Vikas Gupta
-
వీఎల్సీసీ సీఈవోగా వికాస్ గుప్తా
న్యూఢిల్లీ: వెంటనే అమల్లోకి వచ్చే విధంగా వికాస్ గుప్తాను కొత్త సీఈవోగా నియమించినట్లు బ్యూటీ, స్కిన్‌కేర్ బ్రాండ్ వీఎల్సీసీ పేర్కొంది. జయంత్ ఖోస్లా స్థానే వికాస్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2022 డిసెంబర్లో మెజారిటీ వాటాను సొంతం చేసుకోవడంతో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కార్లయిల్ నిర్వహణలోకి వీఎల్సీసీ చేరింది. కాగా.. గుప్తా ఇంతక్రితం నైకాకు చెందిన ఈబీటూబీ బిజినెస్(సూపర్‌స్టోర్)కు సీఈవోగా వ్యవహరించారు. గ్లోబల్ దిగ్గజం వాల్‌మార్ట్ గ్రూప్ ఈకామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లోనూ పనిచేశారు. 2019–21 మధ్య చీఫ్ కస్టమర్, మార్కెటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. తొలుత ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్)లో కెరీర్‌ను ప్రారంభించిన గుప్తా వివిధ హోదాలలో 21 ఏళ్లపాటు సేవలందించారు. 1989లో ఏర్పాటైన వీఎల్సీసీ గ్రూప్ ప్రస్తుతం స్కిన్‌కేర్, బ్యూటీ, వెల్నెస్ విభాగాలలో మల్టీఔట్లెట్ల ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించింది. -
డేటింగ్ గురించి చెప్పేందుకు ఇదా సరైన సమయం?!
దివంగత నటి, 'చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ ప్రత్యూష బెనర్జీ తాను ప్రేమించుకున్నామని నిర్మాత వికాస్ గుప్తా వెల్లడించాడు. తన గురించి ఎవరో చెడుగా చెప్తే ఆమె నమ్మేసిందని, అలా తమకిద్దరికీ బ్రేకప్ అయిందని తాజా ఇంటర్వ్యూలో వివరించాడు. చెప్పుడుమాటలు నమ్మినందుకు ఆమె మీద విపరీతమైన కోపం పెంచుకున్నానని, ఎక్కడైనా కనిపించినా చూపు తిప్పుకుని తనెవరో తెలియనట్లే వెళ్లిపోయానన్నాడు. అలా తమ మధ్య డేటింగ్ కొన్నాళ్లపాటే సాగిందన్నాడు. నిజానికి ఆమెంటే తనకెంతో ఇష్టమని, తనతో కలిసి ఓ పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకున్నానని తెలిపాడు. తాను బైసెక్సువల్ అన్న విషయం విడిపోయాక ఆమెకు తెలిసిందని చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూపై ప్రత్యూష క్లోజ్ ఫ్రెండ్, హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కామ్య పంజాబీ ఫైర్ అయింది. "అతడు చెప్పింది నిజమా? కాదా? అన్నది నిర్ధారించేందుకు ప్రత్యూష మన మధ్య లేదు. వికాస్ ఇప్పుడెందుకు ఆమెతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతున్నాడు? ఓహ్ ఫేమస్ కావడానికా! ఇలాంటి విధానాలను నేను అస్సలు మెచ్చుకోను. ఎందుకంటే తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేందుకు ఆమె ఈ లోకంలో లేదు" అని చెప్పుకొచ్చింది. చదవండి: సీక్వెల్ సినిమాలో 'జాతిరత్నాలు' హీరోయిన్ సందడి! -
నేను బైసెక్సువల్.. ఎవరితోనైనా ప్రేమలో
సాక్షి, ముంబై: బాలీవుడ్ నిర్మాత, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ వికాస్ గుప్తా తాను బైసెక్సువల్ అని సంచలన విషయాలు వెల్లడించారు. ‘హాయ్.. నా గురించి మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ద్విలింగ సంపర్కుడిని. స్త్రీ, పురుష భేదం లేకుండా నేను ఎవరితోనైనా ప్రేమలో పడగలను. నాలాంటి వారు చాలామంది ఉన్నారు. నేను బైసెక్సువల్ అని చెప్పడానికి గర్వంగా ఫీలవుతున్నాను. ఇందులో ఎవరి బెదిరింపులు లేవు. నన్ను నేను గుర్తించేందుకు సాయం చేసిన ప్రియాంకశర్మ, పార్థ్సంథాన్లకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. దీనితో పాటు తన ఫోటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. నెటిజన్లు వికాస్ గుప్తా ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. అతడికి మద్దతు తెలుపుతున్నారు. ‘వికాస్ గుప్తా వాస్తవాన్ని అంగీకరించారు.. అతడిని ఎవరు ఎగతాళి చేయకూడదు. మీలాంటి వారు చాలా అరుదు.. మీకు మా మద్దతు ఎప్పుడు ఉంటుంది’ అంటూ ప్రశంసిస్తున్నారు. Hi Just wanted to let you know a tiny detail about me. I fall in love with the human regardless of their gender. There r more like me. With #Pride I am Bisexual #VikasGupta PS No more being blackmailed or bullied #priyanksharma #ParthSamthaan ThankU for forcing me to come out 😊 pic.twitter.com/0N403EDukp — Vikas Guppta (@lostboy54) June 20, 2020 ‘దేవుడు నన్ను ఎలా సృష్టించాడో అలానే నేను అభివృద్ధి చెందాను. నా ప్రవర్తన పట్ల నా కుటుంబ సభ్యులు అవమానంగా భావించారు. నా తల్లి కూడా నన్ను ద్వేషించింది. నా తోబుట్టువులు నన్ను అసహ్యించుకున్నారు. వారు నన్ను చూసి అవమానంగా ఫీలయ్యేవారు. కానీ నేను వారిని ప్రేమిస్తున్నాను. వారిని గర్వంగా తలెత్తుకునేలా చేస్తాను. పార్థ్‌సంతాన్, ప్రియాంక శర్మలకు ధన్యవాదాలు. వారు నాకు చేసిన అవమానాల వల్ల నేను మరింత శక్తివంతంగా తయారయ్యాను. నా గురించి వాస్తవాలు వెల్లడించగలిగాను. దీనిపై వారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. నాకు మద్దతుగా నిలిచిన నా స్నేహితులకు ధన్యవాదాలు’ అన్నారు వికాస్ గుప్తా. -
ఆ నటి ఆత్మకు శాంతి చేకూరదు!
సాక్షి, ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మకు శాంతి చేకూరదని నటి కామ్య పంజాబీ, నటుడు వికాస్ గుప్తా అన్నారు. ఆమె చనిపోయి రెండేళ్లు పూర్తయినా నిందితులకు శిక్ష పడక పోవడంపై బిగ్ బాస్ 11 ఫైనలిస్ట్ వికాస్, కామ్య పంజాబీ విచారం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉందని, ప్రత్యూష మృతి కేసులో దోషులకు ఇప్పటికైనా శిక్ష పడాలన్నారు. ప్రత్యూష రెండో వర్దంతి సందర్భంగా ఈ నటీనటులు తమ ఆవేదనను షేర్ చేసుకున్నారు. మరికొన్ని రోజులైతే ప్రత్యూష ఎవరూ అనే ప్రశ్నలు తలెత్తుతాయని, నిందితులకు శిక్ష పడకముందే ఈ నటిని అందరూ మరిచిపోయే అవకాశం ఉందని వీరు అభిప్రాయపడ్డారు. రెండేళ్లు పూర్తయింది, కానీ ఎలాంటి చర్యలు లేవు. అయినా ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు కామ్య పంజాబీ. నేను ఇష్టపడే ఓ మంచి వ్యక్తిని కోల్పోయాను. ఇప్పటికే రెండుళ్లు గడిచిపోయాయి. ఇంకా రోజులు గడుస్తుంటే అందరూ ప్రత్యూషను మరిచిపోతారేమో. నీ మృతి నాకు జీవితం విలువను నేర్పిందని వికాస్ గుప్తా ట్వీట్ చేశారు. ప్రత్యూష మృతికి కారకులైన వాళ్లను శిక్షించేవరకూ ఆమె ఆత్మకు శాంతి చేకూరదన్నారు. కాగా, 2016 ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్‌లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె మృతికి ప్రియుడు రాజ్సింగే కారణమని ప్రత్యూష కుటుంబీకులు ఫిర్యాదు చేయగా గతంలో ఓసారి అదుపులోకి ముంబై పోలీసులు విచారణ జరిపారు. రెండేళ్లు గడిచినా సెలబ్రిటీ మృతి కేసులోనే న్యాయం జరగలేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటని కామ్య పంజాబీ, వికాస్ గుప్తా ప్రశ్నిస్తున్నారు. -
‘బిగ్‌బాస్’లో ఆసక్తికర పరిణామం
ముంబై: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ 11వ సీజన్ ఆద్యంతం వివాదాలు, మలుపులతో ఉత్కంఠభరితంగా సాగింది. అత్యంత వివాదాస్పదమైన సీజన్‌గా నిలిచింది. ఈనెల 14న జరిగిన గ్రాండ్ ఫైనల్లో బుల్లితెర నటి శిల్పా షిండే(40) విజేతగా నిలిచారు. ప్రేక్షకుల లైవ్ ఓటింగ్ పెట్టడంతో ఈసారి విజేతను నిర్ణయించడంతో అనేక ట్విస్టులు చోటుచేసుకున్నారు. షో ముగిసిన తర్వాత కూడా బిగ్‌బాస్ హవా కొనసాగుతోంది. టాప్-3లో నిలిచిన వికాస్ గుప్తా విజేతగా నిలవలేకపోయినా తన మంచి మనసుతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తాను దక్కించుకున్న 6 లక్షల రూపాయలను తనతో పాటు పోటీపడిన ఇద్దరు యువతులకు ఇచ్చేశాడు. తనకు అప్పగించిన టాస్క్‌ను పూర్తిచేసి అతడు ఈ క్యాష్‌ప్రైజ్ గెలుచుకున్నాడు. ‘నాకు వచ్చిన 6 లక్షల రూపాయలను ఆర్షిఖాన్, జ్యోతికుమారిలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. బిగ్‌బాస్ హౌస్‌లో అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నా జ్యోతి మాత్రం నాకు మద్దతుగా నిలబడింది. బిహార్‌లోని చిన్న పట్టణం నుంచి వచ్చిన 20 ఏళ్ల జ్యోతి చూపిన తెగువ నన్ను ఆకట్టుకుంది. ఆర్షిఖాన్ కూడా నాకు ఎంతో అండగా నిలిచింది. వీరిద్దరి మద్దతుతో నేను పోటీలో చివరివరకు కొనసాగాన’ని వికాస్ గుప్తా పేర్కొన్నారు. -
నటుడిపై లైంగిక వేధింపుల కేసు
ముంబై: టీవీ నటుడు పార్థ్ సమతాన్ చిక్కుల్లో పడ్డాడు. మోడల్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అతడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై బాంగర్ నగర్ పోలీసులు సెక్షన్ 354ఏ కింద కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 20న జరిగిన ఈ ఘటనపై గత నెలలోనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సమన్లు జారీ చేయడంతో శనివారం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. తనపై బాధితురాలు చేసిన ఆరోపణలను పార్థ్ తోసిపుచ్చాడు. అవన్ని తప్పుడు, నిరాధార ఆరోపణలని పేర్కొన్నాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాను వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిపాడు. ఇది స్నేహితుల మధ్య తలెత్తిన వివాదమని, ఏడాదిన్నర ఆమె ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. నిర్మాత వికాస్ గుప్తాతో కలిసి బాధితురాలు ఫిర్యాదు చేయడం పట్ల అతడు అనుమానం వ్యక్తం చేశాడు. ఇదంతా వికాస్ గుప్తా కుట్ర అని ఆరోపించాడు. ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై ఫిర్యాదు చేశారని, బాధితురాలు తర్వాత తనకు ఫోన్ చేసి ఫిర్యాదు ఉపసంహరించుకుంటానని చెప్పినట్టు వెల్లడించాడు. కేసు వెనక్కు తీసుకునేందుకు పోలీసులు ఒప్పుకోవడం లేదని వాపోయాడు. తన ఫోన్ లోని కాల్ రికార్డింగ్స్, వాట్సప్ మెసేజ్ లను పోలీసులకు అందజేసినట్టు తెలిపాడు. త్వరలోనే కేసు నుంచి బయటపడతానన్న నమ్మకాన్ని పార్థ్ వ్యక్తం చేశాడు. వికాస్ గుప్తాపై వేధింపులు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో పార్థ్ విమర్శపాలయ్యాడు.