Indian Women Cricket Team To Tour New Zealand T20 5 ODI Ahead WC 2022: వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత మహిళల జట్టు ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. న్యూజిలాండ్ వేదికగా వరల్డ్‌కప్ జరగనుండటంతో దానికి నెల రోజుల ముందుగా న్యూజిలాండ్‌తో సన్నాహక సిరీస్‌ను ఆడనుంది. భారత జట్టు సభ్యులు అక్కడి పిచ్‌లకు అలవాటు పడేందుకు బీసీసీఐ ఈ సన్నాహక సిరీస్‌ను ఏర్పాటు చేసింది.
దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను న్యూజిలాండ్ క్రికెట్ శుక్రవారం విడుదల చేసింది. భారత్, న్యూజిలాండ్‌లు ఒక టి20తో పాటు ఐదు వన్డేలు ఆడతాయి. న్యూజిలాండ్‌తో ఫిబ్రవరి 9న జరిగే ఏకైక టి20 మ్యాచ్‌తో పర్యటన ఆరంభం కానుంది. అనంతరం ఫిబ్రవరి 11, 14, 16, 22, 24వ తేదీల్లో ఐదు వన్డేలు జరుగుతాయి. అనంతరం మార్చి–ఏప్రిల్ మధ్య మహిళల వన్డే ప్రపంచ కప్ ఆరంభం కానుంది.
చదవండి: Ind Vs Nz Test Series: విహారిపై ఎందుకింత వివక్ష.. దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ.. ట్వీట్‌తో.. కానీ..
Ind Vs Nz Test Series: న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికైన శ్రీకర్ భరత్ గురించి ఈ విషయాలు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment