U19 Women T20 World Cup
-
T20 WC: మిథాలీ రాజ్, ధోని అంటే ఇష్టం.. పిజ్జా, బర్గర్ తినాలని ఉన్నా!
కంచెలు తెంచేశాం. హద్దులు చెరిపేశాం. ఆంక్షలు తుడిచేశాం. అవరోధాలు ఎదిరించాం. నేల, నింగి, నీరు, ఊరు... కొలువు, క్రీడ, కార్మిక వాడ... గనులు, ఓడలు, రోదసి యాత్రలు.. పాలనలో.. పరిపాలనలో.. ఆర్థిక శక్తిలో.. అజమాయిషీలో సైన్యంలోన సేద్యంలోన అన్నీ మేమై... అన్నింటా మేమై... అవకాశం కల్పించుకుంటాం. అస్తిత్వం నిలబెట్టుకుంటాం. స్త్రీని గౌరవించే సమాజం.. స్త్రీని గౌరవించే సంస్కారం.. ప్రతి ఇంటి నుంచి మొదలవ్వాలి. ప్రతి రంగంలో పాదుకొనాలి. తెలుగుతేజమైన గొంగడి త్రిష ఉమన్ క్రికెటర్‌గా మనందరికీ పరిచయమే. భద్రాచల వాసి త్రిష అండర్–19 వరల్డ్ కప్– 2023 ఫైనల్లో టీమిండియాను జగజ్జేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించింది. ‘సీనియర్ ఉమన్ క్రికెట్ టీమ్‌లో చోటు దక్కించుకోవడమే నా నిరంతర కృషి’ అని చెబుతోంది త్రిష. ఫిట్నెస్ కోచ్ అయిన తండ్రి రామిరెడ్డి ద్వారా మూడేళ్ల వయసులోనే క్రికెట్లో ఓనమాలు దిద్దిన త్రిష ఎనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ అండర్–16 జట్టులో చేరింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు కూతుర్ని హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అకాడమీలో చేర్చారు. అక్కడ నుంచి ఆమె క్రికెటర్‌గా తనను తాను మెరుగుపరుచుకుంటూ భారతజట్టులో స్థానం దక్కించుకుంది. తెలంగాణ అమ్మాయిగా భారత క్రికెట్ జట్టులో విజయకేతనం ఎగురవేస్తున్న త్రిష తన ఆసక్తులను, భవిష్యత్తు కలను ఇలా వివరించింది... ‘‘నేను మహిళల అండర్–19 కేటగిరిరీలో టీ20 వరల్డ్ కప్‌కి ఆడాను. రాబోయే రోజుల్లో ఇండియన్ సీనియర్ ఉమెన్ క్రికెట్ టీమ్‌లో చోటు సంపాదించాలన్నది నాకల. ఆ లక్ష్యం సాధించడానికే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక తపస్సులా ప్రాక్టీస్ చేస్తున్నాను. గెలుపు ఓటమి గురించి కూడా ఆలోచించకుండా లక్ష్యం కోసం చేసే ప్రయత్నంలో ఏదీ ఒత్తిడిగా అనిపించదు. ఇతర అభిరుచులు... నాకున్న మరో అభిరుచి స్విమ్మింగ్. ఎంతసేపైనా వదలాలనిపించదు. అమ్మాయిలకు స్విమ్మింగ్ తప్పనిసరిగా వచ్చితీరాలని. నాకు స్విమ్మింగ్ చేసిన ప్రతీసారి అనిపిస్తుంటుంది. మంచి రిలాక్సేషనిస్తుంది స్విమ్మింగ్. చదువూ ముఖ్యమే.. ఇప్పుడు 12వ తరగతి చదువుతున్నాను. చదువు, ఆటలు కొనసాగిస్తూ వెళ్లడమే. ఎందుకంటే నా ఎదుగుదలకు ఈ రెండూ ముఖ్యమే అని భావిస్తాను. అయితే, ఎక్కువ సమయం క్రికెట్ సాధనను కేటాయించినప్పటికీ ఎగ్జామ్స్‌కి ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతుంటాను. ఇష్టాలు ఏవైనా కల తర్వాతే.. నాకు స్నేహితులు చాలా తక్కువ. కొందరు క్రికెట్ ఫ్రెండ్స్ ఉన్నారు. కోచ్‌లు సూచించిన డైట్‌ని కచ్చితంగా ఫాలో అవుతాను. ఏ ఆహారం తీసుకుంటే నా హెల్త్‌కి మంచిదో, ఫిట్నెస్ పట్ల ఎంత శ్రద్ధ తీసుకోవాలో అవన్నీ పాటిస్తాను. పిజ్జా, బర్గర్ వంటివి ఇంట్రస్ట్ ఉన్నా సరే తీసుకోను. ప్రాక్టీస్‌లోని మా క్రికెట్ టీమ్ మెంబర్స్‌తోనే టైమ్ పాస్ అవుతుంది కాబట్టి, ఇతరత్రా ఆలోచనలు కూడా ఏవీ మైండ్లోకి రానివ్వను. ప్రోత్సాహాన్నిచ్చేవి.. ఉమెన్ క్రికెటర్ మిథాలీరాజ్, ఎం.ఎస్ ధోనీలకు పెద్ద అభిమానిని. వారు ఆడుతున్న తీరును చూస్తూ పెరిగినదాన్ని కాబట్టి, వారు నాకు రోల్‌మోడల్స్. స్ఫూర్తిదాయకమైన వారి మాటలు నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకుంటాను’’ అని తెలియజేసిన త్రిష లక్ష్య సాధనలో ఎన్నో విజయాలు దక్కించుకోవాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి చదవండి: WPL 2023- Shabnam MD- GG: క్రికెట్.. బిర్యానీ.. అంతే..!: విశాఖ క్రికెటర్ షబ్నమ్ -
పృథ్వీ చేతికి మైక్ ఇచ్చిన ద్రవిడ్.. నవ్వాపుకొన్న గిల్! వీడియో చూశారా?
U19 Women T20 WC- Team India: మహిళా క్రికెట్లో అండర్ 19 స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ట్రోఫీని కైవసం చేసుకుని నీరాజనాలు అందుకుంటోంది టీమిండియా. షఫాలీ వర్మ సారథ్యంలోని టీమిండియా ప్లేయర్లు ఈ ఘనత సాధించి చరిత్రలో తమ పేర్లను పదిలం చేసుకున్నారు. భారత అమ్మాయిలు ఇంతవరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదన్న అపవాదును తుడిచివేస్తూ రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి విజయం తర్వాత షఫాలీ బృందంపై సర్వత్రా ప్రశంసల వర్షం కొనసాగుతోంది. అయితే, వీటిలో బీసీసీఐ షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ రెండో మ్యాచ్ సందర్భంగా.. ప్రపంచకప్ గెలిచిన మహిళా జట్టుకు పురుషుల టీమ్ శుభాభినందనలు తెలిపింది. ఇందులో భాగంగా.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ తొలుత విష్ చేసి టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా చేతికి మైక్ అందించాడు. నవ్వాపుకొన్న గిల్ ఈ క్రమంలో పృథ్వీ విష్ చేస్తుండగా.. జట్టు మొత్తం అతడిని తదేకంగా చూస్తూ నిల్చుని ఉన్నారు. ఇక మరో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మరీ నవ్వాపుకొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన టీమిండియా ఫ్యాన్స్.. ‘‘పాత రోజుల్లో ఏమేం చిలిపి పనులు చేశారో.. అవన్నీ గుర్తొచ్చినట్లున్నాయి! అందుకేనేమో ముసిముసిగా నవ్వుతున్నాడు. ఇద్దరు కెప్టెన్లు.. కోచ్ ఒక్కడే అప్పుడు తనకు డిప్యూటీగా ఉన్న గిల్‌తో ఓపెనింగ్ స్థానం కోసం ఇప్పుడు పృథ్వీ పోటీపడుతున్నాడు! ఏమిటో!’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా పృథ్వీ షా టీమిండియాకు 2018లో అండర్-19 వరల్డ్‌కప్ అందించాడు. అప్పుడు శుబ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక ప్రస్తుత జట్టులో ఉన్న ఇషాన్ కిషన్ కూడా అండర్-19 జట్టుకు సారథ్యం వహించినవాడే! అయితే, అతడి నేతృత్వంలోని టీమిండియా 2016 ఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ ద్రవిడ్ ఈ జూనియర్ టీమ్‌లకు కోచ్‌గా ఉండటం విశేషం. చదవండి: T20 WC: మరో మిథాలీగా ఎదగాలని ఆ తండ్రి ఆశ.. ‘దంగల్’లో అమీర్‌ఖాన్‌లా రామిరెడ్డి! A special message from Lucknow for India's ICC Under-19 Women's T20 World Cup-winning team 🙌 🙌#TeamIndia | #U19T20WorldCup pic.twitter.com/g804UTh3WB — BCCI (@BCCI) January 29, 2023 -
మరో మిథాలీగా ఎదగాలని ఆ తండ్రి ఆశ.. ‘దంగల్’లో అమీర్‌ఖాన్‌లా రామిరెడ్డి!
U19 Women T20 World Cup- Gongadi Trisha- సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: స్పోర్ట్స్ నేపథ్యంలో వెండితెర మీద విజయఢంకా మోగించిన సినిమాలు ఎన్నో. అందులో ప్రథమ స్థానం రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన దంగల్‌కు దక్కుతుంది. జాతీయ స్థాయిలో ఆడలేకపోయిన మల్లయోధుడు మహవీర్ తన ఇద్దరు కూతళ్లను మల్లయోధులుగా తీర్చిదిద్ది దేశానికి అనేక పతకాలు సాధించేలా ఎంతో శ్రమించాడు. ఆ కష్టాన్ని అమీర్‌ఖాన్, ఫాతిమా సనా, మల్హోత్రాలు వెండితెర మీద కళ్లకు కట్టారు. అచ్చంగా అలాంటి స్ఫూర్తిదాయక జీవితాలు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తారసపడతాయి. గోదావరి తీరాన శ్రీరాముడి పాదల చెంతన త్రిష – రామిరెడ్డిలు మన దంగల్ కథకు ప్రతిరూపాలుగా నిలిచారు. 22 గజాల క్రికెట్ పిచ్‌లో రాణించేందుకు త్రిష సాగించిన, సాగిస్తోన్న గురించి ప్రయాణం ఆమె తండ్రి రామిరెడ్డి మాటల్లో.... నేను హాకీ ప్లేయర్‌ని స్వతహాగా నేను హాకీ ప్లేయర్‌ని. ఆటల్లో నా వారసులు నన్ను మించేలా ఎదగాలని కోరుకున్నాను. ఒక క్రీడాకారుడిగా నా జీవితంలో ఎదురైన అనుభవాల ఆధారంగా నా పిల్లలకు క్రీడల్లో ఎదురయ్యే ఆటంకాలు రాకుండా చూసుకోవాలని వాళ్లు పుట్టకముందే డిసైడ్ అయ్యాను. క్రికెటర్‌ను చేయాలని అప్పటి వరకు ఉన్న ఆటలను పరిశీలిస్తే షటిల్, టెన్నిస్ తదితర గేమ్స్ హైట్ అడ్వాంటేజ్ గేమ్స్. ప్లేయర్లో ఎంత ప్రతిభ ఉన్నా హైట్ సరిగా లేకపోతే ఈ ఆటల్లో రాణించడం కష్టం. అయితే ఎత్తుతో సంబంధం లేని గేమ్స్ ఏంటా అని పరిశీలిస్తే ఫుట్‌బాల్, క్రికెట్లు కనిపించాయి. భద్రాచలంలో ఫుట్‌బాల్ ఆడేందుకు, కోచింగ్ ఇచ్చేందుకు అనుకూలమైన పరిస్థితి లేదు. అదే క్రికెట్ అయితే గల్లీ క్రికెట్ మొదలు భద్రాద్రి కప్ వరకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నట్టు అనిపించింది. మిథాలీలా ఎదగాలని.. రెండేళ్ల వయసు నుంచే దీంతో నాకు అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా భవిష్యత్తులో క్రికెట్లో గొప్ప స్థాయికి వెళ్లేలా అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. సాధారణంగా పిల్లలకు ఏడేళ్ల నుంచి ఏదైనా ఆటలో ప్రొఫెషనల్ కోచింగ్ ఇప్పించడం మొదలవుతుంది. కానీ నేను త్రిషాకు నేరు రెండేళ్ల వయస్సు నుంచే ప్రారంభించాను, త్రిష పుట్టిన సమయానికి విమెన్ క్రికెట్లో మిథాలిరాజ్ డబుల్ సెంచరీలతో సంచలనాలు నమోదు చేస్తోంది. వరల్డ్‌కప్ ఆడుతుందని నమ్మాను లేడీ సచిన్‌గా పేరు తెచ్చుకుంటోంది. దీంతో మిథాలీ స్ఫూర్తితో కేవలం రెండేళ్ల వయస్సులో తనకు ఏమీ తెలియనప్పటి నుంచే క్రికెటింగ్ షాట్లు ఆడటం నేర్పిస్తూ వచ్చాను. తనకు తెలియకుండానే అది మజిల్ మెమోరీలో ఇమిడి పోయింది. ఆ మజిల్ మెమొరీ తనకు ఎంతగానో ఉపయోగపడింది. తను ఎదుగుతున్న కొద్దీ ఆటలో ఆ తేడాను బయటి వాళ్లు కనిపెట్టలేకపోయినా నేను పసిపగడుతూ వచ్చాను. దీంతో తనకు ఏదో ఒక రోజు ఇండియా తరఫున విమెన్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాదు, కచ్చితంగా వరల్డ్ కప్ కూడా ఆగుతుందనే విశ్వాసం ఉండేది. ఏడేళ్ల వయస్సులో హైదరాబాద్‌కు అడ్వాన్స్, సైంటిఫిక్ కోచింగ్ కోసం త్రిషకు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యాం. అక్కడ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీకి వచ్చాం. వాళ్లిద్దరి ప్రత్యేక శిక్షణలో ఇక్కడ, జాన్ మనోజ్ సార్ త్రిష వీడియోను పరిశీలించారు. అప్పుడే వారు తను ఏదో ఒకరోజు ఇండియాకు ఆడుతుందని చెప్పారు. ఆర్ శ్రీధర్, ఇక్బాల్‌లు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రోజకు ఎనిమిది గంటల పాటు సాధన చేసేది. వారి అంచనాలను నిజం చేస్తూ 16లో దేశానికి ఎంపికైంది. 12 ఇయర్స్‌కి ఛాలెంజర్స్ సిరీస్‌కు సెలక్ట్ అయ్యింది. దీంతో మా నమ్మకం వమ్ము కాదనే నమ్మకం కలిగింది. హ్యపీగా ఉంది నా అంచనాలకు మించి ఏకంగా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో మెంబర్‌గా ఉండటమే కాదు ఫైనల్లో విలువైన పరుగులు చేసింది త్రిష. మా కుటుంబం, బంధువులు, కోచ్‌లు, భద్రాచలం పట్టణం అంతా సంతోషంగా ఉన్నాం. త్రిష విజయాన్ని భద్రాచలం పట్టణం అంతా కేక్‌లు కట్ చేసుకుని తమ ఇంటి పండగలా చేసుకోవడం చూస్తే పట్టరాని సంతోషం కలుగుతోంది. తదుపరి లక్ష్యం అదే ప్రస్తుతం అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో ఉన్న త్రిష ప్రస్తుతం భావనాస్ కాలేజీలో ఇంటర్మీడియ్ సెకండియర్ (సీఈసీ) చదువుతోంది. రాబోయే రోజుల్లో ఇండియన్ సీనియర్స్ జట్టుకు ఎంపిక కావాలనేది తదుపరి లక్ష్యం. అంతేకాదు విమెన్ వరల్డ్ కప్ జట్టులో తాను ఉండాలి, కప్ కొట్టాలనేది మా కుటుంబం లక్ష్యం. చదవండి: Ind Vs Aus: సెలక్షన్ కమిటీ డోర్లు బాదడం మాత్రమే కాదు.. ఏకంగా! అయినా పాపం IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టీ20.. టీమిండియాకు గ్రాండ్ వెలకమ్! వీడియో వైరల్ -
T20 WC: శెభాష్ బిడ్డా! మ్యాచ్‌ను మలుపు తిప్పిన త్రిష.. భద్రాచలంలో సంబరాలు
ICC U19 Women T20 World Cup- Gongadi Trisha: అండర్ – 19 టీ20 వరల్డ్ కప్‌లో తెలంగాణ తేజం, భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష అద్భుత ప్రతిభ కనబర్చింది. బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో రాణించి వరల్డ్‌కప్ సాధనలో తనవంతు పాత్ర పోషించింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌పై భారత జట్టు విజయభేరి మోగించి కప్ సొంతం చేసుకుంది. 68 పరుగులకే ఇంగ్లాడ్ జట్టును ఆలౌట్ చేసిన భారత్.. అనంతరం బ్యాటింగ్ చేపట్టగా త్రిష అద్భుత ఆటతీరును ప్రదర్శించింది. సంబరాల్లో భద్రాచలం వాసులు 24 పరుగులతో అజేయంగా నిలిచి సౌమ్య తివారితో కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి అండర్–19 వరల్డ్ కప్‌ను దేశానికి అందించింది. ఉమెన్ ఆఫ్ ద సీరీస్‌గా నిలిచిన ఇంగ్లండ్ కెప్టెన్‌ను క్యాచ్ ద్వారా ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పింది. దీంతో త్రిష సొంతూరైన భద్రాచలంలో క్రీడాభిమానుల ఆనందానికి హద్దే లేదు. మ్యాచ్ ఆద్యంతం టీవీల్లో వీక్షించారు. గెలిచిన అనంతరం రోడ్లపైకి వచ్చి సంబరాలు జరిపారు. బాణాసంచా కాల్చుతూ జయహో భారత్ నినాదాలు చేశారు.- భద్రాచలం తొలి వరల్డ్‌కప్ టోర్నీలో ‘మెరిసిన త్రిష’ భద్రాచలంలో జిమ్ నిర్వహించే గొంగడి రామిరెడ్డి కుమార్తె అయిన త్రిషను చిన్నతనం నుంచే క్రికెట్లో తీర్చిదిద్దారు. ఎనిమిదేళ్ల వయసులోనే జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో రాణించి ఉమెన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచింది. స్థానిక కళాశాల క్రీడా మైదానంలో త్రిషకు ఓనమాలు నేర్పిన రామిరెడ్డి, తన కూతురును అంతర్జాతీయ క్రీడాకారిణిగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్‌కు కుటుంబాన్ని తరలించి, త్రిషను ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దారు. రామయ్య ఆశీస్సులు ఉండాలి ఇటీవల అండర్–19 జట్టు తరఫున శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్ సిరీస్‌లలో రాణించటంతో అండర్–19 వరల్డ్ కప్ జట్టుకు త్రిషను ఎంపిక చేశారు. అండర్–19 వరల్డ్ కప్‌లో తొలిసారిగా ఎంపికవడంతో పాటు తొలి మ్యాచ్‌లోనే అద్భుతంగా ఆడి వరల్డ్‌కప్ సాధనకు దోహదం చేయడం విశేషం. స్కాట్లాండ్తో ఆడిన ఆటలో 51 బంతుల్లో 57 పరుగులు సాధించింది. భవిష్యత్‌లో మరింతగా రాణించాలని, త్రిషకు ‘భద్రాద్రి రామయ్య’ ఆశీస్సులు ఉండాలని ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: T20 WC: 2005 వరల్డ్‌కప్ టైమ్‌లో పుట్టినోళ్లు! ఒక్కొక్కరిది ఒక్కో కథ.. కుల్దీప్ కోచ్ దత్తత తీసుకున్న ఆ అమ్మాయి.. IND vs NZ: కుల్దీప్ మ్యాజిక్ డెలివరి.. దెబ్బకు కివీస్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్ -
2005 వరల్డ్‌కప్ టైమ్‌లో పుట్టినోళ్లు! కుల్దీప్ యాదవ్ కోచ్ దత్తత తీసుకున్న ఆ అమ్మాయి..
దాదాపు 18 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ చేరింది. అయితే ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ స్థాయిలో, ఏ ఫార్మాట్లో కూడా మన టీమ్ వరల్డ్‌కప్ గెలవలేకపోయింది. నాటి జట్టులో సభ్యురాలిగా ఉన్న ఆఫ్ స్పిన్నర్ నూషీన్ అల్ ఖదీర్ ఇప్పుడు యువ మహిళల టీమ్‌కు కోచ్. ఇప్పుడు అదే దక్షిణాఫ్రికా గడ్డపై మరో ఫైనల్ ఆడిన భారత బృందం ఈసారి విజేతగా నిలిచింది. దాదాపు 2005 వరల్డ్‌కప్ జరిగిన సమయంలోనే పుట్టిన అమ్మాయిలంతా ఇప్పుడు విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించారు. సీనియర్ టీమ్ మంచి ఫలితాలు సాధిస్తున్న సమయంలో అండర్–19 జట్టు కూడా తమ స్థాయిని ప్రదర్శించడం శుభపరిణామం. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న వర్ధమాన ప్లేయర్లలో బీసీసీఐ తొలి వరల్డ్‌కప్ కోసం టీమ్‌ను ఎంపిక చేసింది. అయితే ఎలాగైనా వరల్డ్‌కప్ గెలవాలనే ఉద్దేశంతో ఇప్పటికే సీనియర్ టీమ్‌లో ఆడిన షఫాలీ వర్మ, రిచా ఘోష్‌లను జట్టులోకి తీసుకుంది. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. అమ్మాయిలందరూ తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా రాణించడం విశేషం. శ్వేత సెహ్రావత్ 139.43 స్ట్రయిక్‌రేట్‌తో 297 పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలవగా, షఫాలీ (172 పరుగులు), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (116 పరుగులు) అండగా నిలిచారు. బౌలింగ్‌లో పార్శవి చోప్రా (11 వికెట్లు), మన్నత్ కశ్యప్ (9 వికెట్లు) కీలకపాత్ర పోషించారు. సీనియర్ టీమ్‌లో జూనియర్‌గా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టిన షఫాలీ ఈ టోర్నీ ద్వారా తన నాయకత్వ ప్రతిభను కూడా ప్రదర్శించడం విశేషం- సాక్షి క్రీడావిభాగం వరల్డ్‌కప్ సాధించిన బృందం గురించి సంక్షిప్తంగా... షఫాలీ వర్మ (కెప్టెన్): హరియాణాలోని రోహ్తక్కు చెందిన షఫాలీ భారత్ సీనియర్ జట్టు సభ్యురాలిగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భారత్ తరఫున 74 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. రిచా ఘోష్: బెంగాల్‌కు చెందిన కీపర్ రిచా కూడా సీనియర్ టీమ్ సభ్యురాలిగా 47 మ్యాచ్‌లు ఆడింది. పార్శవి చోప్రా: యూపీలోని గ్రేటర్ నోయిడాకు చెందిన లెగ్‌స్పిన్నర్. తండ్రి ఫ్లడ్ లైట్ సౌకర్యాలతో సొంత గ్రౌండ్ ఏర్పాటు చేసి మరీ కూతురును ఆటలో ప్రోత్సహించాడు. ఎండీ షబ్నమ్: విశాఖపట్నానికి చెందిన షబ్నమ్ తల్లిదండ్రులు నేవీలో పని చేస్తారు. శివశివాని స్కూల్లో పదో తరగతి చదువుతోంది. 15 ఏళ్ల వయసులోనే 110 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. సౌమ్య తివారి: స్వస్థలం భోపాల్. టాప్ ఆర్డర్ బ్యాటర్... కోహ్లిని ఇష్టపడే సౌమ్య అతనిలాగే కవర్‌డ్రైవ్ అద్భుతంగా ఆడుతుంది. టిటాస్ సాధు: బెంగాల్‌కు చెందిన టిటాస్ తండ్రి ఒక క్రికెట్ అకాడమీ నడపిస్తాడు. బెంగాల్ సీనియర్ టీమ్‌కు ఇప్పటికే ఆడింది. గొంగడి త్రిష: భద్రాచలంకు చెందిన త్రిష హైదరాబాద్‌లో స్థిర పడింది. తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్లోకి అడుగుపెట్టి 8 ఏళ్ల వయసులోనే అండర్–16లో ప్రాతినిధ్యం వహించింది. మన్నత్ కశ్యప్: పటియాలాకు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్. ఇటీవల వరుసగా ‘మన్కడింగ్’లు చేసి గుర్తింపు తెచ్చుకుంది. శ్వేత సెహ్రావత్: ఢిల్లీకి చెందిన బిగ్ హిట్టర్. ఆర్థికంగా మెరుగైన నేపథ్యం ఉన్న కుటుంబం. సొప్పదండి యశశ్రీ: హైదరాబాద్‌కు చెందిన మీడియం పేసర్. టోర్నీ లో ఒక మ్యాచ్ ఆడింది. గాయంతో తప్పుకున్న హర్లీ గలా స్థానంలో జట్టులోకి వచ్చింది. అర్చనా దేవి: ఆఫ్‌స్పిన్నర్. యూపీలోని ఉన్నావ్ స్వస్థలం. కడు పేదరికం. తండ్రి ఎప్పుడో చనిపోయాడు. కుల్దీప్ యాదవ్ కోచ్ కపిల్ పాండే దత్తత తీసుకొని ముందుకు నడిపించాడు. సోనమ్ యాదవ్: యూపీ లెఫ్టార్మ్ స్పిన్నర్. తండ్రి ఫిరోజాబాద్‌లో చేతి గాజులు తయారు చేసే పరిశ్రమలో కార్మికుడు ఫలక్ నాజ్: స్వస్థలం యూపీలోని ప్రయాగ్‌రాజ్. ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ తండ్రి ఒక ప్రైవేట్ స్కూల్లో ప్యూన్. రిషిత బసు: వికెట్ కీపర్, బెంగాల్‌లోని హౌరా స్వస్థలం. అద్భుతమైన మెరుపు షాట్లు ఆడుతుంది. మాజీ క్రికెటర్ లక్ష్మీరతన్ శుక్లా తన అకాడమీలో ఉచిత శిక్షణ ఇస్తున్నాడు. చదవండి: Novak Djokovic: తిరుగులేని జొకోవిచ్.. సిట్సిపాస్కిది రెండోసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే! Hockey World Cup 2023: హాకీ జగజ్జేత జర్మనీ From #TeamIndia to #TeamIndia🇮🇳 Well done!!! We are so proud of you! 🤝 pic.twitter.com/YzLsZtmNZr — BCCI Women (@BCCIWomen) January 29, 2023 -
ICC T20 WC: బీసీసీఐ కానుక రూ. 5 కోట్లు! వచ్చే నెలలో ఇంతకంటే పెద్ద ట్రోఫీ కూడా!
ICC U19 Inaugural T20 World Cup- Shafali Verma: ఐసీసీ అండర్–19 టి20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభినందించింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి కలిపి రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. మరోవైపు ఫైనల్లో ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ సాధించిన మహిళల టీమ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ యువ జట్టు భవిష్యత్తులోనూ మరిన్ని టోర్నీలో విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అదే విధంగా భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, హార్దిక్ పాండ్యా సేన.. మహిళా టీమ్‌కు వీడియో సందేశం ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఇంతకంటే పెద్ద ట్రోఫీ కూడా ‘‘అమ్మాయిలంతా చాలా బాగా ఆడారు. వారి ప్రదర్శన, తమపై తమకు ఉన్న నమ్మకం గురించి ఎంత చెప్పినా తక్కువే. కీలక పాత్ర పోషించిన సహాయక బృందానికి కూడా కృతజ్ఞతలు’’ అంటూ భారత కెప్టెన్ షఫాలీ వర్మ హర్షం వ్యక్తం చేసింది. చారిత్రక విజయంలో జట్టు సమిష్టి ఉందని పేర్కొంది. అదే విధంగా... వచ్చే నెలలో ఇంతకంటే పెద్ద ట్రోఫీ (సీనియర్ మహిళల టి20 ప్రపంచకప్)ని కూడా అందుకోవాలని ఉందంటూ షఫాలీ తన ఆకాంక్షను తెలియజేసింది. అండర్–19 టి20 ప్రపంచకప్- ఎవరెవరిపై గెలిచామంటే.. ►లీగ్ దశలో: దక్షిణాఫ్రికాపై 7 వికెట్లతో గెలుపు ►యూఏఈపై 122 పరుగులతో విజయం ►స్కాట్లాండ్పై 83 పరుగులతో గెలుపు ►సూపర్ సిక్స్ దశలో: ఆస్ట్రేలియా చేతిలో 7 వికెట్లతో ఓటమి. ►శ్రీలంకపై 7 వికెట్లతో విజయం ►సెమీస్‌లో: న్యూజిలాండ్‌పై 8 వికెట్లతో విజయం ►ఫైనల్లో: ఇంగ్లండ్‌పై 7 వికెట్లతో గెలుపు చదవండి: IND Vs NZ T20: కివీస్‌పై టీమిండియా గెలుపు U19 Womens WC 2023: వారెవ్వా అర్చన.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్! A special message from Lucknow for India's ICC Under-19 Women's T20 World Cup-winning team 🙌 🙌#TeamIndia | #U19T20WorldCup pic.twitter.com/g804UTh3WB — BCCI (@BCCI) January 29, 2023 -
T20 WC: ఆసీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఫైనల్లో టీమిండియాతో పోరు
ICC Under 19 Womens T20 World Cup 2023 - పోష్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): అండర్-19 టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ మూడు పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో పోరుకు సిద్ధమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ గ్రేస్ స్రివెన్స్ 20, అలెక్సా స్టోన్‌హౌజ్ 25 మాత్రమే 20కి పైగా పరుగులు స్కోరు చేశారు. దీంతో 19.5 ఓవర్లలో 99 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ బౌలర్లు దెబ్బకొట్టారు. హన్నా బేకర్ మూడు, గ్రేస్ స్రివెన్స్ రెండు, జోసీ గ్రోవ్స్, రియానా, ఎలీ ఆండర్సన్, అలెక్సా స్టోన్‌హౌజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో 96 పరగులకే ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. హన్నా బేకర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. చరిత్రకు అడుగుదూరంలో ఆసీస్ బ్యాటర్లలో క్లేర్ మూరే 20, అమీ స్మిత్ 26 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. ఇప్పటి వరకు భారత మహిళల క్రికెట్ జట్టు ఏ ఫార్మాట్లోనైనా విశ్వవిజేతగా నిలువలేకపోయింది. వన్డే ప్రపంచకప్‌లో రెండుసార్లు రన్నరప్‌గా, టి20 ప్రపంచకప్‌లో ఒకసారి రన్నరప్‌గా నిలిచింది. అయితే సీనియర్లకు సాధ్యంకాని ఘనతను సాధించేందుకు భారత జూనియర్ మహిళల జట్టు విజయం దూరంలో నిలిచింది. తొలిసారి నిర్వహిస్తున్న అండర్–19 టి20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు సాధించింది. భారత లెగ్ స్పిన్నర్ పార్శవి చోప్రా (3/20) కివీస్‌ను కట్టడి చేసింది. టిటాస్ సాధు, మన్నత్, షఫాలీ, అర్చన దేవి ఒక్కో వికెట్ తీశారు. అనంతరం భారత్ 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి గెలిచింది. శ్వేత సెహ్రావత్ (45 బంతుల్లో 61 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీ చేసింది. సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: Washington Sundar: స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన సుందర్.. IND Vs NZ: తొలి టి20లో టీమిండియా ఓటమి.. -
టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా.. కివీస్‌తో పోరుకు సై
ICC Under 19 Womens T20 World Cup 2023: అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీలో షఫాలీ వర్మ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాలో బుధవారం ‘సూపర్ సిక్స్’ దశ మ్యాచ్‌లు ముగిశాయి. గ్రూప్–1లో ఉన్న భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు 6 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. సెమీస్ చేరిన జట్లు ఇవే అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత్ (+2.844), ఆస్ట్రేలియా (+2.210) సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఇక గ్రూపు- 2లో ఉన్న ఇంగ్లండ్ వెస్టిండీస్‌పై బుధవారం ఘన విజయం సాధించింది. 95 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. ఇక ఇదే గ్రూపులో ఉన్న న్యూజిలాండ్ ఇప్పటికే పాకిస్తాన్‌పై 103 పరుగుల తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్ ఎప్పుడంటే ఈ నేపథ్యంలో శుక్రవారం(జనవరి 27) జరుగనున్న మొదటి సెమీస్ మ్యాచ్‌లో భారత్- న్యూజిలాండ్ తలపడనుండగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో సెమీస్ విజేతల మధ్య ఆదివారం ఫైనల్ జరుగనుంది. కాగా ఈ మెగా ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా సెమీస్ చేరుకోలేక ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. చదవండి: IPL: ఆల్‌టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్! కానీ.. Kieron Pollard: విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి!