
ఫైల్ ఫోటో
అనంతపురం : ఆంధ్ర టి20 లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారీ స్కోరు నమోదైంది. శనివారం అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసిన టైటాన్స్ జట్టు 81 పరుగులతో వారియర్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టైటాన్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 264 పరుగుల భారీ స్కోరు చేసింది. ఎస్. తరుణ్ (28 బంతుల్లో 68; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో చెలరేగగా.. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షోయబ్ మొహమ్మద్ ఖాన్ (45) ఆకట్టుకున్నాడు. హేమంత్ (30), క్రాంతి కుమార్ (37), సలేష్ (22), డి. చైతన్య (30) రాణించారు.
అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన వారియర్స్ ఎలెవన్ 18.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. సాయిరామ్ (38 బంతుల్లో 60; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే పోరాడాడు. కె. క్రాంతి (26), ప్రణీత్ (21), కరన్ (22) పరవాలేదనిపించారు. లెజెండ్స్ ఎలెవన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ 6 వికెట్లతో గెలుపొందింది. మొదట లెజెండ్స్ ఎలెవన్ 19.5 ఓవర్లలో 136 పరుగులు చేసింది. కరన్ షిండే (38), చరణ్ సాయితేజ (25) రాణించారు. 137 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నరేన్ రెడ్డి (40 నాటౌట్) ఆకట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment