
భారత మహిళల ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా పర్యటను ఓటమితో ముగించింది. గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో ఆసీస్‌తో చేతిలో భారత్ ఓటమి పాలైంది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 243 పరుగులకు ఆలౌటైంది.
ఇండియా బ్యాటర్లలో ఉమన్ ఛెత్రి 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియా పునియా(36), శుభా సతీష్(45) పరుగులతో తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో ఫ్లింటాఫ్, నాట్ తలా మూడు వికెట్టు పడగొట్టారు. అంతకుముందు ఆ్రస్టేలియా ‘ఎ’ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 92 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలౌటైంది.
మ్యాడీ డార్క్ (197 బంతుల్లో 105 నాటౌట్; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డి బ్రోగే(58) పరుగులతో రాణించింది. భారత బౌలర్లలో మిన్నుమణి 6 వికెట్లు తీయగా, సయాలీ, ప్రియా మిశ్రా చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 28 పరుగులు కలుపుకొని భారత్ ముందు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ విఫలమైంది.