
స్వదేశంలో ఆస్ట్రేలియాపై చారిత్రత్మక విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే, టీ20 తలపడేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగే వైట్ బాల్ సిరీస్‌లకు భారత జట్లను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ రెండు సిరీస్‌లలోనూ భారత జట్టును హర్మన్ ప్రీత్ కౌర్ నడిపించనుంది.
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన బౌలర్ శ్రేయాంక పాటిల్‌కు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. అదే విధంగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సైకా ఇషాక్‌కు కూడా ఆసీస్‌తో వన్డే, టీ20 జట్లలో సెలక్టర్లు అవకాశం కల్పించారు. మరోవైపు 20 ఏళ్ల మన్నత్ కశ్యకు వన్డే, టీ20 జట్టుల్లో అవకాశం దక్కింది.
డిసెంబర్ 28న వాంఖడే వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఆసీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు టీమిండియా ఆడనుంది. వన్డే సిరీస్ వాంఖడే వేదికగా జరగనుండగా.. టీ20 సిరీస్ డివై పాటిల్ స్టేడియంలో జరగనుంది.
భారత మహిళల వన్డే జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, హర్లీన్ డియోల్
భారత మహిళల టీ20 జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, కనికా అహుజా, మిన్ను మణి
చదవండి: IPL 2024: పాండ్యా కోసం రూ. 100 కోట్లు చెల్లించిన ముంబై? బంగారు బాతు కదా!
Comments
Please login to add a commentAdd a comment