cash prize
-
అత్యున్నత ఐదువేలు
దాదాపు నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో ఒక పదకొండు వేల మంది తలా వంద రూపాయలు ఇస్తే ఎంతవుతుంది? పోనీ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల నుంచి, ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజల నుంచి కలిపి వేయిమంది తలా వంద రూపాయలు ఇస్తే ఎంతవుతుంది? లెక్క తరువాత మాట్లాడుదాం.‘సినిమా రంగంలో రచయితకు అత్యంత తక్కువగా డబ్బు ఇవ్వాలని నిర్మాతకు ఎందుకనిపిస్తుందంటే అతను ఖాళీ చేతులతో వస్తాడు కనుక’ అని రచయిత సౌదా అంటాడు. నిజమే. మేకప్ వేసేవాడు పెద్ద కిట్ తెస్తాడు. విగ్గులకు డబ్బు అడుగుతాడు. కాస్ట్యూమ్ డిజైనర్ బోలెడన్ని బట్టలు కొనాలి కనుక బిల్లు ఎక్కువ. సినిమాటోగ్రాఫర్ కెమెరాలు, లెన్సులు, క్రేన్లు, భారీ పరికరాలు... ఇన్ని వాడుతున్నాడంటే అతనికి ఎంతిచ్చినా తక్కువే. కళా దర్శకుడు వేసే సెట్ కనిపిస్తుంది.మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వాద్యాల బృందం కనిపిస్తుంది. మరి రచయిత దగ్గరో? ఒక తెల్లకాగితం, పెన్ను. ఐదు రూపాయల పెన్ను జేబులో పెట్టుకుని వచ్చేవాడికి, కాగితం మీద అప్పటికప్పుడు రాసిచ్చి వెళ్లేవాడికి డబ్బు ఇవ్వడం అవసరమా అని నిర్మాతకేం ఖర్మ, ఎవరికైనా అనిపిస్తుంది. చిత్రమేమిటంటే సినిమా ‘సీన్ పేపర్’ నుంచే మొదలవుతుంది. దానిని రచయితే రాయాలి.తన దగ్గరకు వచ్చిన ఆసామీకి టీ ఇచ్చి, అతను తాగి కప్పు దించే లోపలే పాట రాసి ఇచ్చాడట ఆత్రేయ. ‘ఐదు నిమిషాల్లో రాశారు. దీనికింత డబ్బు ఇవ్వడం అవసరమా’ అన్నాడట ఆసామీ లాల్చీ జేబులో చేయి పెట్టి నసుగుతూ. ఆత్రేయ మొహమాటపడక డబ్బు అందుకుని ‘ఈ ఐదు నిమిషాల వెనుక ముప్పై ఏళ్ల తపస్సు ఉంది నాయనా’ అన్నాడట. రచయిత చేతికి పని చెప్పే మెదడు ఉందే, అది రాతకు తయారుగా ఉందే, ఆ మెదడు అలా తయారు కావడానికి రచయిత ఏమేమి చేసి ఉంటాడు? ఎన్ని రాత్రులను పుస్తకాలు చదువుతూ తగలెట్టి ఉంటాడు? ఎన్ని తావుల్లో తిరుగుతూ మనుషుల్లో పాత్రలను వెతుకుతూ వారి చెమట, కన్నీరు, రక్తపు చారికలు పూసుకుని ఉంటాడు? వారి సద్బుద్ధుల చందనంలో, దుర్బుద్ధుల దుర్గంధంలో వారే తానై బతికి ఉంటాడు? ఆ రాత్రి ఉదయించిన సంపూర్ణ చంద్రుడి రంగును సరైన మాటల్లో వర్ణించడానికి ఎన్ని గుప్పుల పొగను తాగి ఊపిరిని నలుపు చేసుకుని ఉంటాడు? ఒక గొప్ప వాక్యం కోసం ఎన్ని వందల కాగితాలను చించి ఉంటాడు? ఒక కావ్యజన్మ కోసం ఎన్ని ఊహా పరిష్వంగాలలో పదేపదే సొమ్మసిల్లి ఉంటాడు?లాల్చీ, పైజామా, జేబులో పెన్నుతో అతడు ఎదురు పడినప్పుడు– అవశ్యం– అతని మేధాశ్రమ ఏదీ కనిపించదు. కనుక కలం పట్టి అతను రాసే రాతకు అత్యల్ప రుసుము ఇవ్వవచ్చనే ఆనవాయితీ ఎవరైనా పాటించవచ్చు. కథకు, కవితకు 500 రూపాయల పారితోషికం ఇవ్వొచ్చు. ఇవ్వక ఎగ్గొట్ట వచ్చు. పదుగురిని అడిగో, పి.ఎఫ్ బద్దలు కొట్టో పుస్తకం వేస్తే అమ్మిన ప్రతుల సొమ్ము అమ్మకందారు ఇవ్వొచ్చు. ఇవ్వక పోవచ్చు. పబ్లిషర్లు ఎవరైనా ఉంటే వారు రాయల్టీ ఇవ్వొచ్చు. ఇవ్వకపోనూవచ్చు. ఒకసారి రచయిత పుస్తకం వేశాక వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ తదితరాలలో ఉండే సాహితీ సూక్ష్మక్రిములు అది తమ సొంతంగా భావించి వందలాది పి.డి.ఎఫ్‌లు పంచొచ్చు... పుస్తకం కొనకనే చదువుకోవచ్చు.ఇవన్నీ ఇలాగుంటే తెలుగునాట సాహితీకారులను ప్రోత్సహించడానికి ‘ఐదు వేలు’ అనే అచ్చొచ్చిన నంబర్ ఒకటి ఉంది. పాతిక, ముప్పై ఏళ్ల క్రితం మొదలైన ‘ఐదు వేల రూపాయల’ అవార్డు/బహుమతి తెలుగు సాహితీజాతికి లక్ష్మణరేఖ. నేటికీ, 2024లో కూడా, ‘చార్జీలతో కలిపి 5000 రూపాయల’ అవార్డు ప్రకటిస్తే అదే పదివేలనుకుని భార్యాపిల్లలను వెంటబెట్టుకువెళ్లే దుఃస్థితి తెలుగు రచయితది. తెలుగు నేలన ఎక్కడ పట్టినా నేటికీ ‘మొదటి బహుమతి 5 వేలు, రెండవ బహుమతి 3 వేలు, మూడవ బహుమతి వేయి రూపాయల’ దిక్కుమాలిన కథాపోటీలు. వాటికి రాసే సీనియర్ రచయితలు! సాహితీ అకాడెమీ పురస్కార గ్రహీతలు! వెయ్యి రూపాయల లిస్ట్‌లో వీరి పేర్లు! రూపాయి ఊసెత్తక తలపాగా, ముఖం తుడవను పనికిరాని శాలువాతో ఇచ్చే అవార్డులు కొల్ల. వీటికి తోడు 116 డాలర్లు మొహానకొట్టే ఎన్ .ఆర్.ఐ వితరణశీలత ఏమని చెప్పుట? ఇంటికి చెద పట్టిందని ఫోన్ చేస్తే ఐదు వేలకు తక్కువగా ఎవరూ రావడం లేదు. గంట కార్పెంటర్ పని చేస్తే రెండు వేలు నిలబెట్టి వసూలు చేస్తాడు. ప్లంబర్ వచ్చి వాష్‌బేసిన్ వైపు చూడాలంటే కనీస వెల వెయ్యి. కాని తెలుగు రచయిత మాత్రం తన దశాబ్దాల తపస్సుకు ‘బాబూ... ఒక్క ఐదు వేలు’ అంటున్నాడు. తెలుగు సాహితీవరణంలో నిషేధించాల్సిన ఒకే ఒక నంబర్– ఐదు వేలు!140 కోట్ల భారతీయులలో పదకొండు వేల మంది వంద రూపాయలు ఇస్తే పదకొండు లక్షలు అవుతాయి. అది మన జ్ఞానపీట్అ వార్డు నగదు బహుమతి! 9 కోట్ల తెలుగువారిలో వెయ్యి మంది వంద రూపాయలు ఇస్తే లక్ష అవుతుంది. అది సాహిత్య అకాడెమీ నగదు బహుమతి. జీవితంలో ఒకసారి పొందే వీటి నగదులే ఇలా ఉంటే ఐదు వేల అవార్డుకు వంకలేల అంటారా? ఆ అత్యున్నత అంకెతో అత్యల్పంగా బతికేద్దాం! -
ICC T20 WC: బీసీసీఐ కానుక రూ. 5 కోట్లు! వచ్చే నెలలో ఇంతకంటే పెద్ద ట్రోఫీ కూడా!
ICC U19 Inaugural T20 World Cup- Shafali Verma: ఐసీసీ అండర్–19 టి20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభినందించింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి కలిపి రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. మరోవైపు ఫైనల్లో ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ సాధించిన మహిళల టీమ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ యువ జట్టు భవిష్యత్తులోనూ మరిన్ని టోర్నీలో విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అదే విధంగా భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, హార్దిక్ పాండ్యా సేన.. మహిళా టీమ్‌కు వీడియో సందేశం ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఇంతకంటే పెద్ద ట్రోఫీ కూడా ‘‘అమ్మాయిలంతా చాలా బాగా ఆడారు. వారి ప్రదర్శన, తమపై తమకు ఉన్న నమ్మకం గురించి ఎంత చెప్పినా తక్కువే. కీలక పాత్ర పోషించిన సహాయక బృందానికి కూడా కృతజ్ఞతలు’’ అంటూ భారత కెప్టెన్ షఫాలీ వర్మ హర్షం వ్యక్తం చేసింది. చారిత్రక విజయంలో జట్టు సమిష్టి ఉందని పేర్కొంది. అదే విధంగా... వచ్చే నెలలో ఇంతకంటే పెద్ద ట్రోఫీ (సీనియర్ మహిళల టి20 ప్రపంచకప్)ని కూడా అందుకోవాలని ఉందంటూ షఫాలీ తన ఆకాంక్షను తెలియజేసింది. అండర్–19 టి20 ప్రపంచకప్- ఎవరెవరిపై గెలిచామంటే.. ►లీగ్ దశలో: దక్షిణాఫ్రికాపై 7 వికెట్లతో గెలుపు ►యూఏఈపై 122 పరుగులతో విజయం ►స్కాట్లాండ్పై 83 పరుగులతో గెలుపు ►సూపర్ సిక్స్ దశలో: ఆస్ట్రేలియా చేతిలో 7 వికెట్లతో ఓటమి. ►శ్రీలంకపై 7 వికెట్లతో విజయం ►సెమీస్‌లో: న్యూజిలాండ్‌పై 8 వికెట్లతో విజయం ►ఫైనల్లో: ఇంగ్లండ్‌పై 7 వికెట్లతో గెలుపు చదవండి: IND Vs NZ T20: కివీస్‌పై టీమిండియా గెలుపు U19 Womens WC 2023: వారెవ్వా అర్చన.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్! A special message from Lucknow for India's ICC Under-19 Women's T20 World Cup-winning team 🙌 🙌#TeamIndia | #U19T20WorldCup pic.twitter.com/g804UTh3WB — BCCI (@BCCI) January 29, 2023 -
సరిగమప లిటిల్ చాంప్స్ విజేతగా తొమ్మిదేళ్ల చిన్నారి.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
సరిగమప లిటిల్ చాంప్స్9 విజేతగా తొమ్మిదేళ్ల చిన్నారి జెట్షెన్ దోహ్నా నిలిచింది. సిక్కింకు చెందిన ఈ చిన్నారి లిటిల్ చాంప్స్9 విజేతగా ట్రోఫీతో పాటు రూ. 10లక్షల నగదు బహుమతిని అందుకుంది. మూడేళ్ల ప్రాయం నుంచే సంగీతంలో శిక్షణ తీసుకుంటున్న చిన్నారి తన ముద్దులొలికే గాత్రంతో ఎన్నో పాటలు పాడి ప్రశంసలు అందుకుంది. ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న శంకర్ మహాదేవన్ సైతం దోహ్నాని 'మినీ సునిధి చౌహాన్' అంటూ పేరు కూడా పెట్టారు. తాజాగా సరిగమప లిటిల్ చాంప్స్9 విజేతగా నిలవడంతో సిక్కీం ముఖ్యమంత్రి, ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ సహా పలువురు దోహ్నాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టైటిల్ విన్నర్‌గా నిలిచిన దోహ్నా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'టైటిల్ గెలుస్తానని అస్సలు ఊహించలేదు. నిజానికి చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. కార్టూన్స్ షోస్‌లో సాంగ్స్ వింటూ సంగీతంపై ఆసక్తి కలిగింది. నాకు ఎల్లప్పుడూ సపోర్ట్‌గా నిలిచిన నా తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు' అంటూ పేర్కొంది. ఏదో ఒకరోజు సింగర్ సునిధి చౌహాన్‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. -
కన్నతల్లితోనే ఛాలెంజ్! ఆరేళ్ల తర్వాత..
