ముంబై: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ 11వ సీజన్ ఆద్యంతం వివాదాలు, మలుపులతో ఉత్కంఠభరితంగా సాగింది. అత్యంత వివాదాస్పదమైన సీజన్‌గా నిలిచింది. ఈనెల 14న జరిగిన గ్రాండ్ ఫైనల్‌లో బుల్లితెర నటి శిల్పా షిండే(40) విజేతగా నిలిచారు. ప్రేక్షకుల లైవ్ ఓటింగ్ పెట్టడంతో ఈసారి విజేతను నిర్ణయించడంతో అనేక ట్విస్టులు చోటుచేసుకున్నారు. షో ముగిసిన తర్వాత కూడా బిగ్‌బాస్ హవా కొనసాగుతోంది.
టాప్-3లో నిలిచిన వికాస్ గుప్తా విజేతగా నిలవలేకపోయినా తన మంచి మనసుతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తాను దక్కించుకున్న 6 లక్షల రూపాయలను తనతో పాటు పోటీపడిన ఇద్దరు యువతులకు ఇచ్చేశాడు. తనకు అప్పగించిన టాస్క్‌ను పూర్తిచేసి అతడు ఈ క్యాష్‌ప్రైజ్ గెలుచుకున్నాడు.
‘నాకు వచ్చిన 6 లక్షల రూపాయలను ఆర్షిఖాన్, జ్యోతికుమారిలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. బిగ్‌బాస్ హౌస్‌లో అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నా జ్యోతి మాత్రం నాకు మద్దతుగా నిలబడింది. బిహార్‌లోని చిన్న పట్టణం నుంచి వచ్చిన 20 ఏళ్ల జ్యోతి చూపిన తెగువ నన్ను ఆకట్టుకుంది. ఆర్షిఖాన్ కూడా నాకు ఎంతో అండగా నిలిచింది. వీరిద్దరి మద్దతుతో నేను పోటీలో చివరివరకు కొనసాగాన’ని వికాస్ గుప్తా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment