IPL 2024 DC VS KKR: ఐపీఎల్‌ చరిత్రలో రెండో భారీ స్కోర్‌ | IPL 2024: KKR Scored Second Highest Total In IPL History Vs Delhi Capitals | Sakshi
Sakshi News home page

IPL 2024 DC VS KKR: ఐపీఎల్‌ చరిత్రలో రెండో భారీ స్కోర్‌

Published Wed, Apr 3 2024 9:50 PM | Last Updated on Thu, Apr 4 2024 9:12 AM

IPL 2024: KKR Scored Second Highest Score In IPL History Vs Delhi Capitals - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 3) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ బ్యాటర్లు వీరంగం సృష్టించారు. టాపార్డర్‌ బ్యాటర్లు పోటాపోటీపడి విధ్వంసం సృష్టించారు. ఫలితంగా ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో అతి భారీ స్కోర్‌ నమోదైంది. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. సునీల్‌ నరైన్‌ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్‌ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్‌ (8 బంతుల్లో 26; ఫోర్‌, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఐపీఎల్‌లో ఇది రెండో అతి భారీ స్కోర్‌.

ఇదే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్‌ చేసిన స్కోర్‌ (277/3) ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. ఓ సీజన్‌లో 250పైగా స్కోర్లు రెండు సార్లు నమోదు కావడం 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. 

ఐపీఎల్‌ చరిత్రలో టాప్‌-5 అత్యధిక స్కోర్లు..

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (277/3): 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై
  • కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (266/6): 2024 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై
  • రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (263/5): 2013 సీజన్‌లో పూణే వారియర్స్‌పై
  • లక్నో సూపర్‌ జెయింట్స్‌ (257/5): 2023 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై
  • రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (248/3): 2016 సీజన్‌లో గుజరాత్‌ లయన్స్‌పై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement