Ind-W vs Aus-W: India lost by 21 runs as Australia lead series 2-1 - Sakshi
Sakshi News home page

IND-w vs AUS-W: చేతులెత్తేసిన బ్యాటర్లు.. ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఓటమి

Published Thu, Dec 15 2022 8:40 AM | Last Updated on Thu, Dec 15 2022 12:23 PM

India Women Suffer 21 Run Defeat, Australia Women Lead 2 1 - Sakshi

ముంబై: బ్యాటింగ్‌ వైఫల్యంతో భారత మహిళల జట్టు మూడో టి20లో పరాజయం పాలైంది.  ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఎలీస్‌ పెర్రీ (47 బంతుల్లో 75; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్రేస్‌ హారిస్‌ (18 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు.

ఆంధ్ర అమ్మాయి అంజలి శర్వాణి, రేణుక సింగ్, దీప్తి శర్మ, దేవిక తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులే చేసింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (41 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిసింది. హర్మన్‌ప్రీత్‌ (27 బంతుల్లో 37; 6 ఫోర్లు), దీప్తి శర్మ (17 బంతుల్లో 25 నాటౌట్‌; 3 ఫోర్లు) రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో డార్సీ బ్రౌన్, ఆష్లే గార్డెనర్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 17న ఇదే వేదికపై నాలుగో టి20 మ్యాచ్‌ జరుగుతుంది.
చదవండి: Kane Williamson: కేన్‌ విలియమ్సన్‌ సంచలన నిర్ణయం.. ఇకపై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement