competition
-
ప్రతి నిమిషం.. సినిమా ధ్యాసే..
చిత్ర పరిశ్రమలో దర్శకత్వ విభాగంలో సక్సెస్ కావాలంటే, అందులోనూ ఓ మహిళ ఆ స్థాయిలో అవ్వాలంటే సామర్థ్యంతో పాటు సృజనాత్మకత తప్పనిసరి. సమకాలీన అంశాలను అర్థవంతంగా తెరకెక్కిస్తేనే ప్రేక్షకాదరణ పొందుతుంది. అలాంటిది హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఎంతో అంకితభావం, చిత్తశుద్ధితో పాటు ధైర్యసాహసాలు కావాలి. ఒకటి కాదు రెండు కాదు వందలాది అంతర్జాతీయ అవార్డ్‌లతో ఔరా అనిపిస్తోంది మన తెలుగమ్మాయి లక్ష్మీ నిమిషా గుమ్మడి. తాజాగా ఆమె ప్రొడక్షన్ డిజైనర్‌గా రూపొందించిన ‘డాస్ బ్రోస్ ఫోర్స్’ ఫీచర్ ఫిల్మ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలిచింది. ఇది చాలదూ.. హాలీవుడ్లో లక్ష్మీ సత్తా ఏంటో చెప్పేందుకు!? హైదరాబాద్‌లోని సంఘమిత్ర స్కూల్, ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో +12 వరకూ చదివిన లక్ష్మీ.. ఆ తర్వాత కర్నాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, కాలిఫోరి్నయాలోని అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (ఏఎఫ్ఐ)లో ‘ప్రొడక్షన్ డిజైన్’లో ఎంఎస్ పూర్తి చేసింది. సమకాలీన డిజైన్స్‌తో సాంస్కృతిక అంశాలను మిళితం చేసే సామర్థ్యం ఈమె సొంతం. తెర వెనక పాత్రల గురించి తెలిసి.. చిన్నతనంలో సినిమాలు చూసేటప్పుడు క్యారెక్టర్స్‌లో లీనమై అతిగా భావోద్వేగానికి లోనయ్యేదానినని తరుచూ స్నేహితులు ఆమెను ఆటపట్టించేవారు. చిన్నతనం నుంచే తనపై సినిమాల ప్రభావం ఉండటంతో నటి కావాలని అనుకునేది. ఆ వయసులో తెరవెనక దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు, నిర్మాతల పాత్ర గురించి ఆలోచించే స్థాయిలేదు కానీ, పెద్దయ్యాక సినిమా మేకింగ్ గురించి తెలిసిన తర్వాత ఆమె ఆసక్తి నటన నుంచి ప్రొడక్షన్ వైపు మళ్లింది.ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ‘తహనన్’.. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్న ‘తహనాన్’ అనే ఫీచర్ ఫిల్మ్ లక్ష్మీ రూపొందించిందే. దీనికి లాస్ ఏంజిల్స్‌లోని కల్వర్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చలనచిత్ర అవార్డ్ వరించింది. అమెరికాలో మ్యూజిక్ వీడియోలు, వాణిజ్య ప్రకటనలు కూడా ఈమె రూపొందిస్తోంది. టేలర్ స్విఫ్ట్సŠ, ఫోర్ట్‌నైట్, రెడ్ క్రిస్మస్, రోబోట్, ఎలిఫెంట్ ఇన్ ది డార్క్, స్టక్ వంటి ఎన్నో మ్యూజిక్ వీడియోలకు లక్ష్మీ పనిచేసింది. అలాగే ఎల్రక్టానిక్ ఉపకరణాల సంస్థ డీఈఎక్స్ వంటి పలు బహుళ జాతి కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు రూపొందించింది.తెలుగు చిత్రం రిలీజ్.. ఈజిప్ట్, ఫ్రాన్స్, పోర్చుగల్, జర్మనీ, ఇస్తాంబుల్, యూకే వంటి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 50 ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 15 అంతర్జాతీయ అవార్డ్లు లక్ష్మీ సొంతం. తాజాగా ‘డాస్ బ్రోస్ ఫోర్స్’ చిత్రం వచ్చే ఏడాది మేలో జరగనున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలిచింది. అర్జున్ ది స్టూడెంట్, మీన్ గోల్స్, ది హల్కైన్ డేస్, బాడీ చెక్ వంటి ఎన్నో ఫీచర్, షార్ట్ ఫిల్మŠస్ను రూపొందించింది. ఇండియాతో పాటు కెనడా, గ్రీస్, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి దేశాల్లోని ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డ్‌లను దక్కించుకుంది. రవికుమార్ వాసు దర్శకత్వంలో శివకుమార్ రామచంద్ర వరపు కథానాయకుడిగా తెరకెక్కిన తెలుగు చలనచిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా తెలుగు విద్యార్థి
అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో ఈ ఏడాది కూడా భారత సంతతి విద్యార్థుల హవానే కొనసాగింది. ఈ ఏడాది జరిగిన 96వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో ఏడుగురు ఫైనలిస్టులను ఓడించి విజేతగా నిలిచాడు భారత సంతతి విద్యార్థి బృహత్ సోమ. కేవలం 90 సెకన్లలో అబ్సెయిల్ సహా 29 పదాలను అలవోకగా తప్పుల్లేకుండా చెప్పి..కప్ తోపాటు 50 వేల డాల నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ ప్రస్తుతం ఏడో గ్రేడ్ చదువుతున్నాడు. అతడి తండ్రి శ్రీనివాస్ సోమ నల్గొండకు చెందినవారు. ఈ ఏడాది స్పెల్లింగ్ బీ పోటీల్లో దాదాపు 240 మందికి పైగా పాల్గొన్నారు. అందులో ఏడుగురు గురువారం రాత్రికి ఫైనల్‌కు చేరుకున్నారు. ఇక వారిలో బృహత్ సోమకి, టెక్సాస్‌కు చెందిన పైజాన్ జాకీ మధ్య టై ఏర్పడింది. దీంతో ఇద్దరికీ మరో రౌండ్ పోటీ నిర్వహించి 90 సెకన్ల సమయాన్ని కేటాయించారు నిర్వాహకులు. ఈ పోటీలో జాకీ 90 సెకన్లలో 20 పదాలు చెప్పగా, బృహత్ ఏకంగా 29 పదాలు చెప్పి టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు. 2022లో జరిగిన పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్ 90 సెకన్లలో 22 పదాల స్పెల్లింగ్‌లు చెప్పగా, ఆ రికార్డును బృహత్ బ్రేక్ చేశాడని నిర్వాహకులు తెలిపారు. అంతేగాదు బృహత్ గతంలో 2022లో స్పెల్లింగ్ బీలో 163వ స్థానానికి చేరురోగా, 2023లో 74వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం బృహత్ టైటిల్‌తో సత్తా చాటాడు. ఇక రన్నరప్‌గా నిలిచిన జాకీ 25 వేల డాలర్ల ప్రైజ్‌మనీని అందుకున్నాడు. ఇక ఈ పోటీల్లో శ్రేయ్ పరీఖ్ రెండోవ స్థానంలో నిలవగా, అనన్య రావు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక అమెరికా ఈ స్పెల్లింగ్ బీ పోటీలను 1925 నుంచి నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఈ పోటీల్లో 29 మంది భారత సంతతి విద్యార్థులు ఛాంపియన్లుగా నిలిచారు. (చదవండి: US: పోర్ట్ ఆఫ్ ఎంట్రీ.. ఒక విషమ పరీక్షే!) -
పతంగుల పోటీలో ఘోరం.. గొంతు తెగి ఆరుగురు విలవిల.. 35 మందికి గాయాలు!
రాజస్థాన్‌లో అక్షయ తృతీయ వేళ విషాదం చోటుచేసుకుంది. ఈ పండుగను రాష్ట్రంలో అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా బికనీర్‌లో గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం ఉంది. అయితే వీటిని ఎగువేసేందుకు వినియోగించే చైనీస్ మాంజాలు పలువురిని గాయాలపాలు చేస్తున్నాయి.చైనీస్ మాంజా తగలడంతో 35 మంది గాయపడ్డారు. ఆరుగురి గొంతులు కోసుకుపోయాయి. మాంజా బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బికనీర్ జిల్లా ఆరోగ్య యంత్రాంగం బాధితులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసింది. బికనీర్‌లోని పీబీఎం ఆస్పత్రిలో కూడా గాలి పటాల బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.గాలిపటాల మాంజాల కారణంగా గాయపడిన 35 మందికి పీబీఎం ఆస్పత్రిలోని ట్రామా సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. గొంతు తెగిన ఆరుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ట్రామా సెంటర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ కపిల్ తెలిపారు. మరోవైపు నగరానికి చెందిన పలువురు తమ ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి గాలిపటాలు ఎగరవేయడంతో ఆకాశం నిండా గాలిపటాలు కనిపిస్తున్నాయి. చైనా మాంజా కారణంగా పక్షులు కూడా చనిపోతున్నట్లు తెలుస్తోంది. आखातीज और बीकानेर स्थापना दिवस पर आइए कभी हमारे बीकानेर और देखिए यहां कि पतंगबाजी इतनी धूप में 🔥🎉#Bikaner pic.twitter.com/QdvPW0R66q— MAHENDARA GODARA (@MAHENDRAJAAT010) May 10, 2024 -
ది గ్రేట్ వడా పావ్ వార్
దిల్లీ ‘వైరల్ వడా పావ్ గర్ల్’గా పాపులర్ అయిన చంద్రికా గెరా దీక్షిత్ తాజాగా తన ఫుడ్ కార్ట్ సార్టప్తో రాత్రికి రాత్రి సెన్సేషన్‌గా మారింది. దీక్షిత్ పాపులారిటీ మాట ఎలా ఉన్నా ఆమెకు పోటీదారులు పెరిగారు. దీక్షిత్ ఫుడ్ కార్ట్ చుట్టుపక్కల పోటీదారులు వడా పావ్ బండ్లను ఏర్పాటు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ‘పాపులారిటీనే కొంప ముంచిందా!’ లాంటి హెడ్‌లైన్స్ నెటిజనుల నుంచి లైన్ కట్టాయి. ‘నిన్న నేను రానందున తన బండిని ఉంచానని ఆంటీ చెప్పింది. ఈరోజు కూడా ఇక్కడే పెట్టింది. ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకోవడం సమంజసమా!’ అని తన ఆవేదనను వెళ్లగక్కింది దీక్షిత్. ఫుడ్ వ్లాగర్ పూడీ మానేహా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోటీదారు ఆంటీ ‘ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా పని నేను చేసుకుపోతున్నాను’ అని ఎర్రటి ఎండల్లో కూల్‌గా బదులిచ్చింది. ‘బండి ఎవరు పెట్టారనేది కాదు... రుచి ముఖ్యం’ అని కూడా సెలవిచ్చింది. -
జగనన్న సంక్షేమంపై స్పెషల్ కాంటెస్ట్
సాక్షి, అమరావతి: గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించే విధంగా ‘మేము సైతం’ పేరుతో ప్రత్యేకంగా ఆన్లైన్ పోటీని ఔత్సాహిక ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేశారు. ఎన్నారైలు శరత్ ఎత్తపు, తిరుమల్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ ఆన్లైన్ పోటీని APNRTS చైర్మన్ వెంకట్ మేడపాటి ప్రారంభించి మాట్లాడారు. సీఎం జగన్ పాలనలో లబ్ధిదారులు పొందిన లబ్ధి గురించి అభిప్రాయాన్ని వీడియో రూపంలో చేసి అందరికీ తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. https://memusaitham.in/ లింక్ ద్వారా రిజిస్టర్ అయి, వీడియోలను షేర్ చేయాలని కోరారు. ఎలా చేయొచ్చు అంటే.? ఏపీలో సంక్షేమపథకాలపై ప్రజల అభిప్రాయం ఏమిటి? ఆర్ధిక, మౌలిక వసతుల రంగాల్లో ఏపీకి పునర్జీవనం వచ్చిందా ? ప్రజల బతుకుల్లో జగనన్న ప్రభుత్వం నింపిన వెలుగులపై ఏమనుకుంటున్నారు? మీ ఫోన్ ద్వారా లబ్ధిదారుల అభిప్రాయాన్ని వీడియో తీయండి, కింద పేర్కొన్న వెబ్సైట్లో అప్లోడ్ చేయండి బెస్ట్ వీడియోకు తగిన గుర్తింపుతోపాటు నగదు పురస్కారం https://memusaitham.in/ లింక్ ద్వారా రిజిస్టర్ అయి, వీడియోలను షేర్ చేయండి ఆసక్తి ఉన్న వారు "మేము సైతం" కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లి జిల్లా, రాష్ట్ర స్థాయి క్యాష్ బహుమతులు గెలవచ్చన్నారు. వీడియోలను అనుభవజ్ఞులైన బృందం పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుందని, మొత్తం రూ.25 లక్షల నగదు బహుమతులు ఉన్నాయని తెలిపారు. ప్రతి కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి రూ. 25,000, రెండో బహుమతి కింద రూ.15,000, మూడో బహుమతి కింద రూ.10,000 ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి రూ.5,000, రెండో బహుమతి కింద రూ.3,000, మూడో బహుమతి కింద రూ.2,000 ఇవ్వనున్నట్లు శరత్ చెప్పారు. -
‘భావి భారతం గురించి నీకేం తెలుసు?’.. విద్యార్థులకు రైల్వేశాఖ పోటీ..
భవిష్యత్తులో భారతదేశం ఎలా ఉండబోతోంది? భారతీయ రైల్వేలు ఎంతలా మారనున్నాయి?.. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలను ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను వారి అధ్యాపకులు అడుగుతుంటారు. తాజాగా భారతీయ రైల్వే దేశంలోని పాఠశాలల విద్యార్థులకు ఒక పోటీ నిర్వహించబోతోంది. ఈ పోటీలో పాల్గొనే విద్యార్థులు భావి భారతంపై తమకున్న కలల గురించి చెప్పాలని రైల్వేశాఖ కోరింది. ఇందుకోసం భారతీయ రైల్వే ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 4000 పాఠశాలల నుంచి 4 లక్షల మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొననున్నారు. భావి భారతం ఎలా ఉండబోతోంది? రైల్వేల భవిష్యత్ ఎలా ఉండనుందనే దానిపై విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, కవితా రచన తదితర పోటీలు నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పోటీలో ప్రతిభ కనబరిచిన 50 వేల మంది విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 26న దేశంలోని అన్ని డివిజన్లలోని 2000 రైల్వే స్టేషన్లలో పోటీ నిర్వహించనున్నామని, పోటీలు జరిగే సమయంలో ప్రధాని స్వయంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని రైల్వే అధికారులు తెలిపారు. -
ఓవరాల్ చాంపియన్ తెలంగాణ పోలీస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు జాతీయస్థాయిలో సత్తా చాటారు. లక్నోలో నిర్వహించిన ఆల్ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో వివిధ పోటీల్లో కలిపి మొత్తం ఐదు బంగారు పతకాలు, ఏడు వెండి పతకాలు తెలంగాణ పోలీస్‌శాఖకు దక్కాయి. ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించి, ప్రతిష్టాత్మకమైన చార్మినార్ ట్రోఫీ దక్కించుకున్నారు.12 ఏళ్ల తర్వాత తెలంగాణ పోలీసులు ఈ ఘనత సాధించారు. శెభాష్ తెలంగాణ పోలీస్: ప్రతిభను చాటిన తెలంగాణ పోలీసులను అభినందిస్తూ ట్విట్టర్(ఎక్స్) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘పతకాలు సాధించిన విజేతలు, డీజీపీ రవిగుప్తా, మొత్తం తెలంగాణ పోలీస్ విభాగానికి శుభాకాంక్షలు ’అని సీఎం అభినందించారు. బంగారు పతకాలు సాధించిన వారిలో జి.రామకృష్ణారెడ్డి, డి.విజయ్‌కుమార్, వి.కిరణ్‌కుమార్, పి.అనంతరెడ్డి, ఎం.దేవేందర్ప్రసాద్, వెండి పతకాలు సాధించినవారిలో పి.పవన్, ఎన్.వెంకటరమణ, ఎం.హరిప్రసాద్, కె.శ్రీనివాస్, షేక్‌ఖాదర్ షరీఫ్, సీహెచ్.సంతోష్, కె.సతీష్‌లు ఉన్నారని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఆయా విభాగాల వారీగా చూస్తే.. ► కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణ విభాగంలో ఒక బంగారు, ఒక వెండి పతకం ► పోలీస్ ఫొటోగ్రఫీ విభాగంలో ఒక బంగారు, ఒక వెండి పతకం ► డాగ్ స్క్వాడ్ పోటీల్లో ఒక బంగారు, ఒక వెండి పతకం ► యాంటీ స్టాబేజ్ చెక్‌లో రెండు బంగారు, మూడు వెండి పతకాలు ► పోలీస్ వీడియోగ్రఫీలో ఒక వెండి పతకం దక్కాయి. ►జాతీయస్థాయిలో రెండోస్థానంలో నిలిచిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు ఒక వెండి, మూడు కాంస్య పతకాలు, మూడోస్థానంలో నిలిచిన ఐటీబీపీ సిబ్బందికి ఒక బంగారు, నాలుగు కాంస్య పతకాలు దక్కాయి. -
ఆడుదాం ఆంధ్రా విజేతలు వీరే
విశాఖ స్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా ఫైనల్ పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. విశాఖలోని ఎనిమిది వేదికల్లో ఐదు క్రీడాంశాల్లో పురుషుల, మహిళల జట్ల మధ్య ఫైనల్స్‌ను ప్రేక్షకులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. మహిళల విభాగంలో.. ► క్రికెట్ విజేతగా ఎన్టీఆర్ జిల్లా సిద్ధార్థ నగర్, రన్నరప్‌గా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, సెకండ్ రన్నరప్‌గా ప్రకాశం జిల్లా చిరకూరపాడు జట్లు నిలిచాయి. ► వాలీబాల్ విజేతగా బాపట్ల జిల్లా నిజాంపట్నం–3, రన్నరప్‌గా కర్నూలు జిల్లా మామిడాలపాడు–1, సెకండ్ రన్నరప్‌గా అన్నమయ్య జిల్లా కుచ్చువారిపల్లి–1 జట్లు నిలిచాయి. ► బ్యాడ్మింటన్ విజేతగా బాపట్ల జిల్లా స్వర్ణ 2, రన్నరప్‌గా వైఎస్సార్ జిల్లా శంకరాపురం–4, సెకండ్ రన్నరప్‌గా కర్నూలు జిల్లా ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ జట్లు నిలిచాయి. ► ఖోఖో విజేతగా ప్రకాశం జిల్లా పోలిరెడ్డి బజార్, రన్నరప్‌గా కృష్ణా జిల్లా నెహ్రూ సెంటర్ చౌక్, సెకండ్ రన్నరప్‌గా కాకినాడ జిల్లా బీసీ కాలనీ 2 జట్లు నిలిచాయి. ► కబడ్డీ విజేతగా విశాఖ జిల్లా లాసన్స్‌బే కాలనీ, రన్నరప్‌గా ప్రకాశం జిల్లా పాకాల 2, సెకండ్ రన్నరప్‌గా అనకాపల్లి జిల్లా సాలపువానిపాలెం జట్లు నిలిచాయి. పురుషుల విభాగంలో.. ► బ్యాడ్మింటన్ విజేతగా ఏలూరు జిల్లా శేఖర్ వీధి, రన్నరప్‌గా తిరుపతి జిల్లా భేరీపేట, సెకండ్ రన్నరప్‌గా వైఎస్సార్ కడప కాగితాలపెంట 1 జట్లు నిలిచాయి. ► వాలీబాల్ విజేతగా బాపట్ల జిల్లా బేతపూడి, రన్నరప్‌గా మన్యం జిల్లా బలిజపేట, సెకండ్ రన్నరప్‌గా చిత్తూరు జిల్లా కొత్తపల్లె జట్లు నిలిచాయి. ► ఖోఖో విజేతగా బాపట్ల జిల్లా పొంగులూరు –1, రన్నరప్‌గా అనకాపల్లి జిల్లా తుమ్మపాల–2, సెకండ్ రన్నరప్‌గా ప్రకాశం జిల్లా రుద్రవరం జట్లు నిలిచాయి. సాగర తీరంలో డ్రోన్ షో సాక్షి, అమరావతి: ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలను ప్రభుత్వం నేడు అట్టహాసంగా నిర్వహించనుంది. విశాఖ సాగర తీరంలో లేజర్ షోతో పాటు డ్రోన్ షోలు ఏర్పాటు చేశారు. స్టేడియంలో ప్రొజెక్షన్ మ్యాపింగ్, సౌండ్ అండ్ లైటింగ్ షోకు శాప్ ఏర్పాట్లు చేసింది. ఎల్ఈడీ కాంతుల్లో 150 మంది కూచిపూడి నృత్యకారులతో ఆడుదాం ఆంధ్రపై కళా ప్రదర్శన నిర్వహిస్తారు. బాణసంచా వెలుగులు ఆహుతుల్ని అలరించనున్నాయి. -
జీడిపప్పుకు సవాల్ విసిరిన వెల్లుల్లి!
వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరుగుతూ, జీడిపప్పుకు సవాల్ విసురుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని వైకుంఠ్‌పూర్, మనేంద్రగఢ్, చిర్మిరి, ఖడ్గవాన్‌తో సహా పరిసర ప్రాంతాల్లో కిలో వెల్లుల్లిని రూ.400 నుండి రూ.600కు విక్రయిస్తున్నారు. నెల రోజుల క్రితం కిలో వెల్లుల్లి రూ.200కు విక్రయించగా, తరువాత అంతకంతకూ పెరుగుతూవస్తోంది. స్థానిక కూరగాయల వ్యాపారి రాజ్ కుష్వాహ తెలిపిన వివరాల ప్రకారం జనవరిలో కిలో వెల్లుల్లి ధర రూ.200 ఉండగా, ప్రస్తుతం రూ.600 దాటింది. కూరల రుచిని పెంచే వెల్లుల్లి ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం జీడిపప్పు ధరలతో వెల్లుల్లి ధర పోటీ పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మార్కెట్లో కిలో జీడి పప్పు ధర రూ. 800 నుంచి 1000 మధ్య ఉంటోంది. ప్రభుత్వం వెల్లుల్లి ధరలను నియంత్రించే ప్రయత్నం చేయడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈసారి హోల్‌సేల్‌లో కూడా వెల్లుల్లి కిలో రూ.421 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో రిటైల్ మార్కెట్లో వెల్లుల్లి ధర రూ.600 దాటింది. గత శనివారం నుంచి కొత్త వెల్లుల్లి మార్కెట్లోకి రావడంతోనే వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వెల్లుల్లి ధర ఒక్కసారిగా పెరగడంపై ఈ ప్రాంత రైతు అమిత్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. గత ఏడాది అధికశాతం రైతులు వెల్లుల్లి సాగు చేశారన్నారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి ధర బాగా తగ్గిందన్నారు. దీంతో ఈ ఏడాది రైతులు వెల్లుల్లి సాగును తగ్గించారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి కొరత ఏర్పడింది. ఫలితంగా వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గత ఏడాది స్థానికంగా వెల్లుల్లి ఎక్కువగా పండడంతో గిట్టుబాటు ధర లభించక రైతులు తమ పంటలను నదులు, కాలువల్లో పడేశారు. గత సంవత్సరం, వెల్లుల్లి హోల్‌సేల్ ధర కిలో రూ. 40. మార్కెట్ ధర దీని కంటే తక్కువగా ఉంది. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. ఫలితంగా రైతులు ఈసారి వెల్లుల్లి సాగును తగ్గించారు. -
నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ అమీతుమీ!
విశాఖ స్పోర్ట్స్: యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ తుది పోటీలకు విశాఖ సిద్ధమైంది. 14,997 గ్రామాల నుంచి మెన్, వుమెన్ జట్లు ఐదు క్రీడల్లో నిర్వహిస్తున్న పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. 50 రోజుల పాటు సాగనున్న ఈ పోటీల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. 37.5 లక్షల మంది మెన్, వుమెన్ క్రీడాకారులు గ్రామ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. శుక్రవారం నుంచి చివరిదైన ఐదో దశ రాష్ట్ర స్థాయి పోటీల్లో 26 జిల్లాల్లో విజేతలుగా నిలిచిన జట్లు విశాఖలో అమీతుమీ తేల్చుకుంటాయి. 12.21 లక్షల నగదు ప్రోత్సాహాకాల్ని సత్తా చాటిన జట్లు సొంతం చేసుకుంటాయి. ఇప్పటికే నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో విజేతలు నగదు ప్రోత్సాహాకాల్ని అందుకోగా, తుది పోరులో రాష్ట్ర టైటిల్‌తో పాటు ప్రోత్సాహాకాల్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా అందుకోనున్నారు. వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మెన్ క్రికెట్ టైటిల్ పోరును ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి పోటీల ప్రారంభ వేడుక రైల్వే స్టేడియంలో జరగనుంది. రాష్ట్ర క్రీడా పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పోటీలను ప్రారంభించనుండగా, విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజని గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ప్రారంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ధ్యాన్‌చంద్ గురువారం స్టేడియంలో ఏర్పాట్లను ప్రత్యక్షంగా వీక్షించి పలు సూచనలు చేశారు. విజేతలకు రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకాలు వైఎస్సార్ స్టేడియంలో 50 రోజుల క్రీడా పండగ ముగింపు కార్యక్రమాన్ని 13న భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఈ టోర్నీ ద్వారా సత్తాచాటిన ఆటగాళ్లకు మరిన్ని మెలకువలు నేర్పేందుకు చెన్నయ్ సూపర్ కింగ్స్ పరిశీలకులతో పాటు ఆయా క్రీడల్లో నిష్ణాతుల్ని ఈ మ్యాచ్‌లు చూసేందుకు ఆహ్వానించామన్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర స్థాయిలో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీలో విజేతగా నిలిచిన జట్లు ఐదు లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని అందుకోనున్నాయి. రన్నరప్ జట్లు మూడు లక్షలు, సెకండ్ రన్నరప్ జట్లు రెండు లక్షలు అందుకోనున్నారు. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతగా నిలిచిన జట్లు రెండు లక్షలు అందుకోనుండగా.. రన్నరప్ లక్ష, సెకండ్ రన్నరప్ జోడి యాభై వేలు అందుకోనుంది. ఏయే ఆటలు ఎక్కడంటే.. రాష్ట్ర స్థాయిలో పోటీపడేందుకు అన్ని జిల్లాల నుంచి 1,482 మంది పురుషులు, 1,482 మంది స్త్రీలు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో జట్లుగా ఆడేందుకు అర్హత సాధించాయి. వారికి స్థానికంగా ఉన్న టిడ్కో గృహాల్లో ఏర్పాట్లు పూర్తయాయి. భద్రతను దృష్టిలో పెట్టుకుని వుమెన్ క్రికెట్ పోటీలను వైఎస్సార్ బి గ్రౌండ్‌లోనే నిర్వహించనుండగా, మెన్ క్రికెట్ పోటీలను రైల్వే స్టేడియం గ్రౌండ్, ఏఎంసీ గ్రౌండ్, కొమ్మాది కేవీకే స్టేడియం గ్రౌండ్లలో నిర్వహించనున్నారు. కబడ్డీ, ఖోఖో కోసం ఏయూ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్, వాలీబాల్ కోసం ఏయూ సిల్వర్ జూబ్లీ గ్రౌండ్లను సిద్ధం చేశారు. బ్యాడ్మింటన్ కోసం జీవీఎంసీ ఇండోర్ స్టేడియంలో ఐదు కోర్టులను వినియోగించనున్నారు. -
పాక్ ఎన్నికల బరిలో...ఆమె అంతంతే
పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమవుతోంది. గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. పాక్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సైన్యం దన్నున్న పార్టీ యే గెలవడం ఆనవాయితీ. ఆ లెక్కన ఈసారి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్)దే విజయం ఖాయమంటున్నారు. మరో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సైన్యం ఆగ్రహానికి గురై జైలుపాలవడంతో ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ కకావికలైపోయింది. బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీ కూడా పెద్దగా పోటీ ఇచ్చేలా కన్పించడం లేదు. ఎప్పట్లాగే ఈ ఎన్నికల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం అంతంతే ఉంది... – సాక్షి, నేషనల్ డెస్క్ పాకిస్తాన్ ఎన్నికల బరిలో ఉన్న మొత్తం 17 వేల మంది పై చిలుకు అభ్యర్థుల్లో మహిళలు ఎందరో తెలుసా? కేవలం 839 మంది! అంటే 4.7 శాతం. సాంప్రదాయికంగా పాక్‌లో మహిళలకు రాజకీయాల్లో అంతగా ప్రోత్సాహం దక్కదు. దాంతో ఎన్నికల్లో కూడా వారి ప్రాతినిధ్యమూ అంతంతమాత్రంగానే ఉంటూ వస్తోంది. పరిస్థితిని మార్చేందుకు మహిళలకు కనీసం 5 శాతం టికెట్లివ్వడాన్ని ఎన్నికల సంఘం తప్పనిసరి చేసింది. అయినా వారికి ఆ మాత్రం టికెట్లిచ్చేందుకు కూడా ప్రధాన పార్టీ లకు మనసు రావడం లేదు. ఈసారి మహిళలకు ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ ఇచ్చిన 53 టికెట్లే అత్యధికం! అయితే వారిలోనూ జాతీయ అసెంబ్లీకి పోటీ పడుతున్నది కేవలం 28 మందే. మిగతా 25 మంది ప్రావిన్సుల స్థానాల్లో పోటీకి పరిమితమయ్యారు. ఇక మహిళలకు పీపీపీ 4.5 శాతం, పీఎంఎల్ (ఎన్) కేవలం 4.2 శాతం టికెట్లతో సరిపెట్టాయి. పీపీపీ నుంచి 35 మంది, పీఎంఎల్ నుంచి 28 మంది మహిళలే బరిలో ఉన్నారు. వారిలోనూ చాలామంది పోటీ ప్రావిన్సు స్థానాలకే పరిమితం! కాకపోతే పాక్ చరిత్రలోనే తొలిసారిగా ఓ హిందూ మహిళ బరిలోకి దిగుతుండటం ఈ ఎన్నికల ప్రత్యేకతగా నిలవనుంది. అలాగే ఓ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, తాలిబన్ల చేతిలో భర్తను కోల్పోయిన మరో మహిళా నేత బరిలో ఉన్నారు.... సవీరా.. తొలి హిందూ అభ్యర్థి 25 ఏళ్ల సవీరా ప్రకాశ్ పాకిస్తాన్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. ఖైబర్ ఫక్తూన్ఖ్వా ప్రావిన్సులో బునెర్ జిల్లాలోని పీకే–25 నియోజకవర్గం నుంచి పీపీపీ టికెట్‌పై బరిలో దిగిన ఆమె ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవలే వైద్యవిద్య పూర్తి చేసిన సవీరాది ఆసక్తికరమైన నేపథ్యం. ఆమె తండ్రి ఓం ప్రకాశ్ సిక్కు కాగా తల్లి క్రిస్టియన్. వారిద్దరి అంగీకారంతో సవీరా మాత్రం హిందూ మతావలంబిగా మారారు. తద్వారా పాక్ వంటి ముస్లిం మెజారిటీ దేశంలో మత సహనానికి, సామరస్యానికి ప్రతీకగా నిలిచారామె. భారత మూలాలున్న ఓం ప్రకాశ్ ఉచిత వైద్యంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా పేరు పొందారు. ఎన్నడూ ఎన్నికల బరిలో దిగకపోయినా 30 ఏళ్లుగా పీపీపీ కార్యకర్తగా ఉంటూ వస్తున్నారు. చెడు చేయాలని ఏ మతమూ చెప్పదంటూ సవీరా చేస్తున్న ప్రచారానికి ముస్లింల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. మత, లింగ వివక్షను నిర్మూలించడమే తన లక్ష్యమని ఆమె అంటున్నారు. ‘‘పాక్‌లో ప్రజా జీవితంలో మహిళ పట్ల వివక్ష బాగా ఉంది. మా జిల్లానే తీసుకుంటే చదువుకున్న మహిళల సంఖ్య కేవలం 29 శాతం. దేశవ్యాప్తంగా కూడా మహిళల్లో అక్షరాస్యత 46 శాతమే. దీన్ని మార్చేందుకే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా’’ అని చెబుతున్నారు. మహిళా రిజర్వు స్థానం నుంచి కాకుండా జనరల్ సీటు నుంచి ఆమె బరిలో దిగడం మరో విశేషం. ఓటర్లను ‘ఇన్ఫ్లుయెన్స్’ చేస్తుందా...? లాహోర్‌లోని ఎన్ఏ–122 స్థానంలో పీఎంఎల్ (ఎన్) అభ్యర్థి ఖవాజా సాద్ రఫీక్, పీటీఐకి చెందిన లతీఫ్ ఖోసా హోరాహోరీ తలపడుతున్నారు. వారిద్దరినీ ఢీకొంటున్న ఓ యూట్యూబ్ సంచలనం ఇప్పుడు దేశమంతటి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమే జెబా వకార్. వృత్తిరీత్యా గైనకాలజిస్టు అయిన ఆమె జమాత్ ఇ ఇస్లామీ అనే మతపరమైన పార్టీ సభ్యురాలు. ఆ పార్టీ తరఫునే బరిలో దిగారు. యూట్యూబ్‌లో ఆమెకు 17,500 మందికి పైగా ఫాలోయర్లున్నారు. ఖురాన్, హదీత్లపై రోజూ ప్రసంగాలు అప్లోడ్ చేస్తుంటారు. విద్యాధికులైన యువతులకు ఖురాన్ పాఠాలు చెప్పే సంస్థను కూడా భర్తతో కలిసి నడుపుతున్నారు. ‘‘నన్ను గెలిపిస్తే మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా చూస్తా. వారిపై వేధింపులకు తెర దించేలా కఠిన చట్టాల కోసం కృషి చేస్తా’’ అని చెబుతున్నారు. భర్త బాటన... ఇక పెషావర్ నుంచి బరిలో దిగుతున్న సమర్ హరూన్ బిలౌర్ది మరో గాథ. గత ఎన్నికల వేళ ఆమె భర్త హరూన్‌ను ప్రచారం సందర్భంగా పాక్ తాలిబన్లు కిరాతకంగా కాల్చి చంపారు. దాంతో ఆయన స్థానంలో సమర్ బరిలో దిగాల్సి వచ్చింది. అవామీ వర్కర్స్ పార్టీ తరఫున ఆ ఎన్నికల్లో నెగ్గి పెషావర్ నుంచి తొలి మహిళా ప్రొవిన్షియల్ ఎంపీగా రికార్డు సృష్టించారామె. దాంతో దేశ రాజకీయాల్లో ఆమె పేరు అందర్లోనూ నానింది. ఈసారి కూడా ఆమె మళ్లీ బరిలో దిగుతున్నారు. అఫ్గాన్ సరిహద్దులకు సమీపంలో ఉండే పష్తూన్ ప్రాబల్య నగరమైన పెషావర్‌లో, పరిసర ప్రాంతాల్లో మహిళలపై అణచివేత మరింత అధికం. మహిళలపై తీవ్ర అణచివేతలకు పేరుమోసిన తాలిబన్ల ప్రభావం మరింత ఎక్కువ. దాంతో సమర్ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. గత ఎన్నికలప్పుడు మతోన్మాద మూకల బెదిరింపుల నేపథ్యంలో బిక్కుబిక్కుమంటూనే ప్రచారం చేశారు. ఈ ఐదేళ్లలో పరిస్థితులు కాస్త మెరుగయ్యాయంటారు సమర్. నిత్యం ప్రజల్లో తిరుగుతూ, వారి సమస్యలను వింటూ, ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండటం ఆమెకు బాగా పేరు తెచ్చింది. -
ఒక్కరోజే వంద దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మేరకు పార్టీకి శుక్రవారం ఒక్కరోజే వంద దరఖాస్తులు అందాయి. శుక్రవారం గాం«దీభవన్‌కు వచ్చిన పలువురు నేతలు తమ దరఖాస్తులను అందజేశారు. మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు ఎక్కువ దర ఖాస్తులు రాగా, హైదరాబాద్‌లో తక్కువగా వచ్చా యి. దరఖాస్తు చేసుకున్న వారిలో సినీ నిర్మాత బండ్ల గణేశ్ (మల్కాజిగిరి), మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఆయన కుమార్తె చంద్రప్రియ (నాగర్‌కర్నూల్), ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, విద్యా స్రవంతి (సికింద్రాబాద్) పెరిక శ్యామ్ (పెద్దపల్లి) తదితరులున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాలైన వరంగల్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌తో పాటు జనరల్ స్థానమైన మల్కాజిగిరి కోసం 4 దరఖాస్తులు అందజేశారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఇప్పటివరకు 141 దరఖాస్తులు రాగా, శనివారం సాయంత్రంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. ఖమ్మం బరిలో గడల, వంకాయలపాటి హాట్‌సీట్‌గా మారిన ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టికెట్ కోసం శుక్రవారం ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, ప్రముఖ వ్యాపారవేత్త, వీవీసీ గ్రూపు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వంకాయల పాటి రాజేంద్రప్రసాద్‌లు దరఖాస్తు చేసు కున్నారు. గడల సికింద్రాబాద్ స్థానానికి కూడా దర ఖాస్తు చేశారు. ప్రభుత్వ అధికారిగా ఉండి, అప్పటి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి వార్తల్లోకెక్కిన గడల.. అప్పట్లో కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఇటీవలే రేవంత్ ప్రభుత్వం గడలను ఆ పోస్టు నుంచి బదిలీ చేసింది. ప్రస్తుతం లాంగ్‌లీవ్‌లో ఉన్న ఆయన ఉన్నట్టుండి గాం«దీభవన్‌లో దరఖాస్తులివ్వడం గమనార్హం. మెజార్టీ స్థానాలు గెలుస్తాం: బండ్ల గణేశ్ మల్కాజిగిరి స్థానం నుంచి పోటీకి అవకాశం కల్పించాలని కోరుతూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావుకు దరఖాస్తు ఇచ్చిన సినీ నిర్మాత బండ్ల గణేశ్ ..విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందన్నారు. -
బీజేపీ ఒంటరి పోరు
సాక్షి, అమరావతి : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రంలో ఒంటరి పోరుకు సన్నద్ధమవుతోంది. పొత్తులకు సంబంధించి రకరకాల ప్రచారం సాగుతున్నప్పటికీ, జాతీయ పార్టీ సూచనల మేరకు రాష్ట్ర పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గురువారం ఒకే రోజున రాష్ట్రవ్యాప్తంగా 25 లోక్‌సభ స్థానాల పరిధిలో పార్టీ ఎన్నికల కార్యాలయాలను ప్రారంభిస్తోంది. కొన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ గురువారమే నియోజకవర్గ కార్యాలయాలను ప్రారంభిస్తోంది. గత నెల రోజులుగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో రాష్ట్రమంతటా పార్టీ శ్రేణులను భాగస్వాములను చేస్తోంది. నెల క్రితమే.. బీజేపీకీ ‘రాష్ట్రంలో ఒక్క అవకాశం – కేంద్రంలో మరో విడత’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా 46 వేలకుపైగా వాల్ పెయింటింగ్‌లు, పోస్టర్లు వేయించారు. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు 20 రోజుల క్రితం రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ముగ్గురేసి ఒక కమిటీగా ఏర్పడి జిల్లాల్లో పర్యటించారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పార్టీ తరుఫున పోటీ చేసేందుకు ఆసక్తి ఉండే అభ్యర్ధుల బయోడేటాలు సేకరించారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 2,438 మంది దరఖాస్తు చేసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల జాతీయ పార్టీ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్‌తో జరిగిన రాష్ట్ర ముఖ్యనేతల భేటీలో లోక్‌సభ స్థానాల్లో పోటీకి అవకాశం ఉన్న నాయకులు, పార్టీ బలాబలాలపై చర్చించారు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్, సీఎం రమేష్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తదితరులతో పాటు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్న పరిపూర్ణానంద స్వామి కూడా లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధుల జాబితాలో ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల వారీగా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలు కేవలం నామమాత్రంగా కాకుండా, పూర్తిస్థాయిలో పార్టీ పోటీలో ఉండేలా పార్టీ పలు చర్యలు చేపట్టింది. అభ్యర్ధులకు అన్ని విధాలా తోడ్పాటునందించేందుకు ప్రతి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు 37 మందితో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో అంశాలను 37 విభాగాలుగా వర్గీకరించారు. ఒక్కొక్క విభాగం బాధ్యతలు ఈ కమిటీలోని ఒకరికి అప్పగించారు. పార్టీ ఎన్నికల కార్యక్రమాలను జాతీయ, రాష్ట్ర పార్టీ సులభంగా పర్యవేక్షించేలా ఐదేసి లోక్‌సభ నియోజకవర్గాలను ఒక క్లస్టర్‌గా విభజించి, 5 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. అగ్రనేతలు రంగప్రవేశం.. ఎన్నికలకు సంబంధించి బీజేపీ రానున్న నెల రోజుల కార్యక్రమాలను సిద్ధం చేసుకుంది. ఫిబ్రవరి 4వ తేదీ తర్వాత పార్టీ అగ్రనేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, జెపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించనున్నారు. క్లస్టర్ల వారీగా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇతరత్రా కార్యక్రమాలు ఉండవు. ఒక వేళ రెండో పూట పర్యటన ఉంటే ఆ ప్రాంతంలోని వివిధ రంగాల నిపుణులతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపారు. ఫిబ్రవరి 9, 10 తేదీల్లో రాష్ట్రంలో అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో పార్టీ ముఖ్య కార్యకర్తలు పర్యటించి, బూత్‌లవారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేస్తారు. అక్కడ పార్టీ ఏజెంట్లుగా పనిచేసే వారిని గుర్తించి రాష్ట్ర పారీ్టకి నివేదిస్తారు. ఎన్నికల ప్రక్రియ జరిగే నెలన్నరలో రాష్ట్రమంతటా 20 వేల బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
విజయ్‌తో కాదు...నాతో నాకే పోటీ
‘‘నాకు, విజయ్‌కు మధ్య పోటీ లేదు. తనకు తానే పోటీ అని విజయ్ అంటుంటాడు. నేనూ అంతే. నాకు పోటీ నేనే’’ అన్నది రజనీకాంత్ లేటెస్ట్ స్టేట్మెంట్. ‘లాల్‌సలామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రజనీకాంత్ ఈ విధంగా మాట్లాడారు. దీనికి ఓ కారణం ఉంది. ‘జైలర్’ సినిమా ఆడియో ఫంక్షన్ వేదికగా రజనీకాంత్ ఓ డేగ, కాకి కథ చెప్పారు. ‘కాకులు ఎంత అరిచినా వాటి అరుపులు పట్టించుకోకుండా డేగ ఆకాశానికి ఎగురుతూనే ఉంటుంది’ అంటూ తన జర్నీని ఉద్దేశించి ఆ కథ చెప్పారు రజనీ. దాంతో విజయ్ను ఉద్దేశించే ఆ కథ చెప్పారని కొందరు విజయ్ ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారు. ఈ విషయంపై తాజాగా చెన్నైలో జరిగిన ‘లాల్‌సలామ్’ ఆడియో లాంచ్ వేదికగా రజనీకాంత్ స్పందించారు. ‘‘జైలర్’ ఫంక్షన్లో నేను చెప్పిన కథ తప్పుగా ప్రచారంలోకి వెళ్లింది. విజయ్‌ని ఉద్దేశించే నేను ఆ కథ చెప్పానని ప్రచారం జరగడం బాధగా అనిపించింది. ‘ధర్మత్తిన్ తలైవన్’ సినిమా షూటింగ్ టైమ్‌లో విజయ్ తండ్రి చంద్రశేఖర్ నాకు అతన్ని పరిచయం చేసి, విజయ్ నటనపట్ల ఆసక్తిగా ఉన్నాడని చెప్పారు. చదువు పూర్తి చేశాక ఇండస్ట్రీలోకి రావాలని విజయ్‌కి సలహా ఇచ్చాను. తన చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. ప్రతిభ, క్రమశిక్షణ, కష్టంతో విజయ్ పెద్ద స్టార్‌గా ఎదిగాడు. ఇకపై మా ఇద్దరి మధ్య పోటీ పెట్టొద్దని ఫ్యాన్స్‌ని కోరుతున్నాను’’ అన్నారు. ఇక ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందిన ‘లాల్ సలామ్’ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. -
విశాఖలో 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు
-
విశాఖలో పోలీస్ కమాండో పోటీలు ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్ర పోలీస్ బలగాలకు చెందిన 23 టాప్ కమాండో బృందాలు పాల్గొనే 14వ ఆలిండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్(ఏఐపిసిసి) సోమవారం విశాఖలోని ఏపీ గ్రేహౌండ్స్ గ్రౌండ్స్‌లో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను విశాఖ నగర సీపీ ఎ.రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కటి ప్రతిభ కలిగిన జట్టు విజయం సాధిస్తుందని, క్రీడాస్ఫూర్తితో తలపడాలన్నారు. ఏపీ గ్రేహౌండ్స్ అదనపు డీజీ రాజీవ్‌కుమార్ మీనా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా ఈ పోటీలకు ఆతిథ్యమిస్తోందన్నారు. విశాఖలో 16 రాష్ట్రాల పోలీస్ కమాండో జట్లతో పాటు ఏడు పారామిలిటరీ దళాల కమాండో జట్లు ఐదు దశల్లో జరిగే పోటీల్లో పాల్గొంటాయన్నారు. జాతీయ సమగ్రతకు ఈ పోటీలు చక్కటి ఉదాహరణ అన్నారు. తొలుత అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ జట్టుతో ప్రారంభమై, ఉత్తరాఖండ్ జట్టు చివరగా మొత్తం 23 జట్లు గౌరవవందనం సమర్పించాయి. గ్రేహౌండ్ బ్యాండ్ మార్చ్‌పాస్ట్ అలరించింది. ఈ కార్యక్రమంలో ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ రాజీవ్‌కుమార్ సింగ్, పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ ఏడీజీ అతుల్‌సింగ్, రేంజ్ ఐజీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడ.. ఎవరు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో ఎంపీ టికెట్ల కోసం హడావుడి మొదలైంది. నలుగురు సిట్టింగ్ ఎంపీలకు రూట్ క్లియర్ అనే ప్రచారం నేపథ్యంలో మిగిలిన 13 స్థానాల్లో మాత్రం నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా అభ్యర్థుల ఖరారులో జాప్యం జరగకుండా వచ్చే నెల మొదటి వారంలోగా ఎంపీ అభ్యర్థుల ఖరారుపై స్పష్టత వచ్చేలా చూస్తామని అమిత్‌షా ప్రకటించారు. ఇందుకు అవసరమైన కసరత్తు వేగవంతం చేయాలని పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్‌ను ఆయన ఆదేశించినట్టు పార్టీవర్గాల సమాచారం. దీంతో ఎంపీ టికెట్ల కోసం తీవ్రపోటీ నెలకొంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీలు స్థానాలు (సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్) మినహాయిస్తే, మల్కాజ్‌గిరితో పాటు జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ల కోసం నాయకులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. ► మెదక్ నుంచి పోటీకి తాను సిద్ధమైనట్టు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ► మహబూబ్‌నగర్ సీటు విషయానికొస్తే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి.ఆచారి ప్రయత్నాల్లో ఉన్నారు. ► చేవెళ్ల నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సై అంటున్నారు. ► భువనగిరి సీటు తనకే వస్తుందనే ధీమాతో మాజీ ఎంపీ డా.బూరనర్సయ్యగౌడ్ ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీచేసిన భువనగిరి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు కూడా పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. ► మహబూబాబాద్ టికెట్‌కు తేజావత్ రామచంద్రునాయక్, హుస్సేన్‌నాయక్, దిలీప్‌నాయక్ పోటీ పడుతున్నారు. ► ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర్‌రెడ్డికి అవకాశం కల్పిస్తారా, లేకపోతే పార్టీ జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్ లేదా గల్లా సత్యనారాయణ, గరికపాటి మోహన్‌రావులకు అవకాశం ఇస్తారా చూడాలి. ► నల్లగొండ నుంచి గత ఎన్నికల్లో జితేంద్ర పోటీ చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనకు అవకాశం ఇస్తారా లేకపోతే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత బరిలో దింపుతారా చూడాలి. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు డా.జి.మనోహర్‌రెడ్డి కూడా ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. ► పెద్దపల్లి నుంచి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగల కుమార్‌కు మళ్లీ పోటీకి అవకాశం దక్కవచ్చునని చెబుతున్నారు. మల్కాజ్గిరి.. ఈటల గురి మల్కాజ్గిరి లోక్‌సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ పోటీకి సై అంటున్నారు. ఇటీవల నగరానికి వచ్చిన అమిత్ షాతో విడిగా ఈటల భేటీ అయ్యారు. లోక్‌సభకు పోటీపై మాట్లాడేందుకు సమయం కావాలని కోరగా, రెండు, మూడురోజుల్లో ఢిల్లీకి రావాలని చెప్పినట్టు తెలిసింది. పి.మురళీధర్‌రావు, పేరాల శేఖర్‌రావు, ఎన్.రామచందర్‌రావు, కూన శ్రీశైలంగౌడ్, డా.ఎస్.మల్లారెడ్డి, టి.వీరేందర్‌గౌడ్, సామ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి తదితరులు ఇక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ మల్కాజ్గిరి టికెట్ ఇవ్వడానికి వీలుపడని పక్షంలో జహీరాబాద్, మెదక్ నుంచి అయినా పోటీ సిద్ధమే అన్న సంకేతాలు ఈటల ఇచ్చినట్టు సమాచారం. జహీరాబాద్.. ఏలేటి సురేశ్ రెడ్డి జహీరాబాద్ నుంచి పోటీకి అవకాశం కల్పించాలంటూ ఈ లోక్‌సభ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన వ్యాపారవేత్త ఏలేటి సురేశ్‌రెడ్డి కోరుతున్నారు. ఇప్పటికే ఆయన కిషన్‌రెడ్డిని కోరినట్టు తెలిసింది. ఈ విషయమై అధిష్టానానికీ విజ్ఞప్తి చేయగా, జనవరి 2న ఢిల్లీ వచ్చి కలవాలని ఆయనకు అమిత్‌షా చెప్పినట్లు తెలిసింది. డాక్టర్ కె.లక్ష్మణ్, వీరశైవ లింగాయత్ సమాజ్‌కు చెందిన జాతీయనేత అశోక్ ముస్తాపురె, అక్కడి ప్రజల్లో గుర్తింపు ఉన్న సోమయప్ప స్వామిజీ, చీకోటి ప్రవీణ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. వరంగల్.. మందకృష్ణ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే.. బీజేపీలో చేరి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ చెబుతున్నారని సమాచారం. మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, మరికొందరూ ఇదే సీటుకు పోటీపడుతున్నారు. నాగర్ కర్నూల్..బంగారు శ్రుతి నాగర్‌కర్నూల్ స్థానానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతిని బరిలో దింపవచ్చునని లేదంటే ఎవరినైనా కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. హైదరాబాద్..రాజాసింగ్ హైదరాబాద్ ఎంపీగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోటీ చేయిస్తే అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీవర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన భగవంత్‌రావు పేరు కూడా పరిశీలనలో ఉంది. -
తెలంగాణ నుంచి సోనియా పోటీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాందీని తెలంగాణలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానంతో కూడిన లేఖలను వ్యక్తిగతంగా సోనియగాంధీకి, అలాగే పార్టీ అధిష్టానానికి పంపింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన దాదాపు రెండు గంటలకు పైగా పీఏసీ సమావేశం జరిగింది. సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. పార్టీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న తీరు, పార్లమెంటు ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఆరు గ్యారంటీల అమలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన ఈ సమావేశంలో సోనియా రాష్ట్రం నుంచి పోటీ చేయడంతో పాటు ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ నేతలు, ఎన్నికల్లో పనిచేసిన పార్టీ కేడర్, నాయకత్వం, అలాగే ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మొత్తం 3 తీర్మానాలను ఆమోదించారు. రేపట్నుంచి శ్వేతపత్రాలు కాంగ్రెస్ 10 రోజుల పాలనపై సమావేశంలో చర్చ జరిగింది. రేవంత్ ప్రభుత్వ పనితీరును పలువురు సభ్యులు అభినందించారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ చెప్పారు. ఇటీవల జరిగిన అధికారుల నియామకాలు, బదిలీల్లో కూడా ఈ విషయం వెల్లడైందని అన్నారు. రాష్ట్ర ఆర్థి క పరిస్థితిని, విద్యుత్ శాఖ, నీటిపారుదల శాఖల్లో వాస్తవిక పరిస్థితులను ప్రజల ముందు పెట్టేందుకు బుధవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేస్తామని తెలిపారు. లోక్‌సభ టార్గెట్ 15 వచ్చే ఏప్రిల్‌లో జరుగుతాయని భావిస్తున్న పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధతపైనా సమావేశంలో చర్చించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 15 లోక్‌సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పీఏసీ సభ్యులు కోరారు. కాగా లోక్‌సభ టికెట్లు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారాలను అధిష్టానం చూసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. సంక్రాంతి లోపే పదవులు పార్లమెంటు ఎన్నికలు వస్తున్నందున నామినేటెడ్ పదవులు ఇస్తే పార్టీ నాయకులు మరింత ఉత్సాహంతో పనిచేస్తారని పీఏసీ సభ్యులు సూచించారు. వీలున్నంత త్వరగా భర్తీ చేయడం ద్వారా రెండేళ్ల కాలపరిమితికి అనుగుణంగా మరో రెండుసార్లు ఈ పోస్టులకు పార్టీ నేతలను ఎంపిక చేయవచ్చని, దాదాపుగా 1,000 మందికి అవకాశం కల్పించవచ్చని చెప్పారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే, సంక్రాంతి పండుగ లోపే నామినేటెడ్ పదవులపై పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతుందని, అధిష్టానం పెద్దలతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ చేపడతానని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారంటీల అమలు ఆరు గ్యారంటీల అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని, ఈ పథకాల అమలు పార్టీ కేడర్ ద్వారా సక్రమంగా జరిగేలా చూడాలని రేవంత్ కోరారు. పథకాల అమలుతో పాటు లబ్ధిదారుల ఎంపికలో పార్టీ నేతలు, కేడర్ చురుకుగా ఉండి అర్హులందరికీ లబ్ధి కలిగేలా చూడాలని, వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. బూత్ స్థాయి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఓటర్ల జాబితా సవరణలపై చర్చ జరగ్గా.. ఈ సందర్భంగా పార్టీ పక్షాన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ వివరించారు. ఫిబ్రవరి 8న ప్రకటించే తుది జాబితా ప్రాతిపదికనే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. ఈ జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణల కోసం బూత్ స్థాయిలో కార్యకర్తలను అలర్ట్ చేయాలని, ప్రతి ఇంటి నుంచి ఓటర్లను చేర్పించే చర్యలు తీసుకోవాలని చెప్పారు. మాజీ మంత్రులు జానారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌చౌదరి, విష్ణునాథ్, పీఏసీ సభ్యులు జగ్గారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, మధుయాష్కీ గౌడ్, బలరాం నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తదితరులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఇన్చార్జులు ఖరారు పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు రెండేసి చొప్పున నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించగా, మంత్రి పదవుల్లో లేని సీనియర్ నేతలు జీవన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలకు కూడా ఇన్చార్జి బాధ్యతలిచ్చారు. మిగిలిన 9 మంది మంత్రులకు 9 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. వీరంతా మంగళవారం నుంచే లోక్‌సభ ఎన్నికల పనిలో ఉంటారని గాందీభవన్ వర్గాలు వెల్లడించాయి. టికెట్ల కేటాయింపు ప్రక్రియ మొదలు ఎన్నికలు పూర్తయ్యేంతవరకు కేటాయించిన నియోజకవర్గాల్లో మంత్రులదే బాధ్యతని తెలిపాయి. ఇన్చార్జులు వీరే: చేవెళ్ల, మహబూబ్‌నగర్ – రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్, హైదరాబాద్– భట్టి విక్రమార్క మెదక్ – దామోదర రాజనర్సింహ ఆదిలాబాద్ – సీతక్క నల్లగొండ – ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భువనగిరి – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వరంగల్ – కొండా సురేఖ ఖమ్మం, మహబూబాబాద్ – పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పెద్దపల్లి – శ్రీధర్‌బాబు కరీంనగర్ – పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ – టి.జీవన్‌రెడ్డి జహీరాబాద్ – పి.సుదర్శన్‌రెడ్డి మల్కాజిగిరి – తుమ్మల నాగేశ్వరరావు నాగర్‌కర్నూల్ – జూపల్లి కృష్ణారావు ఆరు గ్యారంటీలకు 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఈనెల 28న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడిస్తుందని పీఏసీ కన్వినర్ షబ్బీర్ అలీ వెల్లడించారు. గాం«దీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశం అనంతరం ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 నగదు, రూ.500కే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాల కోసం లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. గ్రామసభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేసే సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రారంభిస్తుందని తెలిపారు. 28 నుంచి 15 రోజుల పాటు నిర్దేశిత ఫార్మాట్లో దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పారు. ఎలాంటి వివక్ష లేకుండా సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో జరిగే సభకు తెలంగాణ నుంచి 50 వేల మందిని తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
గట్టిపోటీ... అధిక సీట్లు...
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ రాష్ట్రంలో కమలదళం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 25 నుంచి 30 సీట్లలో బీజేపీ నిర్ణయాత్మకంగా వ్యవహరించడంతో పాటు వాటిలో అధిక స్థానాలు గెలుచుకోవడంపై ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. ఆ స్థానాల్లో పార్టీ అగ్రనేతలు విస్తృత ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఎస్సీ వర్గీకరణ, బీసీ సీఎం నినాదంతోపాటు కీలక స్థానాల్లో ప్రచారం చివరి రోజుల్లో అగ్రనేతల విస్తృత ప్రచారం పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసి వస్తుందని రాష్ట్ర నేతలు అంచనా వేస్తున్నారు. త్రిముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఆయా వర్గాల ఓట్లు చీలితే పలుచోట్ల బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్న నమ్మకాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అగ్రనేతలంతా ఇక్కడే... ప్రధాని మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర ముఖ్య నేతలు విస్తృత పర్యటనలు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ హైదరాబాద్‌లోనే మకాం వేసి సంస్థాగతంగా పార్టీ యంత్రాంగం ఏ మేరకు ఎన్నికల యాజమాన్య నిర్వహణ చేస్తోందో లోతుగా సమీక్షిస్తున్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్‌చుగ్, రాష్ట్ర సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్‌తో సంతోష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఒక్కొక్క లోక్‌సభ నియోజకవర్గానికి ఒక ముఖ్యనేతను ఇన్చార్జిగా నియమించి, పోలింగ్ ముగిసేదాకా అన్ని అంశాలను సమన్వయం చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ప్రధాని సుడిగాలి పర్యటనపై ఆశలు ప్రచారపర్వం ముగిసేలోగా పీఎం మోదీ వరుసగా మూడురోజులు...ఆరుసభల్లో పాల్గొనడంతో పాటు చివర్లో హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించనున్నారు. 25న కామారెడ్డి (కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ) నిజామాబాద్ (అర్బన్), నిజామాబాద్ (రూరల్), రంగారెడ్డి జిల్లా(మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కల్వకుర్తి,), 26న తూఫ్రాన్ (గజ్వేల్, దుబ్బాక, మేడ్చల్, మెదక్, నరసాపురం), నిర్మల్ (నిర్మల్, ముథోల్, బాల్కొండ, ఖానాపూర్), 27న మహబూబాబాద్ (మహబూబాబాద్, ములుగు, తదితర ఎస్టీ స్థానాలు) కరీంనగర్ (కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు, వేములవాడ, చొప్పదండి, కోరుట్ల) ఇలా ఆయా ఉమ్మడి జిల్లాలు, నియోజకవర్గాల పరిధిలోని వివిధ వర్గాల ఓటర్లపై ప్రభావం చూపేలా మోదీ ప్రచార కార్యక్రమాలను ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. బీసీ, ఎస్సీల అండపై అంచనాలు..ఎస్టీలకు హామీ? అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలను దీటుగా ఎదుర్కోవడంతో పాటు ఆ పార్టీలకు చెక్ పెట్టేలా బీసీ నేతను సీఎంను చేస్తామన్న ప్రకటన తమకు కలిసి వస్తుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. కాస్త అలస్యంగా ప్రకటించినా..ఈ నినాదాన్ని బీజేపీ తన ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రంగా మలచుకోగలిగింది. బీసీ సీఎం నినాదంతో పాటు ఎస్సీ ఉపకులాల వారీగా రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోదీ మద్దతు ప్రకటన మేలు చేస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఎస్టీల జనాభాకు అనుగుణంగా 9 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామనే హామీ కూడా బీజేపీ నేతలు త్వరలోనే ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఓ అంచనా ప్రకారం బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు... ♦ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని... ముథోల్, నిర్మల్, బోథ్, ఖానాపూర్, సిర్పూర్ ♦ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో... కామారెడ్డి, నిజామాబాద్ (అర్బన్), ఆర్మూరు, జుక్కల్ ♦ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో... హుజూరాబాద్, కరీంనగర్, కోరుట్ల, మానకొండూరు ♦ ఉమ్మడి వరంగల్ జిల్లాలో... వరంగల్ (ఈస్ట్), పరకాల, ములుగు, మహబూబాబాద్ ♦ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో... మహేశ్వరం, ఎల్బీనగర్, చేవెళ్ల, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ♦ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో... కల్వకుర్తి, మహబూబ్‌నగర్, మక్తల్ ♦ ఉమ్మడి మెదక్ జిల్లాలో... దుబ్బాక, పటాన్ చెరు, నరసాపూర్, ♦ నల్లగొండ జిల్లాలో... సూర్యాపేట, మునుగోడు ♦ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో... గోషామహల్. అంబర్‌పేట, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, మల్కాజిగిరి -
బీజేపీ నేతలొస్తే తరిమికొట్టండి
గజ్వేల్/దుబ్బాకటౌన్: బీడీ కట్టల మీద, పాల మీద జీఎస్టీ వేసి, గ్యాస్ ధరలు పెంచి, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పిన బీజేపీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఓట్లకోసం గ్రామాల్లోకి వచ్చే బీజేపీ నేతలను ఈ అంశాలపై నిలదీసి చీపుర్లతో తరిమికొట్టాలని పిలుపునిచ్చా రు. సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్కు చౌర స్తాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీజేపీ వంద అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ఏనాడూ గజ్వేల్ ప్రజలను పట్టించుకోని ఈటల రాజేందర్ ఇప్పుడు కొత్తగా ఎన్నికల బరిలో కి వచ్చి.. వరుసలు కలుపుతూ తెగ ప్రేమ ఒలకబోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిన్నింటి వాసా లు లెక్కపెట్టేవిధంగా తనకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్‌పైనే పోటీకి దిగడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ వస్తే కటిక చికటే మిగులుతుందని, ఆ పార్టీ కర్ణాటకలో కనీసం మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇదే రకమైన పరిస్థితి వస్తుందన్నారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. మోసపూరిత విధానాలతో వస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే అసైన్డ్ భూములపై పూర్తి హక్కులను కల్పిస్తామన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌కు లక్ష ఓట్ల మెజారిటీని అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రుంజ వాయిద్యంతో ఆకట్టుకున్న మంత్రి సీఎం కేసీఆర్‌కు మద్దతుగా సోమవారం నిర్వహించిన విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు రుంజ వాయిద్యం వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. విశ్వకర్మలకు చెందిన రుంజ కళాకారులు ఈ వాయిద్యంతో అందరినీ అలరిస్తుంటారు. హరీశ్‌రావు సైతం కొద్దిసేపు వాయించి సభికులను ఉత్సాహపరిచారు. కాగా సీఎం కేసీఆర్‌కే మా మద్దతు అంటూ.. విశ్వకర్మ సంఘం నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి మంత్రికి పత్రాలు అందజేశారు. బీజేపీ డకౌట్.. కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ రాష్ట్రంలో బీజేపీ డకౌట్ అవుతుందని, కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ వస్తుందని హరీశ్‌రావు అన్నారు. సోమవారం దుబ్బాకలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు తామే అధికారంలోకి వస్తామంటూ చెబుతున్నారని, కానీ వారి మాటలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని చెప్పారు. బీజేపీపై నమ్మకం లేకనే ఆ పార్టీ నుంచి విజయశాంతి, వివేక్, రాజగోపాల్‌రెడ్డితో పాటు రోజుకో నాయకుడు బయటకు వెళ్లిపోతున్నారన్నారు. బీజేపీకి ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లేనన్నారు. -
గెలిచామా.. ఓడామా.. కాదు
‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... బుల్లెట్ దిగిందా లేదా’.. ఈ పూరీ మార్కు డైలాగ్‌ను ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న చాలామంది..’’ గెలిచామా.. ఓడామా.. కాదు పోటీ చేశామా లేదా అన్నదే ముఖ్యం’’ అన్న రీతిన మార్చేసి బరిలో సై అంటున్నారు. మునుపెన్నడూ అంతగా లేని విధంగా ఈసారి ఎన్నికల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలోకి దిగారు. ప్రధాన రాజకీయ పార్టీల నుంచే కాకుండా చిన్నాచితకా పార్టీల నుంచి, ఇండిపెండెంట్లు కలిపి రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఏకంగా 2,290 మంది పోటీలో ఉన్నట్టు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. అంటే సగటున ఒక్కో నియోజకవర్గానికి 20 మంది పోటీ చేస్తున్నారన్న మాట. ఈ పోటీ ఎంత తీవ్రంగా ఉందంటే 65 చాలా నియోజకవర్గాల్లో రెండు లేదా మూడు బ్యాలెట్ యూనిట్లు వినియోగించాల్సి వస్తోంది. నోటాతో కలిపి అభ్యర్థుల సంఖ్య 16లోపు ఉంటేనే ఒక బ్యాలెట్ యూనిట్ సరిపోతుంది.కానీ, ఈసారి అంతకంటే ఎక్కువ మంది 65 స్థానాల్లో బరిలో ఉండడంతో బ్యాలెట్ యూనిట్లను పెంచాల్సి వస్తోంది. ఎల్బీనగర్ టాప్ ఇక నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ఎక్కువ మంది పోటీ చేస్తున్న జాబితాలో ఎల్బీనగర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి ఏకంగా 48 మంది అభ్యర్థులు అమీతుమీ తేల్చుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి 44 మంది బరిలో ఉన్నారు. ఇక, ఏడుగురే పోటీలో ఉండి రాష్ట్రంలో అతి తక్కువ మంది పోటీ చేస్తున్న నియోజకవర్గంగా బాన్సువాడ నిలిచింది. పది మంది కంటే తక్కువగా పోటీ చేస్తున్న నియోజకవర్గాలు మొత్తం నాలుగు కాగా, 20నుంచి 30 మంది పోటీ చేస్తున్న నియోజకవర్గాలు 33, 30 మంది కంటే ఎక్కువ మంది పోటీ చేస్తున్న నియోజకవర్గాలు 13 ఉన్నాయి. మొత్తం స్థానాల్లో నామినేషన్ వేసిన 2898 అభ్యర్థులలో 608 మంది విత్‌డ్రా చేసుకున్నట్లుగా ఎన్నికల సంఘం వెల్లడించించిన సంగతి తెలిసిందే. పేరు కోసం ఒకరైతే... పోటీ చేయాలనే తపన మరొకరిది ఎలాగైనా పోటీ చేయాలని కొందరు అభ్యర్థులు భావిస్తే మరికొందరు పేరు కోసం పోటీ చేసినట్టుగా ఉంది. ఏదో నామినేషన్ వేశామా లేదా అన్నట్లుగా పోటీలో ఉంటున్నారు. ప్రచారం చేయడం కానీ, ఎన్నికల సంఘం కేటాయించిన తన గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడం కానీ ఇప్పటి వరకైతే చేయడంలేదు. మరో వైపు కొన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో, అభ్యర్థిపై నిరసనతోనో...లేక ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చలేదనో పోటీకి దిగుతున్నారు.. కొన్నిచోట్ల సొంతపార్టీ నుంచి టికెట్ రాక రెబల్స్‌గా పోటీ చేస్తున్నారు. మరో వైపు అభ్యర్థి ఓట్లను చీల్చాలని మరికొందరు పోటీ చేస్తున్నారన్న వాదనలూ ఉన్నాయి. -
దిగ్గజాలకు చిన్న సంస్థల సవాల్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో దిగ్గజ కంపెనీలకు చిన్న సంస్థలు సవాళ్లు విసురుతున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గడంతో చిన్న బ్రాండ్లు మళ్లీ బలంగా పుంజుకుంటున్నాయి. పెద్ద సంస్థలకు బలమైన పోటీనిస్తున్నాయి. మార్కెట్లో వాటాను పెంచుకంటూ, పెద్ద సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించక తప్పని పరిస్థితులను కలి్పస్తున్నాయి. సబ్బులు, టీ, డిటర్జెంట్, బిస్కట్ల విభాగంలో ఈ పరిస్థితి ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్), గోద్రేజ్ కన్జ్యూమర్, మారికో, బ్రిటానియా, టాటా కన్జ్యూమర్ సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాల విడుదల సందర్భంగా.. చిన్న సంస్థల నుంచి వస్తున్న పోటీ కారణంగా ఉత్పత్తుల ధరలను సవరించాల్చి వచి్చనట్టు పేర్కొనడం గమనార్హం. ‘‘ద్రవ్యోల్బణం గరిష్టాల్లో ఉన్నప్పుడు చిన్న సంస్థలకు ఉత్పత్తుల తయారీపై అధిక వ్యయం అవుతుంది. దీంతో అవి పెద్ద సంస్థలకు ధరల పరంగా గట్టి పోటీనిచ్చే పరిస్థితి ఉండదు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు మార్జిన్లు ఎక్కువగా ఉండడంతో అవి అధిక డిస్కౌంట్లు ఇవ్వగలవు’’అని బ్రిటానియా ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్, ఎండీ వరుణ్ బెర్రీ ఇన్వెస్టర్ల కాల్లో పేర్కొన్నారు. ఒక్కసారి కమోడిటీల ధరలు తగ్గడం మొదలైతే, వాటి మార్జిన్లు పెరుగుతాయని, దీంతో అధిక డిస్కౌంట్లు ఇవ్వడం మొదలు పెడతాయన్నారు. కొన్ని విభాగాల్లో అధిక పోటీ ‘‘ఒకవైపు బలమైన బ్రాండ్లతో పెద్ద సంస్థలతో పోటీ పడాలి. ధరల యుద్ధంతో అవి మార్కెట్ వాటాను చిన్న సంస్థలకు కోల్పోవాల్సి వస్తోంది. మేము ఈ చట్రంలో ఇరుక్కోవాలని అనుకోవడం లేదు. రెండింటి మధ్య సమతుల్యం ఉందనుకున్న విభాగంలోనే ముందుకు వెళతాం’’అని టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ పేర్కొనడం గమనార్హం. టీ పొడి మార్కెట్లో ప్రాంతీయంగా చిన్న సంస్థల నుంచి పోటీ ఉన్నట్టు తెలిపింది. ఇతర విభాగాల మాదిరిగా కాకుండా, టీ మార్కెట్లో అన్ బ్రాండెడ్ కారణంగా చిన్న సంస్థలు ఎప్పుడూ ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లలో దీని కారణంగా కొంత వ్యాపారం కోల్పోవాల్సి వస్తుందంటూ.. తమ ప్రీమియం ఉత్పత్తుల వాటా పెరుగుతున్నందున ఇది తమపై ఏమంత ప్రభావం చూపబోదని వాటాదారులకు టాటా కన్జ్యూమర్ వివరించింది. ధరలు తగ్గింపు.. చిన్న సంస్థలు చాలా చురుగ్గా ఉన్నాయని, వాటి కారణంగా మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొన్నట్టు మారికో ఎండీ, సీఈవో సౌగత గుప్తా తెలిపారు. ప్రస్తుత పరిణామాల్లో కొన్ని విభాగాల చిన్న సంస్థల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు ధరలు తగ్గించి, వినియోగదారులకు విలువను చేకూర్చే చర్యలు అమ్మకాల వృద్ధికి వచ్చే కొన్ని త్రైమాసికాల్లో దోహదపడతాయి’8అని సౌగత గుప్తా తెలిపారు. -
బల్దియా టు అసెంబ్లీ
చెరుపల్లి వెంకటేశ్: కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్ బల్దియా నుంచే ఇలా ఎదిగిన వారూ చాలామంది ఉన్నారు. కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచినా, ఓడి నా పట్టు వదలకుండా కృషి చేసి పైమెట్టు ఎక్కారు. ఎక్కువ పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలవడంతోపాటు మంత్రులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావుగౌడ్, సి.కృష్ణయాదవ్, ముఖేశ్‌గౌడ్ తదితరులు నగరపాలకసంస్థ కార్పొరేటర్లుగా పోటీచేసిన వారే. ఎంసీహెచ్ నుంచే మొదలు తొలిసారిగా చాలామంది ఎంసీహెచ్(మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) 1986 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో మోండా డివిజన్ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తలసాని, పద్మారావు చేతిలో ఓడిపోయారు. అనంతరం తలసాని 5 పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిచి టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పలుశాఖలు నిర్వహించారు. ఇక 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు బీఆర్ఎస్ ప్రభు త్వంలో మంత్రిగానూ, డిప్యూ టీ స్పీకర్‌గా నూ పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణయాదవ్ టీడీపీ హయాంలో మంత్రిగానూ, ప్ర భుత్వ విప్‌గానూ పనిచేశారు. మూడుసార్లు ఎమ్మె ల్యే అయిన ముఖేశ్‌గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తొలుత టీడీపీ కార్పొరేటర్‌గా ఉన్న రాజాసింగ్ బీజేపీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్యెల్యేగా ఎన్నికై మూడోసారి పోటీ చేస్తున్నారు. ఓటమి నుంచి గెలుపు.. దోమలగూడ, జవహర్‌నగర్ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ జి.సాయన్న, డా.కె.లక్ష్మణ్ తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో సాయన్న ఐదు పర్యాయాలు, లక్ష్మణ్ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. లక్ష్మణ్ ప్రస్తు తం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. సాయన్న మరణానంతరం ప్రస్తుతం ఆయన కుమార్తె లాస్య నందిత తండ్రి ప్రాతినిధ్యం వహించిన కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. మూసారాంబాగ్ కార్పొరేటర్‌గా ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి 2002లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్‌గా గెలిచారు. ఆ తర్వాత మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీన్ రివర్స్ ►మోండా డివిజన్‌కు పోటీ చేసిన పద్మారావు చేతిలో శ్రీనివాస్‌యాదవ్ కార్పొరేటర్‌గా ఒకసారి, సికింద్రాబాద్ నుంచి శాసనసభ ఎన్నికల్లో ఒకసారి ఓడిపోగా, శ్రీనివాస్‌యాదవ్ చేతిలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్మారావు ఒకసారి ఓడిపోయారు. ►జవహర్‌నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గోపాల్ చేతిలో ఓటమిపాలైన లక్ష్మణ్, ముషీరాబాద్‌లో 2014లో గోపాల్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2018లో గోపాల్ గెలవగా లక్ష్మణ్ ఓడారు. పార్టీ అధ్యక్షులుగానూ కార్పొరేటర్లుగా పోటీ చేయడం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలైన శ్రీనివాస్‌యాదవ్, కృష్ణయాదవ్ , సాయన్న, ముఠా గోపాల్ హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగానూ పనిచేశారు. పద్మారావు టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడిగా పనిచేశారు. లక్ష్మణ్ బీజేపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఎంపీలుగానూ.. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ సైతం కార్పొరేటర్ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా చేసిన రేణుకాచౌదరి ఎంపీగా, కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇలా బల్దియా నుంచి రాజకీయప్రస్థానం ప్రారంభించి తదనంతరం గెలిచినవారు, ఓడిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. పలువురు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లుగానూ పనిచేశారు. కృష్ణారెడ్డి, సు«దీర్‌రెడ్డి హుడా చైర్మన్లుగానూ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో... పోటీలో సిట్టింగ్ కార్పొరేటర్లు ప్రస్తుతం బల్దియా సిట్టింగ్ కార్పొరేటర్లలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగదీశ్వర్‌గౌడ్ శేరిలింగంపల్లి నుంచి , విజయారెడ్డి ఖైరతాబాద్ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. తోకల శ్రీనివాసరెడ్డి(బీజేపీ) రాజేంద్రనగర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్‌గా ఉన్న మహ్మద్ మోబిన్ బహదూర్‌పురా నుంచి ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. షేక్‌పేట కార్పొరేటర్ రాషెద్ ఫరాజుద్దీన్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీలు సైతం.. మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డి ఉప్పల్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. ఎంఐఎం మాజీ కార్పొరేటర్ బి.రవియాదవ్ రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్ కూడా జీహెచ్ఎంసీ మేయర్లుగా పనిచేసిన జులి్ఫకర్ అలీ, మాజిద్‌హుస్సేన్ ఎంఐఎం అభ్యర్థులుగా చారి్మనార్, నాంపల్లి నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన జాఫర్ హుస్సేన్ ఇప్పటికే రెండు పర్యాయాలు నాంపల్లి ఎమ్మెల్యేగా చేసి మూడోసారి యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. వీరిలో జుల్ఫికర్‌అలీ, మాజిద్ హుస్సేన్‌లు మేయర్ల పదవీకాలం ముగిశాక సైతం తిరిగి కార్పొరేటర్లుగానూ పనిచేశారు. మాజిద్ ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్‌గా కూడా ఉన్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్ సనత్‌నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. సుదీర్‌రెడ్డి ఎల్బీనగర్ నుంచి రెండుపర్యాయాలు గెలిచి మళ్లీ బరిలో ఉన్నారు. ముఠాగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, తిరిగి పోటీ చేస్తున్నారు. పద్మారావు సికింద్రాబాద్‌లో మూడుసార్లు గెలిచారు. మళ్లీ బరిలో నిలిచారు. హిమాయత్‌నగర్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయాదవ్ రూపాంతరం చెందిన అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరి లో ఉన్నారు. -
గజ్వేల్ జేజేల కోసం..
యెన్నెల్లి సురేందర్ : మలివిడత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2021వరకు ఎంతో సాన్నిహిత్యం, అనుబంధం ఉన్న సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. గజ్వేల్ గడ్డ పై మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్ అభివృద్ధి మంత్రంతో హ్యాట్రిక్ ధీమాతో ఉండగా, ఈటల బీసీ నినాదంతో బరిలోకి దిగారు. కేసీఆర్ : అభివృద్ధి ఎజెండా ఈటల : బీసీ మంత్రం నర్సారెడ్డి : లోకల్ ఫ్లేవర్ అభివృద్ధి మంత్రం.. బహుముఖ వ్యూహం ‘సెంటిమెంట్’గా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొని రెండుసార్లు సీఎం పదవి చేపట్టిన కేసీఆర్ గజ్వేల్‌ను రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనాగా మలచడంలో సఫలమయ్యారు. నియోజకవర్గంలోని మర్కూక్ వద్ద కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్, కొండపాక మండలంలో మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం, ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ యూనివర్సిటీ, గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌లో రింగురోడ్డు, వంద పడకల జిల్లా ఆస్పత్రి, మరో వంద పడకలతో మాతా శిశురక్షణ ఆస్పత్రి, ఎడ్యుకేషన్ హబ్ వంటి అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరిగాయి. గజ్వేల్ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా జరిగిన అభివృద్ధిని చూపిస్తూ కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు బీఆర్ఎస్ యంత్రాంగం బహుముఖ వ్యుహంతో ముందుకు సాగుతోంది. మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తూ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. అన్నింటికీ మించి బూత్‌లెవల్ మేనేజ్మెంట్ సక్రమంగా జరిగేలా వంద ఓట్లకు ఒక ఇన్చార్జిని నియమించారు. ప్రజా ఉద్యమాలకు ఊపిరి... గజ్వేల్, తూప్రాన్, మనోహరాబాద్, ములుగు, మర్కూక్, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, కుకునూర్‌పల్లి మండలాలతో కూడుకొని ఉన్న గజ్వేల్ నియోజకవర్గం యాదాద్రి, జనగామ, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సరిహద్దున ఉన్నది. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌ను ఆనుకొని ఉండటం వల్ల ఇక్కడ నగర వాతావరణం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో 179 పంచాయతీలున్నాయి. నిర్వాసితులను ఆకట్టుకునే ప్రయత్నం గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో మల్లన్నసాగర్ నిర్వాసితులను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు ఆరాటపడుతున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తొగుట మండలంలో పల్లెపహాడ్, వేములగాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురైన సంగతి తెలిసిందే. ఆయా గామాల్లో 10వేలకుపైగా ఓట్లు ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, ఎన్నికల్లో తమకు మద్దతు ప్రకటిస్తే పోరాడుతామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు హామీ ఇస్తున్నారు. ఈటల ముమ్మర ప్రచారం బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బీసీ నినాదం, స్థానిక సమస్యలే ఎజెండాతో ఎన్నికల బరిలో దిగారు. నియోజకవర్గంలో సుమరుగా 1.40లక్షల బీసీ ఓటర్లు ఉండగా..అందులో తన సొంత సామాజికవర్గం ముదిరాజులు 55వేల వరకు ఉంటారు. వీరిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పేరిట 30వేల కుటుంబాలకు చెందిన భూములను లాక్కొని, సరైన నష్ట పరిహారం ఇవ్వకపోవడంతో రోడ్డున పడ్డారని చెబుతూ...వారందరికీ అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్లో అసంతృప్తి నేతలను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 1992 నుంచి సుమారు పదేళ్లకుపైగా ఈటల ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి ’లోకల్’ కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి నేను లోకల్ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే 24గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రచారం చేస్తున్నారు. ఈటల రాజేందర్ కూడా స్థానిక వ్యక్తి కాదని, ఆయన గెలిచినా ఉపయోగం ఉండదని చెబుతున్నారు. -
అందరి దృష్టి కామారెడ్డిపైనే..
ఎస్. వేణుగోపాలచారి: కామారెడ్డిలో ఏం జరుగుతుంది.. ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి అదే. తెలంగాణ తెచ్చిన నేతగా, ముచ్చటగా మూడోసారి సీఎం పీఠాన్ని అధిరోహించాలన్న పట్టుదలతో కేసీఆర్‌లో కామారెడ్డిలో బరిలోకి దిగగా, ఆయనపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీకి దిగడమే చర్చకు ప్రధాన కారణం. రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు జనం నాడి పట్టేందుకు సర్వేల మీద సర్వేలు చేస్తున్నాయి. కేసీఆర్, రేవంత్‌రెడ్డితోపాటు బీజేపీ నుంచి స్థానికంగా గట్టి పట్టు సంపాదించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయనకు నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉంది. మూడ్ ఎలా ఉంటుందో.. సాధారణంగా వీవీఐపీలు పోటీ చేసే నియోజక వర్గాల్లో ప్రజల నాడి త్వరగా బయటపడుతుంది. కానీ ఇక్కడ రెండు పార్టీల కీలక నేతలు పోటీ చేస్తుండడం, వారికితోడు స్థానికుడైన బలమైన నాయకుడు బరిలో ఉండడంతో పోటీ ఎవరి మధ్యన ఉంటుందన్నదానిపై ఇప్పటికైతే క్లారిటీ రావడం లేదు. స్వయంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారంటే అభివృద్ధి పరుగులు పెడుతుందన్న భావన కొన్ని సెక్షన్లలో ఉండడం సహజం. అధికార బీఆర్ఎస్పై ఉన్న ఒకింత వ్యతిరేకత ఓట్లను ప్రతిపక్ష పార్టీలు రెండూ పంచుకుంటే అధికార పార్టీకి లాభం జరుగుతుందనే అంచనాలు ఉంటాయి. పేగుబంధం సెంటిమెంట్‌తో కేసీఆర్ రెండు పర్యాయాలుగా గజ్వేల్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్‌తో పాటు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. తాను పోటీ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఐదారు నియోజక వర్గాలపై ప్రభావం చూపవచ్చనే ఉద్దేశంతో రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారు. 44వ నంబరు జాతీయ రహదారి ద్వారా హైదరాబాద్‌కు కేవలం గంటన్నరలో చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ కామారెడ్డిని ఎంచుకున్నట్టు భావిస్తున్నారు. దీనికి తోడు కేసీఆర్ తల్లి పుట్టి పెరిగిన ఊరు కావడంతో ఈ ప్రాంతంతో ఆయనకు పేగుబంధం ఉన్నది. ఇక్కడ పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్ఛిన దరిమిలా కేసీఆర్ అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించారు. సర్వేల మీద సర్వేలు... ఇప్పుడు కామారెడ్డి సర్వే రాయుళ్లకు కేరాఫ్ నిలిచిందంటే అతిశయోక్తి కాదు. జనం నాడి పట్టేందుకు ఓ పక్క రాజకీయ పార్టీలు సొంతంగా సర్వేలు చేయించుకుంటుండగా, మరో పక్క నిఘా వర్గాలు, మీడియా సంస్థలు పోటాపోటీగా సర్వేలు చేస్తున్నాయి. కాటిపల్లి ’లోకల్’ బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గత నాలుగైదేళ్లుగా నియోజక వర్గంలో నిరంతరం ప్రజా సమస్యలపై అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. డ్వాక్రా మహిళలకు రావలసిన వడ్డీ రాయితీ డబ్బుల కోసం, మాస్టర్ ప్లాన్‌తో నష్టం జరుగుతోందని ఆందోళన చెందిన రైతుల కోసం ఈయన అండగా అండగా నిలిచి ఉద్యమానికి నాయకత్వం వహించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు కేటాయించాలని పెద్ద పోరాటమే చేశారు. ఇలా వరుస ఉద్యమాలతో జనంతో మమేకమైన వెంకటరమణారెడ్డి తనకు స్థానికులు ఓట్లు వేసి పట్టం కడతారని ఆశిస్తున్నారు. ఆ మేరకు రూ.150 కోట్లతో సొంత మేనిఫెస్టోను అమలు చేస్తానని ప్రకటించాడు. సీఎం పోటీ చేస్తున్నా.. వెరవకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. సవాల్ చేసి మరీ బరిలోకి దిగిన రేవంత్... అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యన జరిగే మాటల యుద్ధంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీఎంకు దమ్ముంటే కొడంగల్‌కు వచ్చి నిలబడమని లేదంటే, తానే కామారెడ్డికి వచ్చి పోటీ చేస్తానంటూ పలుమార్లు సవాళ్లు విసిరారు. సీఎం గానీ, ఆయన పార్టీ నేతల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. కానీ సవాల్ విసిరిన రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి బరిలోకి దిగారు.