరుగులతో మూడో స్థానం ఆక్రమించాడు. ఇలా లక్నో టాప్ స్కోరర్లలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లే ఉండటం గమనార్హం. మరోవైపు.. తాత్కాలిక కెప్టెన్, ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా 188 పరుగులు చేయగా.. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన దీపక్ హుడా పూర్తిగా నిరాశపరిచాడు. 12 మ్యాచ్‌లలో అతడు చేసిన మొత్తం పరుగులు కేవలం 84. ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లో మేయర్స్ 18 పరుగులకే పెవిలియన్ చేరగా.. కృనాల్ 8 రన్స్ మాత్రమే చేశాడు. పాపం స్టొయినిస్ ఒంటరి పోరాటం చేస్తున్న స్టొయినిస్(27 బంతుల్లో 40 పరుగులు)ను అనవసరంగా రనౌట్‌కు బలైపోయేలా చేసిన దీపక్ హుడా(15) తాను కూడా రనౌట్ అయి కొంపముంచాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగా లక్ష్య ఛేదనలో తడబడ్డ లక్నో 101 పరుగులకే చేతులెత్తేసింది. 81 పరుగుల తేడాతో ముంబై చేతిలో ఓడి మరోసారి భంగపడింది. కనీసం వచ్చే సీజన్లో అయినా ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం క్రిక్‌బజ్ షోలో భారత మాజీ బౌలర్ మురళీ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘లక్నో ఎక్కువగా విదేశీ ఆటగాళ్ల మీదే ఆధారపడింది. ఆ జట్టులో ఉన్న భారత ఆటగాళ్లలో ఒక్కరు కూడా అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయారు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో స్టొయినిస్ ఒక్కడే కాసేపు పోరాడాడు. వచ్చే సీజన్లోనైనా లక్నో ఈ లోపాలు సరిదిద్దుకోవాలి. ఈ మ్యాచ్‌లో పూరన్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది. స్టొయినిస్ ఆడతాడు అనుకుంటే చెత్తగా రనౌట్ కావాల్సి వచ్చింది’’ అని లక్నో బ్యాటర్ల తీరును విమర్శించాడు. చదవండి: ఆర్సీబీలో నెట్‌బౌలర్‌గా ఉన్నా... ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు! కానీ ఇప్పుడు.. తిలక్ వర్మను టీజ్ చేసిన సూర్యకుమార్.. వీడియో వైరల్ 🖐️/ 🖐️ Akash Madhwal 🤌with his first 5 wicket haul seals victory for @mipaltan in the #Eliminator 🔥#IPLonJioCinema #TATAIPL #IPL2023 #LSGvMI pic.twitter.com/MlvIYTlKev — JioCinema (@JioCinema) May 24, 2023 Plenty of smiles and celebrations after a resounding victory in a crunch game 😃 The Mumbai Indians stay alive and how in #TATAIPL 2023 😎#Eliminator | #LSGvMI | #Qualifier2 | @mipaltan pic.twitter.com/qYPQ1XU1BI — IndianPremierLeague (@IPL) May 25, 2023 -
#DeepakHooda: ఎవరి కర్మకు వారే బాధ్యులు!
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ కథ ఎలిమినేటర్‌లో ముగిసింది. వరుసగా రెండోసారి ఎలిమినేటర్ గండం దాటడంలో లక్నో విఫలమైంది. ముంబై ఇండియన్స్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైన లక్నో 101 పరుగులకే ఆలౌటై చేతులెత్తేసింది. ఫలితంగా భారీ ఓటమిని మూటగట్టుకొని ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. అయితే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల మధ్య సమన్వయ లోపం. ఒక ఇన్నింగ్స్‌లో మూడు రనౌట్లు అయ్యాయంటే వారి బ్యాటింగ్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే యాదృశ్చికంగా ఈ మూడు రనౌట్లకు ప్రధాన కారణం దీపక్ హుడా. మొదటి రెండు రనౌట్లకు తాను కారణమయ్యాడు.. చివరికి కర్మ ఫలితం అన్నట్లుగా తానే రనౌట్‌కు బలవ్వాల్సి వచ్చింది. 40 పరుగులతో నిలకడగా ఆడుతున్న మార్కస్ స్టోయినిస్ రనౌట్ కావడానికి ప్రధాన కారణం హుడానే. బంతిపై దృష్టి పెట్టి ఎదుట బ్యాటర్ ఎలా వస్తున్నాడో గమనించకపోగా అతన్నే గుద్దుకోవడంతో స్టోయినిస్ రనౌట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత కృష్ణప్ప గౌతమ్‌ను తన తప్పిదంతో పాటు హుడా ముందుకు పరిగెత్తుకొచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోవడంతో రనౌట్ అయ్యాడు. ఇక ముచ్చటగా మూడోసారి దీపక్ హుడా రనౌట్ అయ్యాడు. ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్నట్లుగా లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా రనౌట్ అయి భారీ నష్టం మిగిల్చాడు. తాను ఆడకపోగా ఇద్దరిని అనవసరంగా రనౌట్ చేసి హుడా పెద్ద తప్పు చేశాడు. ఈ చర్య దీపక్ హుడాను లక్నో జట్టుకు దూరం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. Run out ka Mahual!! Deepak Hooda involved in three run outs!!#LSGvMI #LSGvsMI #IPLFinals #Eliminator #CricketTwitter pic.twitter.com/SNp6Hxiv2A — cricketinsideout (@Cricketinout) May 24, 2023 చదవండి: #Akash Madhwal: దిగ్గజం సరసన.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా -
పరుగుపై పెట్టాల్సిన దృష్టి బంతిపై.. తగిన మూల్యం
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి దిశగా సాగుతుంది. అనవసర ఒత్తిడికి లోనయ్యి వికెట్లు చేజార్చుకుంటున్న లక్నో వరుసగా రెండో సీజన్లోనూ ఎలిమినేటర్‌లోనే ఇంటిబాట పట్టేలా ఉంది. ఇక స్టోయినిస్ రనౌట్ అయిన తీరు అయితే లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో గ్రీన్ వేసిన ఐదో బంతిని స్టోయినిస్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా ఆడాడు. రిస్క్ అయినా రెండు పరుగులు తీసే అవకాశం ఉండడంతో ఇద్దరు వేగంగానే పరిగెత్తారు. సింగిల్ పూర్తి చేసి రెండో పరుగుకు వస్తున్న యత్నంలో అటు దీపక్ హుడా.. ఇటు స్టోయినిస్ ఇద్దరు బంతిపై దృష్టి పెట్టి తమకు తెలియకుండానే ఒక లైన్లో పరిగెత్తి ఎదురుపడ్డారు. దీంతో మిడిల్పిచ్లోకి రాగానే ఇద్దరు ఒకరినొకరు గుద్దుకున్నారు. అప్పటికే బంతిని అందుకున్న టిమ్ డేవిడ్ నేరుగా ఇషాన్ కిషన్‌కు త్రో వేయడం.. వికెట్లను గిరాటేయడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ స్టోయినిస్ బంతిపై దృష్టి పెట్టకుండా పరుగు తీసి ఉంటే రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునేవాడేమో. The collision sums up the game for LSG😵#MarcusStoinis #LSGvsMI #IPL2023 #Cricket pic.twitter.com/kMejyL51Jy — Wisden India (@WisdenIndia) May 24, 2023 When Cricketers turn into Actors 😂#LSGvMI #owned #fixing #runout #stoinis #MumbaiIndians #LucknowSuperGiants pic.twitter.com/wOmYcjNO9J — Sai Teja Kolagani (@SaitejaKolagani) May 24, 2023 చదవండి: ప్లేఆఫ్స్.. ముంబై ఇండియన్స్ పేరిట అరుదైన రికార్డు -
జోర్డాన్‌కు చుక్కలు.. ఐపీఎల్ కెరీర్లో అత్యధిక స్కోరు
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్టోయినిస్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కృనాల్‌తో కలిసి స్టోయినిస్ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో కాస్త మెల్లిగా ఆడినప్పటికి ఒక్కసారి కుదురుకున్నాకా తన బ్యాటింగ్ పవర్‌ను చూపెట్టాడు. 36 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న స్టోయినిస్ ఓవరాల్‌గా 47 బంతుల్లో 89 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆ ఫోర్లు, 8 సిక్సర్ల ఉన్నాయి. 36 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న స్టోయినిస్ తర్వాతి 13 బంతుల్లోనే 39 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇక ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన క్రిస్ జోర్డాన్‌కు స్టోయినిస్ చుక్కలు చూపించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో క్రిస్ జోర్డాన్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ వందకు పైగా ఓవర్లు వేసి అత్యధిక ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా క్రిస్ జోర్డాన్ నిలిచాడు. ఈ జాబితాలో స్టోయినిస్ 9.58 ఎకానమీ రేటుతో తొలి స్థానంలో, సామ్ కరన్ 9.48 రేటతో మూడు, ఆండ్రీ రసెల్ 9.26, శార్దూల్ ఠాకూర్ 9.13తో నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక స్టోయినిస్ 47 బంతుల్లో 89 పరుగులు నాటౌట్‌గా నిలిచి తన ఐపీఎల్ కెరీర్లో అత్యధిక స్కోరును సాధించాడు. ఇంతకముందు స్టోయినిస్ అత్యధిక స్కోరు 72గా ఉంది. లక్నో తరపున స్టోయినిస్ది మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం. తొలి స్థానంలో క్వింటన్ డికాక్ 140 పరుగులు, కేఎల్ రాహుల్ 103* రెండో స్థానంలో ఉన్నాడు. Stoinis stepping up when #EveryGameMatters!💪 Can @MStoinis carry on to lead his team to a formidable total?#TATAIPL #IPLonJioCinema #IPL2023 | @LucknowIPL pic.twitter.com/d1q6aBWHSJ — JioCinema (@JioCinema) May 16, 2023 చదవండి: 'ఆడడమే వ్యర్థమనుకుంటే బ్యాటింగ్‌లో ప్రమోషన్' -
IPL 2023: పూరన్ ఊచకోత.. లక్నో గ్రాండ్ విక్టరీ.. సన్‌రైజర్స్ ఔట్
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ కథ ముగిసింది. లక్నోతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఓడటం ద్వారా సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాయి. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో నాలుగు బంతులుండగానే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 16 ఓవర్ల వరకు తమ వైపు ఉన్న మ్యాచ్‌ను సన్‌రైజర్స్ బౌలర్ అభిషేక్ శర్మ పువ్వుల్లో పెట్టి ప్రత్యర్ధికి అప్పజెప్పాడు. ఆ ఓవర్లో అభిషేక్ 31 పరుగులు (స్టోయినిస్ 2 సిక్సర్లు, పూరన్ హ్యాట్రిక్ సిక్సర్లు) సమర్పించుకోవడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయి, లక్నో వైపు మలుపు తిరిగింది. పూరన్ (13 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు)తో పాటు ప్రేరక్ మన్కడ్ (45 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆతర్వాతి ఓవర్లలో వరుసగా 14, 10, 10, 6 పరుగులు రాబట్టి లక్నోను విజయతీరాలకు చేర్చారు. లక్నో గెలుపులో స్టోయినిస్ (25 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్ (19 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్) తమ వంతు పాత్ర పోషించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28), క్లాసెన్ (47), అబ్దుల్ సమత్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, యుద్ద్‌వీర్ సింగ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఆ జట్టు తదుపరి ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేని పరిస్థితి. మరోవైపు ఇవాళ జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించడంతో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. గుజరాత్ (16), సీఎస్కే (15), ముంబై (14) పాయింట్ల పట్టికలో టాప్ త్రీలో ఉన్నాయి. -
SRH VS LSG: పూనకం వచ్చినట్లు ఊగిపోయిన పూరన్.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు..!
లక్నో మిడిలార్డర్ బ్యాటర్ నికోలస్ పూరన్ మరోసారి పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో క్రీజ్‌లోకి వచ్చీ రాగానే హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అప్పటిదాకా సన్‌రైజర్స్‌కు ఫేవర్‌గా ఉన్న మ్యాచ్‌ను పూరన్.. మూడు బంతుల్లో మలుపు తిప్పాడు. Pooran box-office 🍿pic.twitter.com/dBu4G2P2U7— CricTracker (@Cricketracker) May 13, 2023 వివరాల్లోకి వెళితే.. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ దశలో బరిలోకి దిగిన పూరన్.. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను లక్నోవైపు తిప్పాడు. అభిషేక్ శర్మ వేసిన ఈ ఓవర్లో మొత్తం 31 పరుగులు వచ్చాయి. పూరన్‌కు ముందు స్టోయినిస్ సైతం రెండు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే స్టోయినిస్ అదే ఓవర్లో అభిషేక్ ఉచ్చులో చిక్కి ఔటయ్యాడు. 16 ఓవర్ తర్వాత సమీకరణలు 24 బంతుల్లో 38 పరుగులుగా మారాయి. చేతిలో మరో 7 వికెట్లు ఉండటంతో లక్నో గెలుపుపై ధీమాగా ఉంది. అంతకుముందు ఇదే సీజన్లో పూరన్ ఇదే తరహాలో రెచ్చిపోయి, చేదాటిపోయిన మ్యాచ్‌ను గెలిపించాడు. ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్‌లో పూరన్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి తన జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. ఇదిలా ఉంటే, లక్నోతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28), క్లాసెన్ (47), అబ్దుల్ సమత్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, యుద్ద్‌వీర్ సింగ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది. -
'నేను ఔటయ్యానా?'.. జడ్డూ దెబ్బకు షాక్‌లో స్టోయినిస్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. జడేజా బౌలింగ్ మాయాజాలానికి స్టోయినిస్ షాక్ అయ్యాడు. తాను ఔటయ్యానా అని సందేహం వ్యక్తం చేయడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ జడేజా వేశాడు. ఓవర్ ఐదో బంతిని జఫ్పా వేశాడు. జడ్డూ బంతిని లెగ్‌స్టంప్ దిశగా వేశాడు. స్టోయినిస్ ఫ్లిక్ చేద్దామని యత్నించాడు. కానీ బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో స్టోయినిస్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ విషయం తనకు తెలియక పక్కకు జరిగాడు. కానీ అప్పటికే ధోని, జడ్డూ వద్దకు పరిగెత్తుకెళ్లడం చూసి వెనక్కి తిరిగి చూడగా బెయిల్స్ కిందపడడంతో షాక్ తిన్నాడు. 'ఏంటి నేను ఔటయ్యానా?' అనే సందేహంతో అంపైర్‌వైపు చూడగా ఔట్ అని సిగ్నలిచ్చాడు. దీంతో స్టోయినిస్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేశారు. ''ఔటయ్యానన్న విషయం కూడా తెలియలేదా.. జడ్డూ బౌలింగ్ మయాజాలానికి హ్యాట్సాఫ్'' అంటూ పేర్కొన్నారు. What a peach from Ravindra Jadeja. Marcus Stoinis' reaction says everything about it! pic.twitter.com/6xooN0BAM1 — Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2023 చదవండి: అనుభవం ముందు సిక్సర్ల తెవాటియా పనికిరాలేదు -
లక్నో సూపర్ జెయింట్స్‌కు బిగ్ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు తీవ్ర గాయం
ఐపీఎల్-2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 257 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(72), కైల్ మైర్స్(54), పూరన్(45) విధ్వంసం సృష్టించారు. అనంతరం 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. పంజాబ్ బ్యాటర్లలో యువ ఆటగాడు అథర్వ తైదే 66 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్నో బౌలర్లలో యాష్ ఠాకూర్ నాలుగు వికెట్లు, నవీన్ ఉల్ హాక్ మూడు, బిష్ణోయ్ రెండు, స్టోయినిష్ ఒక వికెట్ సాధించారు. మార్కస్ స్టోయినిష్కు గాయం ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన లక్నో స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిష్.. దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు. పంజాబ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో వేసిన స్టోయినిష్.. ఆదిలోనే కెప్టెన్ శిఖర్ ధావన్‌ను ఓ అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు. అనంతరం మూడో ఓవర్ వేసిన స్టోయినిష్ బౌలింగ్‌లో అథర్వ తైదే స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. అయితే బంతిని ఆపే క్రమంలో ఎడమ చూపుడు వేలికి గాయమైంది. చదవండి: IPL 2023 LSG VS PBKS: ఆ నిర్ణయమే పంజాబ్ కొంపముంచిందట..! దీంతో మైదానంలో నొప్పితో అతడు విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో చికిత్స అందినించప్పటికీ ఫలితం లేకపోయింది. ఆఖరికి స్టోయినిష్ మైదానం వీడాడు. వెంటనే అతడిని స్కానింగ్ తరిలించారు. ఇదే విషయాన్ని స్టోయినిష్ కూడా తెలిపాడు. "ప్రస్తుతానికి బాగానే ఉంది. స్కానింగ్‌కు వెళ్లాను. ఆ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాము" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో స్టోయినిష్ పేర్కొన్నాడు. అయితే స్టోయినిష్ గాయం తీవ్రమైనదిగా తేలితే మాత్రం అతడు తర్వాతి మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. చదవండి: PBKS VS LSG: రెచ్చగొట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు, ఆతర్వాత..! -
#KLRahul: త్వరగా ఔటయ్యి జట్టుకు మేలు చేశావు
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల రాహుల్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతుంది. గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసినప్పటికి నెమ్మదిగా ఆడి లక్నో ఓటమికి కారణమయిన రాహుల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 12 పరుగులే చేసి ఔటైనప్పటికి రాహుల్‌ను విమర్శించడంతో పాటు కొంత మంది అభిమానులు మెచ్చుకోవడం ఆసక్తి కలిగించింది. వాస్తవానికి తొలి బంతికే కేఎల్ రాహుల్ వెనుదిరగాల్సింది. అయితే తైదే క్యాచ్ అందుకోవడంలో విఫలం కావడంతో రాహుల్ బతికిపోయాడు. అయితే ఆ తర్వాత కాసేపటికే రబాడ బౌలింగ్‌లో షారుక్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Photo: IPL Twitter విమర్శించడం ఓకే.. మెచ్చుకోవడం ఏంటి? కేఎల్ రాహుల్‌ను మెచ్చుకోవడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే.. అతను త్వరగా వెనుదిరిగాడు కాబట్టే లక్నో.. పంజాబ్‌తో మ్యాచ్‌లో భారీ స్కోరు చేసింది. కైల్ మేయర్స్ ఇచ్చిన అద్బుత ఆరంభాన్ని స్టోయినిస్, బదోని, నికోలస్ పూరన్‌లు కంటిన్యూ చేశారు. ఒకరిని మించి మరొకరు బ్యాటింగ్ చేసి ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జెయింట్స్ తొలిసారి భారీ స్కోరు చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఒకవేళ కేఎల్ రాహుల్ ఔట్ కాకపోయినా.. మరో ఆరేడు, ఓవర్లు బ్యాటింగ్ చేసేవాడు. అతని జిడ్డు బ్యాటింగ్ కారణంగా స్టోయినిస్, పూరన్‌ల అద్భుత ప్రదర్శన మిస్సయ్యేవాళ్లం. అందుకే రాహుల్ త్వరగా ఔటయ్యి ఒక రకంగా జట్టుకు మేలు చేశాడని అభిమానులు సోషల్‌మీడియాలో ట్రోల్ చేయడం విశేషం. KL Rahul dismissed for 12 runs in 9 balls. Advantage LSG now 🔥#PBKSvsLSG pic.twitter.com/yurToeXJ2t — Utsav 💔 (@utsav045) April 28, 2023 చదవండి: ఏమా విధ్వంసం.. ఇలా ఆడితే డికాక్‌కు కష్టమే! -
మిల్లర్ వికెట్‌తో వంద వికెట్ల క్లబ్లో స్టోయినిస్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మిల్లర్ వికెట్ తీయడం ద్వారా మార్కస్ స్టోయినిస్ టి20ల్లో వంద వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 225 టి20 మ్యాచ్‌ల్లో స్టోయినిస్ ఈ ఘనత సాధించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన స్టోయినిస్.. ఓవర్ ఆఖరి బంతికి మిల్లర్ భారీ షాట్‌కు యత్నించి దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వికెట్‌ను ఖాతాలో వేసుకున్న స్టోయినిస్ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. ఇక స్టోయినిస్ అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే.. 60 వన్డేల్లో 1326 పరుగులతో పాటు 40 వికెట్లు, 51 టి20ల్లో 803 పరుగులతో పాటు 18 వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ అంచనా తప్పయింది. ప్లాట్‌గా ఉన్న పిచ్‌పై పరుగులు రావడం కష్టమైంది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 66, సాహా 47 పరుగులు చేశాడు. -
ఆ ముగ్గురు దిగ్గజాలు క్రికెట్‌ను ఏలేవారేమో!
ఆస్ట్రేలియా విధ్వంసక ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా టి20ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైన స్టోయినిస్ ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్లో బిజీగా గడుపుతున్నాడు. ఐపీఎల్లో కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా ఇవాళ ఎస్ఆర్హెచ్తో లక్నో సూపర్ జెయింట్స్ అమితుమీ తేల్చుకోనుంది. కాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న స్టోయినిస్ ఐపీఎల్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. క్రీడారంగానికి సంబంధించి నీకిష్టమైన ముగ్గురు రిటైర్డ్ ఆటగాళ్ల పేర్లు చెప్పమని అడిగారు. దీనికి స్టోయినిస్.. మాజీ బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకెల జోర్డాన్, గోల్ఫ్ దిగ్గజం టైగర్‌వుడ్స్, బాక్సింగ్ దిగ్గజం మహమూద్ అలీ పేర్లను ఏంచుకున్నాడు. ఒకవేళ ఈ ముగ్గురు ఆయా రంగాల్లో కాకుండా క్రికెట్లో ఆడుంటే ఈ ఆటను కూడా ఏలేవారేమో అని పేర్కొన్నాడు. ఇక తాను, ఆస్టన్ అగర్ యూఎఫ్సీకి పెద్ద అభిమానులమని.. ఎప్పుడు మ్యాచ్‌లు జరిగినా తప్పుకుండా చూస్తామన్నాడు. యూఏఈ వేదికగా జరిగిన 2021 టి20 ప్రపంచకప్ సందర్భంగా గోల్ప్ ఆడడానికి పొవెళ్లాం. అక్కడ యూఎఫ్‌సీ ఛాంపియన్స్‌గా ఫోజు ఇవ్వడం ఇప్పటికి మరిచిపోలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్టోయినిస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో గెలిచి మరొక దాంట్లో ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో గెలిచిన లక్నో.. సీఎస్కే చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. The Christian Bale connection to his social-media post 🤔 3⃣ sportspersons he wished would have played cricket 👌 Who is on his speed dial 📱@MStoinis 𝙐𝙉𝙋𝙇𝙐𝙂𝙂𝙀𝘿 ahead of @LucknowIPL's home game against #SRH tonight 😎 - By @ameyatilak #TATAIPL | #LSGvSRH pic.twitter.com/6lLOpFbkb8 — IndianPremierLeague (@IPL) April 7, 2023 చదవండి: IPL 2023: 'టైమూ పాడూ లేదు.. చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది' -
అభిమానులను పిచ్చోళ్లను చేశారు
టీమిండియా స్టార్.. కింగ్ కోహ్లికి కోపమెక్కువన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అగ్రెసివ్నెస్తో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచాడు. అయితే అందులో చాలా భాగం ఫన్నీవేలోనే కోహ్లిని చూశాం. మ్యాచ్ జరిగేటప్పుడు తాను సీరియస్‌గా ఉండలేనని అందుకే కాస్త హ్యూమర్ జోడించి ఆడుతానంటూ గతంలో చాలాసార్లు పేర్కొన్నాడు. తాజాగా బుధవారం ఆసీసీతో జరిగిన మూడో వన్డేలో కోహ్లి చర్య ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా కోహ్లి, స్టోయినిస్‌ల మధ్య ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పిచ్ స్లో వికెట్‌కు అనుకూలిస్తుండడంతో స్టార్క్‌తో కలిసి మార్కస్ స్టోయినిస్ బంతిని పంచుకున్నాడు. ఇన్నింగ్స్ 21వ ఓవర్లో కేఎల్ రాహుల్, కోహ్లిలు క్రీజులో ఉన్నారు. బంతి వేసిన తర్వాత స్టోయినిస్ కోహ్లిని తన భుజాలతో నెట్టాడు. ఇది గమనించిన కోహ్లి స్టోయినిస్‌కు అడ్డంగా వచ్చి ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. కేవలం కళ్లతోనే ఒకరినొకరు కాసేపు చూసుకున్నారు. ఆ తర్వాత స్టోయినిస్ చిన్నగా నవ్వడంతో అసలు విషయం అర్థమైంది. నిజానికి ఇద్దరి మధ్య గొడవ ఫన్నీగానే జరిగింది. ఇది తెలియని అభిమానులు అరె నిజంగానే ఇద్దరికి గొడవైనట్లుందే అన్నట్లుగా చూశారు. కానీ చివరికి కోహ్లి, స్టోయినిస్‌లు కలిసి అభిమానులను పిచ్చోళ్లను చేశారు. ఇక మ్యాచ్‌లో కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. 72 బంతుల్లో 54 పరుగులు చేసిన కోహ్లి వెనుదిరగ్గానే టీమిండియా ఓటమి దిశగా పయనించింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(40 పరుగులు), జడేజాలు స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో టీమిండియా ఓటమి ఖరారైపోయింది. మూడో వన్డేలో విజయంతో ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. Marcus Stoinis and Virat Kohli 😹👌🤙 !! #ViratKohli𓃵 #stoinis#INDvsAUS #CricketTwitter pic.twitter.com/tqUFT9exNl — Diptiman Yadav (@Diptiman_yadav9) March 22, 2023 Virat Kohli and Marcus Stoinis friendly face-off. pic.twitter.com/I6RcwM1vXK — Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2023 చదవండి: సొంతగడ్డపై బెబ్బులే.. కానీ ఆసీస్‌కు మాత్రం దాసోహం ఇలా అయితే వరల్డ్‌కప్ కొట్టేది ఎలా? -
ఆఖరి బంతికి సిక్సర్ కావాలి, స్ట్రయిక్‌లో స్టోయినిస్.. ఏం జరిగిందంటే..?
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో మరో రసవత్తర సమరం జరిగింది. గబ్బా వేదికగా బ్రిస్బేన్ హీట్-మెల్బోర్న్ స్టార్స్ మధ్య ఇవాళ (జనవరి 22) జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగింది. మెల్బోర్న్ గెలవాలంటే ఆఖరి బంతికి సిక్సర్ బాదాల్సి ఉండింది. స్ట్రయిక్‌లో మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు. గతంలో చాలా సందర్భాల్లో ఆఖరి బంతికి సిక్సర్ బాది తన జట్టును గెలిపించిన స్టోయినిస్ ఈసారి మాత్రం నిరాశపరిచాడు. స్పెన్సర్ జాన్సన్ వేసిన లో ఫుల్ టాస్ బంతిని స్టోయినిస్ భారీ షాట్‌గా మలిచేందుకు విఫలయత్నం చేశాడు. మెల్బోర్న్ కేవలం ఒక్క పరుగుతో మాత్రమే సరిపెట్టుకుని, 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు ఓవర్లో (ఇన్నింగ్స్ 19వ ఓవర్) 21 పరుగులు పిండుకున్న స్టోయినిస్ (23 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), హిల్టన్ కార్ట్‌రైట్ (24 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు) జోడీ ఆఖరి ఓవర్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్.. సామ్ హెయిన్ (41 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), పియర్సన్ (43 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మెల్బోర్న్ బౌలర్లలో లూక్ వుడ్ 2 వికెట్లు పడగొట్టగా.. కౌల్టర్ నైల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఛేదనలో మెల్బోర్న్ సైతం అద్భుతంగా పోరాడినప్పటికీ వారికి విజయం దక్కలేదు. జో క్లార్క్ (32 బంతుల్లో 31; 2 ఫోర్లు), థామస్ రోజర్స్ (20 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), క్యాంప్‌బెల్ (23 బంతుల్లో 25; 2 ఫోర్లు), స్టోయినిస్ (36 నాటౌట్), హిల్టన్ (33 నాటౌట్) తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో మెల్బోర్న్ 3 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. బ్రిస్బేన్ బౌలర్లలో స్వెప్సన్ 2, జేమ్స్ బాజ్లీ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో బ్రిస్బేన్ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 పరాజయాలతో (ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి (13 పాయింట్లు) ఎగబాకింది.