చెప్పింది వినకుండా పిల్లలు మారాం చేసినప్పుడు.. ఫలానా కొనిస్తాం లేదంటే ఫలానా దగ్గరికి తీసుకెళ్తాం అంటూ బుజ్జగిస్తుంటారు పేరెంట్స్. ఈరోజుల్లో పిల్లల పాలిట సెల్‌ఫోన్ ఒక వ్యసనంగా మారింది. ఆ అలవాటు మాన్పించే ప్రయత్నాలు ఎన్ని ఉన్నా.. పూర్తి స్థాయిలో వర్కవుట్ కావడం లేదు. ఈ తరుణంలో ఓ తల్లి చేసిన పని.. ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఆరేళ్ల కిందట.. మిన్నెసోటా(అమెరికా)కు చెందిన 12 ఏళ్ల పిలగాడు సివెర్ట్ క్లెఫ్‌సాస్ ఇంట్లో ఉన్న మొబైల్‌కు అతుక్కుపోవడం మొదలుపెట్టాడు. కొడుకును ఎలాగైనా ఆ వ్యసనానికి దూరం చేయాలని తల్లి లోర్నా గోల్డ్స్ట్రాండ్ భావించింది. ఇందుకోసం కొడుకుతో ఓ ఛాలెంజ్ చేసింది. బహుశా ఏ తల్లికి ఇలాంటి ఐడియా వచ్చి ఉండదేమో.! ఆరేళ్ల పాటు సోషల్ మీడియాకు గనుక దూరంగా ఉంటే.. సివెర్ట్ 18వ పుట్టినరోజున 1,800 డాలర్లు (మన కరెన్సీలో లక్ష 36 వేల రూపాయలు) ఇస్తానని ఛాలెంజ్ విసిరింది. అంత చిన్న వయసులో అంత పెద్ద ఫిగర్ వినేసరికి సివెర్ట్ టెంప్ట్ అయ్యాడు. తల్లి ఛాలెంజ్‌కు సై చెప్పాడు. ఆరేళ్లు గిర్రున తిరిగింది.. తల్లితో చేసిన ఛాలెంజ్‌కు కట్టుబడి ఈ ఆరేళ్లు సోషల్ మీడియా జోలికి పోలేదు ఆ కుర్రాడు. మీరు నమ్మినా.. నమ్మకపోయినా.. అదే నిజం అంటున్నాడు. రీసెంట్గా బర్త్‌డే 18వ పుట్టినరోజు చేసుకున్న ఆ కుర్రాడికి.. ఛాలెంజ్ ప్రకారం 1,800 డాలర్లను కొడుక్కి అందించింది లోర్నా. అంతేకాదు కొడుకు ఫొటోను తన ఫేస్బుక్లో షేర్ చేసి.. జరిగిందంతా చెప్పింది. తన పెద్ద కూతురిలా కొడుకు కూడా సోషల్ మీడియాకు బానిస కావడం, మానసికంగా కుంగిపోవడం ఇష్టం లేకనే ఇలా ఛాలెంజ్ విసిరానని చెప్తోందామె. ఈ ఆరేళ్ల కాలంలో తన తోటి వాళ్లెందరో స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యారు. కానీ, తన కొడుకు మాత్రం వాటికి దూరంగా ఉన్నాడని మెచ్చుకుంది ఆ తల్లి. ఇంతకీ ఈ తల్లికి ఈ ఐడియా ఎలా తట్టిందో తెలుసా? ఓరోజు రేడియోలో 18 ఫర్ 18 ఛాలెంజ్ అనే కాన్సెప్ట్ గురించి వినిందట. ఆ స్ఫూర్తితో కొడుక్కి ఈ ఛాలెంజ్ విసిరిందామె. ఇక ఎలాగూ కొడుకు తన ఛాలెంజ్ పూర్తి చేయడంతో.. ఇప్పుడతనికి స్వేచ్ఛ దొరికినట్లయ్యింది. -
కుర్రాళ్లకు బీసీసీఐ భారీ నజరానా, ఎంతంటే..
U19 Cricket World Cup: అండర్-19 ప్రపంచకప్ 2022 ఛాంపియన్‌గా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఇంగ్లండ్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించి జగజ్జేతగా నిలిచింది.ఈ క్రమంలో భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత యువ జట్టును బీసీసీఐ కార్యదర్శి జైషా అభినందించారు. అధ్బుతమైన ప్రదర్శనతో భారత విజయంలో భాగమైన ప్రతీ ఒక్క ఆటగాడికి రూ. 40 లక్షల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అదే విధంగా సహాయక సిబ్బందిలోని ప్రతి సభ్యుడికి 25 లక్షల క్యాష్ ఫ్రైజ్‌ను అందజేయనున్నట్లు జైషా పేర్కొన్నారు. "ప్రపంచ కప్‌ను గెలుచుకున్నందుకు యువ భారత్‌కు అభినందనలు. అండర్-19 ప్రపంచకప్‌లో అత్యత్తమ ప్రదర్శన చేసిన ప్రతి ఆటగాడికి 40 లక్షలు, సహాయక సిబ్బందికి 25 లక్షల రివార్డును ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. మీరు దేశం గర్వించేలా చేశారు" అని జైషా ట్విటర్లో పేర్కొన్నారు. కాగా అండర్-19 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకోవడం ఇది ఐదోసారి. చదవండి: Under 19 World Cup: చాంపియన్ యువ భారత్ -
శెభాష్ దాస్.. క్యాష్రివార్డ్ ప్రకటించిన గూగుల్
టెక్ దిగ్గజం గూగుల్ భారతీయ యువకుడికి నజరానా ప్రకటించింది. హ్యాకర్ల పాలిట కల్పతరువుగా మారిన ఓ బగ్‌ను కనిపెట్టిన కృషికి ఫలితంగా ఆ యువకుడికి క్యాష్ ప్రైజ్‌ను అందించింది. అస్సాంకు చెందిన రోనీ దాస్ అనే యువకుడు.. గూగుల్ ఆండ్రాయిడ్ ఫోర్‌గ్రౌండ్ సర్వీసులో ఒక బగ్‌ను గుర్తించాడు. ఈ బగ్ సాయంతోనే హ్యాకర్లు యూజర్ల ఫోన్‌ను హ్యాక్ చేయడంతో పాటు వ్యక్తిగత డాటాను తస్కరించే అవకాశం ఉంది. ఈ బగ్‌ను రిపోర్టింగ్ చేసినందుకు గానూ 5 వేల డాలర్లను(మన కరెన్సీలో మూడున్నర లక్షల రూపాయలు) ప్రకటించింది గూగుల్. దాస్ ఈ బగ్‌ను ఈ ఏడాది మే నెలలోనే గుర్తించాడు. ఈ కష్టానికి గుర్తింపుగా 5వేల డాలర్లు అందిస్తున్నాం అని గూగుల్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ టీం ఒక మెయిల్ ద్వారా దాస్‌కు తెలియజేసింది. దాస్ చెప్తున్న వివరాల ప్రకారం.. ఈ బగ్ ద్వారా ఫోన్ కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్..ఇలాంటి వివరాలు కూడా హ్యాకర్ల చేతికి వెళ్తాయట. అయితే గోప్యత కారణంగా బగ్‌కి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించేందుకు దాస్ ఇష్టపడలేదు. సైబర్ అన్వేషణలో ఆసక్తి ఉన్న దాస్.. గతంలో గువాహటి యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోనూ బగ్‌ను గుర్తించాడు. ఇక రోనీ దాస్ గుర్తించిన బగ్‌ను ఫిక్స్ చేసిందా? లేదా? అనే విషయంపై గూగుల్ స్పష్టత ఇవ్వలేదు. బగ్‌లను గుర్తించిన రీసెర్చర్లు, ఇంజినీర్లు, సైబర్ ఎక్స్‌పర్ట్స్‌లకు టెక్ దిగ్గజాలు నజరానా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఆసక్తి ఉంటే మీరూ ఆ దిశగా ప్రయత్నం చేసి అదృష్టం పరీక్షించుకోండి. చదవండి: భారత్‌లో గూగుల్, ఫేస్బుక్ ఆదాయం.. వామ్మో! -
JIO: ఇ గేమింగ్ టోర్నమెంట్.. భారీ క్యాష్‌ప్రైజ్
MEDIATEK AND JIO GAMING MASTERS 2.0: గేమర్లకు శుభవార్త తెలిపింది జియో నెట్వర్క్! ఇండియాలో ఇ గేమ్స్ ఆడే వారిని ప్రోత్సహించే లక్ష్యంతో మొబైల్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ జియో, చిప్సెట్ల తయారీ సంస్థ మీడియాటెక్‌లు సంయుక్తంగా గేమింగ్ మాస్టర్ 2.ఓ పేరుతో ఆలిండియా రేంజ్లో గేమింగ్ పోటీలను నిర్వహిస్తున్నాయి. క్యాష్ ప్రైజ్ గేమింగ్ మాస్టర్ 2.ఓ పోటీలో పాల్గొనే ప్రొఫెషనల్ గేమర్స్, ఇ గేమింగ్‌లో ఉత్సాహం ఉన్నవారి కోసం భారీ క్యాష్ ప్రైజులు రెడీగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్ కోసం రూ. 12.50 లక్షల వరకు ప్రైజ్‌పూల్‌ను ప్రకటించారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సిరీస్‌లో ఈ టోర్నమెంట్ జరగనుంది. రిజిస్ట్రేషన్లు గేమింగ్ మాస్టర్ 2.ఓకి సంబంధించి రిజిస్ట్రేషన్లు నవంబరు 12 నుంచి ప్రారంభం అవుతాయి. వెబ్‌పోర్టల్ https://play.jiogames.comకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. గేమింగ్ మాస్టర్ 2.ఓ టోర్నమెంట్ నవంబరు 23 నుంచి జనవరి 10 వరకు జరుగుతాయి. జియో యూజర్లు, జియో నాన్ యూజర్లు ఈ గేమింగ్ టోర్నమెంట్లో పాల్గొనవచ్చు. ఎటువంటి పార్టిసిపేషన్ ఫీజు లేదు. ఇలా చూడొచ్చు గేమింగ్‌మాస్టర్ 2.ఓలో జరిగే అన్ని గేమ్స్‌ని ఆసక్తి ఉన్న వారు జియోగేమ్స్ వాచ్, జియోటీవీ హెచ్డీ ఈస్పోర్ట్స్ ఛానల్, ఫేస్బుక్ గేమింగ్, జియోగేమ్స్ యూట్యూబ్ ఛాన్సల్‌లో చూడవచ్చు. మీడియాటెక్ జియో రాకతో ఇండియాలో ఇంటర్నెట్ యూసేజీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలో ప్రముఖ మొబైల్ నెట్వర్క్ కంపెనీగా జియో సుస్థిర స్థానం దక్కించుకుంది. మరోవైపు మీడియాటెక్ ప్రాసెసర్‌తో ఇండియాలో అనేక మొబైల్ ఫోన్లు తయారయ్యాయి. ముఖ్యంగా మీడియా టెక్ అందిస్తోన్న హెలియో జీ సిరీస్ చిప్సెట్లపై గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎంతో స్మూత్‌గా ఉంటుంది. కాగా 5జీ నెట్‌వర్క్‌పై మరింత సమర్థంగా గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు మీడియాటెక్ సంస్థ డైమెన్సిటీ 5జీ పేరుతో సరికొత్త చిప్సెట్లను అందుబాటులోకి తెచ్చింది. -
తానా నవలల పోటీ... విజేతలు వీరే
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నిర్వహించిన నవలల పోటీలో విశాఖపట్నంకి చెందిన చింతకింది శ్రీనివాసరావు రాసిన మున్నీటి గీతలు, అనంతపురానికి చెందిన బండి నారాయణస్వామి రాసిన అర్థనారి నవలలు బహుమతులు గెలుచుకున్నాయి. విజేతలిద్దరికి రెండు లక్షల రూపాయలను సమానంగా అందివ్వనున్నారు. అదే విధంగా ఈ నవలలను ప్రచురించే బాధ్యతలను తామే తీసుకుంటామని తానా కార్యవర్గం ప్రకటించింది. తానా ఆధ్వర్యంలో 1997 నుంచి నవలల పోటీలు జరుగుతున్నాయి. దాదాపు పదేళ్ల పాటు నవల, కథా పోటీలు నిరాటంకంగా జరిగాయి. ఆ తర్వాత కొద్ది కాలం పాటు ఈ పోటీలు నిర్వహించలేదు. తిరిగి 2017 నుంచి నవల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈసారి జరిగిన నవలల పోటీకి మొత్తం 107 నవలు పరిశీలనకు వచ్చాయి. వీటిలో ఉత్తమంగా ఉన్న రెండు నవలలు బహుమతులు గెలుచుకున్నాయి. -
డూడుల్ గీయండి... లక్షలు పట్టండి
న్యూఢిల్లీ: విద్యార్థులూ.. మీరు చక్కగా బొమ్మలు వేయగలరా? అయితే గూగుల్ ఓ కొత్త ఆఫర్‌తో మీ ముందుకు వచ్చింది. మీరంతా గూగుల్ వెబ్సైట్ తెరవగానే గూగుల్ లోగోపైన డూడుల్ చూసే ఉంటారు. ఏ రోజు ప్రాముఖ్యతను ఆ రోజు చిన్న కార్టూన్ రూపంలో అది సూచిస్తుంది. ఇప్పుడు మీరు గీయబోయే చిత్రం ఆ డూడుల్ స్థానంలో కనిపించనుంది. నవంబర్ 14న ‘బాలల దినోత్సవాన్ని’ పురస్కరించుకొని ప్రత్యేకంగా తయారు చేయనున్న డూడుల్‌కు కార్టూన్లు వేయాల్సిందిగా గూగుల్ కోరుతోంది. ఇది కేవలం మీ డూడుల్ కనిపించేలా చేయడమే కాదండోయ్.. అయిదు లక్షల క్యాష్‌ను కూడా మోసుకొస్తుంది. ‘నేను పెద్దయ్యే సరికి.. నేనేం ఆశిస్తున్నానంటే’ అన్న అంశం మీద డూడుల్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. ఈ అంశం కింద, మీకు ఉన్న ఏ ఆలోచనకైనా రూపం ఇవ్వచ్చు. ఉదాహరణకు చంద్రుడి మీద జీవితం ఎలా ఉంటుంది? భూమ్మీద కాలుష్యం లేకపోతే ఎలా ఉంటుంది? భూమి అంతా సాధు జంతువులతో నిండిపోతే ఎలా ఉంటుంది ? వంటి ఏ అంశం మీదైనా డూడుల్ తయారు చేయవచ్చు.డూడుల్‌లో కచ్చితంగా ‘జీఓఓజీఎల్ఈ’ అన్న గూగుల్ స్పెల్లింగ్ ఉండాలి. ఎంపిక ఇలా...: మొదట మీరు గీసిన చిత్రాలన్నింటినీ గూగుల్ బృందం ఎంపిక చేస్తుంది. ఈ బృందంలో బాగా డూడుల్స్ తయారుచేసే నేహా డూడుల్స్ మేడం, యూట్యూబ్‌లో టాలెంట్ చూపించే ప్రజక్త కోళి, మనందరికీ ఇష్టమైన ఛోటా భీమ్ బొమ్మ గీసిన రాజివ్ చికాల కూడా ఉన్నారు. వీరంతా మేటిగా ఉన్న 20 చిత్రాలను ఎంపిక చేస్తారు. వీటిని అక్టోబర్ 21 నుంచి నవంబర్ 6 వరకు పబ్లిక్ ఓటింగ్‌లో ఉంచుతారు. గెలిచిన వారికి 5 లక్షల స్కాలర్‌షిప్‌తో పాటు రూ. 2 లక్షల విలువైన సాంకేతికతను మీ పాఠశాలకు ఇస్తారు. -
దాతృత్వ మాస్టారుకు పట్టం
తనను వరించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ టీచర్స్ అవార్డు పట్టుకుని విద్యార్థులతో కలసి సంతోషం పంచుకుంటున్న కెన్యా ఉపాధ్యాయుడు పీటర్ మొకాయా తాబిచి. దాదాపు పదేళ్లుగా ఆయన ప్రతీ నెలా తన ఆదాయంలో 80 శాతం మొత్తాన్ని పేద విద్యార్థుల అవసరాలు తీర్చేందుకే వెచ్చిస్తున్నారు. దీంతో వార్కే ఫౌండేషన్.. అవార్డుతో పాటు రూ.7 కోట్ల నగదు బహుమతిని అందజేసింది. -
పరుగుల రాణికి నగదు పురస్కారం
భువనేశ్వర్ : జకార్తాలో జరుగుతున్న 18వ ఏషియన్ క్రీడల్లో రాష్ట్రానికి చెందిన ద్యుతీ చాంద్ వరుసగా పతకాల్ని సాధిస్తోంది. తాజాగా ఆమె 200 మీటర్ల పరుగు పందెంలో రెండో రజత పతకం సాధించింది. లోగడ 100 మీటర్ల పరుగు పందెంలో తొలి రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెకు రెండోసారి రూ.1.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించారు. త్వరలో జరగనున్న ఒలింపిక్ క్రీడల పోటీ సాధనకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి గురు వారం ప్రకటించారు. రెండో రజత పతకం సాధించిన సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడి అభినందనలు తెలియజేశారు. ఏషియన్ క్రీడల్లో రెండు రజత పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా ద్యుతీ చాంద్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. జాతీయస్థాయిలో ఆమె రెండో క్రీడాకారిణిగా స్థానం సాధించడం మరో విశేషం. లోగడ 1982లో న్యూ ఢిల్లీలో జరిగిన ఏషియన్ క్రీడల పోటీల్లో పి. టి. ఉష 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందాల్లో రెండు రజత పతకాల్ని సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచారు. -
టాలెంట్‌కి ప్రశంసలేనా.. ఇంకేం లేదా?
సాక్షి, హైదరాబాద్ : హిమ దాస్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారు మోగుతున్న పేరు. గత రెండు రోజులుగా ఈ అసోం అమ్మాయిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి.. సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరు ఆమెను ప్రశంసించడానికి పోటీ పడ్డారు. అయితే ఆమె ప్రతిభను కేవలం ప్రశంసలతోనే సరిపెట్టడమే విస్మయానికి గురిచేస్తోంది. గతంలో పతకాలు సాధించిన ఆటగాళ్లకు దక్కిన నజరానా, బహుమతులు కానీ ఈ గ్రామీణ క్రీడాకారిణికి దక్కకపోవడం గమనార్హం. క్రీడలకు అంతంత మాత్రానే ప్రోత్సాహకం లభించే మన దేశంలో విజయాలు సాధిస్తే మాత్రం బహుమతులు, నజరానాలతో పోటీపడటం గతంలో చాలా సందర్భాల్లో చూశాం. అయితే హిమ విషయంలో మాత్రం 2020 టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ఆమె ఖర్చులు భరిస్తామని, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కింద నెలకు రూ. 50 వేలు చొప్పున అందజేస్తామని చెప్పి క్రీడా మంత్రిత్వ శాఖ చేతులు దులుపుకోవడమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారిణులకు దేశం ఎంతో ఘనంగా స్వాగతం పలికింది. ఏవేవో కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు వరదలో ముంచెత్తాయి.. ఆకాశానికి ఎత్తాయి.. కార్లు ఇచ్చాయి.. కానుకలిచ్చాయి. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాయి. కానీ చాలా మంది స్పాన్సర్లు, పుష్కలంగా డబ్బులున్న టెన్నిస్, బ్యాడ్మింటన్ స్టార్లకే కాకుండా.. మట్టిలో మాణిక్యమైన హిమ దాస్ వంటి గ్రామీణ క్రీడాకారులకు కూడా సాయం అందిస్తే బాగుంటుందని ప్రతీ సగటు క్రీడా ప్రేమికుడు అభిప్రాయపడుతున్నాడు. అసలెవరూ ఈ హిమ దాస్ ఫిన్లాండ్లోని టాంపెరెలో జరిగిన ఈవెంట్లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం నెగ్గారు. ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా హిమ దాస్ రికార్డు సృష్టించింది. అసోంలోని నగావ్ జిల్లా ధింగ్ గ్రామం 18 ఏళ్ల హిమ దాస్ స్వస్థలం. నలుగురు పిల్లల్లో చిన్నది. దేశంలోని ఎందరో మేటి అథ్లెట్ల మాదిరిగానే ఆమెది గ్రామీణ, పేదరిక నేపథ్యం.. వారిలాగే ఆటలంటే ఆమెకు ఎక్కడలేని ఇష్టం.. బురద, మట్టితో కూడిన తన పొలమే ఆమెకు తొలి ‘ట్రాక్’ అయింది.. అక్కడ నిరంతర సాధన ఆమెను శారీరకంగా బలవంతంగా తయారు చేస్తే.. కుటుంబ కష్టాలు, కన్నీళ్లు మానసిక దృఢత్వాన్ని పెంచాయి.. అయితే తొలి అడుగు ఫుట్‌బాల్‌వైపు పడినా పరుగులో ఆమె వేగం చూసిన స్థానిక కోచ్ ఇచ్చిన సలహాతో రన్నింగ్‌కు మారింది.. అలా రెండేళ్లలోనే ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం కొల్లగొట్టే స్థాయికి ఎదిగింది.. దిగ్గజ మిల్కాసింగ్, పీటీ ఉష తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత పతాకంను రెపరెపలాడించిందీ. చదవండి: కన్నీళ్లురాని ఇండియన్ ఉండరు : మోదీ -
డబ్బు వాపసు చేస్తేనే నిజమైన నిరసన
ఇటీవల నేషనల్ అవార్డ్స్‌లో రాష్ట్రపతి పరిమిత సమయం కారణంగా అందరికీ అవార్డ్స్ ప్రదానం చేయరని తెలిసి పలువురు విజేతలు నేషనల్ అవార్డ్స్‌ను బాయ్‌కాట్ చేసిన సంగతి తెలిసిందే. అవార్డ్ ఫంక్షన్ బాయ్‌కాట్ చేసినవాళ్లను ఉద్దేశిస్తూ.. 2018 నేషనల్ అవార్డ్ అందుకున్న మలయాళ దర్శకుడు జయరాజ్ మాట్లాడుతూ– ‘‘కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతీ ఇరానీ చేతుల మీదగా అవార్డ్ అందుకోవటం మాకు ఇష్టం లేదు అని బాయ్‌కాట్ చేసిన నిరసనకారులంతా కేవలం అవార్డ్ ఫంక్షన్‌ని బాయ్‌కాట్ చేయడమే కాదు నేషనల్ అవార్డ్‌తో పాటుగా మీకు అందే క్యాష్ ప్రైజ్‌ను కూడా తిరిగి ఇవ్వాలి. అదే నిజమైన నిరసన’’ అన్నారు. పాయింటే కదా. -
ఒక్క ఐడియాతో రూ.10 లక్షలు గెల్చుకోండి
మీరు చక్కటి ఐడియాలు ఇవ్వగలరా...? మీ ఆలోచనతో అందరిని ఒప్పించి, మెప్పించగలరా..? అయితే ఇది మీ కోసమే. భారత రైల్వే శాఖ మీరు పది లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఓ మంచి ఐడియా చెప్పడమే. భారత రైల్వే శాఖ జన్ భాగీదారి ప్రోగ్రామ్ పేరిట ఓ పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొన్న వారు దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో మెరుగైన సేవలు, సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ఐడియా చెబితే చాలు. మీ ఆలోచన కొత్తగా, అద్భుతంగా ఉందంటే పది లక్షల రూపాయలు మీవే. అంతేకాదు ఆ తర్వాత మరో మూడు నగదు బహుమతులు కూడా ఉన్నాయి. ఈ పోటీలో పాల్గొనడానికి మీరు ‘ఇన్నోవేటివ్.మైగోవ్.ఇన్’ వెబ్సైట్లోకి వెళ్లి మీ ఆలోచనను ఆన్లైన్లో పంపితే సరిపోతుంది. రైల్వే స్టేషన్లలో చక్కటి సౌకర్యాలు కల్పించడానికి డబ్బును ఎలా సమకూర్చాలో క్లుప్తంగా వివరించాలి. మీ ఆలోచన మన ప్రస్తుత రైల్వే వ్యవస్థకు సరిపోయేదిగా ఉండాలి, ఆచరణ సాధ్యంగా కూడా ఉండాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మెదడుకు పదును పెట్టిండి, పది లక్షలు గెల్చుకోండి! -
రైల్వే బంపర్ ఆఫర్ : ఆధార్ లింక్ చేస్తే...
దేశీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐఆర్సీటీసీ అకౌంట్‌తో ఆధార్ కార్డు నెంబర్‌ను యూజర్లు లింక్ చేస్తే, 10వేల రూపాయల వరకు నగదు బహుమతి అందించనున్నట్టు ఐఆర్సీటీసీ తెలిపింది. దేశీయ రైల్వే జారీ చేసిన సర్క్యూలర్‌లో ఇది పేర్కొంది. 2018 జూన్ వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉండనుంది. ఐఆర్సీటీసీ అకౌంట్‌తో ఆధార్ లింక్ చేసి, ట్రైన్లో ప్రయాణించిన యూజర్లు ఈ ‘లక్కీ డ్రా స్కీమ్’ కి అర్హులవుతారు. ప్రతి కేలండర్ నెలా లక్కీ డ్రా స్కీమ్ ఉంటుంది. ముందు నెలలో ప్రయాణించిన ఐదు లక్కీ ప్రయాణికులను, తర్వాతి నెల రెండో వారంలో కంప్యూటరైజ్డ్ ర్యాండమ్ లక్కీ డ్రా ప్రాసెస్ ద్వారా ఎంపికచేసి వారికి ఈ నగదు బహుమతి అందిస్తారు. ఈ నగదు బహుమతితో పాటు, రైల్ టిక్కెట్ నగదంతా రీఫండ్ చేస్తారు. పీఎన్ఆర్(ప్యాసెంజర్ నేమ్ రికార్డు)ల్లో ఆధార్ ఆధారితంగా బుక్ చేసుకున్న యూజర్లకు మాత్రమే ఈ లక్కీ డ్రా స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఒకే యూజర్ ఒకటి కంటే ఎక్కువ పీఎన్ఆర్లు కలిగి ఉంటే, కేవలం ఒకే ఒక్క పీఎన్ఆర్ను ఎంపిక చేస్తారు. నగదు బహుమతి గెలుచుకున్న విన్నర్ల పేర్లను ఐఆర్సీటీసీ తన వెబ్సైట్లో తదుపరి నెలలో పేర్కొంటోంది. ఐఆర్సీటీసీ ఉద్యోగులు ఈ లక్కీ డ్రా స్కీమ్‌కు అర్హులు కారు. -
‘బిగ్‌బాస్’లో ఆసక్తికర పరిణామం
ముంబై: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ 11వ సీజన్ ఆద్యంతం వివాదాలు, మలుపులతో ఉత్కంఠభరితంగా సాగింది. అత్యంత వివాదాస్పదమైన సీజన్‌గా నిలిచింది. ఈనెల 14న జరిగిన గ్రాండ్ ఫైనల్లో బుల్లితెర నటి శిల్పా షిండే(40) విజేతగా నిలిచారు. ప్రేక్షకుల లైవ్ ఓటింగ్ పెట్టడంతో ఈసారి విజేతను నిర్ణయించడంతో అనేక ట్విస్టులు చోటుచేసుకున్నారు. షో ముగిసిన తర్వాత కూడా బిగ్‌బాస్ హవా కొనసాగుతోంది. టాప్-3లో నిలిచిన వికాస్ గుప్తా విజేతగా నిలవలేకపోయినా తన మంచి మనసుతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తాను దక్కించుకున్న 6 లక్షల రూపాయలను తనతో పాటు పోటీపడిన ఇద్దరు యువతులకు ఇచ్చేశాడు. తనకు అప్పగించిన టాస్క్‌ను పూర్తిచేసి అతడు ఈ క్యాష్‌ప్రైజ్ గెలుచుకున్నాడు. ‘నాకు వచ్చిన 6 లక్షల రూపాయలను ఆర్షిఖాన్, జ్యోతికుమారిలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. బిగ్‌బాస్ హౌస్‌లో అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నా జ్యోతి మాత్రం నాకు మద్దతుగా నిలబడింది. బిహార్‌లోని చిన్న పట్టణం నుంచి వచ్చిన 20 ఏళ్ల జ్యోతి చూపిన తెగువ నన్ను ఆకట్టుకుంది. ఆర్షిఖాన్ కూడా నాకు ఎంతో అండగా నిలిచింది. వీరిద్దరి మద్దతుతో నేను పోటీలో చివరివరకు కొనసాగాన’ని వికాస్ గుప్తా పేర్కొన్నారు. -
మిథాలీ గ్యాంగ్ క్యాష్ ప్రైజ్ పెంపు!
న్యూఢిల్లీ:మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ కు చేరి రన్నరప్ గా నిలిచిన మిథాలీ రాజ్ గ్యాంగ్ ను మరింత ప్రోత్సహించే దిశగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అడుగులు వేస్తుంది. వరల్డ్ కప్‌లో పాల్గొన్న 15 మందితో కూడిన భారత మహిళా బృందానికి ప్పటికే తలో రూ.50లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన బీసీసీఐ..మరింత నగదు నజరానాను ఇవ్వాలని యోచిస్తోంది. కొన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాల అభ్యర్ధనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ ఆ మేరకు అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా క్రీడాకారిణుల నగదు నజరాను రూ. 60లక్షలకు పెంచాలనే చూస్తోంది. అదే సమయంలో సహాయక సిబ్బందికి రూ.30 లక్షలను ఇవ్వడానికి బోర్డు పెద్దలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన భారత్ గౌరవాన్ని ఇనుమడింపజేసిన మహిళా జట్టుకు, సహాయక సిబ్బందికి నజరానాను పెంచినా ఎటువంటి ఇబ్బందులు ఉండవని వెస్ట్‌జోన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీనికి ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే మహిళలు ఆడే మ్యాచ్ ఫీజును కూడా పెంచే యెచనలో్ బీసీసీఐ ఉంది. -
లాటరీ టికెట్ స్క్రాచ్ చేస్తే.. 66 కోట్ల బంపర్ ప్రైజ్!
పోకీప్సీ: 30 డాలర్లు పెట్టి ఓ గేమ్ టికెట్ కొని.. దాన్ని స్క్రాచ్ చేస్తే.. న్యూయార్క్ దంపతులకు ఏకంగా కోటి డాలర్ల (రూ. 66.63 కోట్ల) లాటరీ తగిలింది. న్యూయార్క్ రాష్ట్ర చరిత్రలోనే స్క్రాచ్ ఆఫ్ గేమ్స్‌లో అతిపెద్ద నగదు బహుమతి కలిగిన లాటరీ ఇదే కావడం గమనార్హం. స్క్రాచ్ ఆఫ్ గేమ్స్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా పది మిలియన్ డాలర్ల నగదు బహుమతితో ఈ లాటరీని నిర్వహించామని, హడ్సన్ వ్యాలీ పోకీప్సీ పట్టణంలోని స్టెవార్ట్ దుకాణంలో లాటరీ టికెట్ కొనుగోలు చేసిన ఓ జంటను ఈ బంపర్ అదృష్టం వరించిందని న్యూయార్క్ స్టేట్ గేమ్ కమిషన్ అధికారులు తెలిపారు. ఈ గేమ్ లాటరీ టికెట్ ధర కేవలం 30 డాలర్లు. అయితే, ఈ లాటరీని గెలుపొందిన అదృష్టవంతులైన దంపతుల పేర్లను అధికారులు వెల్లడించలేదు. విన్నింగ్ టికెట్ కొనుగోలు చేసిన స్టెవార్ట్ దుకాణం సమీపంలోనే గురువారం నాడు ఆ దంపతులకు బహుమతికి సంబంధించిన పెద్ద చెక్కును (క్రికెట్ మ్యాచ్‌లలో ఇచ్చేలాంటిది) లాటరీ అధికారులు అందజేయనున్నారు. -
అక్రమ కట్టడాలపై ఉప్పందిస్తే రివార్డు..!
-
అక్రమ కట్టడాలపై ఉప్పందిస్తే రివార్డు..!
