Indian women cricket team
-
స్మృతి సారథ్యంలో...
న్యూఢిల్లీ: ఐర్లాండ్‌తో స్వదేశంలో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ టీమ్‌కు స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన టి20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు స్మృతినే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. విండీస్‌తో వన్డే పోరులో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన పేస్ బౌలర్ రేణుకా సింగ్‌కు కూడా విరామం ఇచ్చారు. విండీస్‌తో సిరీస్‌లో అరంగేట్రం చేసిన ప్రతీక, తనూజ తమ స్థానాలను నిలబెట్టుకోగా... రాఘ్వీ బిస్త్‌కు తొలిసారి వన్డే టీమ్ పిలుపు దక్కింది. భారత వన్డే టీమ్‌లోకి ఎంపికైనా మ్యాచ్ ఆడని సయాలీ సత్ఘరేకు మరో అవకాశం దక్కింది. మరోవైపు ఇప్పటికే స్థానం కోల్పోయిన షఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్‌లపై మాత్రం సెలక్టర్లు ఇంకా విశ్వాసం ఉంచలేదు. రాజ్‌కోట్‌లో ఈ నెల 10, 12, 15 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఇప్పటి వరకు భారత్, ఐర్లాండ్ మధ్య 12 వన్డేలు జరగ్గా...అన్నీ భారత్ గెలిచింది. జట్టు వివరాలు: స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్‌కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, ఉమా ఛెత్రి, రిచా ఘోష్, తేజల్ హసబ్నిస్, రాఘ్వీ బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజ కన్వర్, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, సయాలీ సత్ఘరే. -
వడోదరలో జరిగిన పోరులో అదరగొట్టిన భారత మహిళల జట్టు
-
విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం
భారత క్రికెటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసింది. తద్వారా ప్రపంచ రికార్డును రిచా సమం చేసింది. కాగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు వెస్టిండీస్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.నవీ ముంబైలోఈ క్రమంలో నవీ ముంబై వేదికగా టీ20 సిరీస్ మొదలుకాగా.. ఆదివారం నాటి తొలి మ్యాచ్‌లో భారత్, రెండో టీ20లో విండీస్ జట్లు గెలిచాయి. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. గురువారం నాటి మూడో టీ20 నిర్ణయాత్మకంగా మారింది. ఇక కీలక మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది.స్మృతి ధనాధన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి రికార్డు స్థాయిలో 217 పరుగులు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన(47 బంతుల్లో 77, 13 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ అర్ధ శతకంతో చెలరేగగా.. జెమీమా రోడ్రిగ్స్(31), రాఘవి బిస్త్(31*) ఫర్వాలేదనిపించారు.రిచా ర్యాంపేజ్.. వరల్డ్ రికార్డు సమంఅయితే, ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ రాగానే.. ఒక్కసారిగా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కేవలం 18 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న రిచా.. మహిళల టీ20 క్రికెట్లో ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వరల్డ్ రికార్డును సమం చేసింది. అంతకు ముందు సోఫీ డివైన్, లిచ్‌ఫీల్డ్ ఈ ఘనత సాధించగా.. రిచా వారి వరల్డ్ రికార్డును సమం చేసింది. అయితే, అలియా అలెన్ బౌలింగ్‌లో చినెల్లె హెన్రీకి క్యాచ్ ఇవ్వడంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్(21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు)కు తెరపడింది.రాధా యాదవ్ దూకుడుఇక లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌కు భారత బౌలర్లుకు చుక్కలు చూపించారు. రాధా యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రేణుకా సింగ్, టిటస్ సాధు, దీప్తి శర్మ, సజీవన్ సజన ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.వీరంతా కలిసి తమ అద్భుత బౌలింగ్‌తో వెస్టిండీస్‌ను 157 పరుగులకే కట్టడి చేయడంతో.. భారత మహిళా జట్టు 60 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. తద్వారా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. రిచా ఘోష్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.చదవండి: అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ A 60-run victory in the Third and Final T20I! 🥳#TeamIndia win the decider in style and complete a 2⃣-1⃣ series victory 👏👏Scorecard ▶️ https://t.co/Fuqs85UJ9W#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/SOPTWMPB3E— BCCI Women (@BCCIWomen) December 19, 2024 -
Ind vs WI: సిరీస్ విజయంపై కన్నేసిన భారత్
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు.. రెండో గెలుపుపై కన్నేసింది. ఇరు జట్ల మధ్య మంగళవారం జరిగే రెండో టీ20లో గెలిస్తే ఈ సిరీస్ హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ఖాతాలో చేరుతుంది. మరోవైపు గత మ్యాచ్‌లో ఓటమి నుంచి కోలుకొని మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని విండీస్ మహిళలు భావిస్తున్నారు.ఇక ముంబై వేదికగా తొలి టీ20లో భారత బ్యాటర్లంతా రాణించడం చెప్పుకోదగ్గ సానుకూలాంశం. ఓపెనర్ స్మృతి మంధాన దూకుడుగా ఆడి అర్ధసెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ముఖ్యంగా ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో వన్డేల్లో చిత్తుగా ఓడిన తర్వాత స్వదేశంలో దక్కిన ఈ విజయం జట్టులో ఉత్సాహాన్ని పెంచింది. అయితే ఫీల్డింగ్‌లో టీమ్ కాస్త పేలవ ప్రదర్శన కనబర్చింది.తొలి మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు మూడు సునాయాస క్యాచ్‌లు వదిలేశారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ చక్కటి బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేయగా... టిటాస్ సాధు వికెట్లు పడగొట్టింది. ప్రధాన పేసర్ రేణుకా సింగ్ కూడా సత్తా చాటాల్సి ఉంది. స్వల్ప లోపాలు ఉన్నా... బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శనతో చెలరేగితే మరో విజయం కష్టం కాబోదు.మరోవైపు వెస్టిండీస్ కూడా బ్యాటింగ్‌లో బలంగానే ఉంది. ముఖ్యంగా డియాండ్రా డాటిన్ గత మ్యాచ్ తరహాలోనే ధాటిగా ఆడగల సమర్థురాలు. ఖియానా జోసెఫ్ కూడా తొలి టీ20లో రాణించింది. వీరితో పాటు కెప్టెన్, ఓపెనర్ హేలీ మాథ్యూస్ కూడా తన స్థాయికి తగినట్లు ఆడితే విండీస్ బలం పెరుగుతుంది. -
Ind vs WI: భారత టీ20, వన్డే జట్ల ప్రకటన.. స్టార్ పేసర్‌పై వేటు
వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో భారత మహిళల జట్టు ఎంపికలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నిలకడగా ఆడుతున్న హైదరాబాద్ పేసర్ అరుంధతీ రెడ్డిపై సెలక్షన్ కమిటీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.అరుంధతీ రెడ్డిపై వేటు.. కారణం?కాగా సొంతగడ్డపై భారత్ వెస్టిండీస్ మహిళల జట్టుతో టీ20, వన్డే సిరీస్ ఆడనున్న తరుణంలో అనుభవజ్ఞురాలైన అరుంధతీ రెడ్డిని తప్పించారు. రెండు ఫార్మాట్లలోనూ ఆమెకు ఉద్వాసన పలకడం గమనార్హం. నిజానికి జట్టులో చోటు కోల్పోయేంత పేలవంగా ఆమె ప్రదర్శన అయితే లేదు. కుదురుగా బౌలింగ్ చేస్తున్న ఆమె వికెట్లు లేదంటే పరుగుల కట్టడితో ఆకట్టుకుంటోంది. అయినప్పటికీ వేటు వేయడం గమనార్హం.వారిద్దరికి తొలిసారి చోటుఇక విండీస్ సిరీస్ నేపథ్యంలో భారత జట్టులో ముగ్గురు కొత్త ముఖాలకు చోటిచ్చారు. ప్రతిక రావల్, తనూజ కన్వర్లను తొలిసారి వన్డే జట్టులోకి తీసుకోగా... నందిని కశ్యప్, రాఘవి బిస్త్‌లను తొలిసారి టీ20 జట్టులోకి ఎంపిక చేశారు. ఈ రెండు జట్లకు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌరే సారథ్యం వహించనుంది.టీ20 సిరీస్‌తో ఆరంభంముందుగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ నెల 15, 17, 19 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అనంతరం వడోదరలో ఈ నెల 22, 24, 27 తేదీల్లో మూడే వన్డేల సిరీస్ జరుగుతుంది.ఇక ఈ రెండు సిరీస్‌లకు షఫాలీ వర్మను కూడా ఎంపిక చేయలేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌కు ఫామ్‌లో లేని షఫాలీకి ఉద్వాసన పలికారు. గాయాల కారణంగా యస్తిక భాటియా, శ్రేయాంక పాటిల్, ప్రియా పూనియాలను సెలక్షన్‌కు పరిగణించలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, నందిని కశ్యప్, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, సజన సజీవన్, రాఘవి బిస్త్, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, రాధా యాదవ్.వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెపె్టన్), స్మృతి మంధాన, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, తేజల్ హసబ్నిస్, ప్రతిక రావల్, తనూజ కన్వర్. చదవండి: భారత్‌తో టీ20, వన్డే సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్‌రౌండర్ మిస్ -
ఆసీస్‌తో వన్డే సిరీస్.. భారత క్రికెట్ జట్టుకు మరో షాక్
భారత మహిళల క్రికెట్ జట్టుకు మరో చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన హర్మన్ సేనకు.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) గట్టి షాకిచ్చింది. ఆసీస్‌తో బ్రిస్బేన్‌లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడటంతో ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో కోత పడింది. నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువ వేయడంతో ఓవర్‌కు 5 చొప్పున... భారత ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు రెఫరీ డేవిడ్ గిల్బర్ట్ వెల్లడించాడు.విచారణ లేకుండా నేరుగాఐసీసీ నియమావళిలోని 2.22 ఆర్టికల్ ప్రకారం జరిమానా విధించినట్లు పేర్కొన్నాడు. భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పు అంగీకరించడంతో ఎలాంటి విచారణ లేకుండా నేరుగా కోత విధించినట్లు తెలిపాడు. కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో భారత్ 3-0తో క్వీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే.మూడో వన్డేలో స్మృతి ‘శత’క్కొట్టినా...పెర్త్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆసీస్ ప్లేయర్లలో అనాబెల్ సదర్లాండ్ (95 బంతుల్లో 110; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకంతో చెలరేగగా... కెప్టెన్ తాలియా మెక్‌గ్రాత్ (56 నాటౌట్; 5 ఫోర్లు), ఆష్లే గార్డ్నర్ (50; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు.ఒకదశలో 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను అనాబెల్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకుంది. మొదట గార్డ్నర్తో ఐదో వికెట్‌కు 96 పరుగులు జోడించిన అనాబెల్... ఆ తర్వాత తాలియాతో ఆరో వికెట్‌కు 95 బంతుల్లో 122 పరుగులు జతచేసి జట్టుకు భారీ స్కోరు అందించింది. భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి 4 వికెట్లు తీయగా... దీప్తి శర్మ ఒక వికెట్ దక్కించుకుంది.ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (109 బంతుల్లో 105; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు నుంచి ఆమెకు ఎటువంటి సరైన సహకారం లభించలేదు. ఒక్క హర్లీన్ డియోల్ (39; 4 ఫోర్లు) మినహా మిగతా వాళ్లు విఫలమయ్యారు.అండగా హర్లీన్ డియోల్స్మృతి–హర్లీన్ రెండో వికెట్‌కు 118 పరుగులు జోడించి జట్టుకు బలమైన పునాది వేసినా... తర్వాత వచ్చిన వాళ్లు అదే జోరును కొనసాగించలేకపోయారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (12), రిచా ఘోష్ (2), జెమీమా రోడ్రిగ్స్ (16), దీప్తి శర్మ (0), మిన్ను మణి (8) విఫలమయ్యారు. ఫలితంగా టీమిండియా 45.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్ కాగా.. కంగారూ జట్టు 83 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 5 వికెట్లు తీయగా... మేగన్ షుట్, అలానా కింగ్ రెండేసి వికెట్లు తీశారు. ఇక ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన అనాబెల్ సదర్లాండ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.చదవండి: ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్ -
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్..
న్యూజిలాండ్ మహిళలతో మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో 59 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ అమ్మాయిలు 40.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటయ్యారు.టీమిండియా బౌలర్లలో రాధా యాదవ్ 3 వికెట్లతో అదరగొట్టగా.. అరంగేట్ర బౌలర్ సైమా ఠాకూర్ రెండు, దీప్తీ శర్మ, అరుంధతి రెడ్డి తలా వికెట్ సాధించారు. కివీస్ బ్యాటర్లలో బ్రూక్ హాలీడే(39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.ఆఖరిలో అమీలియా కేర్(25) పోరాడినప్పటకి, సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఆమె ఆజేయంగా ఉండిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 44.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది.టీమిండియా బ్యాటర్లలో అరంగేట్ర ప్లేయర్ తేజల్ హసబ్నిస్(42) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీప్తీ శర్మ(41), యస్తికా భాటియా(37), షఫాలీ వర్మ(33) రాణించారు. ఇక కివీస్ బౌలర్లలో అమీలియా కేర్ 4 వికెట్లు సత్తాచాటగా.. జేస్ కేర్ 3 వికెట్లు సాధించింది. కాగా ఈ మ్యాచ్‌కు భారత రెగ్యూలర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దూరం కావడంతో నాయకత్వ బాధ్యతలను స్మృతి మంధాన చేపట్టింది.చదవండి: IND vs NZ: వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే -
పాకిస్తాన్‌తో మ్యాచ్.. భారత జట్టులో కీలక మార్పు!?
మహిళల టీ20 వరల్డ్ కప్-2024లో భారత జట్టు కీలక పోరుకు సిద్దమైంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. దాయాదుల పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. కాగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాభావం పొందిన భారత జట్టు.. పాక్‌పై గెలిచి తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. అదేవిధంగా హర్మాన్ సేన తమ సేవలను సజీవంగా ఉంచుకోవాలంటే పాక్‌పై కచ్చితంగా గెలవాల్సిందే. ఈ క్రమంలో పాక్‌తో మ్యాచ్‌లో భారత తుది జట్టులో ఓ కీలక మార్పు చేయనున్నట్లు తెలుస్తోందిరాధా యాదవ్ ఎంట్రీ..న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమైన స్పిన్న్ రాధా యాదవ్.. పాక్‌తో మ్యాచ్‌లో ఆడనున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ పిచ్ స్పిన్ అనుకూలించే ఛాన్స్ ఉన్నందున అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పేసర్ అరుంధతి రెడ్డి స్ధానంలో రాధా తుది జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ శ్రీలంకపై ఆడిన జట్టునే కొనసాగించే ఛాన్స్ ఉంది.పాక్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టుషఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, రేణుకా ఠాకూర్, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, ఆశా శోబన. -
ఏకైక టెస్టు.. ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
భారత మహిళల ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా పర్యటను ఓటమితో ముగించింది. గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో ఆసీస్‌తో చేతిలో భారత్ ఓటమి పాలైంది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 243 పరుగులకు ఆలౌటైంది. ఇండియా బ్యాటర్లలో ఉమన్ ఛెత్రి 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియా పునియా(36), శుభా సతీష్(45) పరుగులతో తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో ఫ్లింటాఫ్, నాట్ తలా మూడు వికెట్టు పడగొట్టారు. అంతకుముందు ఆ్రస్టేలియా ‘ఎ’ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 92 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలౌటైంది. మ్యాడీ డార్క్ (197 బంతుల్లో 105 నాటౌట్; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డి బ్రోగే(58) పరుగులతో రాణించింది. భారత బౌలర్లలో మిన్నుమణి 6 వికెట్లు తీయగా, సయాలీ, ప్రియా మిశ్రా చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 28 పరుగులు కలుపుకొని భారత్ ముందు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ విఫలమైంది. -
చరిత్ర సృష్టించిన 'లేడీ ధోని'.. ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
భారత మహిళ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల ఆసియాకప్‌లో అత్యధిక స్టంపౌట్లు చేసిన భారత వికెట్ కీపర్‌గా రిచా ఘోష్ రికార్డులకెక్కింది. మహిళల ఆసియాకప్-2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో రీతూ మూనీని స్టంపౌట్ చేసిన రిచా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది.రిచా ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఏడు స్టంప్‌లు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ తానియా భాటియా(6) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బాటియా ఆల్‌టైమ్ రికార్డును రిచా బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది.తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి కేవలం 80 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ మూడు చొప్పున వికెట్లు కూల్చగా.. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలోనే చేధించింది. భారత ఓపెనర్లు స్మృతి మంధాన(55 పరుగులు), షఫాలీ వర్మ 26 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో శ్రీలంక లేదా పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. pic.twitter.com/zkbz9CR5ub— hiri_azam (@HiriAzam) July 26, 2024 -
దక్షిణాఫ్రికా ఓపెనర్ విధ్వంసం.. భారత్ టార్గెట్ ఎంతంటే?
చెపాక్ స్టేడియం వేదికగా భారత మహిళలతో జరుగుతున్న తొలి టీ20లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. మొదట ఆచితూచి ఆడిన బ్రిట్స్.. మిడిల్ ఓవర్లలో తన విశ్వరూపం చూపించింది. 56 బంతులు ఎదుర్కొన్న బ్రిట్స్ 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81 పరుగులు చేసింది.ఆమెతో పాటు మారిజన్నే కాప్(57) హాఫ్ సెంచరీతో మెరిసింది. ఇక భారత బౌలర్లలో పుజావస్త్రాకర్, రాధా యాదవ్ తలా రెండు వికెట్లు సాధించారు. మిగితా భారత బౌలర్లంతా విఫలమయ్యారు. కాగా ఇంతకముందు జరిగిన వన్డే, టెస్టు సిరీస్‌లను భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
స్వదేశంలో దక్షిణాఫ్రికా మహిళలతో వన్డే సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. బెంగళూరు వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ వెళ్లింది. 266 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా భారత బౌలర్లు దాటికి 37.4 ఓవర్లలో కేవలం 122 పరుగులకే కుప్పకూలింది.భారత బౌలర్లలో ఆశా శోభన 4 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించగా.. దీప్తీ శర్మ రెండు, పూజా, రేణుకా సింగ్, తలా వికెట్ పడగొట్టారు. ప్రోటీస్ బ్యాటర్లలో సునీ లూస్(33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగుల భారీ స్కోర్ సాధించింది.టీమిండియా బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన సెంచరీతో చెలరేగింది.ఈ మ్యాచ్‌లో 127 బంతులు ఎదుర్కొన్న మంధాన 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 117 పరుగులు చేసింది. స్మృతికి ఇది ఆరో అంతర్జాతీయ వన్డే సెంచరీ కావడం గమనార్హం. భారత బ్యాటర్లలో మంధానతో పాటు దీప్తీ శర్మ(37), పూజా వస్త్రాకర్(31 నాటౌట్) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా.. క్లాస్ రెండు, డెకరసన్, మల్బా, షాంగసే తలా వికెట్ సాధించారు. -
సెంచరీతో చెలరేగిన మంధాన.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్
చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన సెంచరీతో చెలరేగింది. 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను మంధాన తన విరోచిత సెంచరీతో ఆదుకుంది. ఈ మ్యాచ్‌లో 127 బంతులు ఎదుర్కొన్న మంధాన 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 117 పరుగులు చేసింది. స్మృతికి ఇది ఆరో అంతర్జాతీయ వన్డే సెంచరీ కావడం గమనార్హం. భారత బ్యాటర్లలో మంధానతో పాటు దీప్తీ శర్మ(37), పూజా వస్త్రాకర్(31 నాటౌట్) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా.. క్లాస్ రెండు, డెకరసన్, మల్బా, షాంగసే తలా వికెట్ సాధించారు.మంధాన అరుదైన రికార్డుఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన మంధాన ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ వన్డేల్లో భారత మహిళల జట్టు తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా స్మృతి(6 సెంచరీలు) రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(5) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో హర్మన్ ప్రీత్ రికార్డును మంధాన బ్రేక్ చేసింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(7) ఉంది. -
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన ఐదో టీ20లో 21 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బ్యాటర్లలో హేమలత(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మంధాన(33),హర్‌ప్రీత్ కౌర్(30) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రబేయా ఖాన్, నహిదా అక్తర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సుల్తానా ఒక్క వికెట్ సాధించింది. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నిర్ఱీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రాధా యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆశా రెండు వికట్లు సాధించింది. బంగ్లా బ్యాటర్లలో రితూ మోనీ(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.చదవండి: టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..? -
బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్.. 44 పరుగుల తేడాతో విజయం
బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. సెల్హాట్ వేదికగా వేదికగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 1-0 అధిక్యంలోకి వెళ్లింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో యస్తికా భాటియా(36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్మన్ ప్రీత్ కౌర్(30), షెఫాలీ వర్మ(31) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రబియా ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మరుఫా అక్తర్ రెండు, త్రిష్నా, ఫాతిమా ఖాటూన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 101 పరుగులకే పరిమితమైంది.బంగ్లా బ్యాటర్లలో కెప్లెన్ సుల్తానా(51) ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లలో రేణుక సింగ్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా.. పూజా రెండు, శ్రేయంకా, దీప్తి శర్మ, రాధా యాదవ్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఏప్రిల్ 30న జరగనుంది. -
242 పరుగులతో విధ్వంసం.. 31 ఫోర్లు, 7 సిక్స్‌లు! ఎవరీ సెహ్రావత్?
బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో ఢిల్లీ యువ సంచలనం శ్వేతా సెహ్రావత్ విధ్వంసం సృష్టించింది. శనివారం నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్వేతా సెహ్రావత్ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు శ్వేతా చుక్కలు చూపించింది. బౌండరీల వర్షం కురిపించింది. ఈ మ్యాచ్‌లో 150 బంతులు ఎదుర్కొన్న సెహ్రవత్ 31 ఫోర్లు, 7 సిక్స్‌లతో ఏకంగా 242 పరుగులు చేసింది. తద్వారా లిస్ట్-ఏ క్రికెట్లో ద్విశతకం సాధించిన తొలి మహిళ క్రికెటర్‌గా శ్వేతా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా దేశీవాళీ క్రికెట్(మూడు ఫార్మాట్లు)లో అత్యధిక స్కోర్ సాధించిన మహిళ క్రికెటర్‌గా నిలిచింది. ఎవరీ శ్వేతా సెహ్రావత్ .. 20 ఏళ్ల శ్వేతా సెహ్రావత్ దేశీవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. గతేడాది జరిగిన అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించింది. ఆ టోర్నీలో టాప్ రన్ స్కోరర్‌గా శ్వేతా సెహ్రావత్ నిలిచింది. కాగా శ్వేత మహిళల ప్రీమియర్‌లో లీగ్‌లో కూడా భాగమైంది. ఈ యువ సంచలనం యూపీ వారియర్జ్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. 2023 డబ్ల్యూపీఎల్ వేలంలో రూ.40 లక్షలకు శ్వేతాను యూపీ సొంతం చేసుకుంది. కానీ ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో మాత్రం ఆమె నిరాశపరిచింది. తొలి సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడిన సెహ్రావత్ కేవలం 34 పరుగులు మాత్రమే చేసింది. Super Sehrawat 👏 2️⃣4️⃣2️⃣ runs 1️⃣5️⃣0️⃣ balls 3️⃣1️⃣ fours 7️⃣ sixes Shweta Sehrawat sparkled in Delhi's 400-run win over Nagaland with a splendid marathon 242-run knock at the MECON Stadium, Ranchi in the @IDFCFIRSTBank #SWOneday Trophy Scorecard ▶️ https://t.co/3QV6VBY42y pic.twitter.com/WPfgDKeL0a — BCCI Women (@BCCIWomen) January 6, 2024 -
ఆసీస్‌తో వన్డే, టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన! యువ క్రికెటర్‌కు ఛాన్స్
స్వదేశంలో ఆస్ట్రేలియాపై చారిత్రత్మక విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే, టీ20 తలపడేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగే వైట్ బాల్ సిరీస్‌లకు భారత జట్లను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ రెండు సిరీస్‌లలోనూ భారత జట్టును హర్మన్ ప్రీత్ కౌర్ నడిపించనుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన బౌలర్ శ్రేయాంక పాటిల్‌కు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. అదే విధంగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సైకా ఇషాక్‌కు కూడా ఆసీస్‌తో వన్డే, టీ20 జట్లలో సెలక్టర్లు అవకాశం కల్పించారు. మరోవైపు 20 ఏళ్ల మన్నత్ కశ్యకు వన్డే, టీ20 జట్టుల్లో అవకాశం దక్కింది. డిసెంబర్ 28న వాంఖడే వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఆసీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు టీమిండియా ఆడనుంది. వన్డే సిరీస్ వాంఖడే వేదికగా జరగనుండగా.. టీ20 సిరీస్ డివై పాటిల్ స్టేడియంలో జరగనుంది. భారత మహిళల వన్డే జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, హర్లీన్ డియోల్ భారత మహిళల టీ20 జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, కనికా అహుజా, మిన్ను మణి చదవండి: IPL 2024: పాండ్యా కోసం రూ. 100 కోట్లు చెల్లించిన ముంబై? బంగారు బాతు కదా! -
ఓడినా మనసులు గెలుచుకుంది.. హీలీ క్రీడా స్పూర్తి! వీడియో వైరల్
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ జట్టుపై భారత మహిళా జట్టుకు మొట్టమొదటి టెస్టు గెలుపు ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 406 చేసింది. దీంతో భారత్ 187 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 74 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. భారత్ ముందు 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. 75 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ మాత్రం తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకుంది. ఏమి జరిగిందంటే? ఈ చారిత్రత్మక విజయం అనంతరం ట్రోఫీని అందుకున్న భారత జట్టు ఛాంపియన్స్ హోర్డింగ్ వెనక ఉండి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ క్రమంలో అలిస్సా హీలీ ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తింది. భారత జట్టు విన్నింగ్ మూమెంట్స్‌ను కెమెరాలో బంధించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓడిపోయినప్పటికీ అలిస్సా హీలీ క్రీడా స్పూర్తికి అభిమానులు ఫిదా అయిపోయారు. హీలీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: T20 World Cup 2024: ఇంగ్లండ్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా కీరన్ పొలార్డ్.. Alyssa Healy 🫶 🎥: Jio Cinema@ahealy77 | @AusWomenCricket | #INDvAUS | #CricketTwitter pic.twitter.com/QVQpaagsGl — Women's CricInsight (@WCI_Official) December 24, 2023 -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో భారత మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారీ విజయం నమోదు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఈ వరల్డ్ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు ఈ అరుదైన రికార్డు శ్రీలంక మహిళల జట్టు పేరిట ఉండేది. 1997లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 309 పరుగుల తేడాతో ఓడించింది. తాజా మ్యాచ్‌తో 26 ఏళ్ల శ్రీలంక రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 479 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. భారత బౌలర్ల దాటికి కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పుజా వస్త్రాకర్ మూడు , గైక్వాడ్ రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ హీథర్ నైట్(21) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో కూడా దీప్తి శర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఓవరాల్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు పడగొట్టంది. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన 9⃣.3⃣ - Sophia Dunkley 9⃣.4⃣ - Nat Sciver-Brunt Relive how Pooja Vastrakar 2⃣ wickets in an over 🎥 🔽 Follow the Match ▶️ https://t.co/UB89NFaqaJ #TeamIndia | #INDvENG | @Vastrakarp25 | @IDFCFIRSTBank pic.twitter.com/EAUF8WPwMF — BCCI Women (@BCCIWomen) December 16, 2023 -
అరంగేట్ర మ్యాచ్‌లోనే అదుర్స్.. ఆర్సీబీ జట్టుతో! ఎవరీ శుభా సతీష్?
