ICC U19 Inaugural T20 World Cup- Shafali Verma: ఐసీసీ అండర్–19 టి20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభినందించింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి కలిపి రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. మరోవైపు ఫైనల్లో ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ సాధించిన మహిళల టీమ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.
ఈ యువ జట్టు భవిష్యత్తులోనూ మరిన్ని టోర్నీలో విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అదే విధంగా భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, హార్దిక్ పాండ్యా సేన.. మహిళా టీమ్‌కు వీడియో సందేశం ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపింది.
ఇంతకంటే పెద్ద ట్రోఫీ కూడా
‘‘అమ్మాయిలంతా చాలా బాగా ఆడారు. వారి ప్రదర్శన, తమపై తమకు ఉన్న నమ్మకం గురించి ఎంత చెప్పినా తక్కువే. కీలక పాత్ర పోషించిన సహాయక బృందానికి కూడా కృతజ్ఞతలు’’ అంటూ భారత కెప్టెన్ షఫాలీ వర్మ హర్షం వ్యక్తం చేసింది. చారిత్రక విజయంలో జట్టు సమిష్టి ఉందని పేర్కొంది. అదే విధంగా... వచ్చే నెలలో ఇంతకంటే పెద్ద ట్రోఫీ (సీనియర్ మహిళల టి20 ప్రపంచకప్)ని కూడా అందుకోవాలని ఉందంటూ షఫాలీ తన ఆకాంక్షను తెలియజేసింది.
అండర్–19 టి20 ప్రపంచకప్- ఎవరెవరిపై గెలిచామంటే..
►లీగ్ దశలో: దక్షిణాఫ్రికాపై 7 వికెట్లతో గెలుపు
►యూఏఈపై 122 పరుగులతో విజయం
►స్కాట్లాండ్‌పై 83 పరుగులతో గెలుపు
►సూపర్ సిక్స్ దశలో: ఆస్ట్రేలియా చేతిలో 7 వికెట్లతో ఓటమి.
►శ్రీలంకపై 7 వికెట్లతో విజయం
►సెమీస్‌లో: న్యూజిలాండ్‌పై 8 వికెట్లతో విజయం
►ఫైనల్లో: ఇంగ్లండ్‌పై 7 వికెట్లతో గెలుపు
చదవండి: IND Vs NZ T20: కివీస్‌పై టీమిండియా గెలుపు
U19 Womens WC 2023: వారెవ్వా అర్చన.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్!
A special message from Lucknow for India's ICC Under-19 Women's T20 World Cup-winning team 🙌 🙌#TeamIndia | #U19T20WorldCup pic.twitter.com/g804UTh3WB
— BCCI (@BCCI) January 29, 2023
Comments
Please login to add a commentAdd a comment