
దివంగత నటి, 'చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ ప్రత్యూష బెనర్జీ తాను ప్రేమించుకున్నామని నిర్మాత వికాస్ గుప్తా వెల్లడించాడు. తన గురించి ఎవరో చెడుగా చెప్తే ఆమె నమ్మేసిందని, అలా తమకిద్దరికీ బ్రేకప్ అయిందని తాజా ఇంటర్వ్యూలో వివరించాడు. చెప్పుడుమాటలు నమ్మినందుకు ఆమె మీద విపరీతమైన కోపం పెంచుకున్నానని, ఎక్కడైనా కనిపించినా చూపు తిప్పుకుని తనెవరో తెలియనట్లే వెళ్లిపోయానన్నాడు. అలా తమ మధ్య డేటింగ్ కొన్నాళ్లపాటే సాగిందన్నాడు. నిజానికి ఆమెంటే తనకెంతో ఇష్టమని, తనతో కలిసి ఓ పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకున్నానని తెలిపాడు. తాను బైసెక్సువల్ అన్న విషయం విడిపోయాక ఆమెకు తెలిసిందని చెప్పుకొచ్చాడు.
ఈ ఇంటర్వ్యూపై ప్రత్యూష క్లోజ్ ఫ్రెండ్, హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కామ్య పంజాబీ ఫైర్ అయింది. "అతడు చెప్పింది నిజమా? కాదా? అన్నది నిర్ధారించేందుకు ప్రత్యూష మన మధ్య లేదు. వికాస్ ఇప్పుడెందుకు ఆమెతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతున్నాడు? ఓహ్ ఫేమస్ కావడానికా! ఇలాంటి విధానాలను నేను అస్సలు మెచ్చుకోను. ఎందుకంటే తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేందుకు ఆమె ఈ లోకంలో లేదు" అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment