reality shows
-
ది యాక్టివిస్ట్ రియాలిటీ షో: ప్రియాంక చోప్రా క్షమాపణలు
‘ది యాక్టివిస్ట్’.. అమెరికాలో ప్రసారం కానున్న ఓ రియాలిటీ షో. గ్లోబల్ యాక్లివిస్ట్ సంస్థ రూపొందిస్తుండగా అక్టోబర్ నుంచి సీబీఎస్ ఛానల్లో ప్రసారం కానుంది. సామాజిక అంశాల గురించి సాగే ఈ షో చుట్టూ వివాదాలు రాజుకోవడంతో.. హోస్ట్‌గా చేస్తున్న నటి ప్రియాంక చోప్రా బహిరంగంగా అందరికీ క్షమాపణలు చెప్పింది. ప్రియాంకతో పాటు సింగర్ ఉషర్, డ్యాన్సర్ జూలియేన్ హగ్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో మొత్తం ఆరుగురు పార్టిసిపెంట్స్ పాల్గొంటారు. అందులో కనీసం ముగ్గురు పబ్లిక్ ఫిగర్స్ ఉంటారు. ఆరోగ్యం, విద్య, పర్యావరణం లాంటి అంశాలపై కార్యకర్తలతో చర్చిస్తారు. ఇందులో చర్చ జరిగిన తర్వాత వారిచ్చే సూచనలను జీ 20 సమావేశంలో వివరించాలని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి సామాజిక అంశాలను టీవీలోకి షోగా చేయడంపై వివాదం రాజుకుంది. ఈ వివాదంపై ప్రియాంక చోప్రా స్పందించింది.‘గతవారం నుంచి ఎంతోమంది చేస్తున్న కామెంట్స్ నన్ను బాధపెట్టాయి. ప్రజలకు మంచి చేసే విషయాల కోసం అందరూ చేతులు కలిపితే కచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ఎందరో సమస్యలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది’ అని చెప్పింది. ఇంకా.. ‘మీరు తప్పుగా భావిస్తున్న ఈ షోలో నేను పాల్గొనడం మిమ్మల్ని ఎంతో బాధించిందని నాకు తెలుసు. దానికి క్షమాపణలు’ అని తెలిపింది. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రారంభం, ఎప్పుడంటే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక సోమవారం నుంచి బుధవారం వరకు సాయంత్రం మీ ఇంట్లో సందడి చేయబోతున్నాడు. ఆయన హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’అనే ఓ రియాలిటీ షో వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జెమిని టీవీ ఈ షో ప్రోమోను విడుదల చేసింది. అగష్టు 22వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు. ప్రోమోలో తారక్ వస్తున్న మీ ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రతి సోమవారం నుంచి బుధవారం సాయంత్రం రాత్రి 8:30 గంటలకు మీ జెమిని టీవీలో’ అంటూ చెప్పుకొచ్చాడు. -