శుభా సతీష్.. భారత మహిళల క్రికెట్లో ప్రస్తుతం మార్మోగుతున్న పేరు. ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైకతో భారత్ తరపున అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన శుభా.. తన అద్భుత ప్రదర్శనతో అందరిని అకట్టుకుంది. తన తొలి మ్యాచ్‌తోనే భారత మహిళల క్రికెట్లో చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా శుభా రికార్డులకెక్కింది. కేవలం 49 బంతుల్లోనే శుభా సతీష్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకుంది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 76 బంతులు ఎదుర్కొన్న శుభా 13 ఫోర్లతో 69 పరుగులు చేసింది. అయితే తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుందన్న భయం ఎక్కడ కూడా శుభా ఇన్నింగ్స్‌లో కన్పించలేదు. అంతేకాకుండా ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టు బౌలర్లకు ఆమె చుక్కలు చూపించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట శుభా.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ 428 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇక అరంగేట్రంలోనే అదరగొట్టిన శుభా సతీష్‌ను భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం ప్రశంసించింది. ఈ క్రమంలో ఎవరీ శుభా సతీష్ అని నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. ఎవరీ శుభా సతీష్? 24 ఏళ్ల శుభా సతీష్ మైసూర్‌లోని ఓ మిడిల్‌క్లాస్ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శుభాకు తన చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో ఆమె తండ్రి కూడా తనకు సపోర్ట్‌గా నిలిచి భారత జట్టు జెర్సీ ధరించడంలో కీలక పాత్ర పోషించాడు. 2014 చివరిసారిగా భారత మహిళ జట్టు స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఆడేటప్పుడు శుభా సతీష్ అప్పుడప్పుడే క్రికెట్ మెళుకులు నేర్చుకుంటుంది. అప్పటికి శుభా సతీష్ వయస్సు కేవలం 15 ఏళ్ల మాత్రమే. అయితే యాదృచ్చికంగా మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత భారత్ తమ తదుపరి స్వదేశీ టెస్టు మ్యాచ్‌తో శుభా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. కాగా ఆమె అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగడంలో కోచ్ రజత్‌ది కూడా ముఖ్య పాత్ర. మైసూరులోని బౌలౌట్ క్రికెట్ అకాడమీలోనే క్రికెటర్‌గా సతీష్ ఓనమాలు నేర్చుకుంది. ఈ అకాడమీలో కోచ్ రజత్ ఆమెను ఒక మంచి క్రికెటర్‌గా తీర్చిదిద్దాడు. కాగా దేశీవాళీ క్రికెట్లో కూడా శుభా సతీష్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ 2021-22 సీజన్లో కర్ణాటక తరపున సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా శుభా నిలిచింది. ఏడు మ్యాచ్‌ల్లో 43.83 సగటుతో 263 చేసింది. దేశీవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తుండడంతో ఆమెకు తొలిసారి మహిళల ప్రీమియర్ లీగ్ కాంట్రాక్ట్ దక్కింది. డబ్ల్యూపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన వేలంలో సతీష్‌ను రూ.10 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. చదవండి: వరల్డ్‌కప్‌లో కుదరలేదు.. ఈసారి సిరాజ్ సాధించేశాడు! పాపం రింకూ.. -
BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా రాజస్తాన్ రాయల్స్ మాజీ కోచ్
BCCI- Women Cricket Team Head Coach: దేశవాళీ దిగ్గజం, ముంబై జట్టు మాజీ కెప్టెన్ అమోల్ మజుందార్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా నియమించారు. కొన్ని నెలల క్రితం సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఈ పదవి కోసం పలువురిని ఇంటర్వ్యూ చేసింది. తుదకు 48 ఏళ్ల అమోల్ మజుందార్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. కాగా అమోల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 171 మ్యాచ్‌లు ఆడి 11,167 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 60 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అస్సాం, ఆంధ్ర జట్లకు కూడా ప్రాతినిధ్యం ఇక రంజీ జట్టు టైటిల్ నెగ్గిన ముంబై జట్టులో కీలక సభ్యుడిగా వ్యవహరించిన అమోల్ తదనంతరం దేశవాళీ క్రికెట్లో అస్సాం, ఆంధ్ర జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించి 2014లో ఆటకు వీడ్కోలు పలికి కోచింగ్‌వైపు వచ్చాడు. ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్‌కు మూడు సీజన్ల పాటు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. చదవండి: WC 2023: క్రేజీ ఇన్నింగ్స్.. అతడు అద్భుతం.. ఆ ‘వంద’లో నాదీ సమాన పాత్ర: కమిన్స్ -
టీమిండియాపై అద్భుత ప్రదర్శన.. బంగ్లాదేశ్ జట్టుకు భారీ నజరానా! ఎంతంటే?
స్వదేశంలో భారత మహిళల జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ను 1-1తో బంగ్లాదేశ్ డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. ఢాకా వేదికగా జరిగిన ఆఖరి వన్డే టై కావడంతో ట్రోఫీని ఇరు జట్లు సంయుక్తంగా పంచుకున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా వంటి పటిష్ట జట్టుపై అద్బుత ప్రదర్శరన కనబరిచిన తమ జట్టుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారీ నజరానా ప్రకటించింది. తమ మహిళల జట్టుకు 35 లక్షల టాకాలు(భారత కరెన్సీలో సూమారు రూ.27 లక్షలు) ఇవ్వనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా వన్డేల్లో బంగ్లాదేశ్ మహిళల జట్టు తరపున తొలి సెంచరీ సాధించిన ఫర్గానా హోక్‌పై బీసీబీ ఛీప్ నజ్ముల్ హసన్ పాపోన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫర్గానా అద్బుతమైన బ్యాటర్ అని, బంగ్లా క్రికెట్‌ను మరో స్ధాయికి తీసుకువెళ్తుందని అతడు కొనియాడాడు. "సాధారణంగా మేము సిరీస్ గెలిస్తే మా జట్లకు బోనస్ ఇస్తాం. కానీ భారత్‌తో సిరీస్ డ్రా అయినప్పటికీ మా జట్టుకు రివార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ సిరీస్‌లో సిరీస్‌లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్‌పై మేము తొలి వన్డే విజయం సాధించాము. అదే విధంగా సెంచూరియన్ ఫర్గానా హోక్ వంటి వ్యక్తిగత ప్రదర్శనలు కూడా ఉన్నాయి. అందుకే మా ప్లేయర్స్‌కు 25 లక్షల టాకాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. అదేవిధంగా సెంచరీతో చెలరేగిన ఫర్గానా 2 లక్షల టాకాలు, వ్యక్తిగత ప్రదర్శన మిగితా ప్లేయర్స్‌కు రివార్డు ఇవ్వనున్నాం. మరోవైపు కోచింగ్ స్టాప్‌ను కూడా ఇందులో భాగం చేయాలి అనకుంటున్నాం. మొత్తంగా 35 లక్షల టాకాలు రివార్డు రూపంలో ఇవ్వనున్నాం" అని నజ్ముల్ హసన్ పాపోన్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. -
జట్టులో నో ఛాన్స్.. ఏడ్చేసిన టీమిండియా స్టార్ క్రికెటర్! వీడియో వైరల్
బంగ్లాదేశ్ పర్యటనకు భారత మహిళల జట్టు అన్ని విధాల సిద్దమవుతోంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ అతిథ్య బంగ్లాదేశ్‌తో తలపడనుంది. హర్మాన్ ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు జూలై5న బంగ్లాదేశ్‌కు పయనమైంది. అయితే ఈ మల్టీఫార్మాట్ సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో స్టార్ బౌలర్ శిఖా పాండేకు చోటుదక్కలేదు. ఈ సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై శిఖా పాండే అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ తో స్పోర్ట్స్‌స్టార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిఖా ఏడ్చేసింది. "నేను నిరుత్సాహంగా, కోపంగా లేనని చెబితే నేను అస్సలు మనిషినే కాదు. మనం కష్టపడినదానికి తగిన ఫలితం దక్కకపోతే చాలా బాధగా ఉంటుంది. నన్ను తప్పించడం వెనుక ఎదో పెద్ద కారణం ఉంది. అది ఎంటో నాకు కూడా చెబితో బాగున్ను. కానీ నేను నా హార్డ్‌వర్క్‌నే నమ్ముతా అంటూ శిఖా పాండే కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా శిఖా పాండే ఇప్పటివరకు 55 వన్డేలు, 56 టీ20ల్లో భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. అదే విధంగా తొలి మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన శిఖా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అయినప్పటికీ పాండేకు జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం అందరని ఆశ్చర్యపరిచింది. ఆమెతో పాటు బంగ్లాటూర్‌కు రిచా ఘోష్, రేణుకా సింగ్‌కు కూడా చోటు దక్కలేదు. చదవండి: IND vs WI: అతడిని ఎందుకు సెలక్ట్ చేశారు.. ఏం చేశాడని! పాపం రుత్‌రాజ్ 🗣️ Shikha Pandey gets teary-eyed talking about the disappointment of not finding a place in the Indian team. Watch the full interview with @wvraman here ➡️ https://t.co/9H20WnkoZG#WednesdaysWithWV | #WomensCricket pic.twitter.com/d5tJmro6SC — Sportstar (@sportstarweb) July 6, 2023 -
2005 వరల్డ్‌కప్ టైమ్‌లో పుట్టినోళ్లు! కుల్దీప్ యాదవ్ కోచ్ దత్తత తీసుకున్న ఆ అమ్మాయి..
దాదాపు 18 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ చేరింది. అయితే ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ స్థాయిలో, ఏ ఫార్మాట్లో కూడా మన టీమ్ వరల్డ్‌కప్ గెలవలేకపోయింది. నాటి జట్టులో సభ్యురాలిగా ఉన్న ఆఫ్ స్పిన్నర్ నూషీన్ అల్ ఖదీర్ ఇప్పుడు యువ మహిళల టీమ్‌కు కోచ్. ఇప్పుడు అదే దక్షిణాఫ్రికా గడ్డపై మరో ఫైనల్ ఆడిన భారత బృందం ఈసారి విజేతగా నిలిచింది. దాదాపు 2005 వరల్డ్‌కప్ జరిగిన సమయంలోనే పుట్టిన అమ్మాయిలంతా ఇప్పుడు విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించారు. సీనియర్ టీమ్ మంచి ఫలితాలు సాధిస్తున్న సమయంలో అండర్–19 జట్టు కూడా తమ స్థాయిని ప్రదర్శించడం శుభపరిణామం. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న వర్ధమాన ప్లేయర్లలో బీసీసీఐ తొలి వరల్డ్‌కప్ కోసం టీమ్‌ను ఎంపిక చేసింది. అయితే ఎలాగైనా వరల్డ్‌కప్ గెలవాలనే ఉద్దేశంతో ఇప్పటికే సీనియర్ టీమ్‌లో ఆడిన షఫాలీ వర్మ, రిచా ఘోష్‌లను జట్టులోకి తీసుకుంది. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. అమ్మాయిలందరూ తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా రాణించడం విశేషం. శ్వేత సెహ్రావత్ 139.43 స్ట్రయిక్‌రేట్‌తో 297 పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలవగా, షఫాలీ (172 పరుగులు), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (116 పరుగులు) అండగా నిలిచారు. బౌలింగ్‌లో పార్శవి చోప్రా (11 వికెట్లు), మన్నత్ కశ్యప్ (9 వికెట్లు) కీలకపాత్ర పోషించారు. సీనియర్ టీమ్‌లో జూనియర్‌గా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టిన షఫాలీ ఈ టోర్నీ ద్వారా తన నాయకత్వ ప్రతిభను కూడా ప్రదర్శించడం విశేషం- సాక్షి క్రీడావిభాగం వరల్డ్‌కప్ సాధించిన బృందం గురించి సంక్షిప్తంగా... షఫాలీ వర్మ (కెప్టెన్): హరియాణాలోని రోహ్తక్కు చెందిన షఫాలీ భారత్ సీనియర్ జట్టు సభ్యురాలిగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భారత్ తరఫున 74 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. రిచా ఘోష్: బెంగాల్‌కు చెందిన కీపర్ రిచా కూడా సీనియర్ టీమ్ సభ్యురాలిగా 47 మ్యాచ్‌లు ఆడింది. పార్శవి చోప్రా: యూపీలోని గ్రేటర్ నోయిడాకు చెందిన లెగ్‌స్పిన్నర్. తండ్రి ఫ్లడ్ లైట్ సౌకర్యాలతో సొంత గ్రౌండ్ ఏర్పాటు చేసి మరీ కూతురును ఆటలో ప్రోత్సహించాడు. ఎండీ షబ్నమ్: విశాఖపట్నానికి చెందిన షబ్నమ్ తల్లిదండ్రులు నేవీలో పని చేస్తారు. శివశివాని స్కూల్లో పదో తరగతి చదువుతోంది. 15 ఏళ్ల వయసులోనే 110 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. సౌమ్య తివారి: స్వస్థలం భోపాల్. టాప్ ఆర్డర్ బ్యాటర్... కోహ్లిని ఇష్టపడే సౌమ్య అతనిలాగే కవర్‌డ్రైవ్ అద్భుతంగా ఆడుతుంది. టిటాస్ సాధు: బెంగాల్‌కు చెందిన టిటాస్ తండ్రి ఒక క్రికెట్ అకాడమీ నడపిస్తాడు. బెంగాల్ సీనియర్ టీమ్‌కు ఇప్పటికే ఆడింది. గొంగడి త్రిష: భద్రాచలంకు చెందిన త్రిష హైదరాబాద్‌లో స్థిర పడింది. తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్లోకి అడుగుపెట్టి 8 ఏళ్ల వయసులోనే అండర్–16లో ప్రాతినిధ్యం వహించింది. మన్నత్ కశ్యప్: పటియాలాకు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్. ఇటీవల వరుసగా ‘మన్కడింగ్’లు చేసి గుర్తింపు తెచ్చుకుంది. శ్వేత సెహ్రావత్: ఢిల్లీకి చెందిన బిగ్ హిట్టర్. ఆర్థికంగా మెరుగైన నేపథ్యం ఉన్న కుటుంబం. సొప్పదండి యశశ్రీ: హైదరాబాద్‌కు చెందిన మీడియం పేసర్. టోర్నీ లో ఒక మ్యాచ్ ఆడింది. గాయంతో తప్పుకున్న హర్లీ గలా స్థానంలో జట్టులోకి వచ్చింది. అర్చనా దేవి: ఆఫ్‌స్పిన్నర్. యూపీలోని ఉన్నావ్ స్వస్థలం. కడు పేదరికం. తండ్రి ఎప్పుడో చనిపోయాడు. కుల్దీప్ యాదవ్ కోచ్ కపిల్ పాండే దత్తత తీసుకొని ముందుకు నడిపించాడు. సోనమ్ యాదవ్: యూపీ లెఫ్టార్మ్ స్పిన్నర్. తండ్రి ఫిరోజాబాద్‌లో చేతి గాజులు తయారు చేసే పరిశ్రమలో కార్మికుడు ఫలక్ నాజ్: స్వస్థలం యూపీలోని ప్రయాగ్‌రాజ్. ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ తండ్రి ఒక ప్రైవేట్ స్కూల్లో ప్యూన్. రిషిత బసు: వికెట్ కీపర్, బెంగాల్‌లోని హౌరా స్వస్థలం. అద్భుతమైన మెరుపు షాట్లు ఆడుతుంది. మాజీ క్రికెటర్ లక్ష్మీరతన్ శుక్లా తన అకాడమీలో ఉచిత శిక్షణ ఇస్తున్నాడు. చదవండి: Novak Djokovic: తిరుగులేని జొకోవిచ్.. సిట్సిపాస్కిది రెండోసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే! Hockey World Cup 2023: హాకీ జగజ్జేత జర్మనీ From #TeamIndia to #TeamIndia🇮🇳 Well done!!! We are so proud of you! 🤝 pic.twitter.com/YzLsZtmNZr — BCCI Women (@BCCIWomen) January 29, 2023 -
ICC T20 WC: బీసీసీఐ కానుక రూ. 5 కోట్లు! వచ్చే నెలలో ఇంతకంటే పెద్ద ట్రోఫీ కూడా!
ICC U19 Inaugural T20 World Cup- Shafali Verma: ఐసీసీ అండర్–19 టి20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభినందించింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి కలిపి రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. మరోవైపు ఫైనల్లో ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ సాధించిన మహిళల టీమ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ యువ జట్టు భవిష్యత్తులోనూ మరిన్ని టోర్నీలో విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అదే విధంగా భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, హార్దిక్ పాండ్యా సేన.. మహిళా టీమ్‌కు వీడియో సందేశం ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఇంతకంటే పెద్ద ట్రోఫీ కూడా ‘‘అమ్మాయిలంతా చాలా బాగా ఆడారు. వారి ప్రదర్శన, తమపై తమకు ఉన్న నమ్మకం గురించి ఎంత చెప్పినా తక్కువే. కీలక పాత్ర పోషించిన సహాయక బృందానికి కూడా కృతజ్ఞతలు’’ అంటూ భారత కెప్టెన్ షఫాలీ వర్మ హర్షం వ్యక్తం చేసింది. చారిత్రక విజయంలో జట్టు సమిష్టి ఉందని పేర్కొంది. అదే విధంగా... వచ్చే నెలలో ఇంతకంటే పెద్ద ట్రోఫీ (సీనియర్ మహిళల టి20 ప్రపంచకప్)ని కూడా అందుకోవాలని ఉందంటూ షఫాలీ తన ఆకాంక్షను తెలియజేసింది. అండర్–19 టి20 ప్రపంచకప్- ఎవరెవరిపై గెలిచామంటే.. ►లీగ్ దశలో: దక్షిణాఫ్రికాపై 7 వికెట్లతో గెలుపు ►యూఏఈపై 122 పరుగులతో విజయం ►స్కాట్లాండ్పై 83 పరుగులతో గెలుపు ►సూపర్ సిక్స్ దశలో: ఆస్ట్రేలియా చేతిలో 7 వికెట్లతో ఓటమి. ►శ్రీలంకపై 7 వికెట్లతో విజయం ►సెమీస్‌లో: న్యూజిలాండ్‌పై 8 వికెట్లతో విజయం ►ఫైనల్లో: ఇంగ్లండ్‌పై 7 వికెట్లతో గెలుపు చదవండి: IND Vs NZ T20: కివీస్‌పై టీమిండియా గెలుపు U19 Womens WC 2023: వారెవ్వా అర్చన.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్! A special message from Lucknow for India's ICC Under-19 Women's T20 World Cup-winning team 🙌 🙌#TeamIndia | #U19T20WorldCup pic.twitter.com/g804UTh3WB — BCCI (@BCCI) January 29, 2023