రియాల్టీ షో లలో ఎన్ని వింతలు, విడ్డూరాలు జరుగుతాయో తెలుగు ‘బిగ్ బాస్’ షోలో మీరు చూసే ఉంటారు. హిందీ ‘బిగ్ బాస్ 11’ షోలో ఇప్పుడు అలాంటి విడ్డూరమే ఒకటి ప్రేక్షకుల్ని నవ్వించింది. అందులో వికాస్ గుప్త, ఆర్షీ ఖాన్ అనే ఇద్దరు కంటెస్టెంట్‌లు ఉన్నారు. ఎవరో.. పొద్దుపోక ‘క్విజ్ ఆడదాం’ అనగానే, మిగతా కంటెస్టెంట్‌లంతా క్విజ్ మాస్టర్‌గా వికాస్‌ను సెలక్ట్ చేసుకున్నారు. ఆర్షీ ఖాన్ వంతు వచ్చింది. ఆయన ప్రశ్నలు వేస్తే ఈమె సమాధానాలు చెప్పాలి. మొదటి ప్రశ్న వేశాడు వికాస్.
‘‘ఢిల్లీ రాజధాని ఏది?’’‘‘భోపాల్’’ అని టక్కున చెప్పేసింది ఆర్షీ.పెద్దగా నవ్వేశాడు వికాస్. వెంటనే కెమెరా వైపు తిరిగి, ‘‘హాయ్ ఆలియా.. మీట్ యువర్ ఫ్యాన్. ఈమె నీలా కావాలనుకుంటోంది’’ అన్నాడు. (ఆలియా జనరల్ నాలెడ్జి మీద చాలా జోకులున్నాయి. అందుకే వికాస్ అలా అన్నాడు).క్వొశ్చన్ నెం.2‘‘కేజీ ఇనుము ఎక్కువ బరువుంటుందా? కేజీ దూది ఎక్కువ బరువుంటుందా?’’ ‘‘ఇనుము’’ అని టక్కున చెప్పింది ఆర్షీ. మళ్లీ పెద్దగా నవ్వాడు వికాస్. బిగ్ హౌస్ లోపల, ముంబైలో టీవీ చూస్తున్న ప్రతి హౌస్ లోపల నవ్వులే నవ్వులు. నవ్వించడానికి ఆర్షీ ఈ సమాధానాలు చెప్పి ఉంటుందనిఎపిసోడ్ చివర వికాస్ ఆమెను గట్టెక్కించాడు. తను క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్‌గా చాన్స్ కొట్టేశాడు.
ఆర్షీ వంతు వచ్చింది
Published Wed, Dec 6 2017 11:23 PM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment