సాక్షి, ముంబై: బాలీవుడ్ నిర్మాత, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ వికాస్ గుప్తా తాను బైసెక్సువల్ అని సంచలన విషయాలు వెల్లడించారు. ‘హాయ్.. నా గురించి మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ద్విలింగ సంపర్కుడిని. స్త్రీ, పురుష భేదం లేకుండా నేను ఎవరితోనైనా ప్రేమలో పడగలను. నాలాంటి వారు చాలామంది ఉన్నారు. నేను బైసెక్సువల్ అని చెప్పడానికి గర్వంగా ఫీలవుతున్నాను. ఇందులో ఎవరి బెదిరింపులు లేవు. నన్ను నేను గుర్తించేందుకు సాయం చేసిన ప్రియాంకశర్మ, పార్థ్‌సంథాన్‌లకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. దీనితో పాటు తన ఫోటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. నెటిజన్లు వికాస్ గుప్తా ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. అతడికి మద్దతు తెలుపుతున్నారు. ‘వికాస్ గుప్తా వాస్తవాన్ని అంగీకరించారు.. అతడిని ఎవరు ఎగతాళి చేయకూడదు. మీలాంటి వారు చాలా అరుదు.. మీకు మా మద్దతు ఎప్పుడు ఉంటుంది’ అంటూ ప్రశంసిస్తున్నారు.
Hi Just wanted to let you know a tiny detail about me. I fall in love with the human regardless of their gender. There r more like me. With #Pride I am Bisexual #VikasGupta PS No more being blackmailed or bullied #priyanksharma #ParthSamthaan ThankU for forcing me to come out 😊 pic.twitter.com/0N403EDukp
— Vikas Guppta (@lostboy54) June 20, 2020
‘దేవుడు నన్ను ఎలా సృష్టించాడో అలానే నేను అభివృద్ధి చెందాను. నా ప్రవర్తన పట్ల నా కుటుంబ సభ్యులు అవమానంగా భావించారు. నా తల్లి కూడా నన్ను ద్వేషించింది. నా తోబుట్టువులు నన్ను అసహ్యించుకున్నారు. వారు నన్ను చూసి అవమానంగా ఫీలయ్యేవారు. కానీ నేను వారిని ప్రేమిస్తున్నాను. వారిని గర్వంగా తలెత్తుకునేలా చేస్తాను. పార్థ్‌సంతాన్, ప్రియాంక శర్మలకు ధన్యవాదాలు. వారు నాకు చేసిన అవమానాల వల్ల నేను మరింత శక్తివంతంగా తయారయ్యాను. నా గురించి వాస్తవాలు వెల్లడించగలిగాను. దీనిపై వారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. నాకు మద్దతుగా నిలిచిన నా స్నేహితులకు ధన్యవాదాలు’ అన్నారు వికాస్ గుప్తా.
Comments
Please login to add a commentAdd a comment