♦ రూ.5 వేల నుంచి రూ.10 వేల నగదు బహుమతి ♦ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన ♦ ప్రతిపాదనలను ఆమోదించిన మంత్రి కేటీఆర్ ♦ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో అమలు ♦ ఒకట్రెండు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్కడైనా అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు, లేఅవుట్లను నిర్మిస్తున్నట్లు ఉప్పందించిన సామాన్య ప్రజలకు నజరానా అందనుంది. అక్రమ కట్టడాలపై సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన చేస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని మిగిలిన 67 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సి పాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ కొత్త పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టనుంది. అక్రమ కట్టడాలు, లే అవుట్ల గురించి ఉప్పందించిన వ్యక్తుల సమాచారం నిజమేనని తేలితే వారికి రూ.5 వేలు లేదా రూ.10 వేలను రివార్డుగా అందించాలని ఆలోచన చేస్తోంది. జీహెచ్ ఎంసీ ప్రతిపాదించిన ఈ వినూత్న కార్య క్రమానికి తాజాగా రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తూ ఒకట్రెండు రోజుల్లో పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. అనుమతులు లేకుండానే నిర్మాణాలను జరుపుతుం డడంతో మున్సిపా లిటీలు ఆదాయాన్ని నష్టపోతున్నాయి. ఈ కొత్త పథకాన్ని అమలు చేయడం ద్వారా మున్సిపాలిటీలకు ఆదాయం కూడా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గజిబిజిగా పట్టణీకరణ.. స్థానిక పురపాలికల నుంచి అనుమతులు పొందకుండానే విచ్చలవిడిగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలు, లేఅవుట్లను నియంత్రించడం పురపాలక శాఖకు సవాలుగా మారింది. ప్రధానంగా పురపాలికల్లో తీవ్ర సిబ్బంది కొరత ఉండడంతో అక్రమ కట్టడాలు, లేఅవుట్లను గుర్తించి చర్యలు తీసుకోవడంలో ఆ శాఖ విఫలమవుతోంది. పురపాలికల పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది సైతం అనధికార కట్టడాలు, లేఅవుట్ల యజమానులతో కుమ్మక్కై చర్యలు తీసుకోకుండా మిన్నుకుండిపోతున్నారు. దీంతో కొత్తగా పుట్టుకొస్తున్న అక్రమ కట్టడాలు, లేఅవుట్లకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. మున్సిపాలిటీల నుంచి అనుమతులు తీసుకోకపోవడమే కాక భవన నిర్మాణ శాస్త్రీయ పద్ధతులకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా కట్టడాలను నిర్మిస్తుండడంతో నగరాలు, పట్టణాల రూపురేఖలు గజిబిజిగా మారాయని ఇప్పటికే పలు సమీక్షల్లో సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అడ్డగోలు నిర్మాణాలతో పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులను చేపట్టడంలో సైతం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. అక్రమ కట్టడాలు, లేఅవుట్లను నిర్మాణ దశలోనే గుర్తించి ఎక్కడికక్కడ కూల్చి వేయాలని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నిర్మాణ దశలోనే అక్రమ కట్టడాలు, లేఅవుట్లను గుర్తించడానికి తగి నంత మంది సిబ్బంది లేకపోవడంతో స్థానిక పౌరుల నుంచే సమాచారాన్ని స్వీకరించాలని ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. పౌరులు అందించే సమాచారాన్ని రహస్యంగా ఉంచి, చర్యలు తీసుకోవడానికి అన్ని పురపాలికల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. -
ఉగాది పురస్కారాల గ్రహీతలు వీరే..
సాక్షి, హైదరాబాద్: మన్మథ నామ సంవత్సర ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ఉగాది పురస్కారాల గ్రహీతల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికకు సీఎం కె. చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. పురస్కార గ్రహీతలకు రూ. 10,116 చొప్పున నగదు బహుమతిని అందజేస్తారు. పురస్కారాల గ్రహీతల వివరాలు.. సాహిత్యం: ముదిగంటి సుజాత రెడ్డి, మలయశ్రీ, గోరటి వెంకన్న, సంగీతం: రామలక్ష్మీ రంగాచారి, రాజగోపాలాచారి, నృత్యం: సుధీర్‌రావు, రత్నశ్రీ, నాటకం: బి.అమరేందర్, చిత్రకళ: సూర్యప్రకాశ్, అంజనీరెడ్డి, శిల్పకల: శ్రీనివాసరెడ్డి, పాండు, పేరిణి నృత్యం: పేరిణి రమేష్, జానపద సంగీతం: వడ్డేపల్లి శ్రీనివాస్, జానపద కళా రూప ప్రదర్శన: దర్శనం మొగులయ్య(పన్నెండు మెట్ల కిన్నెర), హరికథ: పద్మాలయాచార్య, బుర్రకథ: బి.సరోజిని, ఒగ్గుకథ: ఒగ్గు ధర్మయ్య, మిమిక్రీ: ఆర్.సదాశివ, చిందు యక్షగానం: చిందు పెదబాబయ్య, టీవీ రంగం: నాగబాల సురేష్, సినిమా రంగం: ఎన్.శంకర్, భూపాల్‌రెడ్డి, జానపద చిత్రకళ: నకాశ్ వైకుంఠం(చేర్యాల), హస్తకళ: నల్ల విజయ్, హుజూరమ్మ, ఇతరాలు: రవీంద్రశర్మ (కళాశ్రమం), ఎం.వి.నరసింహారెడ్డి(వేద పరిశోధన). -
కామన్వెల్త్ విజేతలకు కేసీఆర్ భారీ నజరానా
-
కామన్వెల్త్ విజేతలకు కేసీఆర్ భారీ నజరానా
హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన తెలుగుతేజాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు భారీ నజరానా ప్రకటించారు. స్వర్ణ, రజత, కాంస్య పతక విజేతలకు వరుసగా 50 లక్షలు, 25 లక్షలు, 15 లక్షల రూపాయిల చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నారు. పసిడి పతకం సాధించిన పారుపల్లి కశ్యప్ 50 లక్షల నగదు బహుమతి అందుకోనున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ సాధించిన సైనా నెహ్వాల్ కు 20 లక్షల రూపాయిలు ఇవ్వనున్నారు. ఇక బ్యాడ్మింటన్ కోచ్ లు పుల్లెల గోపీచంద్, ఆరిఫ్ లకు 50 లక్షల రూపాయిల చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన విజేతలు బుధవారం కే చంద్రశేఖర రావును కలిశారు. వీరిలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, సైనా, పీవీ సింధు, గుత్తా జ్వాల, గురుసాయి దత్, షూటర్ గగన్ నారంగ్ ఉన్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వీరికి ప్రోత్సాహకాలు అందజేస్తారు. తమకు ప్రోత్సహకాలు ప్రకటించినందుకు క్రీడాకారులు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో మంత్రి కే రామారావు పాల్గొన్నారు.