highest score
-
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. టీ20ల్లో టాప్ స్కోర్
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 7) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. టీ20ల్లో ఒక్క వ్యక్తిగత హాఫ్ సెంచరీ కూడా లేకుండా అత్యధిక టీమ్ స్కోర్ సాధించిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. 21 ఏళ్ల పొట్టి క్రికెట్ చరిత్రలో ఏ జట్టు కనీసం హాఫ్ సెంచరీ కూడా లేకుండా ఇంత భారీ స్కోర్ చేయలేదు. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు టీ20ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండా అత్యధిక స్కోర్ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండింది. 2007లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండా 221 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ 48 (గిల్‌క్రిస్ట్). MUMBAI INDIANS SCORED THE HIGHEST T20 TOTAL IN HISTORY WITHOUT AN INDIVIDUAL FIFTY...!!! 💥 pic.twitter.com/2i6RsQ1vr2 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2024 ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక స్కోర్ రికార్డు నేపాల్ పేరిట ఉంది. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో ఆ జట్టు మంగోలియాపై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఐపీఎల్ విషయానికొస్తే.. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉంది. ఆరెంజ్ ఆర్మీ ప్రస్తుత సీజన్లోనే ఈ రికార్డు తమ పేరిట లిఖించుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ రికార్డు స్థాయిలో 277 పరుగులు స్కోర్ చేసింది. ఇదే సీజన్లో ఐపీఎల్లో రెండో భారీ స్కోర్ కూడా నమోదైంది. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 272 పరుగులు స్కోర్ చేసింది. THE CRAZIEST FINAL OVER HITTING. 🤯 - Romario Shepherd smashed 4,6,6,6,4,6 against Nortje. 🔥 pic.twitter.com/8enitnQVVH — Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2024 ఢిల్లీతో మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. నోర్జే వేసిన ఆఖరి ఓవర్లో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. -
IPL 2024 DC VS KKR: ఐపీఎల్ చరిత్రలో రెండో భారీ స్కోర్
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు వీరంగం సృష్టించారు. టాపార్డర్ బ్యాటర్లు పోటాపోటీపడి విధ్వంసం సృష్టించారు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతి భారీ స్కోర్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఐపీఎల్లో ఇది రెండో అతి భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. ఓ సీజన్లో 250పైగా స్కోర్లు రెండు సార్లు నమోదు కావడం 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఐపీఎల్ చరిత్రలో టాప్-5 అత్యధిక స్కోర్లు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (277/3): 2024 సీజన్లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ (266/6): 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (263/5): 2013 సీజన్లో పూణే వారియర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ (257/5): 2023 సీజన్లో పంజాబ్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (248/3): 2016 సీజన్లో గుజరాత్ లయన్స్‌పై -
టపాసుల్లా పేలిన టీమిండియా బ్యాటర్లు.. వరల్డ్‌కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్
దీపావళి పర్వదినాన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు టాపాసుల్లా పేలారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు మెరుపు వేగంతో 50 అంతకంటే ఎక్కువ స్కోర్లు చేసి క్రికెట్ అభిమానులకు అసలైన దీపావళి మజాను అందించారు. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) లక్షీ బాంబుల్లా విధ్వంసం సృష్టించగా.. రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) చిచ్చుబుడ్లలా మెరుపు హాఫ్ సెంచరీలతో ఎగిసిపడ్డారు. ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ చేసింది. వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ 400 అంతకంటే ఎక్కువ స్కోర్ చేయడం ఇది రెండోసారి. 2007 వరల్డ్‌కప్‌లో బెర్ముడాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది. బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఆ స్కోర్‌కు మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఓవరాల్‌గా వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోర్ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. ఇదే ఎడిషన్‌లో సఫారీలు శ్రీలంకపై 428 పరుగులు చేశారు. వరల్డ్‌కప్ టాప్-5 అత్యధిక స్కోర్లలో భారత్ రెండు స్థానాల్లో (413, 410) ఉండటం విశేషం. -
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం.. 400కు పైగా స్కోర్ నమోదు
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. అర్జెంటీనా మహిళల జట్టు టీ20ల్లో అత్యధిక టీమ్ స్కోర్‌ను నమోదు చేసింది. చిలీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా రికార్డు స్థాయిలో 427 పరుగులు (వికెట్ నష్టానికి) చేసింది. పొట్టి క్రికెట్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా (పురుషులు, మహిళలు) చరిత్రకెక్కింది. గతంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు బెహ్రయిన్ మహిళల జట్టు పేరిట ఉండేది. ఆ జట్టు 2022లో సౌదీ అరేబియాపై 318 పరుగులు చేసింది. తాజాగా ఈ రికార్డును అర్జెంటీనా బద్దలుకొట్టింది. పురుషుల క్రికెట్ విషయానికొస్తే.. అత్యధిక స్కోర్ రికార్డు నేపాల్ పేరిట ఉంది. తాజాగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లో నేపాల్ టీమ్ 314 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇద్దరు భారీ సెంచరీలు.. అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారి అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారి ఓ రేర్ ఫీట్ నమోదైంది. ఓ ఇన్నింగ్స్‌లో తొలిసారి రెండు సెంచరీలు నమోదయ్యాయి. చిలీతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా మహిళా క్రికెటర్లు లూసియా టేలర్ (84 బంతుల్లో 169; 27 ఫోర్లు), అల్బెర్టీనా గలాన్ (84 బంతుల్లో 145 నాటౌట్; 23 ఫోర్లు) భారీ శతకాలు బాదారు. వీరితో పాటు మరియా (16 బంతుల్లో 40 నాటౌట్; 7 ఫోర్లు) కూడా రాణించడంతో అర్జెంటీనా వికెట్ నష్టానికి 427 పరుగులు చేసింది. ఇంత భారీ స్కోర్ చేసినా అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం విశేషం. Argentina Women have registered the highest total in T20Is (Men's or Women's) with 427/1 against Chile Women and also secured an easy win against them. This surpasses the previous record of 318/1 set by Bahrain Women against Saudi Arabia Women. pic.twitter.com/BjxwpW3V9x — CricTracker (@Cricketracker) October 14, 2023 టీ20ల్లో ఐదుసార్లు.. అంతర్జాతీయ టీ20ల్లో ఓ ఇన్నింగ్స్‌లో 2 సెంచరీలు నమోదవ్వడం ఇదే తొలిసారి అయితే టీ20ల్లో మాత్రం ఈ ఫీట్ ఐదుసార్లు నమోదైంది. 2011లో మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు తొలిసారి నమోదయ్యాయి. ఆతర్వాత 2016 ఐపీఎల్లో ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి సెంచరీలు చేశారు. ఆతర్వాత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో, 2019 ఐపీఎల్లో (సన్‌రైజర్స్ ఆటగాళ్లు బెయిర్‌స్టో (114), డేవిడ్ వార్నర్ (100 నాటౌట్)), 2022లో బల్గేరియాపై ఇద్దరు చెక్ రిపబ్లిక్ ప్లేయర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేశారు. ఎక్స్‌ట్రాలు 73 పరుగులు.. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో చిలీ బౌలర్లు రికార్డు స్థాయిలో 73 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఎక్స్‌ట్రాల రూపంలో ఇన్ని పరుగులు రావడం ఇదే తొలిసారి. టీ20ల్లో అతి భారీ విజయం.. అర్జెంటీనా మహిళల జట్టు అంతర్జాతీయ టీ20ల్లో అతి భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అర్జెంటీనా 427 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన చిలీ 63 పరుగులకే ఆలౌటై, 364 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చిలీ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. ఇద్దరు సున్నా స్కోర్లకే పరిమితమయ్యారు. కేవలం ఒక్కరు (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. చిలీ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాలే (29) అత్యధిక స్కోర్ కావడం విశేషం. చిలీ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు రనౌట్లు కావడం మరో విశేషం. -
జోర్డాన్‌కు చుక్కలు.. ఐపీఎల్ కెరీర్లో అత్యధిక స్కోరు
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్టోయినిస్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కృనాల్‌తో కలిసి స్టోయినిస్ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో కాస్త మెల్లిగా ఆడినప్పటికి ఒక్కసారి కుదురుకున్నాకా తన బ్యాటింగ్ పవర్‌ను చూపెట్టాడు. 36 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న స్టోయినిస్ ఓవరాల్‌గా 47 బంతుల్లో 89 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆ ఫోర్లు, 8 సిక్సర్ల ఉన్నాయి. 36 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న స్టోయినిస్ తర్వాతి 13 బంతుల్లోనే 39 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇక ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన క్రిస్ జోర్డాన్‌కు స్టోయినిస్ చుక్కలు చూపించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో క్రిస్ జోర్డాన్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ వందకు పైగా ఓవర్లు వేసి అత్యధిక ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా క్రిస్ జోర్డాన్ నిలిచాడు. ఈ జాబితాలో స్టోయినిస్ 9.58 ఎకానమీ రేటుతో తొలి స్థానంలో, సామ్ కరన్ 9.48 రేటతో మూడు, ఆండ్రీ రసెల్ 9.26, శార్దూల్ ఠాకూర్ 9.13తో నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక స్టోయినిస్ 47 బంతుల్లో 89 పరుగులు నాటౌట్‌గా నిలిచి తన ఐపీఎల్ కెరీర్లో అత్యధిక స్కోరును సాధించాడు. ఇంతకముందు స్టోయినిస్ అత్యధిక స్కోరు 72గా ఉంది. లక్నో తరపున స్టోయినిస్ది మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం. తొలి స్థానంలో క్వింటన్ డికాక్ 140 పరుగులు, కేఎల్ రాహుల్ 103* రెండో స్థానంలో ఉన్నాడు. Stoinis stepping up when #EveryGameMatters!💪 Can @MStoinis carry on to lead his team to a formidable total?#TATAIPL #IPLonJioCinema #IPL2023 | @LucknowIPL pic.twitter.com/d1q6aBWHSJ — JioCinema (@JioCinema) May 16, 2023 చదవండి: 'ఆడడమే వ్యర్థమనుకుంటే బ్యాటింగ్‌లో ప్రమోషన్' -
లక్నో సూపర్ జెయింట్స్‌ది రికార్డే.. ఆర్సీబీని మాత్రం కొట్టలేకపోయింది
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తమ బ్యాటింగ్ విశ్వరూపాన్ని ప్రదర్శించింది. కేఎల్ రాహుల్ మినహా వచ్చిన బ్యాటర్లంతా బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందు కైల్ మేయర్స్ 24 బంతుల్లోనే 54 పరుగులతో అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వగా.. దానిని స్టోయినిస్, బదోనిలు కంటిన్యూ చేశారు. ముఖ్యంగా స్టోయినిస్ 40 బంతుల్లో 72 పరుగుల విధ్వంసకర ఆటతీరుతో అలరించాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. బదోని 43 పరుగులు చేసి ఔటైన తర్వాత వచ్చిన పూరన్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. 19 బంతుల్లో 45 పరుగులతో తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. Photo: IPL Twitter ఈ దెబ్బకు లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జెయింట్స్‌ది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక మొదటి స్థానంలో ఆర్సీబీ 2013లో పుణే వారియర్స్‌పై 263 పరుగులు చేసింది. మళ్లీ మూడో స్థానంలో ఆర్సీబీనే ఉంది. 2016లో గుజరాత్ లయన్స్‌పై 248 పరుగులు, ఇక నాలుగో స్థానంలో సీఎస్కే 2010లో రాజస్తాన్‌పై 246 పరుగులు.. చివరిగా ఐదో స్థానంలో కేకేఆర్.. 2018లో పంజాబ్ కింగ్స్‌పై 245 పరుగులు చేసింది. ఇక లక్నోకు ఇదే ఐపీఎల్ అత్యధిక స్కోరు కావడం మరో విశేషం. ఇక్కడ మరో అంశంమేమిటంటే ఐపీఎల్లో ఆర్సీబీ రెండుసార్లు అత్యధిక స్కోర్లు ఫీట్ సాధించింది. అయితే 263 పరుగుల అత్యధిక స్కోరు చేసి తొలి స్థానంలో ఉన్న ఆర్సీబీ ఫీట్‌ను మాత్రం అందుకోవడంలో లక్నో విఫలమయింది. ఇక లక్నో, పంజాబ్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 41 బౌండరీలు కౌంట్ అయ్యాయి. ఇందులో 27 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టుగా లక్నో రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో ఆర్సీబీ 42 బౌండరీలు(21 ఫోర్లు, 21 సిక్సర్లు) ఉంది. 263 is unbreakable, Only RCB can break this! 😎🔥#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #PBKSvLSG pic.twitter.com/MRTMqdmS8Z — Royal Challengers Bangalore FC (@RCBxFC) April 28, 2023 Highest team total in IPL history: RCB - 263/5 Vs PWI. LSG - 257/5 Vs PBKS*. RCB - 248/3 Vs GL. 263 is unbreakable, Only RCB can break this! 😎🔥 pic.twitter.com/kYdVxY7CjA — Lokesh Saini (@LokeshViraat18K) April 28, 2023 చదవండి: #KLRahul: త్వరగా ఔటయ్యి జట్టుకు మేలు చేశావు -
ఏప్రిల్ 23.. ఆర్సీబీకి కలిసిరాని రోజు
ఏప్రిల్ 23.. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీకి కలిసిరాని రోజుగా మిగిలిపోనుంది. ఐదేళ్ల క్రితం 2017 ఏప్రిల్ 23న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు (49)ను నమోదు చేసింది. అప్పుడు కేకేఆర్ ఇచ్చిన 131 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైన ఆర్సీబీ టోర్నీ చరిత్రలోనే అత్యల్పో స్కోరు చేసింది. ఇప్పుడు సరిగ్గా అదే రోజు దాదాపు అదే ప్రదర్శనను కనబరుస్తూ తమ రెండో అత్యల్ప స్కోరు సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడి ఆర్సీబీని 68 పరుగులకే కుప్పకూల్చారు. అదే ఏప్రిల్ 23.. కానీ ఇదే ఏప్రిల్ 23న.. ఆర్సీబీకి మంచి రికార్డు ఉంది. 2013లో పుణే వారియర్స్‌పై గేల్ సునామీ ఇన్నింగ్స్ ఆడడంతో ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ 263 పరుగుల అత్యధిక స్కోరు సాధించింది. ఇప్పటికి ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. యునివర్సల్ బాస్ ఆ మ్యాచ్‌లో 17 సిక్సర్లు, 13 ఫోర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి 175 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 131 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. అలా ఒక మంచి రికార్డు ఉన్నప్పటికి.. రెండుసార్లు ఇదే తేదీన అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన ఆర్సీబీకి ఒక రకంగా పీడకలగా మిగిలిపోనుంది. ఒకే తేదీన అటు అత్యల్ప స్కోరు.. ఇటు అత్యధిక స్కోరు చేసిన అరుదైన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. అయితే ఆర్సీబీ ప్రదర్శనపై క్రికెట్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు. ''దయచేసి ఏప్రిల్ 23న ఆర్సీబీకి మ్యాచ్ పెట్టకండి.. ఏప్రిల్ 23తో ఆర్సీబీకి విడదీయరాని బంధం ఏర్పడింది.. ఒకే తేదీన అత్యల్ప స్కోరు.. అత్యధిక స్కోరు.. ఇది ఆర్సీబీకి మాత్రమే సాధ్యం'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: IPL 2022: ఎదురులేని ఎస్ఆర్హెచ్.. ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు IPL 2022: తొలి బంతికే డకౌట్..కోహ్లికి ఏమైంది.. తలదించుకుని పెవిలియన్‌కు! April 23, 2017 - 49 all-out April 23, 2022 - 68 all-out This date has become a nightmare for @RCBTweets 😂#RCBvSRH #RCB #SRH #IPL2022 pic.twitter.com/RsdGpbEeDx — LightsOnMedia (@lightson_media) April 23, 2022 #RCBvSRH #ViratKohli #Bangalore 23rd April 2013 - RCB 263/5 23rd April 2017 - RCB 49 all out 23rd April 2022 - RCB 68 all out Vintage RCB fan on every April 23 : pic.twitter.com/OUCr2LBqHz — Prakhar (@Prakhar_26_19) April 23, 2022 RCB and 23 April never ending love story🥺@RCBTweets @imVkohli #RCB pic.twitter.com/65onStU7dH — VIRATIAN (@viratiansurya) April 23, 2022 -
పేలిన జార్ఖండ్ డైనమైట్లు.. రంజీ చరిత్రలో భారీ స్కోర్ నమోదు
రంజీ ట్రోఫీ చరిత్రలో నాలుగో అత్యధిక టీమ్ స్కోర్ నమోదైంది. 2022 సీజన్లో భాగంగా నాగాలాండ్‌తో జరుగుతున్న ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 880 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. టోర్నీ చరిత్రలో హైదరాబాద్ (1993/94 సీజన్లో ఆంధ్రపై 944/6) పేరిట అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఉండగా, రెండో అత్యధిక టీమ్ స్కోర్ తమిళనాడు (912/6), మూడో అత్యధిక స్కోర్ మధ్యప్రదేశ్ (912/6) పేరిట నమోదై ఉంది. తాజాగా జార్ఖండ్ 31 ఏళ్ల కిందట (1990/91) ముంబై చేసిన 855/ 6 పరుగుల రికార్డును బద్దలు కొట్టి, టోర్నీ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఝర్ఖాండ్ సాధించిన ఈ రికార్డు స్కోర్‌లో 3 శతకాలు, 3 అర్ధ శతకాలు నమోదు కాగా, ఇందులో ఓ ద్విశతకం, ఓ భారీ శతకం ఉంది. 17 ఏళ్ల యువ వికెట్‌కీపర్, 2020 భారత అండర్ 19 ప్రపంచకప్ జట్టు సభ్యుడు కుమార్ కుశాగ్రా డబుల్ సెంచరీ (270 బంతుల్లో 266; 37 ఫోర్లు, 2 సిక్సర్లు)తో విరుచుకుపడగా, నదీమ్ (304 బంతుల్లో 177; 22 ఫోర్లు, 2సిక్సర్లు), విరాట్ సింగ్ (153 బంతుల్లో 107; 13 ఫోర్లు)లు శతకాలు బాదారు. కుమార్ సూరజ్ (92 బంతుల్లో 69; 11 ఫోర్లు, సిక్స్), అంకుల్ రాయ్ (88 బంతుల్లో 59; 7 ఫోర్లు), రాహుల్ శుక్లా (149 బంతుల్లో 85 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు)లు అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిలో రాహుల్ శుక్లా 11వ నంబర్ ఆటగాడిగా వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి అజేయ అర్ధ సెంచరీ సాధించడం విశేషం. జార్ఖండ్ ఇన్నింగ్స్ అనంతరం బరిలోకి దిగిన నాగాలాండ్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. చదవండి: శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం -
సెంచరీ మిస్సయ్యాడు.. అయినా రికార్డు అందుకున్నాడు
విరాట్ కోహ్లి మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. సెంచరీ మిస్ చేసుకున్నప్పటికి సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టులో 79 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత బ్యాట్స్‌మన్ వరుసగా విఫలమైన చోట కోహ్లి మాత్రం మంచి ఇన్నింగ్స్‌తో మెరిశాడు. సెంచరీ చేసి రెండేళ్లు కావొస్తుండడంతో ఈసారి ఇక సెంచరీ కచ్చితంగా కొడుతాడు అనుకున్న సమయంలో 79 పరుగుల వద్ద రబడ బౌలింగ్‌లో వెర్రియేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఒక రికార్డు అందుకున్నాడు. రెండేళ్లుగా సెంచరీ లేని కోహ్లి అప్పటినుంచి ఆడిన టెస్టుల్లో చూసుకుంటే అత్యధిక స్కోరు 74గా ఉంది. 2020 జనవరిలో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ స్కోరు చేశాడు. తాజాగా కేప్‌టౌన్ వేదికగా సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టులో 79 పరుగులు చేసి అత్యధిక స్కోరు సాధించాడు. -
టి20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ తరపున తొలి బ్యాటర్‌గా
Najib Zadran Highest Individual Score T20 Wc History.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ బ్యాటర్ నజీబ్ జర్దన్ అరుదైన రికార్డు సాధించాడు. టి20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ తరపున అత్యధిక స్కోరు సాధించిన జాబితాలో నజీబ్ జర్దన్ తొలి స్థానంలో నిలిచాడు. కివీస్‌తో మ్యాచ్‌లో అఫ్గాన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన దశలో నజీబ్ తన ఇన్నింగ్స్‌తో అఫ్గాన్ గౌరవప్రదమైన స్కోరు చేసేందుకు సహకరించాడు. 48 బంతుల్లో 73 పరుగులు సాధించిన నజీబ్ జర్దన్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు.. 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక అహ్మద్ షెహజాద్ టి20 ప్రపంచకప్‌లో రెండుసార్లు అఫ్గాన్ తరపున అత్యధిక స్కోరు నమోదు చేశాడు. 2014 టి20 ప్రపంచకప్‌లో హాంకాంగ్‌పై 68 పరుగులు.. 2016 టి20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్పై 61 పరుగులు సాధించాడు. ఇక మాజీ ఆటగాడు అస్గర్ అఫ్గాన్ 2016 టి20 ప్రపంచకప్‌లో శ్రీలంకపై 62 పరుగులు చేశాడు. -
టీ20 లీగ్‌లో భారీ స్కోరు నమోదు
అనంతపురం : ఆంధ్ర టి20 లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో భారీ స్కోరు నమోదైంది. శనివారం అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసిన టైటాన్స్ జట్టు 81 పరుగులతో వారియర్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టైటాన్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 264 పరుగుల భారీ స్కోరు చేసింది. ఎస్. తరుణ్ (28 బంతుల్లో 68; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో చెలరేగగా.. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షోయబ్ మొహమ్మద్ ఖాన్ (45) ఆకట్టుకున్నాడు. హేమంత్ (30), క్రాంతి కుమార్ (37), సలేష్ (22), డి. చైతన్య (30) రాణించారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన వారియర్స్ ఎలెవన్ 18.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. సాయిరామ్ (38 బంతుల్లో 60; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే పోరాడాడు. కె. క్రాంతి (26), ప్రణీత్ (21), కరన్ (22) పరవాలేదనిపించారు. లెజెండ్స్ ఎలెవన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ 6 వికెట్లతో గెలుపొందింది. మొదట లెజెండ్స్ ఎలెవన్ 19.5 ఓవర్లలో 136 పరుగులు చేసింది. కరన్ షిండే (38), చరణ్ సాయితేజ (25) రాణించారు. 137 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నరేన్ రెడ్డి (40 నాటౌట్) ఆకట్టుకున్నాడు. -
టీ20ల్లో రెండో అత్యధిక స్కోర్ నమోదు
-
భారత మహిళల ప్రపంచ రికార్డు!
సాక్షి, ముంబై : అంతర్జాతీయ టీ20ల్లో భారత మహిళా జట్టు రికార్డు స్కోర్ నమోదు చేసింది. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 4 వికెట్లు కోల్పోయి198 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో అత్యధిక స్కోర్‌గా రికార్డుకెక్కింది. 2010లో నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా 205/1 పరుగులతో ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా(191/3), న్యూజిలాండ్ (188/3), ఇంగ్లండ్ (187/5) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి . ఈ ఏడాదే గత దక్షిణాఫ్రికా పర్యటనలో 168/3 పరుగుల స్కోరు చేసిన హర్మన్ ప్రీత్ సేన తాజా స్కోర్‌తో అధిగమించింది. ఇక భారత మహిళల బ్యాటింగ్‌లో స్మృతి మంధాన 76( 40 బంతులు, 12 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగవంతమైన హాఫ్‌సెంచరీకి తోడు మిథాలీ రాజ్ 53(43 బంతుల్లో 7 ఫోర్లు) రాణించడంతో భారీ స్కోరు నమోదైంది. -
ఓపెనర్‌గా వరల్డ్ రికార్డు..
-
ఓపెనర్‌గా వరల్డ్ రికార్డు..
న్యూఢిల్లీ:రంజీ ట్రోఫీలో వరల్డ్ రికార్డు నమోదైంది. గుజరాత్ ఓపెనర్ సమిత్ గోయెల్ విశ్వరూపం ప్రదర్శించి వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. ఒడిశాతో జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో సమిత్ ట్రిపుల్ సెంచరీతో రికార్డులెక్కాడు. 723 బంతుల్లో 45 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 359 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో ఓపెనర్ గా 117 ఏళ్ల వరల్డ్ రికార్డును బద్ధలు కొట్టాడు. అంతకుముందు 1899 లో ఓవల్ లో సర్రే ఆటగాడు బాబీ అబెల్ నమోదు చేసిన 357 పరుగులే ఇప్పటివరకూ ఓపెనర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు. గుజరాత్ రెండో ఇన్నింగ్స్ లో భాగంగా సమిత్ 964 నిమిషాల పాటు క్రీజ్‌లో నిల్చుని ఈ రికార్డు సాధించాడు. చివరి రోజు ఆటలో భాగంగా మంగళవారం 261 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన సమిత్ ఆద్యంతం సమయోచితంగా ఆడాడు. సుమారు 180 పరుగులను ఫోర్ల రూపంలో సమిత్ సాధించడం ఇక్కడ విశేషం. సమిత్ గోయెల్ ట్రిపుల్ తో గుజరాత్ 227.4 ఓవర్లలో 641 పరుగులు చేసింది. దాంతో గుజరాత్ 706 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి ఒడిశా వికెట్ నష్టానికి 81 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.