
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టి20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో భారత టీనేజర్ షఫాలీ వర్మ మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో షఫాలీ 750 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు టి20ల్లో షఫాలీ 23, 47 పరుగులతో రాణించింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న బెత్‌మూనీ (ఆస్ట్రేలియా) 748 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది.
చదవండి: సవాల్ ఛేదించలేక చాంపియన్ చతికిలపడింది
Comments
Please login to add a commentAdd a comment