
భారత రైల్వే
మీరు చక్కటి ఐడియాలు ఇవ్వగలరా...? మీ ఆలోచనతో అందరిని ఒప్పించి, మెప్పించగలరా..? అయితే ఇది మీ కోసమే. భారత రైల్వే శాఖ మీరు పది లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఓ మంచి ఐడియా చెప్పడమే. భారత రైల్వే శాఖ జన్ భాగీదారి ప్రోగ్రామ్ పేరిట ఓ పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొన్న వారు దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో మెరుగైన సేవలు, సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ఐడియా చెబితే చాలు.
మీ ఆలోచన కొత్తగా, అద్భుతంగా ఉందంటే పది లక్షల రూపాయలు మీవే. అంతేకాదు ఆ తర్వాత మరో మూడు నగదు బహుమతులు కూడా ఉన్నాయి. ఈ పోటీలో పాల్గొనడానికి మీరు ‘ఇన్నోవేటివ్.మైగోవ్.ఇన్’ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఆలోచనను ఆన్‌లైన్‌లో పంపితే సరిపోతుంది. రైల్వే స్టేషన్లలో చక్కటి సౌకర్యాలు కల్పించడానికి డబ్బును ఎలా సమకూర్చాలో క్లుప్తంగా వివరించాలి. మీ ఆలోచన మన ప్రస్తుత రైల్వే వ్యవస్థకు సరిపోయేదిగా ఉండాలి, ఆచరణ సాధ్యంగా కూడా ఉండాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మెదడుకు పదును పెట్టిండి, పది లక్షలు గెల్చుకోండి!