ప్రపంచకప్ సెమీస్‌లో భారత జట్టు (PC: BCCI)
ICC Under 19 Womens T20 World Cup 2023: అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీలో షఫాలీ వర్మ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాలో బుధవారం ‘సూపర్ సిక్స్’ దశ మ్యాచ్‌లు ముగిశాయి. గ్రూప్–1లో ఉన్న భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు 6 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి.
సెమీస్ చేరిన జట్లు ఇవే
అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత్ (+2.844), ఆస్ట్రేలియా (+2.210) సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఇక గ్రూపు- 2లో ఉన్న ఇంగ్లండ్ వెస్టిండీస్‌పై బుధవారం ఘన విజయం సాధించింది. 95 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. ఇక ఇదే గ్రూపులో ఉన్న న్యూజిలాండ్ ఇప్పటికే పాకిస్తాన్‌పై 103 పరుగుల తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.
ఫైనల్ ఎప్పుడంటే
ఈ నేపథ్యంలో శుక్రవారం(జనవరి 27) జరుగనున్న మొదటి సెమీస్ మ్యాచ్‌లో భారత్- న్యూజిలాండ్ తలపడనుండగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో సెమీస్ విజేతల మధ్య ఆదివారం ఫైనల్ జరుగనుంది. కాగా ఈ మెగా ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా సెమీస్ చేరుకోలేక ఈవెంట్ నుంచి నిష్క్రమించింది.
చదవండి: IPL: ఆల్‌టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్! కానీ..
Kieron Pollard: విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి!
Comments
Please login to add a commentAdd a comment