భారత మహిళల ప్రపంచ రికార్డు! | Indian Women Cricketers Creates World Record In T20 | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 25 2018 12:34 PM | Last Updated on Sun, Mar 25 2018 6:28 PM

Indian Women Cricketers Creates World Record In T20 - Sakshi

మిథాలీ రాజ్‌, స్మృతి మంధాన

సాక్షి, ముంబై : అంతర్జాతీయ టీ20ల్లో భారత మహిళా జట్టు రికార్డు స్కోర్‌ నమోదు చేసింది. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 4 వికెట్లు కోల్పోయి198 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో ఇది  రెండో అత్యధిక స్కోర్‌గా రికార్డుకెక్కింది. 2010లో నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా 205/1 పరుగులతో ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా(191/3), న్యూజిలాండ్‌ (188/3), ఇంగ్లండ్‌ (187/5)  తర్వాతి స్థానాల్లో ఉన్నాయి .

ఈ ఏడాదే గత దక్షిణాఫ్రికా పర్యటనలో 168/3 పరుగుల స్కోరు చేసిన హర్మన్‌ ప్రీత్‌ సేన తాజా స్కోర్‌తో అధిగమించింది. ఇక భారత మహిళల బ్యాటింగ్‌లో  స్మృతి మంధాన 76( 40 బంతులు, 12 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగవంతమైన హాఫ్‌సెంచరీకి తోడు మిథాలీ రాజ్‌ 53(43 బంతుల్లో 7 ఫోర్లు) రాణించడంతో భారీ స్కోరు నమోదైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement