bisexual
-
నేను బైసెక్సువల్.. ఎవరితోనైనా ప్రేమలో
సాక్షి, ముంబై: బాలీవుడ్ నిర్మాత, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ వికాస్ గుప్తా తాను బైసెక్సువల్ అని సంచలన విషయాలు వెల్లడించారు. ‘హాయ్.. నా గురించి మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ద్విలింగ సంపర్కుడిని. స్త్రీ, పురుష భేదం లేకుండా నేను ఎవరితోనైనా ప్రేమలో పడగలను. నాలాంటి వారు చాలామంది ఉన్నారు. నేను బైసెక్సువల్ అని చెప్పడానికి గర్వంగా ఫీలవుతున్నాను. ఇందులో ఎవరి బెదిరింపులు లేవు. నన్ను నేను గుర్తించేందుకు సాయం చేసిన ప్రియాంకశర్మ, పార్థ్సంథాన్లకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. దీనితో పాటు తన ఫోటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. నెటిజన్లు వికాస్ గుప్తా ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. అతడికి మద్దతు తెలుపుతున్నారు. ‘వికాస్ గుప్తా వాస్తవాన్ని అంగీకరించారు.. అతడిని ఎవరు ఎగతాళి చేయకూడదు. మీలాంటి వారు చాలా అరుదు.. మీకు మా మద్దతు ఎప్పుడు ఉంటుంది’ అంటూ ప్రశంసిస్తున్నారు. Hi Just wanted to let you know a tiny detail about me. I fall in love with the human regardless of their gender. There r more like me. With #Pride I am Bisexual #VikasGupta PS No more being blackmailed or bullied #priyanksharma #ParthSamthaan ThankU for forcing me to come out 😊 pic.twitter.com/0N403EDukp — Vikas Guppta (@lostboy54) June 20, 2020 ‘దేవుడు నన్ను ఎలా సృష్టించాడో అలానే నేను అభివృద్ధి చెందాను. నా ప్రవర్తన పట్ల నా కుటుంబ సభ్యులు అవమానంగా భావించారు. నా తల్లి కూడా నన్ను ద్వేషించింది. నా తోబుట్టువులు నన్ను అసహ్యించుకున్నారు. వారు నన్ను చూసి అవమానంగా ఫీలయ్యేవారు. కానీ నేను వారిని ప్రేమిస్తున్నాను. వారిని గర్వంగా తలెత్తుకునేలా చేస్తాను. పార్థ్సంతాన్, ప్రియాంక శర్మలకు ధన్యవాదాలు. వారు నాకు చేసిన అవమానాల వల్ల నేను మరింత శక్తివంతంగా తయారయ్యాను. నా గురించి వాస్తవాలు వెల్లడించగలిగాను. దీనిపై వారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. నాకు మద్దతుగా నిలిచిన నా స్నేహితులకు ధన్యవాదాలు’ అన్నారు వికాస్ గుప్తా. -
నా కెరీర్ నాశనమైంది : నటి
లాస్ ఏంజెలిస్ : తన గురించి ఓ మేగజైన్లో వచ్చిన కథనంతో తన జీవితం తలకిందులైందనట్లు అనిపించిందని హాలీవుడ్ నటి అంబర్ హియర్డ్(31) అన్నారు. బై సెక్సువల్ అని కవర్ స్టోరీ రావడంతో అందరికీ ఈ విషయం తెలిసిపోయిందని, అప్పటినుంచి తన సినీ కెరీర్ నాశనమైందన్నారు. జీవన విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే మరిన్ని చిక్కులు తప్పవని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తనను హెచ్చరించినట్లు ఆమె తెలిపారు. 'నికోలస్ కేజ్, జానీ డెప్ సరసన నటించాను. ఆ సమయంలో నేనేలా ప్రవర్తించానో అందరికీ తెలుసు. కానీ కొందరు పనిగట్టుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్ జెండర్ (ఎల్జీబీటీ) వర్గాలపై చిన్నచూపుంది. ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. అయినా మనం ఎంత వెనుకబడి ఉన్నామో ఎల్జీబీటీలపై ఉన్న వివక్షే నిదర్శణం. మనుషులం అయినందుకు ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని' నటి అంబర్ హియర్డ్ అభిప్రాయపడ్డారు. ఆమె లేటెస్ట్ మూవీ 'జస్టిస్ లీగ్' ఈ 16న విడుదల కానుంది. -
హవ్వా.. అమ్మాయి గాఢంగా చుంబిస్తూ..
లండన్: ఒక షాకింగ్ ఫొటో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో హల్ చల్ చేస్తోంది. ఓ అమ్మాయి అదరాలను ప్రముఖ హాలీవుడ్ టీవీ స్టార్ మార్ని సింప్సన్ గాఢంగా చుంబిస్తున్నట్లున్న ఆ ఫొటో ఆమె అభిమాని ఖాతాలో దర్శనమిస్తూ చర్చనీయాంశంగా మారింది. సింప్సన్ ఓ బైసెక్సువల్ పర్సన్ అనే విషయం ఇటీవల వార్తలు గుప్పుమనడంతోపాటు అదే విషయం స్పష్టమైంది. అయితే.. కొందరుమాత్రం ఆమె అలాంటిది కాదని అనుకుంటున్నారు. కానీ, ఈ ఫొటో చూసిన ఎవరైనా నిజంగానే ఆమె బై సెక్సువల్ అని అనుకోవాల్సిందే. అర్ధనగ్నంగా డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి చైర్లో కూర్చొని ఉండగా ఆమెను అమాంతం అదిమిపెట్టి మార్ని సింప్సన్ ముద్దుపెడుతూ కనిపించింది. ఈ దృశ్యానికి సంబంధించిన ఫొటో ఒకటి శనివారం ఇన్ స్టాగ్రమ్ ద్వారా వెలుగులోకి వచ్చి హల్ చల్ చేస్తోంది. -
గే, లెస్బియన్ వెబ్ సైట్లపై పాకిస్థాన్ నిషేధం!
గే, లెస్బియన్, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్ జీబీటీ) కమ్యూనిటీలకు చెందిన ఏకైక వెబ్ సైట్ ను పాకిస్థాన్ నిషేధించింది. ఇంటర్నెట్ వినియోగదారుల ఫిర్యాదు మేరకు పాకిస్థాన్ టెలికాం అధికారులు వెబ్ సైట్(queerpk.com) ను తొలగించారు. అత్యధికంగా ఫిర్యాదులు రావడంతో వినియోగదారులకు అందుబాటులో ఉండకుండా ఎల్ జీబీటీ వెబ్ సైట్స్ ను ఇంటర్నెట్ నుంచి తొలగించినట్టు టెలికాం అధికారులు తెలిపారు. గే కమ్యూనిటీని ఆదరించండి అంటూ ప్రారంభించిన వెబ్ సైట్ ను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని సంబంధిత నిర్వాహకులు తెలిపారు. అయితే ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉన్న వెబ్ సైట్ పై కేసును వాదించడానికి పాకిస్థాన్ కు చెందిన లాయర్లు ఎవరూ కూడా ముందుకు రాలేదని నిర్వహకులు వెల్లడించారు. ఇలాంటి వెబ్ సైట్ ను నిర్వహించడం పెద్ద సవాల్ అని. అన్నారు. అయినప్పటికి.. సమాచారం పొందుపరచడంలో అనేక జాగ్రత్తలను పాటిస్తున్నామన్నారు. నెటిజన్లకు వెబ్ సైట్ ను http://humjins.com ద్వారా అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు. స్వలింగ సంపర్కం పాకిస్థాన్ చట్ట విరుద్దం కావడంతో ఇలాంటి వెబ్ సైట్లను నిర్వహించే క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. -
విద్యార్థి ఎన్నికల్లో ఓ అమ్మ.. ఓ స్వలింగ సంపర్కుడు.. ఓ కజకిస్థానీ!
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ) లో ఎన్నికలంటేనే దేశవ్యాప్తంగా ఓ ఆసక్తి కలగడం సహజం. అయితే ఈసారి జేఎన్ యూ లో ఎన్నికలు మరో విధంగా ఆకర్షిస్తున్నాయి. ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో పలు పార్టీలు విజయం సాధించడానికి బలమైన అభ్యర్థులను బరిలో నిలిపారు. అయితే జేఎన్ యూ ఎన్నికల్లో గే (స్వలింగ సంపర్కుడు), ఓ తల్లి, కజకిస్థాన్ కు చెందిన అభ్యర్థులు నేను సైతం అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓ పాపకు తల్లైన గుంజన్ ప్రియ జేఎన్ యూ లో ఎంఫిల్ స్టూడెంట్. గుంజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) పార్టీ తరపున కౌన్సిలర్ గా ప్రచారం చేస్తోంది. అయితే గుంజన్ కూతురు కూడా జేఎన్ యూ క్యాంపస్ లో తన తల్లికి ఓటు చేయాలని ప్రచారం చేయడం అందర్ని ఆకట్టుకుంటోంది. 'తాను వివాహితురాలిని. లింగ సమానత్వం కోసం పోరాడుతాను. వివాహిత మహిళలకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి' అనే డిమాండ్ తో గుంజన్ ముందుకెళ్తోంది. ఇక ఎస్ఎఫ్ఐ బ్యానర్ లో లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్ జీబీటీ) కమ్యూనిటీ తరపున గౌరవ్ ఘోష్ రంగంలో నిలువడం ప్రత్యేకతగా నిలిచింది. ఎల్ జీ బీటి కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులకు జేఎన్ యూ లో సమాన హోదా కల్పించాలి. మా కమ్యూనిటీలోని సభ్యులపై వివక్ష కు అంతం పలికి, సమానత్వం కల్పించాలని గౌరవ్ డిమాండ్ చేస్తున్నాడు. ఇక జేఎన్ యూ ఎన్నికల్లో విదేశీ విద్యార్థి కూడా అధ్యక్ష పదవికి పోటి పడుతూ తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నాడు. కజకిస్థాన్ కు చెందిన అక్మెత్ బెకోవ్ ఝాస్సులాన్ ఓ అనువాదకుడి సహాయంతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. మాజీ సైనికుడైన ఝాస్సులాన్ కు యుద్దంలో పాల్గొన్నందుకు పలు పతకాలు కూడా దక్కించుకున్నట్టు సమాచారం.ఝాస్సులాన్ ప్రస్తుతం జేఎన్ యూలో ఎకనామిక్స్ లో స్నాతకోత్సవ విద్యను అభ్యసిస్తున్నాడు. ఝాస్సులాన్ జనతాదళ్ యునైటెడ్ (జేడీ-యూ) తరపున బరిలో ఉన్నారు. జేఎన్ యూలో విదేశీ విద్యార్థులకు ఇబ్బందులున్నాయని.. భాష ప్రధానంగా అనేక సమస్యలను సృష్టిస్తోందని.. ఇలాంటి పరిస్థితులను అధిగమించేలా తాను చర్యలు తీసుకుంటానని తన ఎజెండాగా ప్రచారంలో ముందుకు పోతున్నాడు. అనేక విశేషాలతో కొనసాగుతున్న ప్రచారం సెప్టెంబర్ 13 తేదిన జరిగే ఎన్నికలతో ముగియనుంది.