మా మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయా? ఊహూ.. ప్రియమణి కెరీర్‌ని పరిశీలించండి. మూడు వెబ్ సిరీస్‌లు... ఆరు సినిమాలు అన్నట్లుగా ఉంది. టీవీ షోలకు జడ్జిగానూ చేస్తున్నారు. పెళ్లయితే కెరీర్‌ను వదులుకోవాలా? ఊహూ.. అక్కర్లేదు అంటున్నారు ప్రియమణి. ఆమె కెరీర్ ఫుల్ పీక్స్.. మరి.. పర్సనల్ లైఫ్.. అది కూడా పసందుగా ఉంది. మరిన్ని విషయాలను సాక్షితో ప్రియమణి ఇలా పంచుకున్నారు. దర్శకులు రాజ్ అండ్ డీకే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌లోని సుచిత్ర పాత్ర గురించి చెప్పినప్పుడు బాగా నచ్చి, ఓకే చెప్పాను. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్లో నా పాత్రకు మంచి ప్రాధాన్యం లభించిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ సీజన్లో అరవింద్, సుచిత్ర పాత్రల మధ్య లోనావాలాలో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పను. అది టాప్ సీక్రెట్. సీజన్ 2లో సమంత బాగా చేశారు. సమంత నటనను మా కుటుంబసభ్యులు కూడా మెచ్చుకున్నారు. రాజీ పాత్రను యాక్సెప్ట్ చేసినందుకు సమంతకు ధన్యవాదాలు. అది చాలా కష్టమైన పాత్ర. నేను చేసిన సుచిత్ర పాత్ర గురించి సమంత ఏం అనుకుంటున్నారో ఆమెనే అడగాలి. ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’ వివాదం గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. వెంకీ సార్ అలా అనడం హ్యాపీ వెంకటేశ్ సార్‌తో గతంలో మూడు నాలుగు సినిమాల్లో అవకాశం వచ్చింది కానీ కుదరలేదు. ‘నారప్ప’కి కుదిరింది. ‘ఈ సినిమాకి మనం పని చేయాలని రాసి పెట్టి ఉందేమో’ అని వెంకీ సార్ అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. శ్రీకాంత్ అడ్డాలగారు, శ్యామ్ కె. నాయుడుగారు లుక్ టెస్ట్ చేస్తున్నప్పుడే నక్సలైట్ డ్రెస్‌లో ఉన్న నన్ను చూసి ‘లుక్స్ బాగున్నాయి.. మీరు ఈ పాత్ర చేయొచ్చు.. మేము ఫిక్స్ అయ్యాం’ అనడంతో ధైర్యం వచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర అనంతపురం యాసలో మాట్లాడుతుంది. ఈ చిత్రం కోసం మూడు రోజుల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పాను. ‘విరాటపర్వం’లో నాది భారతక్క అనే నక్సలైట్ పాత్ర. ఇందులో యాక్షన్ చాలా బాగుంటుంది. నా ఒక్క యాక్షన్ సీక్వెన్స్ అనే కాదు.. రానా, సాయి (సాయి పల్లవి)ది కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం ‘సైనైడ్, కొటేషన్ గ్యాంగ్’ అనే సినిమాలతోపాటు హిందీ ‘మైదాన్’లో హీరో అజయ్ దేవగన్ భార్యగా నటిస్తున్నాను. 99 శాతం డైరెక్టర్స్ ఆర్టిస్ట్‌ని ఇప్పటివరకు చేసిన పాత్రల కోసం నేను ప్రత్యేకంగా ఎటువంటి హోమ్ వర్క్ చేయలేదు. కానీ చేయాల్సి వస్తే చేస్తాను కూడా. అయితే స్క్రిప్ట్ విన్నప్పుడే నా పాత్ర గురించి ఆలోచించుకుని చేస్తానంటే చేస్తానని లేకపోతే లేదని నా నిర్ణయం చెబుతాను. నేను 99 శాతం డైరెక్టర్స్ యాక్టర్‌ని. ఆ ఒక్క పర్సెంట్ నాకు ఏదైనా అనిపిస్తే చెబుతాను. తనని చూస్తే నాకు గర్వం విద్యాబాలన్, నేను కజిన్స్. ఆమె నటనని చూసి గర్వంగా ఫీలవుతా.. తను మా కజిన్ అని కాదు. ఆమె ఎంచుకునే పాత్రలు చాలా బాగుంటాయి. బాలీవుడ్లో ఖాన్స్, కపూర్స్ ఫ్యామిలీలు ఉన్నా తను అక్కడ నిలబడి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సింగర్ మాల్గాడి శుభగారు మా చిన్న మేనమామగారి భార్య. మా అమ్మ తరఫువాళ్లందరూ సంగీతంతో ముడిపడి ఉన్నవాళ్లే. అతను నా లక్కీ చార్మ్ నాకు జతగా అద్భుతమైన సహచరుడు (ముస్తఫా రాజ్) దొరికాడు. మంచి సపోర్టింగ్ భర్త దొరకడం నా అదృష్టం. పెళ్లయ్యాక ఆయన ఇచ్చే సపోర్ట్‌తోనే నేను సినిమాలు చేయగలుగుతున్నా. నిజం చెప్పాలంటే పెళ్లయ్యాక కూడా నాకు ఎక్కువ అవకాశాలు వస్తుండటం నా అదృష్టం. అందుకే తను నా లక్కీ చార్మ్. మా మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి.. ఆ సమయంలో ఆయనే తగ్గుతుంటారు. మైండ్‌సెట్ మారింది! òపెళ్లయినా నాకు మంచి మంచి రోల్స్ ఇస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కాజల్, సమంత మెయిన్ లీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. సాధారణంగా పెళ్లయ్యాక హీరోయిన్స్‌కు అంత మంచి రోల్స్ రావు. వదిన, సిస్టర్ రోల్స్ ఆఫర్ చేస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మైండ్‌సెట్ మారింది. సీనియర్ నటి నయనతార కూడా ఇంకా మెయిన్ లీడ్‌గా సినిమాలు చేస్తోంది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో కొనసాగడమా? లేదా అనేది హీరోయిన్స్ ఛాయిస్. పెళ్లయిన హీరోయిన్ల లుక్స్‌పై కామెంట్స్ చేస్తుంటారు కొందరు. కానీ బాడీ షామింగ్ గురించిన కామెంట్స్ నాపై రాలేదు. పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలామంది శుభాకాంక్షలు చెబుతున్నారు. పారితోషికం తగ్గించాను కరోనా సెకండ్ వేవ్‌లోనూ రియాలిటీ షోస్ షూటింగ్స్ చేస్తున్నాం. అయితే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నాం. గతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు 50 నుంచి 100 మంది ఉండేవారు. షూటింగ్స్ చూసేందుకు కూడా వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా తక్కువ మంది ఉంటున్నారు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు.. డాక్టర్ కూడా సెట్స్‌లోనే ఉంటున్నారు. ‘విరాట పర్వం, నారప్ప’ సినిమాలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేశాం. కోవిడ్ సమయంలో కొంచెం పారితోషికం తగ్గించాను. -
అది సమస్యగా అనిపించడం లేదు!
బాలీవుడ్లో నటుడు ఆయుష్మాన్ ఖురానా కెరీర్లో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన హీరోగా నటించిన ‘అంధాధూన్, బదాయి హో’ చిత్రాలు హిందీ చిత్రపరిశ్రమలో మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. సినిమాల్లోకి రాకముందు రియాలిటీ షోలు, టీవీ షోలు, రేడియో జాకీగా పని చేశారు ఆయుష్మాన్. ఆయనకు చెప్పుకోదగ్గ ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేదు. ‘‘స్టార్ కిడ్ అయ్యి ఉంటే మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవి’’ అని మీరు ఆలోచిస్తున్నారా? అన్న ప్రశ్నను ఆయుష్మాన్ ముందు ఉంచితే... ‘‘నా 27 ఏళ్ల వయసులో నేను ‘విక్కీ డోనర్’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాను. అదే నేను స్టార్ కిడ్ అయితే 22 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చే వాడినేమో. కానీ ఈ ఐదేళ్ల వ్యత్యాసం నాకు పెద్ద సమస్యగా అనిపించడం లేదు. ఎందుకంటే 17 ఏళ్లకే రియాలిటీ షోలో పాల్గొన్నాను. 22 ఏళ్ల వయసులో ఢిల్లీలో ఉన్న యంగెస్ట్ రెడీయో జాకీని నేనే. ఇలా అన్ని రకాల ప్లాట్‌ఫామ్స్‌ను దాటుకుంటూ వచ్చాను. ఎక్కువమంది యాక్టర్స్‌కు ఇది సాధ్యం కాకపోవచ్చు. 27 ఏళ్ల వయసులో ఒక యాక్టర్‌కు ఉండాల్సిన మెచ్యూరిటీ థింకింగ్ కన్నా ఇప్పుడు నా ఆలోచన స్థాయి ఎక్కువ అని చెప్పగలను’’ అన్నారు. -
ఆర్షీ వంతు వచ్చింది
రియాల్టీ షో లలో ఎన్ని వింతలు, విడ్డూరాలు జరుగుతాయో తెలుగు ‘బిగ్ బాస్’ షోలో మీరు చూసే ఉంటారు. హిందీ ‘బిగ్ బాస్ 11’ షోలో ఇప్పుడు అలాంటి విడ్డూరమే ఒకటి ప్రేక్షకుల్ని నవ్వించింది. అందులో వికాస్ గుప్త, ఆర్షీ ఖాన్ అనే ఇద్దరు కంటెస్టెంట్లు ఉన్నారు. ఎవరో.. పొద్దుపోక ‘క్విజ్ ఆడదాం’ అనగానే, మిగతా కంటెస్టెంట్లంతా క్విజ్ మాస్టర్‌గా వికాస్‌ను సెలక్ట్ చేసుకున్నారు. ఆర్షీ ఖాన్ వంతు వచ్చింది. ఆయన ప్రశ్నలు వేస్తే ఈమె సమాధానాలు చెప్పాలి. మొదటి ప్రశ్న వేశాడు వికాస్. ‘‘ఢిల్లీ రాజధాని ఏది?’’‘‘భోపాల్’’ అని టక్కున చెప్పేసింది ఆర్షీ.పెద్దగా నవ్వేశాడు వికాస్. వెంటనే కెమెరా వైపు తిరిగి, ‘‘హాయ్ ఆలియా.. మీట్ యువర్ ఫ్యాన్. ఈమె నీలా కావాలనుకుంటోంది’’ అన్నాడు. (ఆలియా జనరల్ నాలెడ్జి మీద చాలా జోకులున్నాయి. అందుకే వికాస్ అలా అన్నాడు).క్వొశ్చన్ నెం.2‘‘కేజీ ఇనుము ఎక్కువ బరువుంటుందా? కేజీ దూది ఎక్కువ బరువుంటుందా?’’ ‘‘ఇనుము’’ అని టక్కున చెప్పింది ఆర్షీ. మళ్లీ పెద్దగా నవ్వాడు వికాస్. బిగ్ హౌస్ లోపల, ముంబైలో టీవీ చూస్తున్న ప్రతి హౌస్ లోపల నవ్వులే నవ్వులు. నవ్వించడానికి ఆర్షీ ఈ సమాధానాలు చెప్పి ఉంటుందనిఎపిసోడ్ చివర వికాస్ ఆమెను గట్టెక్కించాడు. తను క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్‌గా చాన్స్ కొట్టేశాడు. -
అవి రియాలిటీ షోలు కాదు... : పోసాని
ఆ టీవీ షోల్లో నకిలీ కేసులు భార్యాభర్తలను కొట్టుకోమని నిర్వాహకులే చెప్తారు కొన్నిసార్లు నకిలీ జంటలతోనూ షో నడిపిస్తారు కుండబద్దలు కొట్టిన పోసాని కృష్ణమురళి సాక్షి, హైదరాబాద్: తెలుగు టీవీ ఛానెల్స్‌లో వచ్చే రియాలిటీ షోలు అన్నీ నిజం కాదని ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి తెలిపారు. పలు తెలుగు టీవీ ఛానల్స్‌లో విడిపోయిన భార్యభర్తలను కలిపే కార్యక్రమాలు, కుంటుబం సమస్యలను పరిష్కరించే కార్యక్రమాలు తరచూగా చూస్తూనే ఉంటాం. ఈ కార్యక్రమాల్లో భార్య భర్తల మధ్య తలెత్తిన వైవాహిక సమస్యలను పరిష్కారం చూపిస్తాయి. ఒక్కో సారీ ఈ కార్యక్రమానికి వచ్చిన జంటలు రెచ్చిపోతాయి. భార్యను భర్త కొట్టడమో, భర్తను భార్య కొట్టడమో, కుటుంబం సభ్యులు కొట్టుకోవడమో జరుగుతుంది. వీటన్నింటిపై ఓప్రముఖ తెలుగు ఛానెల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. ఈ కార్యక్రమాలు అన్నీ నిజం కాదని కొన్ని నకిలీ కేసులు ఉంటాయన్నారు. భార్యభర్తలను కొట్టుకోమని కార్యక్రమ నిర్వాహకులే సూచిస్తారని తెలిపారు. అన్నీరోజులు జంటలు రారని, అలాంటి సమయంలో నిర్వాహకులే నకిలీ జంటలను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నడిపిస్తారని చెప్పారు. అన్నీ కార్యక్రమాల్లో తన కార్యక్రమానికే పేరొచ్చిందని తెలిపారు. తాను మాత్రం అలాంటి నకిలీ జంటలతో కార్యక్రమాన్ని చేయనని నిర్మాతలకు చెప్పానని, తనకు నిజం అనిపిస్తేనే షో చేస్తానని పేర్కొన్నారు. నిర్వాహకులు ముందుగానే ఒక్కొక్క షోలో ఒక్కొక్కరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని, దాని ప్రకారమే షో నడుస్తుందని అన్నారు. తాను ఒక్కరోజు షూటింగ్‌కు రూ. 3.45లక్షలు తీసుకుంటానని వారం చివరి రోజుల్లో తన ఖాతాలో జమచేస్తారని పోసాని చెప్పారు. ఒక్కసారి తన రెమ్యునరేషన్లో కొంత మొత్తాన్ని కార్యక్రమానికి వచ్చిన నిజమైన జంటలను ఆదుకోవడానికి అందించినట్లు ఆయన తెలిపారు. -
భాగ్యనగరినాకు రెండో ఇల్లు
ఏడు స్వరాలు ఆయన వేణువు నుంచి వెలువడితే చాలు, శ్రోతలకు ఏడేడు లోకాలలో సంచరించిన అనుభూతి సొంతమవుతుంది. పహిల్వాన్ల కుటుంబంలో పుట్టినా, కుస్తీ వైపు కాకుండా, సంగీతం వైపు ఆకర్షితుడై, అనతికాలంలోనే సంగీత రంగానికి తానే ఆకర్షణగా మారిన వేణుధర ధీరుడు హరిప్రసాద్ చౌరాసియా. సంగీతాభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం నగరానికి వచ్చిన చౌరాసియా, బిజీ షెడ్యూల్‌తో తలమునకలుగా ఉన్నా, ‘సిటీప్లస్’తో కొద్దిసేపు ప్రత్యేకంగా ముచ్చటించారు. సంగీతంలో తన ప్రస్థానాన్ని, హైదరాబాద్ నగరంతో తన అనుబంధాన్ని ఇలా పంచుకున్నారు. నగరం మారిపోయింది.. హైదరాబాద్ నాకు రెండో ఇల్లులాంటిది. తొలిసారిగా 1963లో ఇక్కడ అడుగుపెట్టా. అప్పట్లో ఈ నగరం చాలా చిన్నది. చిన్న హోటళ్లు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఫైవ్‌స్టార్ సిటీలా కనిపిస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది.. తెలుగులో ‘సిరివెన్నెల’ చిత్రానికి వేణుగానాన్ని వినిపించా. సంగీత ప్రధానమైన ఆ చిత్రంలో హీరో ఫ్లూటిస్ట్. ఆ హీరో పాత్రకు వేణుగానాన్ని అందించా. తెలుగువారు ఇప్పటికీ ఆ చిత్రాన్ని గుర్తుచేసుకుంటూ నా వద్ద ప్రస్తావిస్తుండటం నిజంగా ఆనందాన్నిస్తుంది. ఇందుకు నాకు అవకాశం కల్పించిన దర్శకుడు విశ్వనాథ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తెలుగులో శంకరాభరణం, సిరివెన్నెల నాకు ఎంతో ఇష్టమైన చిత్రాలు. సంగీత ప్రధానమైన చిత్రాల్లో అవకాశం దొరికితే, ఇప్పుడు కూడా తెలుగు చిత్రాలకు పనిచేసేందుకు నేను సిద్ధంగానే ఉన్నా. కర్ణాటక విద్వాంసుల్లో ఎం.ఎస్.గోపాలకృష్ణన్, బాలమురళీకృష్ణ, టి.ఆర్.మహాలింగం, ఎన్.రమణి వంటి వారి సంగీతాన్ని చాలా ఇష్టపడతా. గానానికి, వేణునాదానికి ఏవీ సాటిరావు ఎన్నో సంగీత పరికరాలు ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటి గొప్పతనం వాటికి ఉండొచ్చు. అయితే, గానానికి, వేణునాదానికి ఏవీ సాటిరావు. సంగీతం ఉన్నంత వరకు ఇవి ఎప్పటికీ నిలిచే ఉంటాయి. సంగీతమే నా ప్రపంచం. ఏ రాగం ఇష్టమంటే ఏం చెప్పను? అన్ని రాగాలూ ఇష్టమే. సంగీతాన్ని సిలబస్‌లో చేర్చాలి పిల్లలకు స్వతహాగా సంగీతంపై మక్కువ ఉంటుంది. వారిని సంగీతం వైపు ప్రోత్సహించాలి. సంగీతంపై వారి మమకారాన్ని ప్రోత్సహించేందుకు సంగీతాన్ని ఒక సబ్జెక్టుగా సిలబస్‌లో పెట్టాలి. పరీక్షలు కూడా పెట్టాలి. అప్పుడే మన సంగీతానికి మనుగడ ఉంటుంది. రియాలిటీ ‘షో’లు సరిపడవు సంప్రదాయ సంగీతానికి రియాలిటీ షోలు సరిపడవు. వాటి ద్వారా పిల్లలు నేర్చుకుంటారనే వాదనను నేను అంగీకరించను. గురు-శిష్య సంబంధంతోనే సంగీతం ఒకరి నుంచి మరొకరికి ప్రవహిస్తుంది. - ప్రవీణ్‌కుమార్ కాసం -
డేంజరస్ ఎంటర్టైన్మెంట్!
రియాలిటీ షోలు వచ్చిన తరువాత వినోదం కొత్తదారి పట్టింది. ఇలాగే ఉండాలి అన్న నియమమేమీ లేకపోవడం, ఒకదాన్ని మించి ఒకటి ఉండాలన్న పోటీతత్వం పెరిగిపోవడం వంటి కారణాలతో కొత్త కొత్త కాన్సెప్టులు పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని షోలు ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా సాగిపోతుంటే... మరికొన్ని ఉత్కంఠను రేపి ఊపిరాడనివ్వని టెన్షన్‌ని క్రియేట్ చేయడమే ధ్యేయంగా రూపొందుతున్నాయి. ఒత్తిడి నుంచి విముక్తి కోసం, ఆహ్లాదం కోసమే వినోదం అన్న భావనలను చాలా చానెళ్లు తీసి పారేస్తున్నాయి. నరాలు తెగిపోయే ఉత్కంఠను రేపి మరీ టీవీ సెట్లకు ప్రేక్షకులని కట్టిపడేయాలని చూస్తున్నాయి. అందుకే ఖత్రోంకే ఖిలాడీ, ఫియర్ ఫ్యాక్టర్, సర్వైవర్, సూపర్, ఎండ్యూరెన్స్ లాంటి కార్యక్రమాలు ఊపిరి పోసుకున్నాయి. ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూసేలా చేస్తున్నాయి. ఒక వ్యక్తిని వాహనం ముందువైపున కట్టేస్తారు. వేగంగా వాహనాన్ని పోనిస్తూ అడ్డొచ్చినవన్నీ గుద్దేస్తుంటారు. అయినా ఆ వ్యక్తి తట్టుకుని నిలబడాలి. అలాగే... ఓ తొట్టినిండా పాములు, తేళ్లు తదితర విష ప్రాణులను వేసి, అందులో దిగమంటారు. ఎవరు ఎక్కువసేపు ఉంటే వాళ్లే విజేత. ఓ నది మీదో, కొలను మీదో ఎత్తులో ఒక చక్రాన్ని బిగిస్తారు. అది గిరగిరా తిరుగుతూ ఉంటుంది. దాని మీద నడుస్తూ విన్యాసాలు చేయాలి. పడిపోతే మార్కులు పోయినట్టే. ఓ కేక్‌ని తెచ్చి పార్టిసిపెంట్స్ ముందు పెడతారు. దాన్నిండా పురుగులు ఉంటాయి. అయినా అసహ్యించుకోకుండా తినాలి. కక్కితే పోటీ నుంచి చెక్కేయాల్సిందే. ఇవన్నీ చూడ్డానికే మనకి భయమేస్తే... చేసేవాళ్లకి ఎన్ని గట్స్ ఉండాలి! అయినా కూడా చేసేందుకు బోలెడంతమంది సిద్ధంగా ఉంటున్నారు. విదేశాల్లో ప్రసారమయ్యే ఈ తరహా షోలలో మామూలు వ్యక్తుల్నే తీసుకుంటారు. కానీ మన దేశంలో ప్రసారమయ్యే ‘ఖత్రోంకే ఖిలాడీ’లాంటి షోలలో సెలెబ్రిటీలు పాల్గొంటారు. వాళ్లకంత అవసరం ఏమొచ్చింది అనుకోవచ్చు. లక్షల్లో ప్రైజ్ మనీ వస్తుంటే వాళ్లు మాత్రం కాదంటారా? కాసేపు ఊపిరి బిగబడితే, గుండె దిటవు చేసుకుంటే బోలెడంత సొమ్ము, దానికితోడు అంతవరకూ లేని ఓ డిఫరెంట్ ఇమేజ్! అందుకే వాళ్లు ఈ విన్యాసాలకు ఓకే అంటున్నారు. అయితే... దీన్ని వినోదం అనగలమా? వాళ్లు ఎత్తుల మీది నుంచి ఎక్కడ పడిపోతారోనని ఇక్కడ ప్రేక్షకుడు టెన్షన్ పడి పోతుంటాడు. ఒంటిమీద పాకుతున్న విష పురుగులు కరుస్తాయేమో, ఏ పామో కాటేస్తుందేమోనని పార్టిసిపెంట్ కంటే ప్రేక్షకుడే ఎక్కువ కంగారుపడుతుంటాడు. అక్కడ వాళ్లు పురుగులున్న ఫుడ్ తింటుంటే ఇక్కడ వీళ్లు డోక్కుంటూ ఉంటారు. జుగుప్స కలిగించే, మానసిక ఒత్తిడిని పెంచే ఇలాంటి వినోదం అవసరమా చెప్పండి! అయినా ఎవరినీ చూడొద్దని అనలేం. చూసేవాళ్లు ఉన్నప్పుడు తీయొద్దనీ అనలేం. కాబట్టి ఈ డేంజరస్ ఎంటర్టైన్మెంట్ని కామ్‌గా భరించాల్సిందే!