అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తమ జట్టును ప్రకటించింది. ఇందుకు సంబంధించి పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. మలేషియా వేదికగా జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది.
ఈ టోర్నమెంట్లో భారత జట్టుకు నికీ ప్రసాద్(Niki Prasad) కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. సనికా చాల్కే వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. వికెట్ కీపర్ల కోటాలో జి. కమలిని, భవికా అహిరే చోటు దక్కించుకున్నారు.
ఇక నిక్కీ సారథ్యంలోని భారత జట్టులో ముగ్గురు తెలుగమ్మాయిలు గొంగడి త్రిష(G Trisha), కేసరి ధృతి, ఎండీ షబ్నమ్ కూడా స్థానం సంపాదించారు. మరోవైపు.. స్టాండ్ బై ప్లేయర్లుగా నంధాన ఎస్, ఐరా జె, టి అనధి ఎంపికయ్యారు.
పదహారు జట్ల మధ్య పోటీ
కాగా మలేషియాలో జరిగే అండర్-19 మహిళల ప్రపంచకప్ టోర్నీ(U19 Women’s T20 World Cup)లో మొత్తం పదహారు జట్లు పాల్గొంటాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్- ‘ఎ’లో భారత్‌తో పాటు మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో జనవరి 19న వెస్టిండీస్‌తో తలపడుతుంది.
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి భారత్
అనంతరం.. జనవరి 21న మలేషియా, 23న శ్రీలంకతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక నాలుగు గ్రూపులలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ స్టేజ్‌లో అడుగుపెడతాయి. ఈ దశలో రెండు గ్రూపులలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
కాగా 2023లో తొలిసారి మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ నిర్వహించగా.. భారత జట్టు చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం చేయాలని డిఫెండింగ్ చాంపియన్ పట్టుదలగా ఉంది.
అండర్ -19 మహిళల ప్రపంచకప్ 2025కి భారత జట్టు
నికీ ప్రసాద్(కెప్టెన్), సనికా చాల్కే(వైస్ కెప్టెన్), గొంగడి త్రిష, జి. కమలిని(వికెట్ కీపర్), భవికా ఆహిరే(వికెట్ కీపర్), ఈశ్వరి అవసారే, మిథిలా వినోద్, జోషిత వీజే, సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా, కేసరి ధృతి, ఆయుశి శుక్లా, ఆనందితా కిషోర్, ఎండీ షబ్నమ్, వైష్లవి ఎస్.
స్టాండ్ బై ప్లేయర్లు: నంధాన ఎస్, ఐరా జె, టి అనధి.
చదవండి: IND W Vs BAN W: ఫైనల్లో బంగ్లాదేశ్ చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్
నేను బతికి ఉన్నానంటే.. అందుకు కారణం అతడే: వినోద్ కాంబ్లీ
Comments
Please login to add a commentAdd a comment