Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్టోయినిస్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కృనాల్‌తో కలిసి స్టోయినిస్ ఇన్నింగ్స్ నిర్మించాడు.
ఈ క్రమంలో కాస్త మెల్లిగా ఆడినప్పటికి ఒక్కసారి కుదురుకున్నాకా తన బ్యాటింగ్ పవర్‌ను చూపెట్టాడు. 36 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న స్టోయినిస్ ఓవరాల్‌గా 47 బంతుల్లో 89 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆ ఫోర్లు, 8 సిక్సర్ల ఉన్నాయి. 36 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న స్టోయినిస్ తర్వాతి 13 బంతుల్లోనే 39 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
ఇక ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన క్రిస్ జోర్డాన్‌కు స్టోయినిస్ చుక్కలు చూపించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో క్రిస్ జోర్డాన్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ వందకు పైగా ఓవర్లు వేసి అత్యధిక ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా క్రిస్ జోర్డాన్ నిలిచాడు. ఈ జాబితాలో స్టోయినిస్ 9.58 ఎకానమీ రేటుతో తొలి స్థానంలో, సామ్ కరన్ 9.48 రేటతో మూడు, ఆండ్రీ రసెల్ 9.26, శార్దూల్ ఠాకూర్ 9.13తో నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇక స్టోయినిస్ 47 బంతుల్లో 89 పరుగులు నాటౌట్‌గా నిలిచి తన ఐపీఎల్ కెరీర్‌లో అత్యధిక స్కోరును సాధించాడు. ఇంతకముందు స్టోయినిస్ అత్యధిక స్కోరు 72గా ఉంది. లక్నో తరపున స్టోయినిస్‌ది మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం. తొలి స్థానంలో క్వింటన్ డికాక్ 140 పరుగులు, కేఎల్ రాహుల్ 103* రెండో స్థానంలో ఉన్నాడు.
Stoinis stepping up when #EveryGameMatters!💪
— JioCinema (@JioCinema) May 16, 2023
Can @MStoinis carry on to lead his team to a formidable total?#TATAIPL #IPLonJioCinema #IPL2023 | @LucknowIPL pic.twitter.com/d1q6aBWHSJ
Comments
Please login to add a commentAdd a comment